Monday, January 9, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - 10 - భామా విజయం - 5

"తమ పాద స్పర్శతో మా ఇంటిని పరమ పావనం చేసిన
శ్రీశ్రీశ్రీ నవ్వండి బులుసు బ్లాగానంద పెద్ద స్వామీవారు,
శ్రీ శంకర విజయం గావించిన చిన బుజ్జి పండూ కుర్ర స్వామీ వారు,
గీతా కేసు విజేతా రాజీ వారు 
స్వాగతం సుస్వాగతం"


మధుర ఇంటి తలుపులు తెరిచి నాటకీయ ఫక్కీలో అందర్నీ ఆహ్వానించింది.

"మధుర గారు, నెనర్లు. కానీ ఈ ఫ్లైట్ లో తిన్న బ్రెడ్డు ముక్కలతో జిహ్వ రుచి అన్న దే మరిచి పోయింది. మాంచి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ వేసుకుని, వేడి వేడిగా అప్పుడే కాచిన నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది" అన్నారు బులుసు వారు, దహించు కు పోతూన్న ఆకలి తాళ లేక ఇంటిలోకి ప్రవేశిస్తూనే నీరస పడి పోతూ.

మధుర సంతోష పడి, "ఓస్, బులుసు గారు, అదెంత సేపవుతున్దండీ. దాంతో బాటే  నేను మీకు నిముషం లో మాంచి పసందైన దొండకాయ కూర చేసేస్తాను చూడండీ " అని వెంట నే కిచెన్ లో కి ఎంటర్ అయ్యింది.

రాజీ వారు కొంత సందేహ పడ్డారు!

మధుర బుజ్జి పండు వైపు తిరిగి "పండూ అండ్ కో, వంటయ్యేంత దాకా ఈ బుడత జిగురు ముక్క నోట్లో నములుతూ వుండండి. ఇక్కడి వెదర్ కి ఇది అవసరం " అని వారందిరికి బు జి ము ఇచ్చి తానొక్క ముక్క నోట్లో వేసుకుని దొండకాయ కూర చేసే ప్రాజెక్టులో పడ్డారావిడ.

వంట గదిలో కాకుండా హాల్లో మధ్యలో ఓ పేద్ద సెట్టింగు వేసుకుని దొండకాయలు కోసే ప్రాజెక్టు కోసం, ఓ పేద్ద గిన్నెలో నీళ్ళు తీసుకుని, అందులో దొండకాయలేసి అది తీస్కెళ్ళి అక్కడ పెట్టుకుని ఆసాంతం తీరికగా కూర్చుంది మధుర.

ఇంకో గిన్నేమో కోసిన ముక్కలేయడానికి, మరొకటేమో, తీసేసిన ముచ్చికలు వెయ్యడానికి పెట్టు కుని . కడిగిన కాయలు తుడవడానికి ఒక నేప్కిన్ పెట్టుకుని, . కాయలు కోయడానికి ఓ చెక్క, కోసే ముక్కలు ఆ చెక్క మీద నుంచి కింద పడిపోకుండా జాగ్రత్త కోసం దాని కింద ఓ పేద్ద ప్లేటు, ఓ కత్తి, యీ సెట్టింగు అంతా పెట్టడానికి ఒక పీట, అలాగే తను కూర్చోడానికి మరో కుర్చీ ... ఇదీ ఆవిడ సెట్టింగు.

ఇలా ఓ అరగంటసేపు అటూ ఇటూ తిరిగి, అదెక్కడుంది ఇదెక్కడుంది అని వెతుకుతూ కావలసిన సరంజామా అంతా అమర్చుకున్నా క . ఎదురుగా టీవీ పెట్టుకుని, చేతికందేట్టు రిమోట్ కూడా పెట్టు కుని మధుర, ఇహ జైహింద్ అనుకుని దొండకాయలు తరిగే మహా యజ్ఞం మొదలు పెట్టింది.

ఎంతో పద్దతిగా, ఒద్దికగా ఒక్కొక్క దొండకాయ మీదా స్పెషల్ కేర్ తీస్కుంటూ తరగడం మొదలెట్టి, . అదేంటో, అంత ఇదిగా శ్రద్ధ తీస్కుని తరుగుతున్నా ముక్కలన్నీ ఒక్క షేపులో రావడం లేదు సుమీ అని హాశ్చర్య పోతూ

"బుజ్జి పండూ, నీకో కథ చెప్పనా" అన్నారు మధుర గారు.


ఇక్కడ ఈ తతంగం అంతా అర్ధ గంట పై బడి చూస్తూన్న ముగ్గిరికి ఆకలి పెట్రేగి పోతోంది.

"అమ్మాయ్ మధుర , నువ్వు నిజం గానే వంట చెయ్య బోతున్నావా ? లేక కథ అయ్యేకే మొదలెడతావా వంట వార్పూ? " బులుసు గారిని నీరసం కములు కొంది, "నా తల్లే నా బంగారమే....ఎంత పనిమంతురాలో ." అనుకుంటూ.

"సరే బుజ్జి పండూ కథ తర్వాత చెబ్తానే" అని వంట ప్రాజెక్టుని ప్లాంట్ బియో టెక్నాలజీ పీ హెచ్ డీ అంత శ్రద్ధ తో కొనసాగించి వంట ముగించి "టమాటో పప్పు వంట, అంతా రెడీ" అంది మధుర ఓ ముప్పావు గంట తరువాయి.

టమాటో పప్పు అనంగానే ముగ్గిరికీ మళ్ళీ జిహ్వ జివ్వు జివ్వు  మంది.

ఆ హా మన అదృష్టం జర్మనీ లో టమాటో పప్పు కలిపిన కాచిన వెన్న నేయి తో, దొండ కాయ కూరతో మధుర భోజనం - వొహ్ !

"వంట బాగుందండీ ? " మధుర అడిగింది అందర్నీ డిన్నర్ మధ్య లో

"మీ రాశి వారు వంట బ్రహ్మాండంగా చేస్తారు మధురా !" మెచ్చుకున్నారు రాజీ గారు.

బులుసు గారు "అమ్మాయ్ భోజనం బ్రహ్మాండం, కాకపోతే ఓ చిన్నమాట! ఇప్పుడు మనం అన్నం తిన్నాక మన అందరి చేతులూ రెండ్రోజుల దాకా ఇలా పసుప్పచ్చగా ఉంటే బాగోదు కదా! అందుకని, కొంచెం.. ఒక్క రవ్వ పసుపు తగ్గించాలేమో సుమా" అన్నారు తన పసుపు పచ్చని చేతులని చూస్తూ !

బుజ్జి పండు ఫక్కున నవ్వాడు.

"ఫ్రౌ మధుర గారు, రేపటి బ్రేక్ ఫాస్ట్ వేడి వేడి ఇడ్లీని కారప్పొడి, నెయ్యిలో ముంచుకు తింటే ఎలా ఉంటుంది! " అన్నాడు ఆ బుడతడు.

"థాంక్ యు థాంక్ యు " అని మధుర గారాలు పోయింది.

(ఇంకా వుంది )

11 comments:

  1. మేము ఇండియా వెళ్ళేప్పుడు ఫ్రాంక్ఫర్ట్ లో హాల్ట్ ఉంటుంది. ఈ సారి మధురగారి చేతివంట రుచి చూడాల్సిందే...బుజ్జిపండుకు ఇడ్లీలు ఇష్టమని మీకెలా తెలుసింది జిలేబిగారూ..

    ReplyDelete
  2. జ్యోతిర్మయీ వారు,

    చూసారా చూసారా, ఇడ్లీ మహిమ !

    అదేమిటో నాకూ తెలీదండీ, బుజ్జి పండు కథ కీబోర్డు పధం గావిస్తే మొత్తం అవే పరుగులు పెట్టేస్తున్నాయండి! అంతా విష్ణు మాయ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  3. అదేమిటండీ జిలేబీవారు నాకు ఫ్లాష్ వేస్తానని చెప్పి ఇలా? ఎప్పుడేస్తున్నారు ఇంతకీ :)

    ReplyDelete
  4. @భారారె వారు,

    మీ "ఫన్ ఆర్ట్" ఉగాది కి పోస్టు పోన్ అయి పోయింది, మొదటే చెప్పను కదండీ ఏప్రిల్ ఒకటి లోపు మీకు సంక్రాంతి కి పంపిస్తానని, మరిచి పోయారా ?


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. మొత్తానికి భోజనం పెట్టించారు, మధురగారిచేత, యీ ఎపిసోడ్లో పెట్టించరేమో అనుకున్నా, దొండకాయలు తరగడం చూసి.

    ReplyDelete
  6. అయ్యో మరి అప్పడాలు కాని బూడిద గుమ్మడి కాయ వడియాలు కాని లేవా మధుర గారూ???? మొత్తానికి ఈ బుజ్జి పండు ఘట్టం మాత్రం జిలేబీ రుచినంతా ఇనుమడింప చేసుకుని రసవత్తరంగా సాగుతోంది! ఎంతో పద్దతిగా, ఒద్దికగా ఒక్కొక్క దొండకాయ మీదా స్పెషల్ కేర్ తీస్కుంటూ తరగడం మొదలెట్టి,బహుసా ఆవిడ ప్లాంటు సెక్షన్ కట్టింగ్ చేసినంత శ్రద్ధగా చేద్దామనుకున్నారేమో!

    ReplyDelete
  7. @కష్టే ఫలే మాష్టారు గారు,

    నేనూ అలానే అక్కడే ఈ ఎపిసోడ్ ఆపెద్దామనుకున్నా నండీ. ఎంతైనా వారి ఆకలి బాధలు చూసి తాళ లేక మొత్తం మీద మధురమైన భోజనం తో ముగించి మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ కి కూడా సందోహాలు మొదలు పెట్టిన్చామన్న మాట !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. @రసజ్ఞ వారు,

    'అప్ప' యే డాలు! ఇక అప్పడాలు లేక పో'వడ' మన్న ప్రసక్తి యే లేదు ! ఇక జిలేబీ రుచి అంటారా అది మధుర వారి 'బ్లాగ్ మాధురీ మహిమ' ! దొండకాయ స్పెషల్ కేర్ మీరన్నట్టు ఖచ్చితం గా ప్లాంటు 'బీయో' సెక్షన్ 'ప్రియం' శ్రద్దే దధతః '!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. అంత తీరుబడిగా దొండకాయలు తరగడానికి కూర్చుంటే బహుశా బెండకాయల లో విటమిన్లు, ఖనిజ పదార్ధాలు ఏమేమి ఉన్నాయో, అవి పోకుండా ఎలా తరగాలో, వండాలో చెప్పిస్తారనుకున్నాను....... దహా

    ReplyDelete
  10. జిలేబీ గారూ టొమాటో పప్పు,దొండకాయ ఫ్రై మంచి కాంబినేషనండీ..
    చాలా బాగుంది..

    ReplyDelete
  11. @బులుసు గారు

    @రాజి గారు,

    నెనర్లు. మాంచి పసందైన భోజనం మధురిమలు చవి చూసినందులకు!

    జిలేబి.

    ReplyDelete