Monday, November 28, 2011

అనానిమస్ కామెంటులు - బ్లాగ్ వారల అగచాట్లు - జిలేబి ప్రతిపాదన

పూర్వ  కాలం లో ఆకాశ రామన్న ఉత్తరములు వచ్చేవి !

కాలాలు మారినై !

కాలం తో బాటు e మాధ్యములు వచ్చినై.

బ్లాగు లోకములు వచ్చినై.

అయినా , ఆకాశ రామన్న లు  ఎవెర్ గ్రీన్ హీరో లు !!

వారే మన e తరం అనానిమస్సులు ! వారికి నమస్సులు !

వారు లేనిదే ఈ భువి ఉంటుందా అన్నది నా ధర్మ సందేహం ! ఆకాశం పైనా ఉంటేనే కదా క్రింద భువి ఉండును!


మిస్సులు కస్సుమంటే , ఈ అనానిమస్సులు  బుస్సు మందురు.

మాష్టారులు  బెత్తం పడితే , వీరు పంతం పట్టెదరు.!

 ఔరా, అయ్యలారా మీరేమైనా బ్లాగు లోకమును గుత్తగా కోనేసుకున్నారా అని అందురు !

వీరికున్న 'gut' వేరే ఎవరకీ ఉండదని నా సవినయ అభిప్రాయం !

దొంగ గారికి ఎ ఇల్లు తాళం లేక, తాళం సరిగా లేక ఉన్నదో తెలవడం అన్నది చోర కళా నైపుణ్యము !

తలుపు లు జాగ్రత్తగా వేసి ఉన్న కూడా చోరీ జరుగక ఉన్నదా ? కావున అనానిమస్సులు కాక పోయినా కూడా, ఎవడైనా , ఓ కందిరీగ అన్న పేరు తో కామేన్టడం మొదలెడితే మన చెవులు హోరుమన క ఉండునా ?

వీరి కున్న gut కి కారణం బెద్ది ? వారి నామ ధేయమే  కదా ? నామమేమి ? అజ్ఞాత ! అనగా ఏమి ? జ్ఞాతుడు కాని వాడు. అనగా , సర్వం తెలిసిన వాడు కాదని. అనగా కొంత తెలిసిన వాడని. అనగా వాడికి ఎంతో కొంత ఆ మేటరు లో పాయింటు లోపమో తెలిసినవాడు అని అర్థము కదా !

సరే, ఇంతకీ ఈ అనానిమస్సులంటే మనకు ఎందుకు పడదు ? ఎవరైనా ఆలోచిన్చినామా? వారికి తగినన్ని స్థానములు మనము గాని, ఈ సంకలిని నిర్వాహకులు గాని సముచిత స్థానము కల్పించినారా ? లేదే ? వారికి సముచిత స్థానము వెంటనే హారం అధినేతలు కలిపించినచో ఈ అననిమస్సులు సరియిన విధముగా సత్కారము పొందిన  వారై భుక్తాయసములతో తీరికగా ఆలోచించి కామెంటు దరు కదా ?

వీరి కై నేనొక మహత్తరమైన ప్రణాళికని హారం అధినేతలకు ప్రతిపాదిస్తున్న్నాను. !

అది ఏమనగా, వారు హారం లో నే ఎ టపా పైన అయినా అన్య మనస్కులైన , వెంటనే అననిమస్సులుగా బుస్సు మను టకు సదవకాసము కలిగించవలె !

ఎందుకనగా చాలా బ్లాగర్లు అనానిమసులకి ఆస్కారము కలిపించకుండా తమ బ్లాగులను పకడ్బందీ (మళ్ళీ ఈ పదమును గమనింపుడు - బందీ ! - బందీ అనగా ఎవరు ? తప్పు చేసిన వాడు గదా - మనలను మనం పకడ్బందీ చేసుకున్నచో దీని అర్థం ఏమి ? మనం తప్పు చేసినవారలమని కదా అర్థము ?) గావిన్చుకున్నారు కాబట్టి, ఈ అవకాసమును హారము నేతలు కలిపించవలె నని కోరడము జరిగినది.

అనానీమస్సు,
అన్నా, నీ మనస్సు తెలియక
అనాడీ వాణి గమనించక
మేము చేసిన తప్పుల మన్నించి
మమ్ము కరుణించ వయ్యా
'అనాధ' బ్లాగ్ లోక పోషకా - అజ్ఞాతా !

చీర్స్

జిలేబి.

10 comments:

  1. అజ్ఞాత definition అదుర్స్ !!

    అజ్ఞాత definition అదుర్స్ !!

    నిజమే మీరు చెప్తుంటే అనిపిస్తున్నది,
    ఒక అజ్ఞాత గారి పుణ్య వశాత్తూ నా blog లో అజ్ఞాత comments not allowed గా తీర్మానం చేశాను
    మొత్తానికి ఏదో ఒక దొంగ పేరుతో జ్ఞాతల వ్యవహరించిన మనం చేయగలిగేది ఏమీ లేదు
    ఇక మనమే జ్ఞాతులమై వారి హృదయమును సైతం రంజిల్ల చేసే విధంగా కాస్తంత మన హక్కును సవరించుకోవాలసినదే !!
    Nice
    ?!

    ReplyDelete
  2. హహ్హహ్హా... జిలేబి లాగన్నమాట :))

    ReplyDelete
  3. హన్నా, భారారె,

    జిలేబి 'లాగి' అన్న మాటే ! - ఉన్న మాటే ! లాగ్ ఐ అన్న మాటే !

    మరి కొన్ని అజ్ఞాత ల పేరులు

    చెప్పులోని రాయి
    చెవిలోని జోరీగ
    కాలి లోని ముల్లు
    కంటిలోని నలుసు

    ఇలా చెప్పుకుంటూ పోవచ్చు !


    నెనర్లు

    @?!

    మనం అజ్ఞాతల ని తక్కువగా చూడరాదన్నదే నా ఉద్దేశ్యం! మీరు దానిని ఆల్రెడీ గమనించేసారు !

    జిందాబాద్ జిందా తో బాద్ మే దేఖే!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. ఇది వ్యంగమా , చతూరా, హాస్యమా , సెటైరా, లేకా సమర్దిన్చారా ???

    వ్యంగామైతే : అనానిమస్సుల మీద వ్యంగమా జిలేబి గారి మీద త్వరలో ఒక వ్యంగ టపా రెడీ..

    చతురైతే: అనానిమస్సు మీద చతుర చేసిన జిలేబి గారి కి త్వరలో ఒక అనానిమస్ కామెంట్

    హాస్యమా: ఎంత ధైర్యం మా లాంటి విమర్శకుల మీదా మీ హాస్యం ...!!! క్షమించరాని నేరం.

    సెటైరా: మీ సంగతి మా సభ అధ్యక్షుడి కి చెప్పాం రిసల్ట్ కోసం వెయిట్ చేయండి...

    సమర్ధింపు : అరేయ్ ఎవరక్కడా?? జిలేబి గారికోసం ఒక ౧౦ కే.జి ల జిలేబిలు పట్టుకు రండి.


    NICE !!! చాలా బాగా రాసారు ..

    మీ శ్రేయోభిలాషి,
    RAAFSUN

    ReplyDelete
  5. తప్పు రాసిన వాడు
    తన పేరు రాయడు

    పేరు రాయలేని సోమరులు
    అజ్ఞాతను వాడెదరు

    వారి బురదను పట్టించుకునిన
    మన మనసు మరకలగును

    అజ్ఞాతలకు చోటులేని వరూదిని
    మనకు ఆదర్శం ఓ బ్లాగు మిత్రమా

    బ్లాగులెన్ని ఉన్నా వరూదిని బ్లాగు సూపరయా
    రుచులెన్ని ఉన్నా జిలేబి రుచి వేరయా..

    ReplyDelete
  6. గమనిక : నేను రాసింది అనానిమస్ / అజ్ఞాత కామెంట్స్ చేసేవారికి మాత్రమే .

    ReplyDelete
  7. @రాఫ్సన్ అండ్ భాస్కర్ గార్లకు

    మీ అనాలసీసు, కవితా కాన్వాసు అమోఘం.! నెనర్లు ! సాంద్ర సలాములు. ధన్యవాదములు. థాంక్ యు లు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. సూపర్
    భాస్కర్ గారు : బాగా రాసారు
    >>>హన్నా, భారారె,
    అన్నా హజారే లాగా ఉంది మీ సమయస్పూర్తికి జోహార్లు

    ReplyDelete
  9. అప్పారావు శాస్త్రీ గారు,

    నెనర్లు. మీరా సమయస్పూర్తి అన్నాకే, నాకూ ఆ హన్నా లో రిథం కనబడింది. బాగా కనబెట్టారు! హన్నా భారారె అన్నా హజారే! వాహ్ వాహ్ హుజూర్ !

    @రాజేష్ మారం గారు,

    ఆ సూపెర్ మరియు రెండు చుక్కలు ఒక బ్రాకేట్టులకి నెనర్లు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete