Sunday, March 11, 2012

జ్యోతిష్యం ఒక నమ్మక వాహిని

నమ్మకం అన్నదానికి అర్థం - తార్కికానికి  ఆవల ఒక దాన్ని విశ్వసించడం అనుకో వచ్చు.

ఈ డెఫినిషన్ కింద ఆలోచిస్తే - జ్యోతిష్యం నమ్మే కొద్దీ దాని ప్రభావం మన జీవితాలలో పెరగడం దీన్ని నమ్మే వాళ్ళలో చాల మంది గమనించడం జరగడం సర్వ సాధారణం. - ఇందులో తల మునకలైన వాళ్లకి - ప్రతి విషయం జ్యోతిష్యం అలా చెప్పినందు వల్ల  ఇలా జరగడం అయ్యిందన్న మాట అని సరిపెట్టుకోవడం కాకుంటే దానికి పరిష్కారం చూడాలనుకోవడం లాంటి మరిన్ని "బై ప్రొడుక్ట్స్ " కింద వెళ్ళిపోవడం గమనించ వచ్చు.

సో, దీన్ని పాటిస్తే - ఓ మోస్తరు - అందులో నే మన జీవితం నిబిడీ కృతం అయినట్టు అని పిస్తుంది.

ఉదాహరణకి ప్రతి పనిని మంచి గంటలో నే చెయ్యాలనుకుని - రాహు కాలం అనో కాకుంటే యమ గండం అనో - ఏదో ఒక గుళిక అనో ఎన్నో సార్లు చెయ్యాల్సిన మంచి పని ని కూడా వాయిదా పద్దతుల మీద సాగించే సాదా సీదా జనసాంద్రత మనం గమనించ వచ్చు.

సో, ఒక నమ్మకం మరో నమ్మకానికి - ఆ పై అది మరో నమ్మకానికి - ఇలా విచక్షణా రహితం గా - ఓ లాంటి పరమ పద సోపానం లో పామునోట పడ్డట్టు ఈ ఊబిలో చిక్కు పోతూ - మానవుని కర్మ సిద్ధాంతాన్ని, సంకల్ప బలాన్ని  - మరిచి పోయే టంత గా  "కిక్కు" ఇవ్వ గలడం ఈ జ్యోతిష్యం యొక్క weakness అని చెప్పుకోవచ్చు కూడా.

వాహిని - ఒక ప్రవాహం. అందులో కొట్టుకుపోవచ్చు. ఈతాడ వచ్చు. జలకాలా వాడచ్చు. ఎంత కావాలంటే అన్ని నీళ్ళు ఉపయోగించ వచ్చు. కొంత ఆలోచిస్తే - ఈ జ్యోతిష్యం కూడా ఒక నమ్మక వాహిని అనిపిస్తుంది 

దాన్ని ఎలా ఉపయోగించు కుంటామో అన్న దాన్ని బట్టి- మన ఇచ్ఛా శక్తి కూడా అభివృద్ధి చెందడానికి దోహద కారిగా నా కాకుంటే - మన మూఢ నమ్మకాలకి సోపానం గానా- అన్న దాని బట్టి ఈ శాస్త్రం ఉపయోగం ఉందా లేదా  అనిపిస్తుంది.

మరో విధం గా ఆలోచిస్తే- దీన్ని గురించి - ఈ శాస్త్రం గురించి తెలియక పోతే , పట్టింపులు లేక పోతే - "Ignorance is Bliss"!


చీర్స్
జిలేబి.
(జిలేబీ what are you trying to convey?)

53 comments:

  1. "...ఈ శాస్త్రం గురించి తెలియక పోతే , పట్టింపులు లేక పోతే - "Ignorance is Bliss"!..."

    Very strange statement. The reliability of the Jotishya Sastra itself is debatable. So if somebody does not know about it how it can be called ignorance!

    ReplyDelete
  2. జ్యోతిష్యాన్ని కేవలం ఒక విశ్వాసం అనుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. దాన్ని శాస్త్రం అంటేనే కాంట్రోవర్సీ అవుతుంది.

    ReplyDelete
  3. :) ఈ మాటల గారడీలకేంగాని, yes/no అని ఒక్కముక్కలో చెప్పేయండి.

    ReplyDelete
    Replies
    1. హన్నా శంకర్ గారు,

      అవునంటే కాదని లే, కాదంటే అవునని లే !

      ఇంతకీ, Is light a particle or a wave?

      ఈ ప్రశ్న కి మీరిచ్చే సమాధానం లో మీరడిగిన ప్రశ్నకి సమాధానం ఉందేమో ?!


      చీర్స్
      జిలేబి.

