Thursday, December 29, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 9 - (భామా విజయం - 4 )

"సో యువర్ ఆనర్," అడ్వొకేటు రాజీ గారు గొంతు సవరించుకున్నారు.

తిరుప్పావై మొదటి పాశురం వారికి గుర్తుకొచ్చింది.

"నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్."


నందునిఅనుంగుబిడ్డ, నీలమేఘశ్యాముడు, పద్మనేత్రుడు యశోదముద్దుపట్టి, బాల కిశోరం చెప్పిన గీత కి ఈవాళ ఇక్కడ బహిష్కారమా కాదా అన్న వీరి కేసుకి శ్రీ కృష్ణుడు తనని ప్రెసెంట్ చేయమనడం తన పూర్వ జన్మ సుకృతం !

శ్రీ కృష్ణుల వారు చిద్విలాసం గా రాజీ గారిని గమనిస్తున్నారు. ఈ అమ్మాయిని తను అడ్వొకేటు గా ఉండమనడం ఈ అమ్మాయికి సొబగైన వ్యవసాయం ఐనది. తన భగవద్గీత ని క్షుణ్ణం గా  ఇంకో మారు చదివి మరీ ఇక్కడి కి వచ్చింది -

ఈ కేసు దెబ్బతో చదివని వాడు గూడా జాడ్యం వదిలించుకుని తా జెప్పిన గీతలో ఏముందో అన్న క్యూరియాసిటీ తో చదువు తాడేమో రాబోయే కాలం లో. 

అయినా ఆ కాలం లో అర్జునుడే చాలా కష్ట పడ్డాడు తాను చెప్పిన గీత ని అర్థం చేసుకోలేక.

కాలం మారింది. మనిషి కూడా చాల విజ్ఞాన వంతుడయ్యాడు. కాబట్టి ఒక వేళ క్షుణ్ణం గా చదివితే ఈ కాలం లో అర్థం చేసుకుంటాడేమో ! చూద్దాం ఈ రాజీ ఏమని వాదిస్తుందో ? కేసు గెలిస్తే ఏమి ఓడితే ఏమి ? తాను చెప్పాల్సింది చెప్పేసాడు. "Whether some body takes it or not its their Karma!"

రాజీ 'ఘనమైన కోర్టు వాళ్ళని చూసింది.

"యువర్ ఆనర్, మా శ్రీ కృష్ణుల వారు చెప్పిన గీతలో ఒక వాక్యం ఇక్కడ కోట్ చేస్తాను వినండి.

"You only control your action. Not the results. So be not motivated by results, nor be attached to inaction"

కోర్టు లో ని జడ్జి గారి కి తల గిర్రున తిరిగింది. ఇట్లాంటి సిద్ధాంతం ఎప్పుడూ విని ఉండలేదు ఆయన. ఆలోచించాడు. ఈ వాక్యం తన పుస్తకం లో రాసుకుని వంద సార్లు చదివిన తనకి అర్థం కాలేదు. తను లా చదివే టప్పుడు తన గురువు గారు చెప్పిన లాయరు సూక్తం గుర్తుకొచ్చింది ఆయనకీ. లా అన్నది లాయర్ ల కి మాత్రమె అర్థం అవ్వాలి. జన సాధారణానికి అర్థం కాకూడదు. అప్పుడే అది లా అనబడును - అదీ ఆయన నేర్చుకున్న ప్రధమ సూక్తం. ఆ ప్రకారం చూస్తె ఈ గీత తనకే అర్థం కాలేదు ఇన్ని మార్లు తిరగేసినా - కాబట్టి ఇది భారద్దేశం లో లా పుస్తకం అయివుండవచ్చు.
"Law has given me this Judge post! To which ever country this belongs, I donot care, but I need to respect Law"

అని ఆ జడ్జీ వారు ఒక నిర్ణయానికి వచ్చి " ఈ గీత లో బహిష్కారం చెయ్య వలసినది ఏదీ నాకున్నట్లు కనిపించడం లేదు. మీదు మిక్కిలి ఈ పుస్తకాన్ని వెంటనే పెర్ఫెక్ట్  గా మన దేశ భాషలో తర్జుమా చేసుకుని లా చదివే వాళ్లకి పుస్తక పాటం గా కూడా పెట్టుకునేలా చెయ్యాలి " అని ఓ జడ్జిమెంటు బర బర గీకి ఆయన ఎంచక్కా పోయారు.

