Saturday, December 24, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 7 - (భామా విజయం - 2 )

మ్యూనిక్  మహానగరం.

ఓ అమ్మాయి చూడడానికి ఇండియన్ లా వుంది. 

చలి విపరతీం గా ఉండటం తో మెడ చుట్టూ మఫ్లర్ , తలకి స్కార్ఫ్. 

రిసెర్చ్ సెంటర్ నించి బయటకు  వచ్చి రిస్ట్ వాచ్ లో టైం చూసుకుని తన కారు ఎక్కి డాష్ బోర్డ్ పై వున్న శ్రీ కృష్ణ స్వాముల వారి ఫోటో కి ఓ నమస్కారం సమర్పించుకుని కార్ ని ఫ్రాంక్ఫర్ట్ నగరం వైపు కి వెళ్ళడానికి ఉత్తరం వైపు తిప్పి ఆటో బాన్ ఎ నైన్ ఎగ్జిట్ వైపు సాగించింది.

శ్రీ కృష్ణ స్వాముల వారి పై అమితానురాగాలతో రీసెర్చ్ చేసే మన మధురవాణి గారు ఈవిడే నని నేను వేరు గా చెప్పనక్కర్లేదనుకుంటా !

దాదాపు నాలుగు వందల కిమీ పై చిలుకు ప్రయాణం. ఓ మోస్తరు నాలుగు గంటలలో ఫ్రాన్క్ఫర్టు చేరుకోవచ్చని తీరిగ్గా ఆలోచనలో పడింది మధుర.

బుజ్జి పండుని కిడ్ నాప్ చెయ్యాలి అనుకున్నది గాని, ఎలా చెయ్యాలో తెలియకుండా పోయింది. ఆ ఐడియా వచ్చినప్పటి నించి మధుర శ్రీ కృష్ణుల వారిని పిలుస్తోన్నే వుంది. స్వామీ నీవే ఏదైనా ఉపాయం చూడు అని.

ఎందుకో ఎప్పట్లా ఈ మారు స్వామి వారు పలకడం లేదు. వున్నారో లేదో అన్న సందేహం కూడా వస్తోంది తనకి. ఎప్పుడు పిలిచినా వెంటనే పలికే కన్నయ్య ఈ మారు ఎందుకో ఏమో తెలీదు అస్సలు పత్తా లేకుండా పోయాడు.

ప్రయాణం లో అలుపు తెలీకుండా 'ఘంటసాలవారి అష్టపది వింటూ 'తవ విరహే కేశవా ' కృష్ణా రాధికా కృష్ణా రాధికా అంటూ ఆటో బాన్  మీద రెండువందల కిలో మీటర్ వేగాన్ని కారు కి అందనిచ్చింది మధుర వాణి, కృష్ణా ఏమైనా ఉపాయం చెప్పవూ అంటూ.

ఊహూ, శ్రీకృష్ణుడు అస్సలు పత్తా లేదు.

హే కృష్ణా ముకుందా మురా ఆ ఆ రే .... అంటూ ఈ మారు ఘంటసాల వారి గొంతు ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తే , తాను ఆటో బాన్ మీద వెళ్తున్నాన్నదాన్ని మరిచి హే కృష్ణా అంటూ స్టీరింగ్ పై నించి రెండు  చేతులూ వదలిసింది మధుర వాణి!

రష్యా లో కోర్టు కేసులో హాజరవుతూన్న శ్రీ కృష్ణుల వారు ఉలిక్కి పడి అక్కడ్నించి తటాలు న మాయ మయ్యారు, తన అడ్వొకేట్ అయిన రాజి కి మాట మాత్రం కూడా చెప్పకుండా , అడ్వొకేటు రాజి గారు కృష్ణా , వెళ్ళకు ఆగు, కేసు ఫైనల్ హియరింగ్ జరుగుతోంది అని గాబారా పడుతూ చెబ్తూంటే వినిపించుకుంటేనా స్వామీ వారు!

***

'అమ్మాయ్ , అమ్మాయ్ మధురా - నువ్వు ఆటో బాన్ లో వున్నావ్ , ఇట్లాంటి చేష్టలు ప్రాణ హానికరం' అంటూ సున్నితం గా సుతారమైన గొంతు ఈ మారు బాక్ సీట్ నించి విన రావడం తో ఉలిక్కి పడి ఈ లోకం లో కి వచ్చి మధుర రియర్ వ్యూ మిర్రర్ లో ఎవరా అని చూసింది.

నెమలి పించం , లలాట ఫలకే కస్తూరి తిలకం  అంత దాకా శ్రీ కృష్ణుల వారిలా వున్న ఆ ఆకారం ... ఆ పై వేషం వేరుగా వుండి, కొటూ , సూటూ,  కంఠం లో ముక్తా వళీ లా టై  పడమటి కేళీ విలాసం లా గున్నాడా పెద్ద మనిషి. !

' స్వామీ ! ఇదేమి కొత్త వేషం ఈ మారు ? ' స్వామిని గాంచిన మహదానందం తో అడిగింది మధుర.

'ఏమని చెప్పనమ్మాయ్ మధురా!  నేనెప్పుడో చాలా కాలం క్రితం మా అర్జునినికి గీత చెప్పాను. అది నా తలరాత లా అయిపోయింది.

 రష్యా లో గీత కి చరమ గీతం పాడాలని కొందరు కోర్టు కి ఎక్కారట.

మా అర్జునుడు ఒకటే గొడవ, బావా నీవే వచ్చి దానికి వకాల్తా తీసుకోవాలి ! నీ గీతను నువ్వే కాపాడుకోవాలి అని వాడు చేతులెత్తేసాడు.

పోనీలే అని రష్యా కోర్టు కెళ్ళి అక్కడి తతం గం లో తలమునకలై వుంటే నీ 'గజేంద్ర' పిలుపు ఆర్తనాదం వినిపించి, ఆ కోర్టు కేసు వాళ్ళ తలరాతకి వదిలేసి, అలాగే వచ్చేసాను !

అబ్బ ఒక్కటే చలి ప్రదేశం అమ్మాయ్ ఈ రష్యా దేశం ! అంటూ కోటు ని మరీ దగ్గిరగా కప్పుకున్నారు శ్రీ కృష్ణ స్వాములవారు - "ఇంతకీ  ఎందుకు నన్ను పిలిచినట్టు ?"  అని అడుగుతూ.

'స్వామీ ! బుజ్జి పండు ఫ్రాంక్ఫర్ట్ ఇంటర్నేషనల్ ఏరియా లో వున్నాడు. అతన్ని ఎలా బయటకి రప్పించి నేను మ్యూనిచ్ తీసుకెళ్లాలో నాకు తెలియటం లేదు. నీవే నాకు మార్గం చూపెట్టాలి ' అని మొర పెట్టుకున్నది మధుర, మొత్తం కథని టూకీ గా వారికి చెప్పి.

'ఓస్, అమ్మాయ్, ఈ మాత్రం దానికి నేనెందుకు. ? నా  ప్రియ బాంధవుడు బులుసు అక్కడే కదా వున్నాడు. ఆతడే చూసుకుంటాడు సుమా , వుండు ' అంటూ చేతిని తన హృదయం మీదికి పోనిచ్చారు శ్రీ కృష్ణుల వారు.

ఇక వస్తానమ్మాయ్! నీ కారు ఏర్పోర్ట్ చేరుతోంది, చూడూ, అక్కడ గెట్ ఎ ఒన్ దగ్గిర బులుసు వారు పక్కనే బుజ్జి పండు వున్నారు గమనించు . ఇక నే మళ్ళీ రష్యా వెళ్తా ' అని కృష్ణ స్వాములవారు అంతర్ధానమయ్యారు !

ఆటో బాన్ నించి సుమారు మూడు వందల కిమీ దూరం లో వున్న ఏర్పోర్ట్  ముందర ఆగింది ఈ మారు మధుర వాణి కారు "augenblick" సమయం లో !  అంతా శ్రీ కృష్ణుల వారి మాయ  ! గెట్ ఎ ఒన్ దగ్గిర బులుసు గారు, పక్కనే బుజ్జి పండు కనపడ్డారు మధుర వాణికి!

"Vielen Dank Krishna" అంటూ మధుర వాణి సంతోషం తో అమందానందకళిత హృదయారవిందురాలై కారు దిగి, బులుసు వారికెదురేగి 'నమస్తే' మాష్టారు ' అంటూ  చెప్పి, బుజ్జి పండు వైపు తిరిగి 'హాయ్ బుజ్జి పండు' అంది మధుర.

బుజ్జి పండు బులుసు వారి వైపు తిరిగి ఎవరన్నట్టు చూసాడు ఈ మారు.

'మై డియర్ బాయ్,  మీట్ 'ఊ , ఊహూ మధుర' అని బుజ్జి పండు కి పరిచయం చేసారు మధురని బులుసు వారు.

'ఓమ్ నమో మాతా నమో నమః' అనబోయి బుజ్జి పండు తాను జర్మేని లో వున్నానని గుర్తుకొచ్చి, "Wie gehts frau madhura " అన్నాడు.

"Good Dank! und du"  మధుర చెప్పింది బుజ్జి పండు జర్మన్  ఆక్సేంట్ కి అబ్బురపడి.

