Tuesday, November 15, 2011

జిలేబి కి పెళ్ళి కళ వచ్చేసిందోచ్!

జిలేబి కి పెళ్ళి కళ వచ్చేసిందోచ్!

అప్పుతచ్చు. ఈ మధ్య చాలా అప్పు తచ్చు లు వచ్చేస్తున్నాయి. ఆ మధ్య భారారె గారికి ఏప్రిల్ ఒకటో తారీఖు లోగా సంక్రాంతి కి కొత్త గా ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకె రాస్తానని చెప్పాను. ఏప్రిల్ లో సంక్రాంతి ఏమిటి మీకెమైనా మతి పోయిందా జిలేబి,  లేక రమ్ము ఎక్కువ తాగారా అని చీవాట్లేసారు ఆ మహానుభావుడు.

అరే చాలా అప్పుతచ్చు లు జరుగుతున్నాయే సుమా అని సరే అప్పుతచ్చు మీదే ఒక టపా రాద్దామని నిదురలోకి జారుకుంటే, పిల్లి కలలో కొచ్చేసింది.

పెళ్లి కళ అన్నానా ? అప్పు తచ్చు.

పిల్లి కల (లోకి) వచ్చెసింది. అదీ విషయం.

పిల్లి ఈ వైపు నించి ఆ వైపు వెళితే శాస్త్రం చెబుతారు.

ఇలా పిల్లి కలలో వచ్చిన ఏమి అగును ? జీడిపప్పు ఉప్మా తినే యోగం కలుగునా ?

(దీనికి సమాధానం చెప్పగలవారు నాకు తెలిసి ఒక్కరే ఒక్కరు ఉన్నారు, కాని వారు ఇలాంటి చచ్చు ప్రశ్నలకి ఆస్కారం ఇవ్వరు - కాబట్టి ఏమి చెయ్యలేం. )


జీడిపప్పు యోగం  అంటే జ్ఞాపకం వస్తోంది- నేను నవలలు గట్రా చదివే రోజులలో (అంటే నా చిన్నప్పుడన్నమాట)   ఝాన్సీ రాణీ గారో, కాకుంటే మరొకరో ఎవరో నాకు సరిగ్గ గుర్తు లేదు, వారి నవలల్లొ టిఫిను మాట వస్తే , ప్రతిసారీ జీడిపప్పు ఉప్మాయే టిఫిను అయ్యేది నవల మొత్తం మీద.

ఝాన్సీ అంటే  గుర్తుకొస్తోంది, హిందీ - నవలిక ఝాన్సీ కీ రాణీ లాంటి గొప్ప పుస్తకం వేరొకటి నేను  చదివింది లేదు.

హిందీ  అంటె గుర్తుకొచ్చేది దక్షిణ భారత హిందీ ప్రచార సభ.

మద్రాసు పట్టణం లో ఉండేది మేము చదివే రొజులలో. ఆ తరువాయి, జై ఆంధ్రా సమయం లో హైదరాబదు కి వచ్చిందనుకుంటాను. ఖచ్చితం గా తెలీదు. హైదరాబాదీలు చెప్పాలి.

జై అంధ్రా అంటే గుర్తుకొస్తొంది, జై ఆంధ్రా మూవ్మెంటు. (ఇప్పుడు తే నా లంగా  మూవ్మెంటు అంటున్నారు- ఇది విడదీత, అప్పటిది కలబోత అనుకుంటాను)

జై ఆంధ్రా అంటే, , మా వీధి బడి వద్ద పెట్టిన  వినాయక బొమ్మ జ్ఞాపకం వచ్చెస్తోందండోయ్. అప్పుడు వీధి బడి కాడి వినాయకుని బొమ్మ వద్ద కూర్చుని మేము 'ఉణ్ణావరిదం ' ఉన్నాము జై ఆంధ్రా మూవ్ మెంటు కోసం.

కడుపు మాడబెట్టటానికి అనగా ఉపవాస దీక్ష కు అరవం లో 'ఉణ్ణావరిదం' అన్న పేరు.

ఉపవాసం అంటే, అన్నా హజారే గారు యాద్గారోన్ మే ఆ రహెన్ హై !

యాద్గారే అంటే, చిన్నప్పటి మా పెళ్లి (జిలేబి వెడ్స్ జంబు నాధన్- అని పెద్ద అక్షరాలతో కలర్   చాక్ పీసు తో బ్లాకు బోర్డు మీద అప్పుడు రాసి పెట్టడం కూడా గుర్తుకొస్తోంది సుమా)  గుర్తుకోచ్చేస్తోంది. (మా కాలం నో నియాన్ దీపాల కాలం మరి )

అబ్బో, పెళ్లి అంటే మళ్ళీ జిలేబి కి పెళ్లి కల, పెళ్లి కళ రెండూ వచ్చేస్తూన్నాయి.

హమ్మయ్య, back to square one!

ఇంతకీ నెనక్కడున్నాను ?

అంతా జిలేబి మయం గా ఉందే ఇక్కడ ?


ఇదేమి విష్ణు మాయయో? కలయో నిజమో తెలియని అయోమయములో ?!


చీర్స్
జిలేబి.

16 comments:

  1. పెళ్లి కళ వచ్చేసిందే బాలా! అయ్యో కాదు కాదు పిల్లి కల వచ్చేసిందే బాలా! నిద్రన్నది పోయిందే లైలా! నిద్రలేకపోవడం వలన ఆలోచనలేవో వచ్చాయే మళ్ళా! అందుకనే ఈ టపా కదా ఇలా!

    ReplyDelete
  2. పిల్లి కలలోకి వస్తే భార్యామణి దుడ్డు కర్ర తో దర్శనమిచ్చును అని మా గురువు గారు చెప్పారు. నిజమేనా సారూ?

    ReplyDelete
  3. జిలేబిగారూ...! నిజం చెప్పండి..
    మీ ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉన్నాయి కదా..!

    ReplyDelete
  4. :):):):):)
    ఈ సారి మరీ నవ్వాపుకోలేకపోయా. అందుకే అన్ని నవ్వులు పూసేసాయ్.ఇందులో నా ప్రమేయమేమీ లేదండోయ్.అంతా మీ కల మహిమే.అసలు ఒకటి చెప్తుంటే ఇంకోటి గుర్తుకొస్తోందిగా మీకు.మొత్తమ్మీద మాకేమీ గుర్తులేకుండా చేసేసారు.

    ReplyDelete
  5. హ హ చాల గుంది బావు....ఏంటి ఇలా అచ్చు తప్పు పడిపోతుంది.అచ్చు అంటే....వద్దులే ఇలా కొనసాగిస్తే బాగుండదు.....హ హ...బాగుంది చాల...ఏంటో అంత తప్పు ;)

    ReplyDelete
  6. బలే రాసారే వాక్యానికి వాక్యానికి లింక్ పెట్టుకుంటూ :))

    ReplyDelete
  7. @రసజ్ఞ గారు,

    మీ ఈ 'లా' గానం,
    పాతా'ళ భైరవి లో
    బాలా , అన్న ఎస్ వీ రంగారావు గారి ని గుర్తుకు తెస్తోంది.
    చాలా , లావెక్కేసాను.

    @బులుసు గారు,

    బులుసు గారి కి కలలో భార్యామణి దుడ్డుకర్ర తో దర్శనమిచ్చును. కాని జిలేబి శ్రీవారు , జంబునాథన్ కృష్ణస్వామీ వారు కలలో కూడ జిలేబి తో పరాచికలాడడానికి ముందూ వెనుకల ఆలోచిస్తారు, ఎందుకైనా మంచిది అని జిలేబి కి జాంగ్రీ తోనే దర్శనమిచ్చుదురు. మరుసటి రోజు, జిలేబి కిచెను కి హడ్తాలు చేయునేమొనని వారి బాధ వారిది. జంబునాథన్ కృష్ణస్వామి గారికి, జంబునాథన్ కిచెన్ స్వామీ అవడం అంటే మరీ బెరుకు. అదన్నమాట విషయం. ఇంతకీ నేనెక్కడున్నాను ? ఎమిటో ఒకటి రాస్తూంటే మరోటి వస్తోంది చెప్మా?

    ReplyDelete
  8. @వేమన గీత గారు,

    అవునండీ , మా ఇంట్లో, 'ఏలకులు ' ఎక్కువగానే ఉన్నాయి. ( మళ్ళీ అప్పు తచ్చులు . హథొస్మీ)

    ReplyDelete
  9. హమ్మయ్య subha గారు ,

    మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, అన్ని వన్నెలు ఫైనల్ గా ఇచ్హినందుకు ధన్యవాదములు సుభా గారు ,

    ReplyDelete
  10. శేఖర్ గారు,

    అంతా విష్ణు మాయ అండీ. అప్పు తచ్చులు, కప్పు తప్పులు, కామెంటి నందులకు ఖరములు జోడించి నెనర్లు. మళ్ళీ అప్పు తచ్చే

    @జ్యొతిర్మయీ, ఆ.సౌమ్య గారు,

    నెనర్లు. ఆ రెండు చమత్కారములకి, ఆ లింకుల టపా చదివినందులకు

    ReplyDelete
  11. జ్యోతిర్మయి గారు,

    జోడి వన్నెల నుంచి ' టీన్ ' వన్నెల కు రేటింగ్ పెంచినండులకు ధన్యవాదములు. మీ కు మోర్ అండ్ మోర్ వెన్నె దండి గా లభ్యమగు గాక అని మా కొండ దేవర ' వెన్ ' కన్న ని వేడుకొందు !

    చీర్స్
    వెల లేని లేడి,వేడి జిలేబి

    ReplyDelete
  12. ఒక కుక్క ను పెంచుకోండి. ఈ సారి పిల్లి కలలో కి వస్తే కుక్క దాన్ని తరిమేస్తుంది. మళ్ళీ రాకుండా కాపలా కాస్తుంది. ఇక పిల్లి కలలోకి వస్తే ఏమవుతుందీ అని సందేహాలు పెట్టుకోవక్కర్లేదు.

    ReplyDelete
  13. భలే వారండీ జాన్ గారు,

    నాకు పెళ్లి అయినప్పటి నించి, ఒక విశ్వాసమైన శునకస్వామీ వారు ఉండనే వున్నారు. మరో శునేకేశ్వరుడు ఏల?

    ReplyDelete
  14. అవునండీ జిలేబీ గారూ జనవరి బదులు ఏప్రిల్ అని వ్రాయడాన్ని అచ్చుతప్పంటారా? ఉద్దేశపూర్వకమంటారా? లేదా తెలియక పోవడమంటారా?

    అచ్చుతప్పు అంటే ఓ క్రొత్త విషయాన్ని మీనుంచి నేర్చుకున్నాననుకుంటాను :))

    ReplyDelete
  15. అయ్యా భారారే,

    అచ్చు తప్పు ను తెలుగు లో అప్పు తచ్చు అనే అందురు. మరి ఆంగ్లములో నేమో printer's devil అందురు. అనగా ప్రింటు చేయువాడి భూతము అని తెలుంగు లో అర్థం చెప్పు కోవాలె. భూతం కాబటి అది టక్కరి. జనవరి ని ఆప్రిల్ గావించి ఉండవచ్చు. కాక పోయిన జిలేబి ఫన్ విత్ జేకే అయి వుండవచ్చును. కాకున్న, బారారే గారు గెస్సు చేసిన రమ్ము ఎఫెక్ట్ అయి ఉండవచ్చు ను. అంతా విష్ణు మాయ మరి.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete