Tuesday, April 26, 2011

బాబా తిరిగి రాక

బాబా తిరిగి రాక -

 మాన వాళి నివాళుల తో పరి తపించే హృదయాలతో వీడు కోలు

అందరి చిరు ఆశ - బాబా తిరిగి వస్తారని !

మానవ హృదయం తన హృదయానికి ప్రతీక ఆయనలో చూసుకుంది.

అద్దం భల్లు మన్నది. గుండె చివుక్కు మంటోంది.

జాతస్య హి మృతం ధ్రువః ! అద్దం ప్రతిబింబం - ఆ ప్రతిబింబాన్ని ఇన్ని దశాబ్దాల బాటు తనివి దీర ఆస్వాదించాం.

ఇప్పుడు ఆ ప్రతిబింబం లేదు.

కానీ అందరిలో ఉన్న ది దాని స్వరూపం. 

ఆ స్వరూపాన్ని వెలుపల కి తీద్దాం. అదే బాబా గారి తిరిగి రాక!

సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామని క్రిత్వాభివదన్ యదాస్తే !
తమేవం విద్వానమృత ఇహ భవతి - నాన్య పంథా అయనాయ విద్యతే !!


నివాళుల తో

జిలేబి.

7 comments:

  1. ఏవో కొన్ని మంచి పనులను పెట్టుబడిగా పెట్టి వేల కోట్లు దోచుకున్న దొంగ దేవుడికి అందరూ అండగా వుండటం మన దేశం యొక్క దౌర్భాగ్యం..

    ReplyDelete
  2. అప్పట్లో విజయవిహారం బాబా మోసాలను సాక్యాలతో సహా బయటపెట్టింది కానీ ఎవరూ support చేయలేదు..warren buffett bill gates లాంటి నాస్తికులు అంతా కన్నా ఎక్కువ ఆస్తులను జనం కోసం త్యాగం చేశారు..

    ReplyDelete
  3. విజయ విహారం ఎడిటర్ నాస్తికుడు కాదు. అతను మత విశ్వాసాలు ఉన్నవాడే కానీ మన నాయకులలాగ బాబాల కాళ్ళు పట్టుకునే టైప్ కాదు.

    ReplyDelete
  4. ఇన్నయ్య గారి బ్లాగ్‌లో అనుకుంటాను, సత్యసాయిబాబా పై విమర్శలు వచ్చినప్పుడల్లా జీవని ప్రసాద్ వచ్చి అనంతపురం జిల్లాలో వాటర్ ట్యాంక్‌లు కట్టించింది సత్యసాయిబాబాయేనని చెప్పి జస్టిఫై చేసేవాడు. విరాళాలు వసూలు చేసి ఆ డబ్బులలో కొంత ఖర్చు పెట్టడం గొప్ప కాదు. భక్తి పేరు చెప్పకపోతే విరాళం ఇవ్వని స్థితిలో ప్రజలు ఉండడం మన దౌర్భాగ్యం.

    ReplyDelete
  5. "ఉత్తములైన వారు దేనిని ఆచరించునో లోకమంతయు దానినే ఆచరించును" అని భగవద్గీత లో చెప్పినట్లు, మన సినీ,క్రీడా, రాజకీయ ప్రముఖులు అతన్ని నమ్మినపుడు సామాన్యులు కూడా అదే బాట పడతారు కదా. నా బాధ ఏమిటంటే స్వయంకృషి లేకుండా అందరూ ఏ విభూదినో ఉంగరాన్నో నమ్ముకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటారని.

    ReplyDelete
  6. ఈ రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు బాబా గురించి చేస్తున్న హడావిడి చూస్తుంటే మనం ఎంత అసత్యపు స్వార్థపరమైన సమాజంలో వున్నామో అర్థం అవుతుంది..సామాజిక భాద్యత గల మీడియా కూడా అతన్ని దేవుడిగా భావించి ప్రచారం చేయటం అత్యంత భాధాకరం...అసలు ఈ బురిడీ బాబా గొప్పతనం ఏంటో కొంచెం తార్కికంగా వివరణాత్మకంగా ఎవరన్నా posts పెడితే చదవాలని వుంది

    ReplyDelete
  7. ఏసు ప్రభువు త్వరలో తిరిగి వస్తాడని రెండు వేల సంవత్సరాల నుంచి చెపుతున్నారు. ఇప్పటి వరకు తిరిగి రాలేదే.

    ReplyDelete