Thursday, March 8, 2012

మహిళా దినోత్సవం !

ల్లి, కొప్పులో,

హిరణ్మయి నడకలో, కా

ళం పగ పడితే,

వణీ లలామ ,

దిక్సూచి కుటుంబానికి,మ

నోహరి మనోహరునికి , వా

త్సల్యమయీ

వందనం !


మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో -

చీర్స్
జిలేబి.

19 comments:

  1. Happy Women's Day..

    http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html

    ReplyDelete
  2. జిలేబిగారూ మీ పద ప్రయోగాలు నాకెప్పటికీ ఆశ్చర్యాలే. మీక్కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. నన్ను కడుపులో మోసిన కన్నతల్లి !
    తోడ బుట్టిన సోదరీ ! తోడు నిల్చి
    జీవితాన్ని పండించు రాజీవ నయన !
    తే నమోస్తు మహిళ ! ప్రణుతింతు సతము

    ReplyDelete
  4. మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి.

    ReplyDelete
  5. Woman is one half of the sky (మహిళ ఆకాశంలో సగం): Ho Chi Minh

    ReplyDelete
  6. cheeers Madam jilebi gaaru. happy women's day

    ReplyDelete
  7. Woooow.. Nice one andii.. Happy Women's Day andii..

    ReplyDelete
  8. నమస్తే జిలేబీ గారు,
    పైన వ్రాసిన ఒక జవాబు ద్వారా మీరు "స్త్రీ" అని తెలిసింది.
    మహిళా దినోత్సవ సంధర్భముగా నా హృదయపూర్వక సుభాకాంక్షలు.
    మన భారతీయ సంస్కృతిలో "స్త్రీ" కి ఇచ్చిన అత్యున్నతమయిన స్థానం మరి ప్రపంచములో ఎక్కడా లేనందుకు చాలా గర్విస్తున్నానండి.
    ఒక వ్యక్తి, ఒక కుటుంబము లేదా ఒక సమాజము అటు విజయాలలోనూ, ఇటు పతనములోనూ ఇలా ప్రతి చోట "స్త్రీ" పాత్ర లేకుండా మన దేశ చరిత్ర లేనే లేదు. మిగతా దేశాలలో "స్త్రీ" పాత్ర కేవలము విలాసమునకే పరిమితం చేయబడింది. అది వారి సంస్కృతి.

    ReplyDelete
  9. ఆహా ఏం చెప్పారు! మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
  10. @రాజి గారు,

    నెనర్లు మీ అభిమానానికి!

    @జ్యోతిర్మయీ గారు,

    ధన్యవాదాలు మీ ఆప్యాతకు !

    @వనజ వనమాలీ గారు,

    ధన్యవాదాలు! వరూధిని కాదండోయ్, ది ఒన్ అండ్ ఓన్లీ జిలేబి !!

    @వెంకట లక్కాకుల వారు,

    నెనరస్య నెనరః!

    @జయ గారు,

    మీకున్నూ శుభాకాంక్షలండి

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. జై గొట్టిముక్కల గారు,

    బాగా చెప్పారు. అనంతమైన ఆకాశం లో అర్ధనిమీళిత నేత్రం నారి.

    @కష్టే ఫలే శర్మ గారు,

    ధన్యవాదాలు !

    @DSR Murthy గారు,

    బాగా చెప్పారు. భారత దేశం లో స్త్రీ ఓ వైపు హిమాలయోన్నత శిఖరం. మరో వైపు అధః పాతాళం. The contrast is very wide spectrum. As Radhakrishnan, former president said, "if you educate a woman, an entire family is educated".

    So, in that sense, the empowerment of woman is a revolution in Indian psyche.

    Added to that also steps in the impacts of western civilization, where in the negative aspects of a urbanized life kills the woman away from the family bonds.

    Thank you.

    Cheers

    zilebi.

    ReplyDelete
  12. @రసజ్ఞ గారు,

    నెనర్లు. ! ఓహో, ఫోటో మార్చారే!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  13. @సుభ గారు,

    నెనర్లు. మీకు కూడా శుభాకాంక్షలండి

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  14. @జ్యోతిర్మయీ గారు,

    మీరు అన్న పద ప్రయోగాల ఆశ్చర్యం గురించి - ! అంతా అరవ గందర ఈ జన్మ అండ్ (అంగ్రేజీ ) అండ్ కోనసీమ(పూర్వ జన్మ ) గోళం !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  15. "ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి" పాట విన్నప్పుడల్లా నాకు వింతగా రోతగా తోస్తుంది. వీరమాత, వీరపత్ని లాంటి "బిరుదులు" చూసినప్పుడు మన డొల్లతనం బయటపడుతుంది.

    స్త్రీకి అస్తిత్వమే లేనట్టు, బాంధవ్యం ద్వారా reflected glory తోటే మహిళలు గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నంత కాలం మన దేశం ముందుకు వెళ్ళదు.

    ReplyDelete
  16. జై గారు, Woman is one half of the sky (మహిళ ఆకాశంలో సగం) అన్నది మావో జెడాంగ్.

    ReplyDelete
  17. జై గారు, ఆడవాళ్ళని తల్లి-చెల్లి లాంటి పడికట్టు మాటలతో కట్టిపెట్టడానికి ఎంత ప్రయత్నించినా తెగించేవాళ్ళు కొందరు ఉంటారు. ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/T9UPVcc65Ea

    ReplyDelete