శ్రీ కృష్ణు ల వారు ఈ మారు ముక్కు మీద వేలు పెట్టు కున్నారు. ఔరా, ఈ కాలపు రాధికలు మరీ ఘటికులే ! ఒక్క వాక్యం తో ఈ జడ్జీ గారిని బోల్తా కొట్టిన్చారే సుమీ అని !

రాజి శ్రీ కృష్ణుల వారికి నమోవాకాలు అర్పించింది.

"స్వామీ"
"ఏమీ "
నా మనసులో వున్నది మీకు తెలియదా "
"అమ్మాయ్ మనసులో వున్నది తెలియక పోతే నీ కృష్ణున్ని నేను కాను"
"తెలిసినా నా కోర్కెను తీర్చేరేమీ "

"ఇదో అమ్మాయ్ రాజీ, నువ్వు ఈ కోర్టు కేసు గెలిచావు. నీ కోరిక బుజ్జి పండుని జర్మనీ లో కలవాలి. అంతే కదా"

"స్వామీ వారు చిద్విలాసులు. మనసులో మాటని వెంటనే కనిబెడతారు "

శ్రీ కృష్ణుల వారు చక్రం తిప్పారు. రాజీ గారు అక్కణ్ణించి మాయమయ్యారు. !

******

మ్యూనిచ్ కొనిగ్ స్త్రాస్సే నెంబర్ పదకొండో ఇంటి ముందు ఆగిన బీ ఎం డబ్ల్యూ కారు నించి బులుసు గారు, బుజ్జి పండు, మధురా దిగారు.

మధురా ఇంటి కీ ఓపెన్ చేసి "హాయ్ " అన్న గొంతు వినబడటం తో తిరిగి చూసారు. బులుసు గారు, బుజ్జి పండూ కూడా తల తిప్పి చూసారు.

వెనక రాజీ గారు - ప్రత్యక్షం గా కాన వచ్చారు. !

"ఓహ్ రాజీ గారు, వాట్ ఏ సర్ప్రైజ్! "

బులుసు గారికి తల తిరిగింది ! ఇదేమిటి ఈవిడ గారు ఎక్కణ్ణించి ఇక్కడికి వచ్చారు అని

" ఏమండీ రాజీ గారు చాల సర్ప్రైజ్ "

"అంతా శ్రీ కృష్ణుల వారి చలవ మాష్టారు "

బులుసు గారికి ఈ శ్రీ కృష్ణు ల వారు మరీ అగాతా క్రిస్టీ సస్పెన్స్ బుక్ లా అయిపోయ్యారు !

(ఇంకా ఉంది)

8 comments:

  1. "కోర్టు పరీక్షలో నెగ్గిన మన భగవానుడు శ్రీ కృష్ణులవారు చెప్పిన భగవద్గీత."
    జిలేబీ గారూ మన భగవద్గీత సాధించిన విజయాన్ని నేను సాధించిన విజయంగా నా పేరుకు కీర్తి తెచ్చిన మీకు కృతజ్ఞతలు.
    నాకెందుకో మీ బ్లాగ్ లో మీరు నాకందించిన ఈ విజయం రాబొయే
    నూతన సంవత్సరానికి శుభసూచకంగా కనిపిస్తుంది..

    ThankYou So Much For Your New Year Gift :)

    ReplyDelete
  2. ఎవరి టపా చూస్తే

    అనునిత్యం సంభ్రమ ఆశ్చర్యాలకు గురి అవుతామో

    ఆబ్లాగ్ మూర్తే zilebi

    ఆ బ్లాగే వరూధిని

    అయ్యబాబోయ్ !

    :)

    100's of times

    చీర్స్ to జిలేబి

    ?!

    ReplyDelete
  3. వావ్ భలే బాగుందండి:-)

    ReplyDelete
  4. రాజి గారు,

    నెనర్లు. మీరు కేసు గెలిచారు. అదే సంతోషం !

    జిలేబి.

    ReplyDelete
  5. ఎఏ ?!

    మరీ ఎలెక్ట్రిక్ పొలం లోకి తోసేస్తున్నారండీ! షాక్ కొట్టి జిలేబి మూర్చితురాలయ్యారు !

    నెనర్లు
    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. శర్మ గారు,

    పట్టు వదలక టపా సీరియల్ చదివి ప్రోత్సహిస్తున్నందులకు నెనర్లు.

    జిలేబి.

    ReplyDelete
  7. పద్మార్పిత గారు,

    నెనర్లు. భలే భలే ! భల్లే భల్లే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete