Tuesday, March 1, 2011

మాయన్ -క్యాలెండరు - 12-12-12 - సారూప్యతలు !


మాయన్ క్యాలెండరు గురించి జరుగుతున్న పరిశోధనలు గురించి మీలో చాలామంది చదివే ఉంటారు.
దీనికి సంబంధించి కొంత చదివాక సరే - మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమైనా ప్లానెటేరి పొసిషన్స్ కనిపిస్తున్నాయా అని ఆ రోజు కి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి , రెండు వేల పన్నెండు కి చక్రం గీస్తే నాకైతే ఎలాంటి విశేషాలు కనిపించలేదు చార్ట్ లో.
సరే - ఇంత గగ్గోలు అవుతోంది కదా - ఈ మాయన్ కాలెండర్ సబ్జెక్టు అని కొంత ముందు వెళ్లి డిసెంబర్ పన్నెండో తేది ,(కాకుంటే పదమూడో తేది ) రెండు వేల పన్నెండు కి చార్ట్ చూస్తె - ఓ పాటి విలక్షణమైన జ్యోతిష చార్ట్ కనిపించింది. అంటే - రెండు ప్లానెట్ లు తప్పించి, ( మంగళ, శని గ్రహాలూ తప్పించి మిగిలిన వన్ని కల గట్టుకుని ఎదురెదురు గా కనిపించడం, ఆ పై డిసెంబర్ పదమూడో తేది అమావాస్య కూడా కావడం లాంటివి నాకు తట్టిన విశేషాలు. ఇంకా ఇందులో నిష్ణాతులైన వాళ్ళు దీని మరింత విశ్లేషించవచ్చు.
అంతె కాకుండా - పదమూడో తేది అమావాస్య కాబట్టి - డిసెంబర్ ఇరవై ఒకట వ తేది నవమి. ద్వాపర యుగ కర్త శ్రీకృష్ణుడి జన్మం అష్టమి లో. త్రేతాయుగ కర్త శ్రీ రాముని జననం నవమి లో. కలి యుగ కర్త ( ఎవరు? ) తెలియదు, నాకైతే - కలి ప్రభావం అనుకుంటే - శ్రీ కృష్ణ పరమాత్లు , ఈ కలి యుగానికి కూడా కర్త గా అనుకోవచ్చు. సో, ఈ రీతిలో ఆలోచిస్తే - సప్తమి రోజున ఏదైనా విశేషం ఉండవచ్చా? అంటే ఈ డిసెంబర్ పన్నెండు నించి ఇరవై ఒకటి లోగా ఏదో విశేషం జరగవచ్చు అని ఊహించవచ్చా? మీ ఉద్దేశాలు తెలుపగలరు.
చీర్స్
జిలేబి.

1 comment:

  1. మీరు చాలా ఆసక్తికరమైన విషయాన్ని లేవనెత్తారు. నాకు mundane astrology తో పెద్దగా పరిచయం లేదు. అందుకని no comments. పెద్దల వ్యాఖ్యల కోసం పంచవటికి పంపుతున్నాను - ఏమీ అనుకోరు కదా?

    ReplyDelete