"Vielen good, Dank! ' బుజ్జి పండు చెప్పాడు నవ్వుతూ - "మా స్కూల్లో జర్మన్ సెకండ్ లేన్గ్వేజీ నాకు ". ఆతని హరీ పాటర్ కళ్ళద్దాలలోంచి చమక్కుమని ఒక మెరుపు మెరిసి తెల్లటి తివాచీలా వున్న మంచు పై రిఫ్లెక్ట్ అయింది.

"Alles klaar, das ist schon" అంటూ మధుర సంతోష పడి వారిద్దర్నీ అక్కడి దగ్గిరే వున్న స్టార్ బక్స్ కి తీసుకెళ్ళింది కొంత రెఫ్రెష్ అవడానికి.

కొంత సేపటి తరువాయి, ఆ ముగ్గురు వున్న మధుర కారు మ్యూనిక్ వైపు పరుగులేట్టింది. . బులుసు కాలికి నిగ నిగ లాడే కొత్త బూట్లు ఆ కారు కలర్ కి కామ్పీట్ చేశాయి ఈ మారు !

(ఇంకా ఉంది)

14 comments:

  1. మొత్తంగా నవల రాసేస్తున్నారే..బావుంది. ఈ నవలలో జిలేబి గారి ఎంట్రీ ఎప్పుడో..

    ReplyDelete
  2. మొత్తానికి మా జడ్జ్ గారిని రష్యా పంపించేసారు.ఇంకా ఏమేమి చేస్తారో:)

    ReplyDelete
  3. జయ గారూ చూశారా..మొత్తానికి జిలేబి గారు
    నన్ను రష్యా పంపించారన్నమాట!

    ReplyDelete
  4. కథ బోలెడన్ని మలుపులు తిరిగేస్తుందండీ బాబూ. ఇందులో మాయలు కూడా ఉన్నాయి.నాకు ఈ ఎపిసోడ్ బాగా నచ్చేసింది.వెన్న దొంగ వేంచేసాడాయే మరి..Next episode ???

    ReplyDelete
  5. జ్యోతిర్మాయీ గారు,

    ఈ నవలిక లో జిలేబి ఎంట్రీ వేరు గా కావలె నంటారా ?

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. @జయ గారు,

    అడ్వొకేటు రాజీ గారు జగత్ జడ్జీ గారు అందుకే వారిని రష్యా పంపించడం జరిగింది. కొన్ని ఎపిసోడ్ ల తరువాయి వారి ఎంట్రీ మళ్ళీ వుంటుంది. వేచి చూడండి!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. @రాజీ గారు,

    మిమ్మల్ని స్పెషల్ గా శ్రీ కృష్ణుల వారే ఎన్రోల్ చేసుకున్నారు కేసు కోసం ! ఇందులో జిలేబి ప్రమేయం ఏమీ లేదు ! నెనర్లు!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. @సుభ గారు,

    మీకు నచ్చినందులకు నెనర్లు. బుజ్జి పండు చదువు ముందు ముందు మరిన్ని మలుపులు తిరిగును! అంతే గా క బులుసు గారి ఆర్ముగం తో భేటీ పారీసు లో కూడా వుందాయే మరి !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  9. సూత్రదారే పాత్రధారైతే ఆ అందమే వేరు కదండీ..

    ReplyDelete
  10. @జ్యోతిర్మాయీ గారికి,

    నెనర్లు. సూత్రధారి పాత్ర ధారి ఐతే బుజ్జి పండు తెలుగు చదవు అరవ మగును! కావున ప్రస్తుతానికి జిలేబి సూత్రధారి మాత్రమే! ఆఖరున దీక్షితుల గారిని బుజ్జి పండు కలవ బోతున్నాడు. ఆ ఎపిసోడ్ లో జిలేబి ఒక స్పెషల్ ఎంట్రీ గా వస్తున్నారు ! వెరీ స్పెషల్ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. ఏ నిమిషానికి ఏమిజరుగునో ఎవరూహించెదరూ....

    ReplyDelete
  12. @శర్మ గారు,

    >>>>ఏ నిమిషానికి ఏమిజరుగునో ఎవరూహించెదరూ....

    ఏ నిమిషానికి ఏమిజరుగునో రాయువారికి తెలీయదు! అంతా విష్ణు మాయ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  13. జిలేబిగారే ఎంట్రి అంటే వెరీ స్పెషలే మరి..ఎదురుచూస్తూ ఉంటాము..

    ReplyDelete
  14. ఎయిర్ పోర్టులో కాలికి చెప్పులు తొడుక్కొని బుజ్జి పండుని పలకరించిన బులుసువారికి కారెక్కేసరికి కొత్త బూట్లెలా వచ్చుంటాయి చెప్మా... (అదే వారి మహత్యం అంటారా....?? అలాగలాగే.....!!)

    ReplyDelete