Wednesday, September 30, 2009

కాదేది కవిత కనర్హం

ఈ మధ్య శ్రీ శ్రీ గారి రచనల్ని తిరగేస్తుంటే వారి కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ ,అగ్గి పుల్ల గుర్తు కొచ్చేయి. కాదేది కవిత కనర్హం లా కాదేది బ్లాగ్లోకానికి అనర్హం అన్నా తప్పులేదు లా ఉన్నది. ఈ ఇరవై ఒక్క శతాబ్దం లో బ్లాగులు నాటి పత్రికల్ని తలదన్నెట్టు వేర్వేరు సబ్జెక్టు లతో కొత్త కొత్త హంగులతో వస్తున్నై. ఆ కాలంలో ఎ ఆంద్ర పత్రిక లేక ప్రభ లోనో ఓ చిఇన్ని "మీ ఉత్తరం" లో మన పేరు కనిపిస్తే అదే పదివేలన్న సంతోషం తో మురసి పోయే వారం! ఇక మన కథ అచ్చు ఐతే చెప్పనవసరమే లేదు! కాలరేగారేసుకొని ఓ గడ్డం పెంచేసుకుని గొప్ప కథకులమై పోయేమన్నఆలోచనలో విహంగమై విహరించే వాళ్ళం! మరి ఇప్పుడు ఎవరి కి ఏది తోస్తే వాళ్లు అది వ్యక్తీ కరించవచ్చు! దాన్ని చదివి కామెంటడానికి జనాభా ఖచ్చితంగా ఉంటున్న్దన్న భరోసా ఎల్లప్పుడూ ఉండనే ఉన్నది!
బ్లాగోన్నమః!

ఛీర్స్
జిలేబి.

Tuesday, September 15, 2009

ఓబన్న ఓనమాలు

ఓబన్న గారు అమెరికా దేశాధ్యక్షులు ఈ మధ్య ఓ వారం మునుపు స్కూల్ పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళని ఉత్తేజ పరిచేలా వాక్రుచ్చేరు. వారి మాట ప్రకారం గా మనం జీవితం లో ఎట్లాంటి ఉద్యోగం లో కి వెళ్ళాలన్న మంచి చదువు ఉండాలన్నారు. అలా అంటూ అందులో రాజకీయ నాయకునికి ఎలాంటి చదువు కావాలో చెప్పలేదు! దీని ప్రకారం చూస్తే రాజయకీయనికి చదువుకి చుక్కెదురు అమెరికాలో కూడా అనుకోవాలేమో ? ఓబన్న చెప్పిన వేదం ఆంగ్లం లో ఇక్కడ ఇచ్చాను!


"And no matter what you want to do with your life – I guarantee that you’ll need an education to do it. You want to be a doctor, or a teacher, or a police officer? You want to be a nurse or an architect, a lawyer or a member of our military? You’re going to need a good education for every single one of those careers. You can’t drop out of school and just drop into a good job. You’ve got to work for it and train for it and learn for it"

ఛీర్స్
జిలేబి.

Saturday, September 5, 2009

ఎంతెంత దూరం?

చిన్న పిల్లల ఆటలలో ఓ చిన్ని ఆట - కళ్ళకు గంతలు కట్టు కుని "ఎంతెంత దూరం?" అంటూ ముందు వెళ్తున్న చిన్నారి పాపో బాబో అంటుంటే వెనుక వస్తున్నపాప "చాలా చాలా దూరం" అంటూ గెంతుతూ వెళ్ళడం చిన్ని ప్రదేశాలలో గమనించవచ్చు. కాని వాళ్లు ఆటలాడుతున్న ప్రదేశం మాత్రం చిన్ని ప్రదేశమే!

కీర్తి శేషులు శ్రీ వై ఎస్ ఆర్ ఆఖరుగా పలికిన వాక్యం " చిత్తూరికి ఫ్లైట్ ఎంత సేపట్లో వెళుతుంది" అని పైలట్ ని అడిగారని ది హిందూ వారు కోట్ చేసారు.

చిత్తూరు అన్నపదం "సత్పురమ్" అన్న పదం నుంచి వచ్చినట్టుగా నానుడి. కాబట్టి శ్రీ వై ఎస్ ఆర్ గారి ఆఖరి వ్యాఖ్యని "సత్పురమ్ వెళ్లడానికి ఎంతసేపు?" అని అడిగ్నట్టుగా అనుకుంటే జవాబు ఆయన జీవిత ఆఖరి ఘడియలే అని పిస్తుంది. సత్పురమ్ అంటే శ్రీ మన్నారయణుని నివాసం.

శ్రీ వై ఎస్ ఆర్ కుటుంబసభ్యులకి ఒదార్పులతో
జిలేబి.