Saturday, December 31, 2011

సంవత్సరం 2011 నేను చదివిన చదువుతున్న పుస్తకాలు

అదేమిటో నండీ , ఈ పుస్తకాలు ఏమి చదివామో ఒక సారి సమీక్ష చేసుకోవాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా సరే ఈ రెండు వేల పద కొండు లో ఏమేమి చదివామబ్బా అని ఆలోచిస్తే ఈ ఒకటో రెండో పుస్తకం తప్పించి పూర్తి గా ఏదీ చదవలేదు.

పుస్తకాలు చదవడమన్నది నా వరకైతే ఒక పారలెల్ ప్రాసెస్సింగ్. ఎ ఒక్క పుస్తకాన్ని పూర్తిగా వెంటనే చదివిన పాపం పుణ్యం కట్టు కోలేదంటే మీరు నమ్మాలి. ఎందుకంటే మనం చదివే దానికి 'సోమ్బెరు' లన్న మాట. 'కప్పు ' దాటు , చాటు వారలం. ఒక పుస్తకం కొంత బోర్ గా వుంది అనుకుంటే దాన్ని వదలి వేరే పుస్తకాని కి వెళ్ళడం , అది బోర్ అనుకుంటే మరో దానికి వెళ్ళడం, ఆ పై మొదటి పుస్తకాని కి రావడం, మొత్తం మీద నా వరకైతే రెఫ్రెషింగ్ సబ్జెక్ట్. (ఈ ట్రెండ్ మీరు ఈ బ్లాగు టపాల లో కూడా గమనించి వుంటారు. - లేదే అంటారా - అబ్బా, మీరు గమనించారండీ, కాని కాస్త చెప్పడానికి మోహ మాట పడి వుంటారు అంతే సుమా!). సో, దీన్ని బట్టి నా రాశీ మీకు తెలిసి ఉంటుందను కుంటాను. (వ్రాత రాశి కాదు మరి అంటారా అది వేరే విషయం !)


ఈ చదివిన దానిలో కొన్ని ఈ-పుస్తకాలు  కూడా. ( వేదం కూడా - రిగ్వేదం స్పెసిఫిక్ గా - ఓ మారు పూర్తిగా తిరగేసానంటే మీరు నమ్మాలి - ఈ ఈ పుస్తకం సాంస్క్రిట్ డాక్యుమెంట్స్ డాట్ ఆర్గ్ లో వుంది ). సంస్కృతం అంత గా తెలీదు కాబట్టి ( తెలుగు తెలిసిన వాళ్లకి సంస్కృతం అంత గా కష్టం కాదనుకోండీ, అయినా, అప్పుడప్పుడు చాలా సందేహాలు వచ్చేస్తోంటాయి, ఉదాహరణకి నాసదీయ సూక్తం చదివేటప్పుడు - దీని కి నా పరిధిలో లో ఎక్కడో ఈ బ్లాగులో నే ఓ భావాను వాదం కూడా రాసాను - ఈ వేదం విషయం స్పెసిఫిక్ గా ఎందుకు రాసానో మీరు ఇప్పటికే గ్రహించేసి వుంటారు ) !

సో, ఆ పుస్తకాల ఫోటో లు ఇక్కడ పెడుతున్నాను. ఇవన్నీ ఇంకా పారల్లెల్ గా నే 'చల్' తూ వున్నాయి. ఇందులో ఒకటి కూడా  తెలుగు పుస్తకాలూ లేవేమిటండీ అంటారా ? నాకు తెలుగు రాయటం మాత్రమే వచ్చు, చదవటం రాదు, ప్రొబ్లెం !  అంతే గాక మేము 'తెల్గూ' వాళ్ళం, తెల్గు మాట్లాడం, చదవం మరీ. జేకే. !!




 






ప్రస్తుతానికి, అంటే ఈ టపా రాసే నాటికి 'చల్తూ' ఉన్న గాడీ ఇది. !!



ఇలా కొన్ని. మరి కొన్ని కూడా వున్నాయి. కాని మరీ బోర్ కొట్టేస్తుందేమో ? అందువల్ల ఇప్పటికి ఇక్కడే ఆపేస్తాను.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

23 comments:

  1. :)

    ఆదర్శవంతమైన "అభిరుచి" జిలేబి వారిదైతే,

    అందరిని అలరించి ఉల్లాస పరిచే "రుచి" వరూధిని సొంతం.

    ఇది లోకమెరిగిన సంగతే!

    మీరు చెప్తే

    మరి కొన్ని కూడా వున్నాయి. కాని మరీ బోర్ కొట్టేస్తుందేమో ?) ఈ బ్రాకెట్ లోనిది నిజం అయితే bore అనే పదానికి అర్థం అన్ని భాషలలోనే మూకుమ్మడిగా అర్థం మార్చుకోవలసి వుంటుంది అనుట లో ఏమాత్రం సందియము లేదు.

    Swamy rama గారి ఆ గ్రంథం ఒకపరి చుస్తున్నమంటేనే ఆ మహనీయుల సాంగత్యం చేస్తున్నట్లే ...

    Well appreciations zilebi గారు

    You know the art of living & Joy of giving

    Hat's up ....

    ?!

    ReplyDelete
  2. సో "టెల్గూ" పుస్తకాలేవీ చదవలేదనమాట...కొత్త సంవత్సరం టు డూ లిస్ట్ లో చేర్చేయండి కొన్నైనా ;)
    నూతన సంవత్సర శుభాకాంక్షలు, జిలేబి గారికి...

    ReplyDelete
  3. సో "టెల్గూ" పుస్తకాలేవీ చదవలేదనమాట...కొత్త సంవత్సరం టు డూ లిస్ట్ లో చేర్చేయండి కొన్నైనా ;)
    నూతన సంవత్సర శుభాకాంక్షలు, జిలేబి గారికి...

    ReplyDelete
  4. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    పుస్తకాలు కొని చదివే అలవాటు లేదు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వాళ్ళకి నచ్చినవే కొంటున్నారు కానీ నాకు నచ్చినవి ఏమి కొనటం లేదు. దొంగమొఖాలు.

    ReplyDelete
  5. @ బులుసు साब

    " దొంగమొఖాలు "

    comment కేక

    @ Telugu Bloggers

    వారికే నచ్చే posts లేని పక్షాన

    ఈ bloggers కుడా పై మాటే వర్తిస్తుంది సుమా !

    :)

    ?!

    ReplyDelete
  6. http://teluguwebmedia.in మీకు నూతన సంవత్సర స్వాగతం పలుకుతోంది.
    -- ప్రవీణ్ శర్మ

    ReplyDelete
  7. @ఎందుకో ఏమో గారు,

    నెనర్లు. ప్రోత్సాహములకు, చీర్స్ లకు ! ఏదో అప్పుడప్పుడు అలా చదవటం మాత్రమే ! బుర్రలో ఎంత ఎక్కిందో ఆ 'వెనక''టి' ఈశుడి కే తెలియాలి !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. చిన్ని ఆశ గారు,

    మీ చిన్ని ఆశని రెండువేల పన్నెండు లో తీర్చగలనా అని చూస్తాను. నెనర్లు. ఎంతైనా 'టెల్గూ' వారం. ఆరంభ శూరత్వం కొంత ఎక్కువే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. @బలుసు మాష్టారు,

    మీ కామెంటు నాకు వీనులకు విందు గా కనుల పండువగా వున్నది. అబ్బే, వీళ్ళెవ్వరూ మనం చదవ గలిగే పుస్తకాలే కొనుక్కోవటం లేదే ! అంతా దొరసాని ముఖాలు. ఎం చేద్దాం. వీళ్ళంతా ఇంతే !


    బుడి బుడి క
    లువ మాష్టారు హాస్య
    సుళువులు వారి
    సుటపాలు
    బ్ర
    హ్మజ్ఞాని వారి బ్లాగ్ ప్రామా
    ణ్యం మా కు !

    నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువర్యా !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. ఓరోరీ అబ్బాయ్ ప్రవీణు,

    నీ పేరుగాంచి నా గుండె దికూ దికూ మనె!

    శుభాకాంక్షలు గాంచి మనసు వీణ అయ్యే

    నీకిదే జిలేబి ఇచ్చు నూతన వత్సర శుభ శాపం!!!

    నీవిలాగే అందరి బ్లాగుల్లో ఇల్లాంటి మాంచి శుభ కామనా కామెంటులే రాయుదువు గాక రాబోవు వత్సరముల లో !!!

    ఇది తప్పిన జిలేబి పేరు అగును బీలేజే!!!

    ఇదే నా కమండల ము నించి నీ పై చల్లితి రెండు చుక్కలూ ఒక బ్రాకెట్టు !
    ఓం ఫట్ ప్రవీణా య నమః !!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. ధన్యవాదాలు. కానీ

    >>> @బలుసు మాష్టారు,


    పెదాలతో నవ్వి నొసటి తో వెక్కిరించడం అంటారా ?..... దహా.

    HAPPY NEW YEAR

    ReplyDelete
  12. ఎందుకో ? ఏమో ! గారికి,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  13. ఓహ్ బులుసు గారు,

    అది పెదాలతో నవ్వి నొసటి తో వెక్కిరించడం కాదు సుమండీ,

    పదాలతో కోతి కొమ్మచ్చి, పద విరుపులతో వాయింపులు !

    గమనించలేదే సుమా బులుసు వారు మహా బలుసు గారని !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  14. చివరి పుస్తకం విశేషాలేమన్నా ఒక బ్లాగ్‌లో క్లుప్తంగా పంచుకోగలరా?

    ReplyDelete
  15. నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

    ReplyDelete
  16. wish you happy new year

    ReplyDelete
  17. తియ్య తియ్యని కబుర్లతో
    తిక మక పెట్టే వ్యాఖ్యలతో (సరదాకే)
    అందరికీ తలలో నాలుకలా
    నేనున్నానంటూ ఆప్యాయంగా పలకరించే
    జిలేబీ గారికి మరియు కుటుంబసభ్యులకు నా హృదయపూర్వక నూతన వత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  18. !! వరూధిని !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  19. జిలేబీ గారు, అందరికీ మీరిచ్చే తియ్యటి జిలేబీలకి, మీకూ నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  20. @తెలుగు భావాలు గారు,

    కామెంట్లకు నెనర్లు. ప్రయత్నిస్తాను.

    హ్యాపీ న్యూ ఇయర్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  21. @subha గారు,
    @కష్టేఫలె మాష్టారు,

    నెనర్లు. మీకున్ను నూతన వత్సర శుభాకాంక్షలు !

    జిలేబి.

    ReplyDelete
  22. @రసజ్ఞ గారు,

    హ్యాపీ న్యూ ఇయర్ !

    ఇక తికమక మీరు గమనించింది మీకు మాత్రమె కాదండోయ్! జిలేబి గారికి కూడా.

    ఈ తికమకలతోనే , కౌముది జనవరీ ముఖ చిత్రం కౌటిల్య గారి నలదమయంతి టపా లో లింకు చూసి తికమక పడి "కౌన్ ఈ ముదిత ? మా డీజీపి గారి మాటల్లో చెప్పాలంటే మరీ టెంప్ట్ఇంగ్ గా ఉందని" కామెంటు కొట్టి, మరీ కన్ఫ్యూజీ అయి పోయి ఎం చెప్పమంటారు జిలేబి పాట్లు ! హా , రమ్ము ఎక్కువై పోయే జిలేబి మీకు అన్నదాక వచ్చింది నా పరిస్థితి ! ఈశ్వరో రక్షతు !

    నెనర్లు మీ కామెంట్లకి. తికమక తిక్క గా మారక మునుపే జిలేబి బ్లాగ్ బెడ్డింగు కట్టెయ్! మాయమయి పో ఇక్కణ్ణించి!!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  23. @తెలుగు పాటలు గారు,

    వరూధిని కాదిక్కడ. జిలేబి.! నెనర్లు. నేనే చాల తికమకల్తో వున్నాను. ! (పై కామెంటు గమనించవలె) ! మీరు మరీ నన్ను తికమక పెట్టేస్తున్నారు. !

    హ్యాపీ న్యూ ఇయర్ అండీ మీకు కూడా!

    @జయ గారు,

    మీకు ఈ రాబోయే కాలం 'దిగ్విజయ'ముగా వుండాలని మా వెంకన్న ని ప్రార్థిస్తూ


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete