Sunday, November 20, 2011

బ్లాగర్లు సంకలినులకు శృంఖలా బద్ధులై పోయారా ?

సంకలినులు లేకుంటే అసలు బ్లాగులకు గుర్తింపు ఎలా ఉండేదో నాకు తెలీదు.

ఎందుకంటే నేను బ్లాగు మొదలెట్టినప్పుడు ఆల్రెడీ aggregaters వచ్చేసి వున్నాయి. అంతకు మునుపు బ్లాగులకి గుర్తింపు గూగుల్ ద్వారానో కాకుంటే సెర్చ్ సైట్ ల ద్వారానో, కాకుంటే పరిచయస్తుల ద్వారానో ఉండి ఉండవచ్చు.

ఇప్పటి కాలం లో అలా ఒక బ్లాగు ఓపెన్ చెయ్యడానికి జస్ట్ ౩ స్టెప్పులు. సంకలినుల లో చేరడానికి కొన్ని క్షణాలు అంతే

కాని ఈ ప్రస్తుత పరిస్తితి నాకైతే , బ్లాగరులు ఈ సంకలినులకు శృంకలా బద్ధులై పోయారేమో అని పిస్తోంది.

మనం బ్లాగు మన రీతిలో రాస్తున్నామా కాకుంటే , aggregators లో మన టపాలు రావాలని , అవి ఎక్కువ గా చదివిన తపాల లిస్టులలో రావాలనో, కాకుంటే , ఎక్కువ కామెంటులు కోరి రాస్తున్నామో  అని ఆలోచిస్తే, ఈ బ్లాగడం ఒక ఇండస్ట్రీ క్రింద జమకట్టిన వాళ్ళూ ఉన్నారూ, అడపా దడపా రాసే వారూ ఉన్నారూ, అలా మేము కామెంట డానికే ఉన్నాము అనే వాళ్ళూ ఉన్నారు.

బ్లాగ్ లోకానికే శాస్వతం గా అంకితమైన వాళ్ళూ ఉండవచ్చు.

ఈ లాంటి పరిస్తితులలో , ఈ సంకలినులు అనేవి లేక పొతే అసలు బ్లాగర్ల కి ఈ పాటి సమయ వెచ్చింపు మాధ్యమం వేరే ఉండేదా?

ఒక రకం గా చెప్పాలంటే సంకలినుల వల్ల బ్లాగులు గణనీయం గా పెంపొందాయని చెప్పు కోవచ్చు.

దీనికి మరో కోణం మనం బ్లాగర్లు , సంకలినులకు శృంఖలా  బద్ధులమై పోయామని కూడా చెప్పు కోవచ్చా ? ఏమంటారు ?

చీర్స్
జిలేబి.

13 comments:

  1. నిజమేనండోయ్... ఇలా జరిగితే బ్లాగులు పెట్టడానికి వెనుకన ఉన్న ముఖ్య ఉద్దేశం మనం తెలుసుకోనట్టే.

    ReplyDelete
  2. మీకోసం ...
    ఈ బ్లాగిల్లు...
    http://www.blogillu.com

    ReplyDelete
  3. మీరన్నదాంట్లో పాయింట్ ఉంది. నాకింకో గార్డెన్ బ్లాగ్ ఉంది. 2008 నుండీ. దానిని ఏ సంకలిని లోనూ చేర్చలేదు, ఎవరికీ దాని గురించి చెప్పాలేదు. మూడేళ్ల లో ఒక్కోసారి జనాలు ఎక్కడినుంచో కామెంట్లు, ప్రశ్నలూ వేస్తూ ఉంటారు, ఒక ఇద్దరు ఫాలోవర్స్ గా ఉన్నారు. వారానికి ఒక ౨౦-౩౦ విసిట్స్ వస్తూ ఉంటాయి.

    అదే కృష్ణప్రియ డైరీ మూడు నాలుగు సంకలునులలో ఉండటం వల్ల, నేనూ, సంకలునుల ద్వారా వేరే బ్లాగుల్లో నా సిగ్నేచర్ వదలటం వల్లనయితేనేం, ఈ బ్లాగు లో టపా చదివేవారు, వ్యాఖ్యానించేవారు, అలాగే కొద్ది మంది మిత్రులు ..