      Delete
    2. కాంతికి ఓ భౌతిక శక్తి(ఆదిపరాశక్తి కాదు). దంద స్వభావము (రెండునాలుకలు) దాని ప్రకృతని కొందరు శాస్త్రీయంగా 'విశ్వసిస్తున్నారు' లెండి. జ్యోతిష్యానికీ అలా వుంటుందా? లేదా?
      'అర్థం కానిది' అని అన్నగారు అన్నారు, అది మరీ గోపీయంగా వుందని కొందరు విశ్వసిస్తున్నారు. Yes/No కిమ్‌కహా?(అంటే తమరేమంటారు అని?) :)

      Delete
    3. శంకర్ గారు,

      ఓ పాటి దరిదాపుల్లో వచ్చారు!,

      దీనిలో మరో ముఖ్యమైన పాయింటు వుంది. అది the element of 'observer' .

      The element of observer that makes the difference for that duality.

      Which in turn leads to Quantum theory.

      Now thats another big question When Quantum theory was not yet known/proposed, was this pheonomenon already there or having known Quantum theory that we come to know of the duality and the element of observer making the difference?


      cheers
      zilebi.

      Delete
  4. This is always a debatable question and there is no end for the arguments on both sides.

    ReplyDelete
  5. చాల సార్లు తెలియక పోవటం మంచిదవుతుంది. సంగీత స్వరాలూ వగైరా తెలియక్పోతే విశ్లేషణల తో సంబంధం లేకుండా సంగీతాన్ని అపాంటేనియస్ గ ఆస్వాదించవచ్చు.
    జ్యోతిషం నిజమైన సందర్భాలు నా జీవితం లో కనపడలా! ఒకవేళ జ్యోతిషం శాస్త్రీయమైనది అనిపించుకోవాలంటే దానికి నిరూపణలను చూపించాలి. అప్పుడు సైన్స్ దానిని అంగీకరిస్తుంది. ఉదాహరణ కి ఈ రోజునుంచీ వచ్చే సంవత్సరం లో ఒక మనిషి జీవితం లో జరగబోయే సంఘటనల గురించి ఓ వంద ప్రెడిక్షన్స్ చెప్తే, స్టాటిస్టికల్ గా జ్యోతిషం కరక్ట్ అని చెప్పవచ్చు. అ ప్రెడిక్షన్స్ నిజమవటానికి కల కారణాలను చెప్పగలిగితే అప్పుడు జ్యోతిషం ఒక సైన్స్ అని ఒప్పుకోవచ్చు. సైన్స్ కి కావలసినది అబ్జర్వేషన్ అండ్ ప్రూఫ్. మిగిలినదంత నమ్మకమో, అభిప్రాయమో, వేరొకటో..

    ReplyDelete
  6. జ్యోతిష్యాన్ని కనీసం hypothesisగా కూడా పరిగణించలేము. ఎక్కడో లక్షల మైళ్ళ దూరంలో ఉండే నక్షత్రాల నుంచి భూమికి కాంతే అతి అల్పంగా అందుతుంది. అటువంటప్పుడు ఆ నక్షత్రాల ప్రభావం అందుతుందంటే నమ్మగలమా? ఈ విషయం చెపితే చంద్రుని ప్రభావం చెప్పి టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తారు జ్యోతిష్యులు. అమావాస్య నాడూ, పౌర్ణమి నాడూ పిచ్చివాళ్ళకి పిచ్చి ముదురుతుంది అని చెప్పి గ్రహాల ప్రభావం నిజమని వాదిస్తారు. bipolar disorderకీ & అమావాస్య, పౌర్ణమిలకీ మధ్య సంబంధం లేదని డాక్టర్లే చెపుతుండగా డాక్టర్‌లు చెప్పని విషయాలు కూడా తమకి తెలుసని జ్యోతిష్యులు చెప్పుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారం యొక్క మోడస్ ఓపరాండీయే ఇలాంటిది.

    ReplyDelete
  7. మనిషి జాతకం ఎలా వ్రాయబడి ఉంటే అలా జరుగుతుందని జ్యోతిష్యం చెపుతుంది. ఇది అదృష్టదురదృష్టాల మీద ఆధారపడాలని చెప్పే కర్మవాదం (fatalism) కాదా? ఇలాంటి నమ్మకాలని నమ్ముకుంటే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందము.

    ReplyDelete
  8. లెస్సబలికె ‘ జిలేబి ‘ చాలించి చర్చ ,
    ‘ బ్రతుకు భ్రమలందు దిగి తన భవిత దెలియ
    గోరు బలహీను డొక్కడు , చేరి వాడి
    సొమ్ము కాజేయు బలహీన శుంఠ డొకడు ‘

    నేస్తమా ! చూడు ! ‘ కుజన శని గ్రహాలు ‘
    తిరుగు చున్నవి నీచుట్టు తెలిసి బ్రతుకు ,
    పైన నెక్కడో దారి తప్పని గ్రహాల
    వలన నిసుమంతయును హాని కలుగ దెపుడు

    ReplyDelete
    Replies
    1. @ వెంకటరాజారావు గారూ !
      నిజముగానే లెస్స బలికితిరి .

      Delete
  9. ఇందాకే ఒక మహానుభవుణ్ణి "మీరు మీ పిల్లవాణ్ణి కూడా జాతకాలని నమ్ముకోమని చెపుతారా?" అని అడిగితే ఇలా సమాధానం చెప్పాడు.
    >>>>>
    ఇక నా స్వవిషయానికి వస్తే, అందరూ చీదరించుకుంటున్నా పట్టనట్టు ఎకేవిధంగానయితే పెరగడన్న గ్యారంటీ నాకున్నది.
    >>>>>

    అంటే అతని కొడుకు జీవితానికి మినిమం గ్యారంటీ ఏదో ఉంచుకున్నాడన్నమాట.

    జ్యోతిష్యం ఒక నమ్మకమే కానీ నిజం ఎన్నటికీ కాదు. అందుకే జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు తమ పిల్లలని సొంత టాలెంట్‌ని నమ్ముకోమని చెపుతారు, సమాజానికి మాత్రం అదృష్ట-దురదృష్టాల ఆధారంగా జీవితం ఉంటుందని చెప్పే జాతకాలు లాంటి నమ్మకాలని నమ్ముకోమని చెపుతారు.

    జ్యోతిష్యులే వ్యక్తిగతంగా నమ్మని విషయాలు సమాజం మాత్రం నమ్మాలనడం హిపోక్రిసీ కాకపోతే ఏమిటి?

    ReplyDelete
  10. జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళపై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ తన కుటుంబ సభ్యులు బాగుంటే చాలు, సమాజం ఏమైపోయినా ఫర్వా లేదు అనుకుంటూ తాము వ్యక్తిగతంగా నమ్మని విషయాలని సమాజం నమ్మాలని చెప్పడంపైనే నా వ్యతిరేకత.

    ReplyDelete
  11. ప్రవీణ్ గారూ,
    మీ వ్యక్తిగత యిష్టాయిష్టాలూ, వ్యక్తిగత అభిప్రాయాలూ వగైరా యెవరికీ అవసరం లేదు. మీరు యేదైనా చర్చలో దూరి అసంగతంగా వ్యాఖ్యలు చేయటం బదులుగా కేవల చర్చావిషయానికి మీ బ్యాఖ్యలను పరిమితంచేస్తే అందరికీ సదుపాయంగా ఉంటుంది. ఏదో విధంగా చర్చలో మీ గొంతు వినిపించటమే ముఖ్యం అనుకొని అందరితోటీ వివాదాలకు దిగటం వలన విషయం ప్రక్కదారిపట్టే ప్రమాదమే కాక అనవసర వాగుధ్ధాలు జరుగుతాయి. మీ అభిమతం అదే నని అనుమానంగా ఉంది. ఆరోగ్యకరమైన చర్చలకు సంయమనమూ, విషయపరిజ్ఞానమూ కల వ్యక్తులు అవసరం - మిగిలిన వారితో పనిలేదు.

    ReplyDelete
  12. జ్యోతిష్యం ఒక నమ్మకమా, సైన్సా అది అడిగారు. అది కేవలం నమ్మకం అని చెప్పాను. సైన్స్‌లో చెప్పే దానికీ, చేసే దానికీ మధ్య వైరుధ్యం ఉండదు. జ్యోతిష్యంలో ఆ వైరుధ్యం ఉంది కాబట్టే అది నమ్మకం అని అన్నాను. ఇది చర్చకి సంబంధం లేనిది ఎలా అవుతుంది? టైటిల్‌లోనే జ్యోతిష్యం ఒక నమ్మకమా అని అడిగారు కదా.

    ReplyDelete
  13. మీరు పోస్ట్ టైటిల్ కూడా చదవకుండా హారంలో వ్యాఖ్య చూసి వచ్చారని మీ వ్యాఖ్య చదివితేనే అర్థమైపోతుంది. జ్యోతిష్యం నమ్మకమా, కాదా అనే విషయం మాత్రమే వ్రాసాను. చర్చ దాని గురించే కదా.

