Sunday, December 11, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 3 - (శంకర విజయం - 2)

సభా ప్రాంగణమున బుడతడి గురించి చర్చా ఘట్టము

శ్యామలీయం మాష్టారు సభా ప్రాంగణమున ప్రవేశించి పిడుగు బుడతడి రాక ని కవి పండితాదులకి తెలియజేసారు.

"మన ఈ కవితా ప్రాంగణమున ఆ బుడతడు ఏమి నేర్చుకునును? దీనికి కొంత తెలుగు జ్ఞానము కలిగిన వారై , గ్రాంధికము తెలిసిన వారై వుండిన కదా ఏమైనా వారికి అర్థమగును ? అందులోనూ , బుడతడు అంటున్నారు శ్యామలీయం వారు . అంత చిన్న పిల్లవాడు మనతో ఎలా సంభాషించ గలడు ? "అన్న పండిత నేమాని వారి  పృచ్చ తో సభా ప్రాంగణమున కలకలము, మంచి విషయము చర్చకు వచ్చినది అన్న సంతోషము వారిలో కలిగినది.

ఈ ప్రశ్న కి స్వయముగా సమాధానము జెప్పక ఎప్పటి వలె శంకరార్యులవారు అష్ట దిగ్గజముల వైపును, మీదు మిక్కిలి పండిత లోకమును గాన్చినారు చిరునగవుతో , మీ సమాధానం ఏమిటి జెప్పుడు అన్నట్లు. ! ఆర్యులవారు ఎప్పుడు తమ అభిప్రాయమును మొదటే జెప్పరు. అది వారి సొబగు. అప్పుడే కదా కవితా లోకమున ఇంద్రధనుస్సులు వెల్లి విరియును !

లక్కాకుల వారు వెంటనే లేచి, 'అయ్యలారా, మనం ఇంత సంకోచించ రాదు. మనము వృద్ధులమై పోతున్నాము. ఈ సభ మనతో నే ముగిసి పోవలెయునా ? నది పారును. తటాకము ఒక్క చోటే ఉండును. మనము తటాకం వలె ఒక్కరే ఉన్నాము. మనము నదియై పారవలె. అప్పుడే కదా ఈ కవితా లోకము అభివృద్ధి చెందును ? కాల ఘట్టములో చూడుడు, నదీ ప్రవాహక ప్రదేశములలో నే కదా జన జీవనము ? కావున నా అభిప్రాయం , మనము నదియై  పారవలె. మనతో బాటు చిన్న కాలువలు రావచ్చును. అవి కొంత కాలం తరువాత మనలో కలసి, ఆవియును నదియై , మహానదియై రాబోవు కాలమునకు స్ఫూర్తి నిచ్చుదురు " అని భావవేశాముతో తమ నిర్దుష్ట అభిప్రాయమును తెలియ జేసినారు.

ఈ మారు శ్యామలీయం వారికి  'భేషో లక్కాకుల మాష్టారు' అని మొదటి మారు అనాలన్న సంతోషము గలిగినది. తన మనసున వున్న మాటయే వారు కూడా అనేయటం తో వారికి ఇక బ్లాగ్కామెంటు ఇవ్వటం కుదరక శ్యామలీయం వారు లక్కాకులవారికి బ్లాగ్కామ్ప్లిమెంటు ఇచ్చి ముసి ముసి నవ్వులతో తమ ఆనందాన్ని తెలియ జేశారు.

ఇక మిగిలిన మాష్టార్లు , ఓ మోస్తరు గా , తమ అభిప్రాయమును లక్కాకుల వారి వలె తెలియజేసారు, తమదైన స్వంత శైలి లో. రాజేశ్వరీ అక్కయ్య గారికి మొదటి మారు సంతోషం వేసినది. ఇప్పటిదాకా అందరు పెద్ద మనుషల సాంగత్యం తో తన చిలిపిదనం కట్టు బెట్టి కొంత గంభీరం గా ఉండవలసి వచ్చే. ఈ బుడతడి రాకతో వారి మాతృ హృదయము కొంత ఊరట జెందినది.

పండిత నేమాని వారు ముసి ముసి నవ్వులతో, మొత్తం చర్చని గమనించి, 'ఆర్యులారా, నేనలా మొదటే అనడం వల్ల మన చర్చా కార్యక్రమము రమ్యముగా జరిగినది. గురువు గా తమ మొదటి కర్తవ్యం శిష్యులలో ఉత్సుకతతని నెలకొల్పటం ! ఆ కర్తవ్యమును నేను సరిగ్గా నెరపినానని భావిస్తాను ! ఇక మనం శంకరార్యులవారి అభిప్రాయమును తెలుసు కొందుము ' అని ఆర్యులవైపు చూసారు వారు.

శంకరార్యులవారేమైనా తక్కువ వారా ? నాలుగు పదుల సంవత్సరం అధ్యాపక వ్రత్తి ని కడు రమ్యముగా గావిన్చినవారు. వారు అవుననీ కాదనీ అనకుండా , ఎప్పటి వలె,
' ఆర్యులారా, మనం ఏదైనాను సమస్యా పూరణము ద్వారానే కదా అన్నిటికి పరిష్కారము గావిన్చేదము. కావున ఈ బుడతడికి కూడా ఒక ప్రశ్న ఇచ్చెదము . వాడు దానికి జెప్పు జవాబు బట్టి మనము తీర్మానించ వచ్చును ' అని శ్యామలీయం వారి వైపు తిరిగి, ' శ్యామలరావు గారు, ఆ బాలకుడు జేప్పినది ఏమి ? తన మాత మాట గా వచ్చితి నని కదా ? " అన్నారు

' అవును ఆర్యా' అన్నారు శ్యామలీయం మాష్టారు. ' ఇందులో ఏదైనా వేరే సూక్షమ్ము ఏదైనా ఉందా ' అని ఆలోచిస్తూ.

'కావున ఆ బాలకునికి, వారి మాత గురించి జెప్పుమని ఒక ప్రశ్న వేసెదము. వాడు దానికి ఏమి జేప్పునో దానిని బట్టి మనము ఆతనికి సభా ప్రవేశము ను ఇచ్చుట యో లేక తిప్పి పంపి వేయుటాయో జేసేదము !' అని ఆర్యులవారు జెప్పారు.

అష్టదిగ్గజములు ఎప్పటి వలె  దీనికియునూ తలయూపి, శ్యామలీయం మాష్టారు వైపు జూసినారు.

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !

(సశేషం)

(నేడు డిసెంబర్ పదకొండు ! -

 ప్రముఖ  తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి(సుందర తెలిన్గినిలే పాటిసై త్తేన్ అని తెలుగు సొబగు ని మెచ్చుకున్న తమిళ కవి వారు )  గారి జన్మ దినం అని మా సింగపూరు వారి oli ఎఫ్ఫెం వారి  మాంచి తమిళ పాటలు పెడుతున్నారు. ఈ శుభ దినమున మన బుడతడు శంకరాభరణము కొల్వును జేరుట శుభ సూచకం గా భావిస్తాను !

మీదు మిక్కిలి కందుకూరి పంతులుగారి జన్మదినం అని మన నవ రసజ్ఞ వారు తెలుపుతున్నారు రాజమహేంద్రవరం నించి.. ఆ పై ఎందుకో ? ఏమో ? గారు  తెలుగు బ్లాగు మహోత్సవ దినం కోసం ఒక మాంచి వీడియొ తయారు జేసి అందరినీ ఆశ్చర్యామ్భుధిలో ఓల లాడిస్తూ వున్నారు !  - ఈ శుభ దినాన శ్రీమాన్ బుజ్జి పండు వారు శంకరాభరణం కొలువు ప్రవేశం మరీ శుభ సూచకం! జ్యోతిర్ మాయీ వారు సంతోషమే కదా !

