Wednesday, December 14, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 4 - (శంకర విజయం - 3)

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !

శ్యామలీయమైన నెమిలి పై నుంచి బుజ్జి పండు నిదానముగా దిగాడు.

ఆతన్ని జూసి సభా స్థలి అచ్చేరువొందింది. ఈ బుడతడి ముఖమున ఏదియో తెలియరాని జ్యోతి (ఆ మాత జ్యోతిర్మయీ మహత్వమేమో ?)  ప్రస్ఫుటిస్తోంది.

ఇది అని చెప్ప నలవి కానిది.

షణ్ముఖుడు పంచకక్షం కట్టినవాడు.

ఈ బుడతడు జీన్స్ ప్యాంటు పై టీ షర్టు ధారి యై వున్నాడు.  కంటికి హారీ పాటర్ అద్దములు కూడాను. నెత్తి పై నామము. కాలికి నైకే షూస్.

షణ్ముఖుడు వేలాధయుడు. ఈ బుడతడు శర్కరీ ధారీ !

 ఒక చేత శర్కరీ , మరియొక్క చేత అంకోపరుండై వున్నాడు వీడు.

బుజ్జి పండు  సభా స్థలి కి ప్రణమిల్లి ,

"సభ యందు  వెలసిల్లిన పెద్దలన్దలికీ నా నమస్కాలములు ! నా పేలు బుజ్జి పండు , నేను మీ చెంత తెలుగు  నేల్చు కొనవలె నని మా మాత ఆదేశానుసాలముగా ఇచ్చటికి వచ్చితిని " అని,

రాజేశ్వరీ అక్కయ్య వారి వైపు తిరిగి , " నమో మాతా , నమో నమః ! పెద్దమ్మ వాలికి నమస్సులు " అని 'స్పెషల్' గా నమస్కరించడం తో రాజేశ్వరీ అక్కయ్య వారు తబ్బి మొబ్బిబై 

"రారార కన్నయ్య , రార వరాల పంట, రారార గారాల పట్టి ,తెలుగు నేర్వంగ " అని మురిసి పోయింది.

సభాస్థలి బుడతడి వైపు ఒక్క మారు , రాజేశ్వరీ అక్కయ్య వైపు ఒక్కమరూ చూసింది. 

ఈ మాతలు ఎల్లప్పుడూ వెన్నె హృదయులే సుమా అని అచ్చెరువొంది న వారు, వీరు వెన్నపూసై కరిగి పోవడానికి అర నిముషము చాలు సుమా అని తీర్మానించు కున్నారు.

బుజ్జి పండు ఈ మారు శంకరార్యులవైపు తిరిగి నమస్కరించి,

"అందమగు బ్లాగు నిలిపిలి యందలి
హ్లుదయముల నిలిచి యానందము
పెంపొందిచిన గులువు గాలికి
నమస్సులు కవివల , జేజే"

అని సాదర ప్రణామము గావించాడు. 

ఈ మారు  శంకరార్యుల వారికి సందేహం వేసింది,  " ఈ బుడతడు, మరీ తన బ్లాగు మొత్తం పరిపూర్ణముగా శోదించి వచ్చి వున్నాడేమో సుమీ " అని సందేహ పడిన వారై చిరునగవు ఒకటి నొసగి పండిత నేమాని వారి వైపు జూసినారు, ఆర్యా మీరు ప్రశ్నింపుడు బాలకుడిని అన్న చందాన.

పండిత నేమాని వారు, ఔరా , ఈ శంకరార్యుల వారి చాతుర్యమే చాతుర్యం - అన్నిటికీ నన్నే ముందు వుండమనటం అనుకుని,

ప్రకాశాముగా  " బాలకా, నీవు ఇచ్చట తెలుగు నేర్చుకొనుటకు మీ మాత పంపగా వచ్చినావని మా శ్యామలీయం మాష్టారు జెప్పారు. మంచి ప్రయత్నమే. కానీ వచ్చినవాడివి ఎటువంటి వ్రాత పుస్తకములు లేకుండా వచ్చి నావే" అని ధర్మ సందేహం లేపారు.

అసలు బాలకా నీవు నిజంగానే నేర్వడానికి వచ్చినావా అని వారు నేరుగా అడిగి ఉండవచ్చు. కాని సూక్ష్మం గా వారు ఈ లా ప్రశ్నించారు. అది వారి చాతుర్యం.

బుజ్జి పండు తడుము కోకుండా టపీ మని,

" అయ్యా పండిత నేమానీ గులువా - హస్తభూషణముగ అంకోపలుండగా  పుస్తకం బదేల హస్తమందు?" అని చిరు నగవుతో జెప్పి "అయ్యా చేత మా మాత నొసంగిన 'శల్కలీ ' సహిత ఇచ్చట వచ్చి వున్నాను ' అన్నాడు.

ఈ బాలకుడి రేఫమును ఎటుల సరి దిద్ద వలె నని శ్యామలీయం మాష్టారు తీవ్రముగా ఈ మారు చింతించడం మొదలెట్టారు.

" ఆర్యా, పండిత నేమాని వారు , ఆ బుడతడు శర్కరీ అన్న పదాన్ని అలా 'శల్కలీ' అన్నాడు. రేఫాలోపము అంతే.
ఒక చిన్న సందేహము నాకు ఇది దుష్ట  సమాసమేమో " అన్నారు శ్యామలీయం వారు - నానాటికీ తీసికట్టు నాగంభట్లు అయిపోతున్నానే సుమీ అని కొంత నివ్వెర పడుతూ.

