Saturday, June 25, 2011

బ్లాగు గొలుసు కథ - ఒక ప్రయోగం

పూర్వ కాలం లో - వార పత్రికలూ , మాస పత్రికలూ ఆంధ్ర ప్రజానీకాన్ని అలరారించిన కాలం లో ( అబ్బో ఇదేదో ఓ వంద సంవత్సారాల్ ముందు కాదు లెండి - ఓ మోస్తరు ఇరవై లేక ముప్పై సంవత్సారాల ముందు - ) వార పత్రికల్లో కానివ్వండి , మాస పత్రికల్లో కానివ్వండి, గొలుసు కథలు లేక గొలుసు నవల వచ్చేవి.

అంటే ఎవరో ఒక రచయితా కాకుంటే, రచయత్రి ఓ వారం కథ రాస్తే దాని ఆధారం గా వేరొకరు కథ ని పొడిగించి ఒక మంచి మలుపు ఇచ్చి వదిలేవారు. అలా అలా సాగి పోయే గొలుసు కథా ప్రవాహం లో , ఎడిటర్ గారు అల్టిమేటం ఇచ్చి ఆఖరి అధ్యాయాన్ని రాయమనేవారు. అలా అంత మయ్యేది ఆ కథో లేక నవలో .

మరి మన కాలపు బ్లాగు లోకం లో ఈ గొలుసు కథా కాకుంటే నవల ప్రయత్నం ఎవరైనా చేసారా లేదా నాకు తెలీదు.

నా ప్రయత్నం గా ఈ పధ్ధతి కి ఈ కథ మొదటి భాగం ఇక్కడ ఇస్తున్నాను - ఇందులో ఆసక్తి ఉన్న బ్లాగ్ బంధువులు ఈ కథకి రెండో భాగం రాయ వచ్చు. దాన్ని ఈ కథ కింద కామెంటులో మీరు లింకు ఇవ్వచ్చు. మీకు అభ్యంతరం లేక పొతే ఆ లింకుని నేను మళ్ళీ ఈ టపాలో లింకు కింద కూడా ఇవ్వగలను.

ఈ బ్లాగు గొలుసు పధ్ధతి ద్వారా నాకు ఏమని పిస్తుందంటే - ఒకటి కన్నా ఎక్కువైన రెండో భాగాలు కాకుంటే వేరు వేరు భాగాలు రావచ్చు. అంటే ఒకే కథ ఆరంభానికి వేరు వేరు శాఖలు రావచ్చన్న మాట ! అంటే కథ వేరు వేరు తరహాలో వెళ్ళ వచ్చు. !  ఇక్కడ ఎడిటర్ ఎవరు లేదు కాబట్టి ఆ ఆ శాఖల కథ తదుపరి భాగాలు మళ్ళీ మరో శాఖలు కావచ్చు. !  ఆలోచిస్తూంటే చాలా అద్భుతం గా అని పిస్తుంది నాకైతే ఈ ప్రయోగం !

ఈ గొలుసు ప్రయోగం ఎంత దాక వెళ్తుందో చూద్దాం ! బ్లాగర్ల కందరికీ సుస్వాగతం ! - ఈ ప్రయత్నం సాఫల్యం మీ మీద ఆధార పడి ఉంది !

మొదటి భాగం ఇక్కడ:


విజయోత్సు !

చీర్స్
జిలేబి.
                                                    

4 comments:

  1. అవును గొలుసు కట్టు కథలు నేనూ చదివా. ఆసక్తికరంగా వుండేవి. ప్రయోగం బావుంది కానీ నాకు వ్రాసేంత ఓపిక లేదు కనుక చూస్తూ వుంటా. మీ మొదటి భాగం ఆసక్తికరంగా వుంది. అప్పట్లోనే పలు రకాల రచయితలు ఒక ఆంశం తీసుకొని వ్రాస్తే ఎలా వుంటుందో లేక ఒక కథ వ్రాస్తే ఎలా వుంటుందో కూడా వ్రాసేవారు. అలా కూడా ఎవరయినా పలు బ్లాగర్ల శైలితో వ్రాస్తే చూడాలని వుంది.

    ReplyDelete
  2. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ http://teluguwebmedia.in - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్‌లో గూగుల్ సెర్చ్ బాక్స్ సౌకర్యం కల్పించబడినది. మీరు అగ్రెగేటర్‌లోని పాత ఆర్కివ్‌లు సెర్చ్ బాక్స్ ద్వారా వెతుక్కోవచ్చు.
    ఇట్లు నిర్వాహకులు - తెలుగు వెబ్ మీడియా

    ReplyDelete
  3. ప్రమదావనం సభ్యులు ఈవిధంగా గొలుసు కధ రాసారండి.. ఇదిగోండి లంకె..

    http://srilalitaa.blogspot.com/2011/03/11.html

    ReplyDelete
  4. Manchi Prayatnam jyothi gaaru. Pramadaavanam sabhyulaku subaakaankshalu ! anduonu jyothi gaari ki final gaa a kadambaanni e-pustakm gaa ivvadam manchi prayatnam !

    cheers
    zilebi.

    ReplyDelete