Friday, January 6, 2012

మీ శ్రీ వారు ఇంటి పనుల్లో మీకు సహాయం చేసేలా చెయ్యడం ఎలా ?

ఈ టపా లేడీస్ స్పెషల్. -- టాప్ సీక్రెట్ ! మగవారు చదివే ముందే చదివెయ్యండి !

అంటే మగవారు చదవ కూడదని కాదు. (చదివితే వాళ్లు ఈ కిటుకు తెలుస్కుంటే మనకి మేలు లేఅడు కాబట్టి వాళ్లు చదవరని ఆశిస్తాను!)


మీరు కిచెన్ తో తలమునకలయ్యే పనుల్లో బిజి బిజి గా ఉంటే, మీ వారు  పడక్కుర్చిలో నింపాదిగా కూర్చుని ఏ ఈనాడు పత్రికో లేకుంటే లాప్ టాప్ పెట్టేసుకుని ఈ లాంటి బ్లాగో దివేస్తుంటే మీకు మరీ చిరాకు ఎక్కువై దమ్మని ఈ గరిటో లేకుంటే ఏ గిన్న్నో కింద గిరాయించి ప్రొటెస్ట్ చేస్తారా?

లేక తెక్నికులు ఉపయోగించి మీ వారిని వంట గది లోకి రప్పించి వారిచే మెప్పుగా కార్యసాధన అయ్యేలా చేస్తారా?


ఈ రెండు పద్దతిలో నూ ఒక్కో మారు ఒక్కో ఫలితాన్ని సాధించవచ్చు. ఈ మీరు పనిచేస్తుంటే మీ శ్రీ వారు ఈజీ చేరు  సీను మమ్మీ లేజీ బాయ్ కి మధ్య జరిగే తమాషా!

 లేజీ బాయ్ ని నిద్ర లేపాలంటే గదమాయింపు లేకుంటే బుజ్జాగింపు రెండు అవసరం.

నారదాయ నమః !

చీర్స్
జిలేబి.

16 comments:

  1. పడక్కుర్చీ?

    ఈ ఇంటింటా సోఫాల రోజులు వచ్చి పడక్కుర్చీలు మాయమై పోయాయని నా అనుమానం.

    మా శ్రీమతిగారు యెలాగూ కంప్యూటర్ చుట్టుపక్కలికే రారు కాబట్టి నేనే చదివేసాను మరి!

    ReplyDelete
  2. చెబితే చెయ్యంటండీ! మరీ అంత టెక్కు నిక్కు లెందుకూ

    ReplyDelete
  3. మీరు కిటుకు చెప్పటం ఏమో గాని మా అక్క అయితే బావని కిచన్ కి దరిదాపులో కుడా రానివదు.. ఎందుకు అని అడిగితె నేను మా వారికి చేయటం నాకు ఇష్టం రా అంటది..

    ReplyDelete
  4. @వ పవరు రెండు వనజ వనమాలీ గారు !

    రెండు చుక్కలూ ఒక బ్రాకేటు మీకున్ను !

    @శ్యామలీయం మాష్టారు,

    మా కాలానికి పడక్కుర్చీ లే ! సోఫాలు ఇంకా రాలేదన్న మాట. అవన్ని ఓ జనరేషన్ తరువాయి మాటలు ! అయినా పడక్కుర్చీ సౌకర్యాలు సోఫాలో వస్తాయటండీ ?

    ఇక మీ శ్రీమతి చదవడం గురించంటారా ? ఆవిడ ఎప్పుడో చదివేసి వుంటారు ఈ తెక్నీకు. వారికి కంప్యూటరు ఎందకండీ మరీను ! జీవితాన్ని కాచి వడబోసి వుంటారు ఆల్రెడీ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. @కష్టే ఫలే మాష్టారు,

    మీరెంత చెబితే అంత. మీ విషయం లో ఈ పై లేజీ బాయ్ స్టైలు పనికి రాదు. కంపూటారు పవర్ కార్డు లాగేసి అలా చక్క పోతారు మీ శ్రీమతి గారు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. @బాలు గారు,,

    నెనర్లు కామేన్తులకి.

    @తెలుగు పాటలు గారు,

    చూసారా , చూసారా ఎంత మర్యాదో ! ఈ పాటివి గమనించి కూడా మీరు ఆ తెలుగు పాట లల్లేరంటే ఏమనాలంటారు ?

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. జిలేబి గారు,
    బలే కనిపెట్టేశారే!

    ReplyDelete
  8. @కష్టే ఫలే మాష్టారు,

    ఇది ఇక్కడా మా జమ్బునాధన్ కృష్ణస్వామి వారు ఎదుర్కొఒటున్నదే కదా !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. ఆ టెక్కు నిక్కులేవో త్వరగా చెప్పండి! అసలే భారారె గారు చదువెందుకు పెళ్లి చేసుకోక అన్నారు? ప్చ్ కనుక మీలాంటి వారు నేర్పితే ఫాలో అయిపోతా!

    ReplyDelete
  10. ఆ టెక్కు నిక్కు చెప్పమంటే చెప్పరే నాకు?

    ReplyDelete
  11. రసజ్ఞ వారు,

    పెళ్లవగానే అది నిక్కుటము గా మీకు వచ్చును. టెక్కు మరియు నిక్కు లు! కావున మీరు ఇప్పుడే దాని గురించి చింతించ వలదు. ఒట్టి మట్టి బుర్రల గురించి మనము రిసెర్చ్ సమయం లో అంత ఆలోచించ వలసిన పని లేదు ! ఎంత ఒక్క ఆరు నెలలో 'కైవసము' కళ్యాణ పురుషుడు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  12. :))
    సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  13. కల్లూరి శైల బాల గారు,

    మీకున్నూ సంక్రాంతి శుభాకాంక్షలు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  14. ఆడువారు అన్నిట సగం వాటాకావాలని వాదులాటలు పోరాటాలు చేస్తుంటే, మీరేమి టండి వారికి గుత్తాధిపత్యం కట్టిపెట్టిన వంటింట్లో కూడా మగవారికి భాగమిస్తామంటారు ? మగవారికి మావంటింట్లో అర్ధభాగమే కాదు, అర్ధ సూదిమొన మోపు భాగమైనా లేదు, లేదని రారాజు రేంజిలో చెప్పెడివారు ఎందరెందరో గలరెందెందు వెదికినన్. కాదంటారా !!

    ReplyDelete
  15. అన్వేషీ గారు,

    ఎప్పటి కెది మనకు సమస్య యో దాని ని వారికి మనం ఇచ్చెయ్య వలె. సులభమైన వాటిని మాత్రం మనం చేసేసి, అబ్బా హెంత కష్ట పడ్డామో చూడండీ అని చెప్పవలె !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete