Tuesday, August 9, 2011

రాజీ లేని నామాలు - నామాలు లేని 'రా' జీవులు'

ఈ రాష్ట్రం లో మరీ చోద్యం - రాజీ నామాల పర్వం నిరంతరం కొనసాగుతూనే ఉంది.

ఈ గవర్నమెంటు ఉద్యోగి రాజీ నామా చేస్తే పాపం అతని కి తిరిగి ఉద్యోగం దొరకటం కుదరదు.
మన రాజ కీయ నాయకులకు మాత్రం ఎన్ని మార్లు రాజీ నామాలు చేస్తే కూడా పర్లేదు. మళ్ళీ సద్యోగం ఖాయం

గవర్నమెంటు ఉద్యోగులు కాస్త తెలివి తెచ్చి కొండి. అసెంబ్లీ సమావేశాల్లో మీకు కావలసినన్ని జీ వో లు , మీకు సముఖం గ ఉన్న జీ వో లో కాస్త తెలివిగా ప్రతిపాదించు కొండి.

ఈ నాయకులతో సమం గ మీకు కూడా అన్ని విధాలా సౌకర్యాలు కల గ జేసు కొండి. కాస్త మా మీద కనికరం ఉంటె అప్పుడు కొంత మాకు కూడా పడెయ్యండి.  అసలే మేం నామాలు, అడ్రస్ లేని జీవులం ! కాస్త కనికరించండి.


ఇట్లు

జిలేబి ల కోసం లేజీ లైన మేం సాహేబులం - ఆంద్ర వాసులం  పై పెచ్చు భారత మాత ' ముద్దు ' బిడ్డలం !

1 comment:

  1. ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేస్తే అతనికి ఉద్యోగం తిరిగి వస్తుంది కానీ అందుకు కొన్ని రూల్స్ ఉంటాయి. మా మామయ్య బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికలలో పార్లమెంట్‌కి పోటీ చేశాడు. ఎన్నికలలో గెలవలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ST రిజర్వేషన్ కోటాలో ఉద్యోగానికి 45 ఏళ్ళు వయసు వరకు అనుమతి ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో ఉద్యోగం దొరికింది. ఒకవేళ ఇంతకు ముందు పని చేసిన చోటే ఉద్యోగం కావాలంటే అందులో ఖాళీ ఉంటే ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగులకి మాత్రం రాజీనామా చేస్తే ఉద్యోగం తిరిగి రాదు.

    ReplyDelete