Tuesday, May 11, 2010

ఆది శంకర - గౌతమ బుద్ధ- స్వామీ వివేకానంద - ఆ పై?

శంకరాచార్యుల వారు జీవించినది ఓ ముప్పై సంవత్సరాల కాలం పాటు. గౌతమ బుద్ధుడు జీవించినది ఓ ఎనభై సంవత్సరాల కాలం పాటు. స్వామీ వివేకానంద విషయం తీసుకుంటే ఆయనా నలభై లోపే జీవనం పరిసమాప్తి చెయ్యడం జరిగింది.

వేదముల సూక్ష్మం మరుగుపడి కర్మ కాండలు అధికమై సనాతన ధర్మం అధోగతి పాలవుతున్నప్పుడు బుద్ధుడు దిక్సూచి గా మారి జన జీవనానికి వేదాన్ని దాని సారాంశాన్ని ధ్యాన మార్గం ద్వారా తెలియజేసి ఓ సరికొత్త పంధా కి నాంది వాక్యం పలికాడు.

అలాగే బౌద్ధం క్షీణించి కర్మ కాండల మార్గం లో దిక్కు లేని దిశలో ప్రయాణిస్తున్న సమయం లో ఆది శంకరులవారు సనాతన మతాన్ని ఉద్దీపనం చేసారు.

ఆ పై చరిత్ర పునరావృత్తం అయి సనాతన ధర్మం అడుగున పడి - అసలు సనాతన ధర్మం ఇక నిల దొక్కుగో గలుగుతుందాని సందేహం వచ్చిన సమమయం లో వివేకానందుని వాక్కు ప్రతిధ్వనించింది. భువి పర్వంతం ఓ సరికొత్త నిర్వచనం తో సనాతన ధర్మం కర్మ సిద్ధాంతం వైపు పరుగులు తీసింది.

ఆ పై ఎవరు? - ? ఈ కాలానికి తగినట్టు స్వాములు - బాబాలు ఉన్నారు.
కాకుంటే - ఓ సరి కొత్త దర్శనాన్ని చూప గలిగే ఆ వినూత్న శక్తీ కాకుంటే మానీషి ఎవరు? ఆ మలుపు ఎప్పుడు?

చీర్స్
జిలేబి.

2 comments:

  1. >> వేదముల సూక్ష్మం మరుగుపడి కర్మ కాండలు అధికమై సనాతన ధర్మం అధోగతి పాలవుతున్నప్పుడు బుద్ధుడు దిక్సూచి గా మారి జన జీవనానికి వేదాన్ని దాని సారాంశాన్ని ధ్యాన మార్గం ద్వారా తెలియజేసి ఓ సరికొత్త పంధా కి నాంది వాక్యం పలికాడు.


    I do not agree with this. Buddhisam never supported vedic sacrifices.

    ReplyDelete
  2. Dear Bhaaraare

    Thank you for your comments. The essence of vedic life vanished by the time of Buddha and what remained was nothing but sacrifices. Vedic life is beyond that. So to my understanding Buddha gave the essence in the form of Dhyana- meditation where there is no form(inclusive of Buddha) which later on over period of time went into idolation of Buddha which is a deterioration or can we say corruption of the master Buddha's principle which is always the case through the history when the master leaves the mortal coil the followers some how lose the track and over period of time gets into rituals. Hope this clarifies my point

    cheers
    zilebi.

    ReplyDelete