Thursday, September 16, 2010

ఇండియన్ స్టాక్ మార్కెట్ - ఎ గతి?

నదీనాం సాగారో గచ్చసి అన్నది సుభాషితం.

ఈ స్టాక్ మార్కెట్ లకి సాగరం ఎక్కడ ఉన్నదన్నది నా పెద్ద సందేహం!

ఏదో కొంపలు మునిగి పోయేటట్టు - విపరతీం గా అమ్మేసుకుని అమ్మోయ్ మేమంతా నష్ట పోయామోచ్ అని తల మీద గుడ్దేసుకుని ప్రభుత్వాలని గెంజి , బతిమాలి కాకుంటే - మా కు ఆత్మా హత్యలే శరణ్యం అని బెదిరించి డబ్బులు - ప్రజల పన్నుల డబ్బులు లాగేసుకుని - మళ్ళీ జూమ్మని తెగ స్టాక్ లు కొనుక్కుంటూ వోయ్ ఇండియా ఆసియా లో తలమానికంగా వెలుగొంద బోతూందని స్టేట్మెంట్లు ఇచ్చేయ్యడం - !

విష్ణు మాయ కాకుంటే - ప్రతి కొన్ని సంవత్సరాలకి ఇది జరగడం - ఆ తరువాయి అంతా మరిచి పోయి - వోయ్ మంచి రోజులు వచ్చేసాయ్ అని చంకలు గుద్దేసుకుని సంతోష పడి పోవడం - కాదండీ మరి ? - ఈ గతి కి సముద్రం ఎక్కడ ఉన్నది?

చీర్స్
జిలేబి.

1 comment:

  1. పోయినసారి డబ్బులు పోగొట్టుకున్న వారు ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యరు, ఎప్పుడూ ఒక కొత్త బ్యాచ్ మునిగి పోతారు. ఎప్పుడైతే టీవీ చానెల్లన్నీ మంచిరోజులు వచ్చాయని చెబుతుందో అప్పుడు చెడ్డరోజులు దగ్గరలో ఉన్నాయని అర్ధం.

    ReplyDelete