Monday, December 29, 2008

మధురాంతకం రాజారాం గారి జ్ఞాపకాలు - 2


శ్రీ మధురాంతకం గార్ని రెండవ సారి కలవటం చిత్తూరు లో శ్రీజయరాం గారి ఇంట్లో. శ్రీ జయరాం గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు - సంగీతం మాస్టారు (or P.E.T మాస్టరు నాట్ sure ) అనుకుంటా. శ్రీ జయరాం గారు ఆర్ట్ లవర్స్ సెక్రటరీ గా చిత్తూరు జిల్లాలో మాత్రమె గాదు ఆంధ్రా మొత్తం లో నాటక రంగం వాళ్ళకి సుపరిచితులు. ఓ మారు ఇంట్లో ఉంటే నా మిత్రుడు వచ్చి శ్రీ రాజారాం గారు వచ్చారు నిన్ను రమ్మన్నారని చెప్పడం తో శ్రీ జయరాం గారి ఇంటికి వెళ్లాను. శ్రీ రాజారాం గారు మండువాలో కూర్చుని వున్నారు. "మీ కథల్రాయడం ఎలా సాగుతోంది" అని అడిగితే "సర్ ఈ మధ్య ఉద్యోగం లో చేరాక ఉష్ కాకి అయిపొయింది కథల్రాయడం " అనటం తో ఆయన నవ్వి "కథకి వస్తువు గా ఓ వ్యక్తి జీవితాన్ని మధిస్తే ఓ కథ పుట్టొచ్చు" అన్నారు - ఈ వాక్యం అప్పుడు సరిగా అర్థం కాలేదు గాని ఆ తరువాత ఆయన కథల్ని తిరగేస్తే ఆయన ప్రతి కథలోను ఈ విషయాన్ని గమనించడం జరిగింది. పెద్దవాళ్ళ మాట పెన్నిటి మూటయే గదా!
జిలేబి.

3 comments:

  1. Can you please send in your email id to the following?

    purnima.tammireddy@gmail.com

    waiting for your mail.

    ReplyDelete
  2. మధురాంతకం గారున్న ఆ కవర్ పేజీని భారీసైజులో పెట్టవలసినదిగా మనవి

    ReplyDelete
  3. మధురాంతకం రాజారాం గారిని ఒకే ఒక సారి కలుసుకున్నాను - అదీ కేవలం కాకతాళీయంగా జరిగింది.

    తిథి, వారం, నక్షత్రం జ్ఞాపకం లేవు కాని అది షికాగోలో జరిగిన తానా (లేక ఆటా) సభ. మగాళ్ళంతా సూట్లు, బూట్లు వేసుకునిన్నీ, ఆడంగులు పట్టు చీరల రెపరెపల తోటీన్నీ, ఏదో హడావిడిగా తిరుగుతూ ఉన్న సందర్భంలో ఎవ్వరో ఒక పెద్దాయన - మరీ పొడగరి కాదు, చామన చాయకి ఒక చాయ తక్కువే, లాల్చీ, కండువా - పక్కా పల్లెటూరి బైతులా కనిపించేడు. ఇండియా నుండి అప్పుడే దిగొచ్చిన ఏ రైతు బిడ్డో అయ్యుంటాడని అనిపించి, పోనీ ఒక సారి పలకరిస్తే సంతోషిస్తాడని పలకరించేను. పలకరించి చొరవగా ఆయన బేడ్జీ చూసేను. మధురాంతకం రాజారాం! గతక్కు మన్నాను. ఆయన పెద్ద పేరు మోసిన కథా రచయిత అని తెలుసు; కాని, ఆయన రాసిన కథలలో ఒకటో, రెండో చదివి ఉంటానేమో! వాటి పేర్లు దొరుకుతాయేమోనని నా బుర్రలో ఉన్న శోధన యంత్రం గిర్రున తిరగటం మొదలెట్టింది. ఇంతలో నా బేడ్జీ మీద పేరు చూసి, "మీరు ఈ మధ్య ప్రభలో రాసిన కథ చదివేను. సైన్సు అర్ధం కాలేదు కాని, కథ విలక్షణంగా ఉంది," అన్నారు.

    "మీరు రాసిన కథ బాగుంది" అని ఆయన అనుంటే ఇంకా సంతోషించి ఉండేవాడిని. కనీసం నా కథనీ, నా పేరునీ గుర్తు పెట్టుకున్నారు కదా అని సంతోషించేను. అల్పసంతోషిని.

    ReplyDelete