Friday, May 27, 2011

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ - 1

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ

ఒకానొక దేశం లో బ్లాగ్ యువ రాణి సమ్మోహనం గా వెలుగొందు చుండెను.

పొరుగు రాజ్యాలలో పేరిన్నికగన్న కామెంటు యువరాజాలు కోకోల్లెలు గా ఉండిరి.

బ్లాగు యువరాణి  వారి కి  పెళ్లి చెయ్య దలిచి వారి రాజా వారు - తన రాజ్యం లో నూ పొరుగు రాజ్యం లోనూ డప్పు వేయించెను.

బ్లాగు యువరాణికి  సరి జోడు ఎవరైనను స్వయంవరమునకు రావలనేహో అని ఆ డప్పు వాడు డప్పు వాయిన్చుచూ రాజ్యాలు తిరిగెను.

ఈ బ్లాగు రాణి బహు సుందరాంగి కావున అన్ని కామెంటు యువరాజులు వారి వారి పనులని పక్కకు నెట్టి స్వయంవరాని కి ఏగు తెన్చిరి.

ఆ నాటి స్వయం వారానికి ఏగు తెంచిన రాజా వారలను గమనిచి బ్లాగు యువరాణి సుకుమారి వారికి కష్టమైన పనిని చెప్పెను. అది ఎవరు  సాధించెదరో వారికి తన కుమార్తెను కట్ట బెట్టెద నని రాజా వారు వ్రాక్కున్చిరి.

(సశేషం)

జిలేబి.

5 comments:

  1. ఆ యువ(?) రాజా ల జాబితాలో నా పేరు కూడా చేర్చండి :)

    ReplyDelete
  2. ఎవరా యువరాణీ, ఏమా కథ? ఆ పరీక్షకి అంపైరుగా నన్నుండనివ్వండి.

    ReplyDelete
  3. శివధనస్సు, మత్స్య యంత్రమూ లాటివి ఓల్డ్... ఎవరు ఎక్కువ చెత్త బ్లాగుని రాస్తారో వారినే వివాహమాడవలనెనని రాకుమారికి నా మనవి (అప్పుడైతే నేనే గెలవచ్చు)..

    ReplyDelete
  4. ఎవరైతే నా బ్లాగ్ లో వరుసగా వారం రోజులు కామెంట కుండా ఉంటారో వారినే వివాహమడేదను అని ప్రకటించెను.
    కాని మన కామెంట్ యువరాజులకది సీతమ్మ వారి అగ్ని పరీక్షా కన్నా కష్టం గా తోచింది. అటు పిమ్మట పరీక్షా ప్రారంభం అయ్యెను.
    బ్లాగ్ యువరాణి వారు తన ప్రావీణ్యం అంత ఉపయోగించి పలు పలు విషయాలలో బ్లాగ్ పోస్టులు ప్రచురించెను.
    ఆ టపాలు చదివి యువరాణిని మెచ్చుకోకుండానో , తిట్టు కోకుండా నో ఉండలేని కామెంట్ వీరులు కామేంటి స్వయంవరం నుండి నిష్క్రమించిరి.
    (సశేషం)

    ReplyDelete
  5. @ cricketlover
    kevvvvvvvv keka

    ReplyDelete