Saturday, March 28, 2009

వరూధిని జిలేబి ఒక్కరేనా?

ఈ బ్లాగుల్లో రాస్తున్న వరూధిని & జిలేబి ఒకరే వ్యక్తీనా లేక ఇద్దరనా అన్న సందేహం కొందరు (వరూధిని తో కలిపి) లేవ దీసారు. వరూధిని అన్న పేరుతొ నేను ఈ బ్లాగు మొదలెట్టాను. ఈ పేరెందుకు పెట్టానో నా మొదటి టపా లో తెలిపాను . ఆ పేరుతోనే మరి ఒక బ్లాగోదరి ఉన్నారని వారు కూడా ప్రముఖ బ్లాగు రైటర్ అని తెలిసింది. కొంత మంది జిలేబి పేరు ఏమిటి ఈ విడకి ? - ఈ విడకి జిలేబి లంటే మరీ ఇష్టమా అని కూడా సందేహ పడి పోయారు !

ఇందు మూలకం గా వచ్చిన సందేహాలకి సరి ఐన సమాధానం ఇవ్వ వలసిన భాద్యత నా దని
భావించి దీని మూలకం గా తెలియ జేసు కోవటం ఏమనగా - బ్లాగ్ బాన్ధవులార- నా బ్లాగు పేరు మాత్రమె వరూధిని - నా పేరు జిలేబి. ఈ విషయాన్ని గ్రహించగలరు !

ఈ ఉపోద్ఘాతం తరువాయి అందరికి తెలుగు విరోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియ జేసుకుంటూ-
మీ ప్రియమైన- వరూధిని
జిలేబి.

Monday, March 23, 2009

గూగులాయ నమః!

కొత్త ప్రపంచపు సరికొత్త శ్లోకాలు:

గూగుల్ బ్రహ్మ గూగుల్ విష్ణు గూగుల్ దేవో మహేశ్వరః
గూగుల్ సాక్షాత్ "అంతర్జాల బ్రహ్మం" తస్మై శ్రీ గూగుల్ నమః!
యాహూ నమస్త్యుభం వరదే "సెర్చ్" రూపిణీ
సెర్చ్ ఆరంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!

ఛీర్స్
జిలేబి.



Monday, March 16, 2009

పుంగనూరు జవాను కథ

చిత్తూరు జిల్లాలో ఈ పుంగనూరు జవాను అన్న పదం ప్రచారం లో ఉంది. ఈ పుంగనూరు జవాను అన్నది ఎకసక్కం గా ఎవేర్నైన ఉద్దేశించి అనడానికి ఉపయోగించడం ఇక్కడి వాళ్ల విశేషం ! ఎవడైనా "ఒరేయ్ అయ్యగారు ఉన్నారా చూసి రారా" అని పంపిస్తే వాడు చూసి వచ్చేసి "చూసానండి" అంటారు చూడండి అట్లాంటి వాళ్ల గురించి ఈ పదం వాడకం లో ఉంది!

బ్రిటిషు జమాన లో తాసిల్దార్ ఆఫీసు లో ఓ జవాను ఉండేవాడట ! వాడ్ని "ఒరేయ్ జవాను చిత్తూరు వెళ్లి కలెక్టరు గారున్నారా చూసి రారా" అంటే వాడు ఖచ్చితింగా చిత్తూరు వెళ్లి కలెక్టరు ఉన్నారా లేదా అని చూసి ఇంకా ఎట్లాంటి వాకబు చెయ్యకుండా టపీమని తిరిగి వచ్చి ఉన్నారనో లేకుంటే లేరనో చెప్పేవాడు.
"ఒరేయ్ నేను రావచునో లేదో అడిగావారా? " అంటే వాడు తల గోక్కుని "మీరు ఆ విషయం అడగమని చెప్పలేదు కదండీ? " అనే వాడు.
ఈ కథా క్రమం గా ఈ నానుడి ఏర్పడింది. ఇది జాతియమా లేకుంటే నానుడియా యా అన్నది నాకున్న సందేహం ! ఎంతైనా పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉండడం వల్ల ఇది రాయలసీమ మాండలీకం కూడం కాక పోవచ్చు. దీని పరిధి చిత్తూరు జిల్లా వరకే పరిమితి అయి ఉండవచ్చు!

ఛీర్స్
జిలేబి

Saturday, March 14, 2009

నాకు సలహా కావాలి

బ్లాగ్మిత్రబాన్ధవులార -

నా బ్లాగులోని టపాలని నేను PDF లో కి మార్చి ఈ - పుస్తకం గా వెలువరిన్చాలని ( వచ్చిన వ్యాఖ్యలతో సహా) అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇది ఎలా చెయ్యడమో తెలిస్తే దయ చేసి తెలియ జేయ్యగలరు. నా PDF దాకుమేంట్ తయారైనప్పుడు సాంకేతిక సహాయం అన్న పెరుకింద మీకు కృతజ్ఞతలు తెలియ జేసుకుంటాను.

ఛీర్స్
జిలేబి.

రాజకీయ వేత్తలు బహు పరాక్ !

రాజకీయ వేత్తలు బీ హోషియార్! మీ సద్యోగాలకి ధోకా వచ్చే కాలం ఉన్నట్టుంది!

మధ్య సినిమా నటీ నటులు ప్రభంజనం లా రాజకీయం లోకి దూసుకు వచ్చేస్తున్నారు!

కనీ వినీ ఎరుగని రీతి లో వీళ్ళు నేనంటే నేనని ముందుకు వచ్చి ఉన్న పార్టీ లోనో లేకుంటే మన చిరంజీవి గారిలా కొత్త పార్టీ తోనో ప్రజావాహిని జన జీవితం లో "కిక్కు" కలిగిస్తున్నారు!

మధ్య నటీమణి నగ్మా ముంబై నాదేనని పై ఎదలపై చెయ్యేసి మరీ ఘంటాపథం గా ఘోషిస్తున్నారు కాంగ్రెస్స్ హెడ్ క్వార్టర్స్ తో!

రాజకీయవేత్తలు మీరెప్పుడైనా ఇలాంటి "కిక్కులు" సినిమా ఫీల్డ్ లో కెళ్ళి దుమారం లా చెయ్య గలిగారా? లేదు. అంటే, దీని వల్ల తెలియ వచ్చే దేమి టంటే రాజకీయం చెయ్యడానికి ఎవ్వరైనా చెయ్య వచ్చు ! అదీ పాపులారిటీ ఉన్న సినీ నటీ నటులకి మరీ తేలిక! జన మహా ప్రభంజనం లో వాళ్ళకి ఎప్పుడు ఆహ్వానమే!

రెండో పాయింటు దీని వల్లే తెలిసేది ఏమిటంటే రాజకీయ వేత్తలు సినిమా ఫీల్డ్ లో రాణించలేరు కాని సినిమా వాళ్లు రాజకీయమ్లో భేషుగ్గా ఇమిడి పోగలరు!

వాళ్ళకి ఫీల్డ్ అచ్చోచ్చినదని శ్రీ రామారావు గారు ఆల్రెడీ నిరూపించి చూపించారు !

కారణాల రీత్యా రాజకీయ వేత్తలు బహు పరాక్! మీ సదరు ఉద్యోగాలకి మీరు తిలోదకం ఇవ్వడానికి అంత్య కాలం చాల దరిదాపుల్లో నే ఉన్నట్టుంది! సో ప్రస్తుతపు మాంద్యం లో మీ ఉద్యోగాలు హుషు కాకి కాకుండా చూసు కొండి!బహు పరాక్! బహు పరాక్ ! బీ హోషియార్! బీ హోషియార్!

కొసమెరుపు: ఈ టపా ని మా అమ్మాయికి చూపిస్తే "మరీ నీ చోద్యం గాని రాజకీయ వేత్తలు సినిమా లోకి వస్తే సినిమా ఎవరు చూస్తా రే అమ్మా ! అయినా రాజకీయం వాళ్ళని సినిమా వాళ్లు రానిస్తారా అంటా ? ఆ ఫీల్డ్ ఆల్రెడీ "క్లోసేడ్ సర్క్యూట్" కాదే? రాజకీయం వాళ్ల తెలివి ఏంటో మనకి తెలియదటే? సినిమా వాళ్లు మరీ బుర్ర ఉన్న వాళ్లు కాదటే ? " అని సందేహం లేపింది!

ఛీర్స్
జిలేబి!

(ఈ మధ్య నటీమణి నగ్మా ముంబై నాదేనని ఘోషిస్తున్నారు కాంగ్రెస్స్ హెడ్ క్వార్టర్స్ తో అన్న వార్త చదివాక వచ్చిన జ్ఞానోదయం తో !)

Thursday, March 12, 2009

వరూధిని చిత్రంలో శ్రుతిమించిన శృంగారం !

ఇంతకూ మునుపు నా బ్లాగు పేరుతొ సినిమా ఉందండోయ్ అని చెప్పాను. ఈ మధ్య అంతర్జాలం లో ఈ సినిమా పై 1947 వచ్చిన సిని విమర్శ చదివి మరీ ఆశ్చర్య పోయాను! 1947 లోనే ఈ చిత్రానికి ఇంత విమర్శ వచ్చిందంటే ( ఈ సిని విమర్శ లేక సినిమా రివ్యూ రూపవాణి పత్రికనుండి ఫిబ్రవరి 1947 సంచికనుంచి) అయ్యా బాబోయ్ నిజంగా ఆ కాలం లోనే సినిమా వాళ్లు అదీను తెలుగు సినిమా వాళ్లు ముందంజ ఉన్నారా అని ఆశ్చర్యం కలుగక మానదు. - ఈ సినిమా రివ్యూ ఆర్తికేల్ టైటిల్ : వరూధిని చిత్రంలో శ్రుతిమించిన శృంగారం! చదివి చూడండి మీరు ఆశ్చర్య పడక మానరు!
కొసమెరుపు:
అన్నమయ్య కే ద్విపత్ని సమేతం గా ఆసేతుహిమాచలం తన చిత్రం ద్వారా ప్రాచుర్యాన్ని తెచ్చిన మన రాఘవేంద్ర రావు బీ. ఎ. గారికి ఈ వరూధిని ఇంతదాకా తట్టక పోవడానికి కారణం ఏమి ఉంటుంది చెప్మా?

ఛీర్స్
జిలేబి.

లంకె:
1. http://www.cscsarchive.org/MediaArchive/art.nsf/(docid)/4C9F991856F2F392E5256D06003DF1DD

http://www.cscsarchive.org/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/4c9f991856f2f392e5256d06003df1dd/$FILE/Te230122.pdf

Wednesday, March 11, 2009

గొల్టి గాడి గోడు - చిత్తూరు గొల్టీలు

ఈ అరవం వాళ్ళకి తెలుగోడిని చూస్తె అదో మజా. ఈ చిత్తూరు వాళ్ళలో చాలా మంది తమిళులు ఉండడం చేత వీళ్ళకి తమిళ నాడు తో బంధుత్వం రీత్యా రాక పోకలు చాలా ఉండటం తో మద్రాసు తెలిసనంతగా హైదరాబాదు గాని మరి ఎ ఇతర ఆంధ్ర దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు తెలియక పోవడం అన్నది ఆ కాలం లో మాట. ఇప్పుడు కూడా ఇదేనా అన్నది నాకు తెలియదు. మా మిత్రుడొకడు అరవం వాడు - మాతో బాటే తెలుగు చదివి మా కన్నా తెలుగులో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవాడు - అరవం మాట్లాడం మాత్రమే తెలిసినవాడు - ఎందుకంటే ఈ చిత్తూరు అరవం వాళ్ళకి మాత్రు భాష అరవమైన కూడా ఆంద్ర దేశం లో ఉండటం వల్ల తెలుగు నేర్చుకునేవాళ్ళు కాబట్టి- సరాసరి మూడు నెలలకోసారైన తమిళనాడు కి అంటే దరిదాపుల్లో నున్న కాట్పాడి గాని మద్రాసు గాని వెళ్ళిరావడం అన్నది సర్వ సహజం. వీడు ప్రతి సారి తమిళనాడు కి వెళ్లి బంధు మిత్రులని కలిస్తే వాళ్లు పలకరింపు - "ఎన్నాబ్బ గొల్టి ఎప్పడి ఇరుక్కే " అనటం వీడు మండి పడి "నానోన్నుం గొల్టి ఇల్లే " అని సమజాయింపు చేసుకోవడం సర్వ సాధారణం ! ఈ గొల్టి పదం మరి ఇతర జిల్లాలో వాడతారో లేదో తెలియదు గాని చిత్తూరు జిల్లా వారికి ఈ పదం తో అవినాభావ సంబంధం తప్పక ఉంది. అంతే గాకుండా ఈ గొల్టి పదం ఓ మోస్తరు అయోమయం మనిషి అన్న పదాని కి కొన్ని మార్లు పర్యాయ పదం గా కూడా ఈ అరవం వాళ్లు ఉపయగొంచిడం కద్దు.

"ఎన్నబ్బ గొల్టి కథ అర్థమాచ్చ? "

ఛీర్స్
జిలేబి.

Sunday, March 8, 2009

బ్లాగ్లోకం లో బంగరు పాప

ఈ శీర్షికని సినిమా టైటిల్ క్రింద రిజిస్టర్ చెయ్యాలని నాకో ఆలోచన వచ్చింది. పూర్వాశ్రమం లో ఇట్లాంటి టైటిల్ ఉన్నఓ సినిమా హిట్ అయినట్టు గుర్తు. ఈ మధ్య సినిమా వాళ్లు కూడా తెగ బ్లాగేస్తున్నారని వినికిడి. ఆల్రెడీ వాళ్లు చిన్ని తేరా కి వచ్చేసి బుల్లి తెరలో పని చేసే చిన్ని నటీనటుల్ని తరిమేసి తామే తెర నిండా ఆక్రమించుకుని అన్యాయం చేసేస్తున్నారు ప్రజలకి సినిమా టాకీసు కి వెళ్ళాక పోయిన ఇంటి చిన్ని ఇడియట్ బాక్స్ లో కనబడి భయ పెట్టేస్తూన్నారు. ఇక వీళ్ళు బ్లాగ్లోకం లో వచీస్తే మన లాంటి చిన్ని చితకా ఎక్కడికి పోయేది? అయిన వీళ్ళు ఈ బ్లాగ్లోకం లోకి రారని నాకనిపించిన - కారణం ఇక్కడ పైసలు ఏమి రాలవు కాబట్టి - ఓ వైపు భయం ఉందనే చెప్పాలి. అందుకే ఈ మహిళా దినోత్సవపు వాళ "బ్లాగ్లోకం లో బంగరు పాప " అన్న చిత్ర రాణి నా రాణి అని కంపూటర్ కీ బోర్డు గుద్ది మరీ ఘంటాపథం గా వక్కానిస్తున్నాను. బ్లాగు సోదరీ సోదరులారా నా ఈ రిజిస్ట్రేషన్ కి మీరు మద్దతు ఇవ్వాలని మహిళా దినోత్సవపు నా ఈ కోరికగా తెలియ జేసుకుంటూ



మీ బ్లాగేస్వరి జిలేబి.

Wednesday, March 4, 2009

చెప్పుల బాబాయి - ఫైనాన్స్ గీత

నా చెప్పులు తెగి పోయేయి. మా వీధిలో ఉన్న చెప్పుల బాబాయి ఒక్కడే దిక్కు ఇక నాకు!
ఈ చెప్పుల దుకాణం ఈయన ఎప్పుడు పెట్టేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను పుట్టి బుద్ధి వచ్చి నప్పటి నించి ఈ బాబాయి దుకాణం ఉంది కాబట్టి ఈయన మా వాడకందరకి బాబాయ్! ఆ మధ్య మా వీధికో కొత్త ఫ్యామిలీ వచ్చింది. నా చెప్పులు కుట్టుకునేందుకు వీధి చివర్న ఉన్న బాబాయి అంగడికి వెళితే ఆ ఫ్యామిలీ పెద్ద తన చెప్పులు కుట్టించుకుంటూ "ఏమిటోయి చెప్పులు కుట్టేదాని కి 10 రూపాయలు తీసుకుంటావ్ ఎన్ని రోజులకి గ్యారంటీ? అనడమున్ను చెప్పుల బాబాయి సీరియస్ గా ఈ కొత్తాయన వైపు చూడడమున్ను ఆ పై ఈ గీతోపదేశం చెయ్యడమున్ను కనుల ముందు చేవులాస్చర్యంగా సాగి పోవడమున్ను జరిగింది.
"ఏమండి ఓ పది రూపాయలిచ్చి పాత చెప్పుకు గ్యారంటీ అడుగుతారు? ఏమి గ్యారంటీ ఉందని ఈ వీధి మొదట్లో ఉన్న బ్యాంకులో డబ్బులు పెట్టేరు? తెలియకడుగుత మీరు ఆ బాంకులో డబ్బులు పెట్టి ఉంటే దీనికన్నా గ్యారంటీ గా తిరిగి వస్తుందని చెబ్తారా? "

పోనీ మన మున్సిపాలిటీ కోన్సేల్లెర్ మీకీ ఎ సహాయం చేస్తాడని గ్యారంటీ? మీ మంత్రులు మీకే మేలు చేస్తారని గ్యారంటీ కింద వాళ్ళని ఎన్నుకున్నారు? ఆ మాటకీ వస్తే మీ కి ఎ గ్యారంటీ ఉందని దేశం మంత్రులు వరల్డు బాంకులో అప్పు తీసేసుకుంటున్నారు? ఈ లా ఈయన ఉపన్యాసం మొదలెట్టేసరికి ఆ పెద్దాయన కి ఏమి పాలు పోక మనకెందుకులే అని సీరియస్ గా ఓ లూక్కు విసిరి వీసా వీసా వెళ్ళిపోయేరు. నాకైతే నవ్వాగ లేదు. ఏమి బాబాయ్ మరీ అంత సీరియస్ అయి పోయేవ్ అంటే " ఎమున్దమ్మ అంతా ఈ మధ్య గ్యారంటీ లదగతం మొదలెట్టేరు ! అదేదో అమెరికా దేశం లో ఇన్సురన్సు కంపనీలే మునిగి పోతావుంటే నా చెప్పులకి ఆ కుట్టుకి ఈళ్ళు గ్యారంటీ లదిగితే నేనేమి చేసేది! ఈ కుట్టే దారం నాదా ? ఈ సూది నాదా? లేకుంటే ఈ చెయ్యి నాదా? ఈ కన్నూ నాదా? - వీటి కన్ని టికి గ్యారంటీ ఇచ్చేవాడు ఉన్నాడో లేదో ఏమి గ్యారంటీ అంటూ వేదాంతము లోకి దిగి పోయీడు!

ఛీర్స్
జిలేబి.

Tuesday, March 3, 2009

గూగుల్ అయ్యవారు - యాహూ అమ్మవారు

ఈ మధ్య మా అక్కయ్య అబ్బాయి (అదేదో దేశం కాని దేశం లో పని చేస్తున్నాడు - పేరేదో చెప్పాడు కాని నోట్లో తిరుగాడటం లేదు-) ధబీల్మని ఓ రోజు ప్రత్యక్షమై కథా కమామీషు గా ఈ గూగుల్ అయ్యవారు- యాహూ అమ్మవారి గురించి చెప్పాడు.

ఏమిటోయ్ మీ దేశం లో జనాలు ఎట్లా చదువు సాగిస్తున్నారు? అని అడిగితె అదేముంది ఎ ప్రశ్న కైనా గూగుల్ గాని యాహూ చేస్తేగాని సరిపోతుంది - చాంతాడంత ఆన్సర్ రాయవచ్చు అని కొట్టి పారేసాడు.

అదేమిటి విడ్డూరం ఇంక పిల్లకాయాకి ఎలారా విజ్ఞానం వస్తుంది? అని అడిగితె - విజ్ఞానం ఎందుకె పిన్నమ్మ - ఎ చదువైన "ధనం మూలం ఇదం జగత్" కొరకే గదా గూగుల్ అయ్యవారు యాహూ అమ్మవారు ఇంటింటా జ్ఞానాన్ని క్షణాల్లో ఇచీస్తుంటే - జ్ఞానాన్ని సముపార్జించుకుని లేకుంటే మూటకట్టుకుని ఏమి చేస్తాము ? అని శివాజీ బాస్ లెవల్లో అయిన ఈ జ్ఞానం ఇవన్ని మనం పోయేటప్పుడు మనతో బాటు వస్తాయా అని వేదాంతము వేరే చెప్పాడు!

అవురా ఈ జమానా కుర్రాళ్ళు ఏమి ఫాస్ట్ రా బాబోయ్ అని బుగ్గ నొక్కేసుకున్నా! అంటా విష్ణు మాయ గాకుంటే మరేమీ తన్టారూ?

మీ జిలేబి.