ఆ రేఫా లోపమును మీరి ఆ బుడతడు జెప్పిన సమాదానమునకు పండిత నేమాని వారు సంతసించి,

" శ్యామలీయం మాస్టారు, మీ సందేహ నివృత్తి వేరుగా చర్చించ దెము , ముందు ఈ బుడతడి సమాధానం మాకు బాగుగా నచ్చినది " అని ఆప్యాయముగా తన మనవణ్ణి జూసినంత గా బుజ్జి పండుని గాంచి నారు పండిత నేమాని వారు. మనవళ్ళ వయసులో వున్న పిల్లలని గాంచిన తాత గార్లకు ఎల్లప్పుడూ సంతోషదాయకమవడం ప్రకృతి సహజ మే గదా!

పండిత నేమానీ వారు ఇంత శీఘ్రం గా కరిగి పోతారని అనుకోని గోలీ వారు దీర్ఘముగా బుడతడు బుజ్జి పండు ని గాంచి,

"నాయనా బుజ్జి పండు.. నీ ఇచ్చుకని మేము మేచ్చితిమి. అయినన్ను , మీ మాత మాట మీదుగా ఇచ్చటికి వచ్చి నాడవని అంటున్నావు. మరి మీ మాత గురించి నీకు తెలిసిన ఒక పద్యము జెప్పుము అని ఒక బాణాన్ని ఎక్కు పెట్టారు సూటిగా. వారు పేరు కు తగ్గట్టు గోళీ సూటిగా వేయుదురు -మధురమైన పద్యము ముందు వారు "తేనె రుచిని జూడ తీయదనము లేదు - పటిక బెల్లమందు పసయె లేదు - చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు"  అని అంతర్జాల పథముగా నొక్కి వక్కాణించినవారు కూడాను!

ఇలా సూటిగా గోలీ వారు బుజ్జిపండు ని బరిలోకి లాగడం తో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జేప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !

బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు .

(సశేషం)

10 comments:

  1. జిలేబిగారూ..సభాస్థలి నందలి విశేషములు కడు రమ్యముగా నున్నవి. ధన్యవాదములు.

    ReplyDelete
  2. బాగుందండి బాబు! బుజ్జి పండుకి మొత్తంగా గ్రాంధికమే నేర్పేసేలావున్నారు.

    ReplyDelete
  3. ఓహ్ బుజ్జిపండు చదువు తరువాతి భాగాలు వచ్చాయా...నేను చూడనేలేదు! చదువుతా అన్నీ!

    జిలేబీగారు
    మీకు నేను, మా గురువుగారు (బులుసుగారు) ప్రామిస్ చేసిన పొట్టి నవ్వుల పోస్ట్ వెసేసాను. నా బ్లాగు చూడండోసారి.

    ReplyDelete
  4. జిలే బీ గారి రచనా చాతుర్యము అమోఘము.
    వారికి నా హౄదయ పూర్వ క నమో వాకములు

    ReplyDelete
  5. మాతా జ్యొతిర్ మాయీ గారు,

    బుజ్జి పండు తెలుగు చదువు సజావుగా నె సాగుతుందని భావిస్తాను !

    కామెంటినందులకు నెనర్లు

    చీర్స్

    జిలెబి.

    ReplyDelete
  6. శర్మ గారు,

    బుజ్జి పండు ప్రస్తుతపు పంథా గ్రాంధికం! రాబోవు సమయం లొ వేచి చూద్దాం బుజ్జి పండు ఏమేమి నెర్వునో అని !

    ఈ శర్మ గారు, కష్టేఫలే శర్మ గారు ఒక్కరేనా లేక వేరా? ఈ ధర్మసందేహం ఎటులు తీరును ?

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. ఆ సౌ గారు,

    నెనర్లు . బుజ్జి పండు చదువుని మీరు ప్రరిశీలిస్తున్నందులకి. ! మీ బాకు లాంటి టపా సగం చదివాను. మొత్తం చదివాక వచ్చును మీ పై జిలేబి ప్రశ్నల పరంపర ! జస్ట్ కిడ్డింగ్. !




    చీర్స్

    జిలేబి.

    ReplyDelete
  8. 'సురా బ్లాగీయం' సుబ్బారావు మాష్టారు గారికి,

    హే గురో,

    మీ ప్రొత్సాహం నాకు అమితోత్సాహాన్ని ఇస్తున్నది! బుజ్జి పండు చదువులో మీ పాత్ర కూడా వున్నది. రాబోవు టపాలలో బుజ్జి పండు మీతో సంభాషించ బొవుచున్నాడు ! తప్పక చదవగలరు !


    చీర్స్

    జిలేబి.

    ReplyDelete
  9. విద్యాప్రాంగణము కడు రమ్యంబుగనూ నాహ్లాదకరంబుగనూ నున్నది. బుజ్జి పండు తో పాటు గ్రాంధికము నేర్వవలెనని నాకున్నూ కుతూహలముగా నున్నది. శంకరార్యుల వారి విద్యాపీఠమున నాకు ప్రవేశము కొరకు నొక సిఫార్సు పత్రము ను ప్రదానము చేయుమని మిమ్ములనభ్యర్ధించు చున్నవాడ.

    ReplyDelete
  10. బులుసు గారు,

    మీరు గ్రాంధికం బుజ్జి పండు తో నేర్చుకొనుటకు గల కుతూహలమును గమనించి శంకరాభరణం కొలువులో మీకై బుజ్జి పండు సిఫార్సు చేసినాడు. అది నిరాకరించ బడినది. కారణం శంకరాభరణం కొలువు న మీరు కాలిడిన కొలువు ఇక మాయా బజార్ అగునని వారి భయం!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete