Sunday, November 13, 2011

బ్లాగులు వెర్సెస్ దురదగొంటాకు ఒక సమాలోచనా విశ్లేషణ

పాత సామెత ఉండనే ఉంది. ఆకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద ఆకు పడ్డా నష్టం మరి ఆకుకే అని.

ఆ తీరులో , మన బ్లాగులని, బ్లాగరులని గమనిస్తే, ఒక విషయం స్ప్రష్టం గా కానవస్తుంది.

పాపం ఈ అమాయక బ్లాగర్లు (ఈ జిలేబి తో చేర్చి) ఏదో అల్లా టప్పా గా అలా 'నేనెందుకు బ్లాగు మొదలెట్టాను , చదువరులారా నన్ను ఆశీర్వదించు డీ అని వినమ్ర ముగా  పలికి బ్లాగు మొదలెడుతారు.

ఇక అప్పట్నించీ వీరి కనా కష్టాలు మొదలు.

ఓ టపా రాసేక, అమ్మయ్య అని ఊపిరి పీల్చు కునే సమయలోపలె, టపా కి వెల్లువగా వచ్చి కామెంటుల తుంపరలు పడతాయి -  'మీకు బ్లాగ్ లోకమునకు ఇదే, మా సుస్వాగతం', మీరు ఆ డిపార్ట్మెంటు వారా, ఐతే మీరే మా మొదటి ఈ స్టైల్ బ్లాగరు, ఈ బ్లాగ్లోకం మీకు కొంగొత్త ఐడియా లు ఇవ్వు గాక లాంటి ఆశీర్వచనములు కోకొల్లలు గా వీరి కి వస్తుంది.

ఇక చూడండి మజా, - రాసే వాడికి చదువరి  లోకువ చందాన టప టపా తమ జ్ఞానం అంతా బ్లాగ్ రూపేణ బహిష్కారం అవుతుంది. _ ఈ వ్యాక్యం లో ఏదో తప్పుందే, ఏమిటి చెప్మా ?

ఇక అక్కడ్నించీ దురద గొంటాకు ఎఫ్ఫెక్టు మొదలు. మెల్లి గా కామెంటడం  మొదలెడతారు. తమకొచ్చిన కామేన్తులకి  నెనర్లు పలుకుతారు. వేరొకరి టపా కి జేజేలు పలుకుతారు.

ఇంకా కొంచం ముందుకెళ్ళి, అప్పుడప్పుడూ , ఎవరినైనా అలా మరీ తీవ్రం గా గోకేసారనుకొండీ, ఇక ఉన్నది తంటా,  కామెంటుల హోరాహోరి వరల్డ్ వార్ మొదలు.

ఇలా, పాపం అసంస్ప్రుస్య అయిన వాళ్ళు , బ్లాగటం అనే దురద గొంటాకు మీద పడి  ఆ పై, ఆ దురద గొంటాకు ఎఫ్ఫెక్టు కి బలి అయి పోతారు.

దీనికి పరాకాష్ట, వారే దురద గొంటాకు గా రూపాంతరం చెందడ మన్న మాట. !

ఇంతటి తో ఈ దురద గొంటాకు సమాలోచనా విశ్లేషణకి 'కామా పెట్టి, ఈ దురద ఎఫ్ఫెక్టు ఎంత మందికి ఉందొ వేచి చూస్తాను. -

దురదస్య దురదః ,
జిలేబి నామ్యా దురదగొంటాకు హ !

చీర్స్
జిలేబి.

12 comments:

  1. హహహ దురదస్య దురదః ,
    జిలేబి నామ్యా దురదగొంటాకు హ అదిరింది!

    ReplyDelete
  2. హ హ నిజం చెప్పారు .....

    ReplyDelete
  3. తెలుగును తెలుగులా వ్రాయండి

    మీ Blog ఒకమారు మీరే చదువుకుంటే మీకే అర్ధం అవుతుంది

    ReplyDelete
  4. దురద కూడా మంచిదే
    గోకితే మరీ ఆనందం. .. దహా.

    ReplyDelete
  5. @రసజ్ఞాగారు,

    అదేమిటో మరి ఇది మరీ పొగడ్తే ! నాకు దురద మరీ ఎక్కువై పోయే మీ ప్రోత్సాహం తో నెనర్లు

    @శేఖర్ గారు,

    ఇది డొంక తిరుగుడా ? లేక పొగడ్తా ? విశదీకరించగలరు

    గెల్లి గారు,

    మీరు మరీ కెలుకుడు గారు లా వున్నారు . ప్రాబబ్లీ మీరు నా తెలుగు బ్లాగు చదివి ఉంటారు. అది నా అరవ బ్లాగు . మీరు నా అరవ బ్లాగు చదివితే అందులో మీకు మొత్తం తెలుగు తెలుగు లా కనబడును. ప్రయత్నము చేయుడు.

    @బులుసు గారు
    ధవా !
    ఈ దురద కి ఉన్న పవర్ మీరు సరిగ్గా గమనించారు.

    @సుభా గారు,

    మరొక్క స్టార్ :) మిస్సింగ్. మరొక్క మార్కు మీరు ఇచ్చి ఉండవచ్చు. నాకు పంచ వన్నెలు లభించేవి.

    అందరికి ధన్యవాదములు.

    ReplyDelete
  6. జ్యోతిర్మయిగారు,

    ధన్యవాదములు. ఈ దురద కథ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.never ending episode.

    ReplyDelete
  7. sarma గారు,

    అవ్ అవ్ అవ్ . నెనర్లు.

    ReplyDelete
  8. ఇందులో డొంక తిరుగుడు ఏముంది జిలేబి గారు....మీరు నిజం చెప్పారు..... :)

    ReplyDelete
  9. శేఖర్ గారు,

    నెనర్లు. హమ్మయ్య, నా గుండె దిటవు పడింది.!

    ReplyDelete