 - చీర్స్  జిలేబి )

16 comments:

  1. ఈ బుడతడి నడకలను అడుగడుగునా కడు రమ్యంగా తీర్చిదిద్దుతున్నారు మీరు! అబ్బురమూ,ఆనందమూను!!

    ReplyDelete
  2. కవి, పండితులు, విఙ్ఞులు, వుండగా బుజ్జిపండుకు చదువు, అందునా తెలుగు చదువు కొరతా! కటకటా! పెద్దలు నిర్ణయించెదరుగాక.
    నిన్నటివరకు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారు ఊరిలో లేనందున అందుబాటులోలేరు. ప్రస్తుతం వచ్చియున్నారు కావున మార్గము శోధించెదరుగాక!

    ReplyDelete
  3. "శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !"

    అటు పిమ్మట ఏమి జరగనున్నదో, విజ్ఞులు వేగిరము సెలవీయండి..

    ReplyDelete
  4. అసలు ఈ బుజ్జిపండు చదువు పూర్తయ్యేదాకా కల్పించుకోకూడదని మౌనముగా చదువుకుంటున్నాను. ఏదో బుజ్జి పండు తరువాత నేను కూడా అతనిని ఆదర్శంగా తీసుకుని ఏదో ఇలాంటి సభలలో అష్టదిగ్గజాలలో మన తెనాలి రామలింగ కవి వద్ద శిష్యురాలిగా ఉందామని చిన్న ఆలోచన!
    కందుకూరి పంతులుగారి జన్మదినం కాదు జిలేబీ గారూ! తొలి వితంతు వివాహం జరిపించిన రోజు! ఇది చెప్పడానికి మాత్రం రాక తప్పలేదు!

    ReplyDelete
  5. జిలేబిగారు,
    తెగని సమస్యలకి పరిష్కారం వెతకాలంటే, ఒక కమిటీ వేస్తే అది రిపోర్టిస్తే అప్పటి పరిస్థితులను బట్టి అమలుచేయడమా కాదా అని నిర్ణయించచ్చునంటున్నారు ప్రభుత్వం వారు. యధా రాజా తధా ప్రజా.

    టెరంస్ ఆఫ్ రిఫరెన్స్.
    ౧.బుజ్జి పండుకు నేర్పవలసిన భాష దాని స్వరూప స్వభావాలు నిర్ణయించడం.
    ౨. నేర్పబోవు భాష గ్రాంధికమా, వ్యవహారికమా, గ్రామీణమా.
    ౩.గద్యమా. పద్యమా.
    రిపోర్ట్ పది రోజుల్లో చేరేలా కమిటీ వేయండి సార్.ఇలా అన్నానని నన్ను అందులో దూర్చెయ్యదు.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  6. @కొత్తావకాయ గారు,

    మీరేమో అబ్బురమూ, ఆనందమూ అని అనేస్తున్నారు. బుడతడి నడక ఇంకా ఎలా సాగుతుందో నాకే ఇంకా తెలియదు ! చూద్దాం, పిడుగు ఇంకా ఎలా నేగ్గుకోస్తాడో, ఎంతైనా జ్యోతిర్ మాయీ వారి బుడతడు కదా వాడు, అన్డునూ అమరిక గా వచ్చినవాదూనూ!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. కష్టే ఫలే శర్మ మాస్టారు గారికి,

    నెనర్లు. మీరు ఆ కమిటీ మాట చెప్పి కమిట్ అయ్యినందులకు! మిమ్మల్నే ఆ కమిటీ కుర్చీ మనిషి గా నిర్ణయించడమైనది ! దాని అవుట్ కం చెప్పవలె త్వరలో మీరు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. @ఎందుకో ఏమో గారు,

    ఆ మూడు రెళ్ళ ఆరు చుక్కలకి, మూడు బ్రాకేట్లకి ముక్కోటి నెనర్లు !

    @తెలుగు పాటలు గారు

    రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట మీరూ మొదలెట్టేసారన్న మాట ! చీర్స్

    నెనర్లు

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. @రసజ్ఞ గారు,

    తప్పులు కాచి, కామేంటి నందులకు నా నెనర్లు. ఆ తప్పు రాయడం మీ మౌనాన్ని భగ్నం చేసినందులకు క్షమాపణలు ! ఒక మనిషి గుర్తు ఆతను జేసిన గొప్పదనం మీద ఆధార పది వుంటుందన్న అర్థం తో వారి జన్మ దినం అన్న అర్థం చెప్పుకుంటాను !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. @జ్యోతిర్ మాయీ వారికి,

    మీ ఆతురత ని అర్థం చేసుకున్న వాడను ! ఈ పై బుడతడి నడకలు ఎ వైపు పోవునో మా కొండ దేవర పెరుమాళ్ళకే ఎరుక ! వారు ఎలా ఆ బుడతడి కి గమ్యం జూపెదరో ఇక మీదట అది వారి భారమే ! నేను తప్పు కుంటున్నాను !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. అయ్యయ్యో ఎంత మాట! క్షమార్పణలు దేనికండీ? పొరపాటున ఇవాళ జన్మదినం అని గుర్తు పెట్టేసుకుంటారేమో అని అలా వ్రాశాను! మీ అంతరార్ధం ఇప్పుడు తెలిసిందిగా సరే అలానే కానివ్వండి! మన బుజ్జి పండు చదువు గురించి మాత్రం మొత్తం సెరీస్ అయ్యేదాకా మౌనమే మంచిది (నాకు). అంతా అయ్యాక వచ్చి అప్పుడు కామెంటతా!

    ReplyDelete
  12. రసజ్ఞ గారు,

    అంతా అయ్యేదాక, మీరు కామెంటకుండా వుండమాకండీ దయజేసి! ప్రతి టపా కి మీరు కామెంటితెనే కథ బుజ్జి పండు చదువు ముందుకు సాగును. బుజ్జి పండు కి ఎప్పటి పరీక్షలు అప్పుడే ఐపోవలె. టెర్మ్ పరీక్షలలా అన్న మాట ! మొత్తం ఒకెసారి ఆఖరున పరీక్ష అంటే పాపం బుజ్జి పండు బెదురుచున్నాడు !

    చీర్స్

    జిలేబి.

    ReplyDelete
  13. ప్రశాంతగ్గా ఆడుకోనివక ఈ చదువుగోల ఏమిటి? ఈ అమ్మలు ఎప్పుడు ఇంతే స్కూల్ కి పోయిన చదువునే హోం కి వచ్చిన చదువునే బ్లాగ్ కి వచ్చిన చదువునేన???? మేము ఎప్పుడు ఆడుకోవాలి:(

    ReplyDelete
  14. తెలుగు పాటలు బ్లాగ్ కనిపించటం లేదు సంకలిని లో కనపడుట లేదు? మాలిక లో కనపడటం లేదు? మీకు ఎవరికీ అయిన కనిపించినను నాకు తెలియపరచండి
    ఇట్లు
    మీ తెలుగు పాటలు బ్లాగ్
    అడ్రస్: తెలుగువారి వీది,
    ఉరు : ఆంద్రప్రదేశ్
    ఇగా నేను వెళ్లి వెతుకుతా ధన్యవాదములు

    ReplyDelete
  15. సంకలిని లో,మాలికలో 'దారి ' తప్పిన తెలుగు పాటలగారికి,

    బుజ్జి పండు మీలా దారి తప్పియే శంకరాభరణం కొలువు జేరినాడని భోగట్టా ! మీరు కూడా కొంత జాగ్రత్త పడవలెను. మీరు క్షేమముగా మళ్ళీ తెలుగు పాటల్ని వెతికి పట్టుకుంటారని ఎదురుచూతము !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete