Sunday, January 11, 2009

నాకు నచ్చిన పద్యం - దాశరథీ శతకం నుంచి

భండన భీముడార్థజన భాందవుడుజ్వల బాణ తూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికిన్ రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేదనుచున్ గడ గట్టి భెరికా డాండ
డడాండ డాండ నినదంబు నిండ మత్త
వేదండము నెక్కి చాటెదన్ దాశరథీ కరుణాపయోనిధి!


ఈ పద్యం లో ఉన్న జోష్ రియల్లీ సూపర్బ్. - డాండ డడాండ డాండ అన్న పదమొక్కటే చాలు చేణుక్కు మనడానికి


భావార్థం: ఈ పద్యం శ్రీ రామచంద్రుని గురించి. శ్రీ రాముడు బలంలో భీముడంతటి వారట. ఆర్త జన భాన్దవుడు. ఉజ్వల బాణ తూణ కళా కోదండ ప్రచండులు. అట్లాంటి శ్రీ రామచంద్ర ప్రభువుల భుజ తాండవ కీర్తిని మత్త ఏనుగు నెక్కి డంకా భజాయించి అట్లాంటి స్వామీ కి రెండవ సాటి దైవం ఇక ఎవ్వరు లేదని చాటి చెబ్తారట దాసరథి వారు!

జిలేబి.

8 comments:

  1. అర్థము, తాత్పర్యము కూడా వివరించి ఉంటే బాగుండేది.

    ReplyDelete
  2. నాగప్రసాద్ గారు-
    మీ కోరిక పై దాశరథి శతకం పద్యానికి భావార్థం ఇచ్చాను.

    ReplyDelete
  3. మిగిలిన పదాల సంగతేమో కానీ, "డాండ డడాండ డాండ" మాత్రం మొదటి సారి చూస్తున్నాను! దీనికి ప్రత్యేకంగా అర్థమేమన్నా ఉందంటారా?

    ReplyDelete
  4. భండనమంటే యుద్ధమని అర్థం. భీముడంటే భీతిగొలిపేవాడు అని అర్థం. భండనభీముడంటే భయంకరమైన యుద్ధం చేసేవాడు (శత్రువులకి భయంకరుడు) అని అర్థం.

    తరువాత, డండ డడాండ డాండ పదాలకి ప్రత్యేకమైన అర్థమేమీ లేదు. ఈ పద్యంలో డకార ండకారాలు తిరిగి తిరిగి వచ్చి అందాన్నిస్తున్నాయి (వృత్యనుప్రాసాలంకారం) కాబట్టి ఈ ప్రయోగపు ప్రధాన ప్రయోజనం శబ్దాలంకారం. ఈ ప్రయోగం ద్వారా తను చాటింపు వేసేటప్పుడు భేరీ ఎలా మ్రోగిద్దామని అనుకుంటున్నాడో ఆ నినాదాలు ఎలా వినబడతాయో కూడ చెప్తున్నాడు కవి.

    ReplyDelete
  5. రాఘవా గారు-

    అంత విపులంగా వివరణ ఇచ్హిందులకి నెనర్లు.

    జిలెబి.

    ReplyDelete
  6. డాండ డడాన్డ డాండ నినదంబుల అంటే డంకా బజాయించి

    ReplyDelete
  7. భేరికా డాండ డడాన్డ డాండ నినదంబుల అంటే డంకా బజాయించి

    ReplyDelete