    సంకలునుల్లో రోజులో కనీసం ఒకసారి తొంగి చూడటం, వ్యసనమైపోయింది నాకు.

    ReplyDelete
  4. దీని వలన నష్టమేమీ లేదు.ప్రింట్ మీడియా లో అందరికీ అవకాశం దొరకదు.ఈ విధంగా self expression కివీలు కలుగుతున్నది.నా మట్టుకు మిగతా ఎలా వున్నా మంచి ఫొటోలు ,కొన్ని మంచి పాటల ఆడియోలు చూసి,విని,ఆనందించ గలుగు తున్నాను.ఎటు వచ్చీ పరస్పర దూషణలూ ,అసభ్య పదజాలం కూడదు.సద్విమర్శ చెయ్యవచ్చును.సహనం పాటించాలి .

    ReplyDelete
  5. నాకేమీ అర్ధం కాలేదహూ .....

    ReplyDelete
  6. Srivatsa YRK,

    చాలా బాగ గుర్తించారు! నెనర్లు.
    అంతా విష్ణు మాయ!

    ReplyDelete
  7. బ్లాగిల్లు!

    శొభిల్లు మీ ఇల్లు !
    అయ్య బాబొయ్ మరో బంధీ ఖానా!
    కారగార వాసమా!
    ప్రస్తుత భారతీయ జీవనానానికి , లబ్ధప్రతిష్టులైన
    మన నాయకులే కారగారములకు వెళుతుండగా,
    మనం ఏపాటి వాళ్ళం! స్వాగతం మీ కారగారమునకు!
    శృంఖలా బద్ధుల గావింపుడు మరిన్ని బ్లాగర్లను !

    ReplyDelete
  8. కృష్ణప్రియగారు,

    చూసారా , మీ బృందావనం కన్న
    కృష్ణప్రియ డైరీ కె ఎక్కువ ప్రాచుర్యం!
    సంకలినుల మహాత్మ్యం !
    మరి ఇంక వెచి ఉండనేల,
    బృందావనమును సంకలినిలులలో
    హారమించండీ !
    త్వరలోనే మీ బృందావనం కృష్ణుడిని మురిపించును ఆ పై మరిపించును !

    ReplyDelete
  9. శ్రీ కమనీయం,

    శ్రీకరం, శుభకరం, సంకలనీ మయం !
    నెనర్లు

    ReplyDelete
  10. రాఫ్సన్ మహాశయా,

    మీరిప్పుడే బ్లాగులోకమునందు అదుగిడినారు,
    అర్థం కాకుండడమే మరీ మంచిది !
    నెనర్లు

    ReplyDelete
  11. సంకలినులు లేకుండా బ్లాగులుండచ్చుగానీ బ్లాగులు లేకుండా సంకలినులుండవు. అదీ కాక ఈ బ్లాగుల సంఖ్య ఒక లక్ష దాటితే ప్రతీ నిమిషానికీ అప్డేట్ ఉంటే సంకలినుల ఉపయోగం ఎంతవరకూ ఉంటూందో చెప్పటం కష్టమే.

    ReplyDelete
  12. మా లక్కు, పేట రౌడీ గారు (మలక్పేట రౌడీ గారు) , బహు కాలం దర్శనం! రౌడీ గారూ, రౌడీ గారి అమ్మ గారు అందరూ కుశలమే కదా! ఉభకుశలోపరి తదుపరి, మీ కామెంటులకు నెనర్లు. బ్లాగులు లేనిచో సంకలనులు లేవని చాలా విస్తారముగా చెప్పారు- సరిగ్గా చెప్పవలయునన్న - రౌడీలు లేక మలక్పేట ఉండునా అనునట్లు నన్న మాట

    చీర్స్

    జిలేబి.

    ReplyDelete
  13. సంకలినులకి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? గూగుల్ సెర్చ్ నుంచే కదా. http://imageshack.us/photo/my-images/850/screenshotgwe.png/

    ReplyDelete