    ReplyDelete
  14. ఒకవేళ నేను వ్రాసినది సంబంధం లేని వ్యాఖ్య అయితే స్టాటిస్టిక్స్ చూపించాలని బొందలపాటి గారు వ్రాసినది కూడా సంబంధం లేని వ్యాఖ్యే అవుతుంది. మీరు చర్చ కూడా చదవకుండా హారంలో చూసిన ఒక వ్యాఖ్య చూసి ఇక్కడికి వచ్చారని మీరు వ్యాఖ్య వ్రాసిన శైలి చూస్తే అర్థమైపోతుంది.

    ReplyDelete
  15. ప్రవీణ్ గారూ, మీకు చాలా విషయాలు సులువుగా అర్థమైపోతాయని భావించుకుంటున్నారు. సంతోషం. జ్యోతిష్యం నమ్మకమా, కాదా అనే విషయం అనే విషయం మీదే చర్చ అన్న దానిలో సందేహం యేమీ లేదు.

    మీతో వాదిస్తూ కూర్చొనటానికి నాకు తీరుబడి లేదు. అదీ చర్చావిషయాన్ని ప్రక్కన బెట్టి.

    జ్యోతిష్యం నమ్మకమా, కాదా అనే విషయం గురించి మాట్లాడటానికి మీకు గల జ్యోతిషపరిజ్ఞానం యేమాత్రం? ఇది కొంచెం విపులంగా చెప్పండి. (TV లో చర్చలు చూసాను అని చెప్పకండి - అది పరిజ్ఞానం క్రిందికి రాదు గదా.) విషయపరిజ్ఞానం లేకుండా మీరేమనుకుటున్నారో పదేపదే రకరకాలుగా చెప్పటం వలన చర్చ యేమీ సంపన్నం కాదు! అలాగే వ్యక్తిగత మైన విషయాలను ఉద్దేశించి ప్రశ్నించటం సంస్కారం కాదు. మీకు తగినంత జ్యోతిషపరిజ్ఞానం ఉంటే మీ వల్ల చర్చకు ప్రయోజనం కాని మీరు ఇక్కడ pollution create చేయాలన్న ఉద్దేశంతో మాత్లాడటం యేమీ ప్రయోజనకారి కాదు చర్చకు.

    ReplyDelete
  16. http://saradaa.blogspot.in/2012/03/1.html

    జగదీశ్ గారిలాగ మీరు ఒక వ్యాసం వ్రాయండి. అప్పుడు సమాధానం చెపుతాను. ఎందుకంటే నేను విషయం చెపితే నేను చెప్పిన విషయం జ్యోతిష్యంలో లేదని జ్యోతిష్యులు వాదించగలరు. జ్యోతిష్యులు అలా వాదించడం ఇంతకు ముందు చూశాను. అందుకే జ్యోతిష్యులు ముందు మాట్లాడిన తరువాతే సమాధానం చెప్పాలనుకుంటున్నాను.

    ReplyDelete
  17. ప్రవీణ్ గారూ, మీరుదహరించిన వ్యాసం ఒక తప్పులతడక. నేను అలాగ ఒక వ్యాసం వ్రాయటం యేమిటి - మీరు సమాధానం చెప్పటం యేమిటి?

    జ్యోతిషం గురించి చర్చించటానికి మీకున్న జ్యోతిషపరిజ్ఞానం యేమాత్రం అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా యెదురు ప్రశ్నలేమిటి? నేనేదో మీ సమాధానం కోసం యెదురు చూస్తున్నట్లు యెందుకు మాట్లాడతారు? చర్చించటానికి మీ అర్హత యేమిటి అని సూటిగా అడిగాను.

    ఒకవేళ నేను నా బ్లాగులో మీరన్నట్లు జ్యోతిర్విషయకమైన వ్యాసం వ్రాస్తే అక్కడ మీకు చర్చలో పాల్గొనే అవకాశం ఇస్తానని యెలా అనుకొంటున్నారు? విషయజ్ఞానంలేకుండా మాట్లాడే వారికి చర్చలో స్థానం యివ్వటం దేనికి? నేనేదో మీకు భయపడిపోతున్నానని సంతోషించ వద్దు. చర్చలో పాల్గొనే అర్హత సంపాదించుకొని తప్పక రావచ్చును. గోల చేయటం కోసం వస్తానంటే యెలా?

    ReplyDelete
  18. నేనేమీ గోల చేస్తాననలేదు. వ్యాసం వ్రాయండి చూద్దాం అని అన్నాను. జ్యోతిష్యం గురించి నేను కూడా ఒక వ్యాసం వ్రాసే ఆలోచనలో ఉన్నాను. మీరు వ్యాసం వ్రాస్తే నాకు అభ్యంతరం లేదు. సమాధానం చెప్పలేక నా కామెంట్లు డిలీట్ చేసినా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే జ్యోతిష్యం ఎప్పుడూ మూడు కాళ్ళ మీదే నిలబడుతుంది కాబట్టి. మూడు కాళ్ళ మీద నిలబడేవాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు కానీ యూనివర్సిటీలలో జ్యోతిష్యం కోర్స్ చెపుతూ దాన్ని సైన్స్ అని నిరూపించడానికి ప్రయత్నించడం వల్లే సమస్య వచ్చింది.

    ReplyDelete
    Replies
    1. అబ్బాయీ ప్రవీణు,

      మీకు బ్లాగు ఉందా ! నేను వెతుకుతున్నా ఎక్కడైనా బ్లాగు వుందా మా ప్రవీణు శర్మ కి ఒక్క కామెంటు కొట్టి జన్మ ధన్యం చేసుకుంటా అని! కనబడితే ఒట్టు!

      వెంటనే ఓ టపా కట్టవయ్యా ! చదివి పుణ్యం కట్టు కుంటా !!

      బామ్మ
      జిలేబి.

      Delete
    2. >>>వెంటనే ఓ టపా కట్టవయ్యా ! <<<
      ప్రవీను తొందరగా "టపాకట్టు" :)))

      Delete
  19. ప్రవీణ్ గారు,
    మీరు ఇప్పటికే ఇక్కడా మరికొన్ని యితర బ్లాగుల్లోనూ యీ జ్యోతిర్విషయ చర్చల్లో పాల్గొంటూ చాలానే గోల చేస్తున్నారు - విషయం లేని వ్యాఖ్యాలతో. మీరు జ్యోతిష్యం గురించి వ్యాసం వ్రాయటం మానటం మీయిష్టం. (మీ జ్యోతిషవ్యాసప్రయోగం అనేది నేను కమ్మ్యూనిజం గురించి వ్రాయబూనటం లాగే ఉంటుందని నా అనుమానం. మీకు తెలియని జ్యోతిషం గురించి మీరు వ్యాసాలూ పుస్తకాలూ వ్రాయ గలరేమో గాని, నాకు మీకు తెలియని కమ్మ్యూనిజం గురించి నేనలా చేయను) జ్యోతిషపరిజ్ఞానం యేమాత్రం లేనప్పుడు మీతో చర్చించనని చెప్పటం నా ఉద్దేశం. నా బ్లాగులోకి వచ్చే, విషయం లేని వ్యాఖ్యలను నిరోధించే హక్కు నాకుంటుందని మరచిపోవద్దు. అందుచేత మీకు నా బ్లాగుల్లో వ్యాఖ్యానించే అవకాశం దొరకటం అనుమానాస్పదమే.

    ReplyDelete
  20. నాకు జ్యోతిష్య పరిజ్ఞానం లేదని నేను చెప్పలేదే. నాకు తెలియని విషయాల గురించి నేను వ్రాయను. అలా వ్రాసే అలవాటు మీకే ఉంటుందేమో. నేను మాట్లాడితే జ్యోతిష్యులు నోర్పు తెరవలేని నిజాలు బయటకి వస్తాయి. జ్యోతిష్యంలో నాకు అంత పాండిత్యం ఉంది. సమాధానం చెప్పలేనివాళ్ళు "నువ్వు సంబంధం లేని వ్యాఖ్యలు వ్రాస్తున్నావు" అని అనడం పాత స్టైల్. అందుకే పాచిపళ్ళ దాసరి పాటలు ఎందుకు అని అన్నది.

    ReplyDelete
  21. సమాధానం తెలియకపోతే తెలియదు అని చెప్పాలి. "నువ్వు సంబంధం లేని వ్యాఖ్యలు వ్రాస్తున్నావు" అని అంటే అది తప్పించుకునే పిరికితనమే అవుతుంది.

    ReplyDelete
  22. "నమ్మకం అన్నదానికి అర్థం - తార్కికానికి ఆవల ఒక దాన్ని విశ్వసించడం అనుకో వచ్చు."

    నాకెందుకో ఈ డెఫినిషన్ సరి కాదని అనిపిస్తుంది. నా నమ్మకాలకు ఆధారం తర్కం కూడా కావచ్చు కదా. నా తర్కం వాదనలో నిలబడకపోవచ్చు లేదా నేను బయటికి చెప్పుకోకపోవచ్చు కానీ నాకంటూ ఒక తర్కం ఉండే అవకాశం ఎక్కువ.

    ReplyDelete
  23. @Praveen Mandangi:

    "జ్యోతిష్యంలో నాకు అంత పాండిత్యం ఉంది"

    నిజమే కావొచ్చు కానీ మీ పాండిత్యాన్ని మీరే పొగడితే ఎలా? వేరే వారికి కూడా అవకాశం ఇవ్వండి :)

    ReplyDelete
  24. ప్రవీణ్ గారు, విషయం వదలి మాట్లాడుతున్నారని అన్నమాట నిజమే కాని నేను మిమ్మల్ని నిందించి మాట్లాడలేదే? ఎందుకు బెదిరింపులకు, నిందలకు దిగుతారు? మీలాంటి దుడుకువారితో మాట్లాడటానికి మనస్కరించటం లేదంటే మేము పిరికివారమని మరొకనింద. బాగుంది.

    ReplyDelete
  25. మీకు నిజంగా జ్యోతిషంలో అఖండపాండిత్యం ఉండే ఈ జగదీష్ గారి టపా (http://saradaa.blogspot.in/2012/03/1.html) లింక్ ఇచ్చారా? అదెంత అశాస్త్రీయమో నేను సవివరంగా చెప్పాక కూడా! స్వస్తి.

    ReplyDelete
  26. ఈ వ్యాసం చదవండి: http://praveensarma.in/astrology-is-a-three-legged-rabbit

    ReplyDelete
  27. ప్రవీణ్. మహానుభావా! మీ వ్యాసాన్ని చదివాను.

    మీకు పాండిత్యం మాట అటు ఉంచి ప్రాథమిక పరిజ్ఞానం కూడా యేమాత్రం లేదని తెలిసింది.

    నవ్వుకోవాలో జాలిపడాలో తెలియటం లేదు.

    ReplyDelete
  28. సమయం ఎలా కొలుస్తారో తెలియకుండా ముహూర్తం నిర్ణయించే జ్యోతిష్యుల కంటే నా పాండిత్యమే మెరుగులెండి. వరూధిని గారు ఆర్టికల్ వ్రాయమంటే వ్రాసాను కానీ ఏదో ఇంటరెస్ట్ కలిగి వ్రాయలేదు.

    ReplyDelete
  29. And also read this article: http://praveensarma.in/bible-is-a-bowl-of-lies-and-vedic-astrology-i

    ReplyDelete
  30. > సమయం ఎలా కొలుస్తారో తెలియకుండా ముహూర్తం నిర్ణయించే జ్యోతిష్యుల కంటే.....
    సమయం యెలాకొలుస్తారో జ్యోతిష్యులకు తెలియదనుకొనే మీ అజ్ఞానానికి యేం చెప్పాలి?

    ఇక చాలు. మీకు యిష్టమైతే ఒక్ పధ్దతిగా నేర్చుకోండి ముందు.
    ఇకమీద జ్యోతిషం విషయంలో యేమీ తెలియని మీకు జవాబులిస్తూ పోవటం కుదరదు.

    ReplyDelete
  31. మనిషి పై ప్రకృతిలోని ప్రతి అంశం ప్రభావితం చూపుతూనే ఉంటుంది. ప్రకృతికీ మనిషికీ విడదీయరాని సంబంధం ఎప్పటికీ ఉంటుంది.
    ఇందులో ఇప్పటికి మనకు తెలిసింది చాలా అల్పం మాత్రమే .
    తెలియాల్సింది ఎప్పటికీ మిగిలే ఉంటుంది.
    దేనినైనా సరే ఋజువు చేయగలిగేది శాస్త్రం అవుతుంది.
    నమ్మకం ఉంచుకునేది విశ్వాసం అవుతుంది.
    ప్రతి నమ్మకమూ నమ్మకం గానే మిగిలిపోతుంది అని మొండిగా వాదించాల్సిన పనీ లేదు , నిరూపించకుండానే శాస్త్రం అనీ వాదించడమూ తప్పే అవుతుంది.
    ఏదీ శాశ్వత సత్యం కాదు. అసత్యం ఎప్పటికీ సత్యం కాదు.

    ReplyDelete
  32. >>>>>
    భూమి గుండ్రంగా ఉందని మొట్టమొదట ఊహించినది పైథాగొరాస్ శిష్యులు. గ్రహణం సమయంలో చంద్రుని మీద పడే నీడ ఆధారంగా భూమి గుండ్రంగా ఉంటుందని పైథాగొరాస్ శిష్యులు ఊహించారు. కానీ అప్పట్లో గ్రీక్ ప్రజలు ఎవరూ పైథాగొరాస్ శిష్యుల మాటలు నమ్మలేదు. అప్పట్లో ఇజ్రాయెలీయులకి కూడా భూమి గుండ్రంగా ఉందని తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అప్పట్లో విజ్ఞాన శాస్త్రం ఇంకా అభివృద్ధి చెందలేదు. మన దేశంలో ఆర్యభట్టు భూమి గుండ్రంగా ఉందని ఊహించాడు. కానీ అప్పట్లో ఎవరూ ఆర్యభట్టు వాదనని నమ్మి ఉండరు. ఇండియాలోనైనా, గ్రీస్‌లోనైనా, ఇజ్రాయెల్‌లోనైనా సైన్స్‌ని అంతగా అర్థం చేసుకునే స్థాయికి అప్పటి విజ్ఞానం ఎదగలేదు. కానీ మన దేశంలో జ్యోతిష్యులు ఆర్యభట్టు పేరు చెప్పి భూమి గుండ్రంగా ఉందని మన పూర్వికులకి తెలుసు అని వాదిస్తున్నారు. భూమి గుండ్రంగా ఉందని మన పూర్వికులకి తెలిస్తే ఆ విషయం ఇంత కాలం వరకు ప్రజలకి చెప్పకుండా ఎక్కడ గాడిదలు తోలుతూ కాలక్షేపం చేశారు? భూమి గుండ్రంగా ఉంది అని ఆర్యభట్టు లాంటి కొద్ది మంది శాస్త్రవేత్తలు చెప్పిన విషయాన్ని ప్రజలు చాలా కాలం వరకు నమ్మలేదనే కదా దాని అర్థం.
    >>>>>
    భూమి గుండ్రంగా ఉందని మన పూర్వికులకు తెలుసు అని చెప్పి జ్యోతిష్యం శాస్త్రీయం అని నిరూపించడానికి ప్రయత్నించేవాళ్ళు ఉన్నారు. అందుకే ఈ విషయం వ్రాసాను.

    ReplyDelete
  33. భూగోళం అన్న పదం ఎప్పుడూ వినలేదా ప్రవీణ్? వరాహావతారంలో "గుండ్రని" భూమిని తన కోరలపై మోపి పైకి లేపినట్టు ఉంటుంది. పురాణాలు ఈ మధ్య నువ్వో, నేనో రాసినవి కాదుగా.

    ReplyDelete
  34. @Praveen Mandangiగారు
    //కానీ అప్పట్లో ఎవరూ ఆర్యభట్టు వాదనని నమ్మి ఉండరు//& //మన పూర్వికులకి తెలిస్తే ఆ విషయం ఇంత కాలం వరకు ప్రజలకి చెప్పకుండా ఎక్కడ గాడిదలు తోలుతూ కాలక్షేపం చేశారు?//
    మీరు ఏమీ అనుకోకుండా తెవికీలో ఈ వ్యాసం చదవండి..
    http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C_%E0%B0%86%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82
    ఇది తెవికీలో రాసింది నేనే, దానికి సంబంధించిన ఇతర లంకెలు

    http://www.skyscrapercity.com/showthread.php?t=1260661

    //Katas Raj is also the place where Alberuni attempted to measure the circumference of the Earth, studied Sanskrit and wrote his renowned Kitab-ul-Hind (Book of Hind) which depicted the religion, scientific knowledge, and social customs of Hindus//వ్యాసంలో ఈ ముక్క సరిపోతుంది, మీ వాదన తప్పని చెప్పడానికి..
    ఇది వికీలోని అల్-బెరూనీ వ్యాసం..

    http://en.wikipedia.org/wiki/Ab%C5%AB_Ray%E1%B8%A5%C4%81n_al-B%C4%ABr%C5%ABn%C4%AB

    ఎవరకీ తెలియకుండానే, ఎవరికీ చెప్పకుండానే అల్-బెరూనీ భారతీయ విశ్వవిద్యాలయంలో భూమి చుట్టుకొలత ఎలా కనుక్కున్నాడో మరి.???

    ReplyDelete
  35. పైథాగొరాస్ శిష్యుల సూత్రీకరణలని అప్పటి గ్రీక్ ప్రజలు నమ్మలేదు నిజమే. కానీ ఆ సూత్రీకరణలని రికార్డ్ చేసిన skeptics (సంశయవాదులు) కొందరు ఉన్నారు. అందుకే ఆ సూత్రీకరణలు మనకి తెలిశాయి. అటువంటి సంశయవాదులు ఇండియాలోనూ, ఇరాన్‌లోనూ ఉంటారు కదా. సంశయవాదం ఎక్కడైనా ఉంటుంది. సంశయం లేకుండా సత్య శోధన జరగదు కదా.

    ReplyDelete
  36. భూమి కదులుతోంది అని ఆర్యభట్టు చెప్పినప్పుడు బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టుని విమర్శిస్తూ ఇలా అన్నాడు "ఒకవేళ భూమి పశ్చిమం నుంచి తూర్పుకి కదిలితే తూర్పుకి ఎగిరిన పక్షులు పశ్చిమాన వాలుతాయి" అని. అప్పట్లో ఎవరికీ గురుత్వాకర్షణ గురించి తెలియదు కాబట్టి బ్రహ్మగుప్తుడు అలా అనడం విచిత్రం కాదు. సాయింత్రం ఏడు గంటల సమయంలో కనిపించిన నక్షత్రాలు అర్థ రాత్రి పన్నెండు గంటలకి కనిపించవు, అర్థ రాత్రి పన్నెండు గంటలకి కనిపించిన నక్షత్రాలు ఉదయం ఐదు గంటలకి కనిపించవు. భూమి కదులుతోంది అనడానికి అప్పట్లో అదే ఋజువు. కానీ దాన్ని ఋజువుగా అంగీకరించే స్థాయికి అప్పటి ప్రజల జ్ఞానం ఎదిగిందా, లేదా అనేదే ప్రశ్న. ఆర్యభట్టుకి అప్పట్లోనే ఈ సందేహాలు రావడం గొప్పే. సంశయవాదులు ఎప్పుడూ ఉంటారు కనుక అప్పట్లో ఆర్యభట్టు లాంటి సంశయవాదులు ఉండడం కూడా సహజమే అనుకోవాలి. ముందు సంశయం మొదలైన తరువాతే సత్య శోధన మొదలవుతుంది. కనుక ఆర్యభట్టుని మూల పురుషునిగా మాత్రం అంగీకరించవచ్చు.

    ReplyDelete
  37. అంటే మీరు అల్-బెరూనీని సంశయవాదిని చేసేశారన్నమాట..! (సంశయవాదులు అనేది మీరన్నమాటే.. ఇప్పటివరకూ నాకు తెలీదు) లేదా ఆర్యభట్టునికీ, అల్-బెరూనీకి మధ్యనున్నవాళ్లు సంశయవాదులయ్యి ఉండాలి..
    అల్-బెరూనీ పుట్టింది గజినీ(అఫ్ఘనిస్తాన్)లో..చుట్టుకొలత కనుక్కున్నది కటాస్(పాకిస్తాన్)లో..
    ఆర్యభట్టుడు ఎక్కడి వాడు..? ఎప్పటివాడు..? దానిమీద చాలా భేదాభిప్రాయాలున్నాయి.. పుట్టింది కుసుమపురం(పాట్నా)లో.. బతికింది 400-500ప్రాంతంలో (అని ఇప్పటి చరిత్రకారుల ఉద్దేశ్యం).
    అర్యభట్టునికీ- అల్-బెరూనీకి మధ్యలో 500 సంవత్సరాలు తేడా ఉంది. భౌగోళికంగా వందలకొద్దీ కి.మీ తేడా ఉంది. మధ్యలో ఒక్కరికీ తెలియకుండానే, అల్-బెరూనీకి భూమి గుండ్రంగా ఉందని అనిపించిందన్నమాట..! అదే కదా మీ ఉద్దేశ్యం..?

    ఇంకో విషయం, అర్యభట్టుడు భూమి గుండ్రంగా ఉందని ఊహించాడని, అదేదో చాలా గొప్ప విషయమని రాసారు. అర్యభట్టుడు చేసిన వర్కులో, అది సహస్రాంశం ఉంటుందో కూడా అనుమానమే.! అప్పటివరకూ, ఎవ్వరికీ భూగోళం అని తెలీయకుండా ఒక్కడు మధ్యలో వచ్చి అంత వర్కు చేసి చూపెట్టడం., మనుషులకైతే సాధ్యం కాదని నా అభిప్రాయం. అందుకే, అర్యభట్టునికి ముందే భూగోళం అనే పరిభావన ఉందని, చాలామంది అంటారు.

    ReplyDelete
  38. వైదిక జ్యోతిష్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం రచించబడినది. అది ఆర్యభట్టు పుట్టకముందు. సూర్యకేంద్రక సిద్ధాంతం గురించి జ్యోతిష్య శాస్త్ర సృష్టికర్తలకి తెలుసు అని ఇప్పటి జ్యోతిష్యులు అనడం వల్లే కాంట్రోవర్సీ వచ్చింది.

    ReplyDelete
  39. ప్రవీణ్ గారూ..!
    ఇందాకటి వ్యాఖ్యలో//భూమి గుండ్రంగా ఉందని మన పూర్వికులకు తెలుసు అని చెప్పి జ్యోతిష్యం శాస్త్రీయం అని నిరూపించడానికి ప్రయత్నించేవాళ్ళు ఉన్నారు.// అన్నారు. ఇప్పుడేమో //సూర్యకేంద్రక సిద్ధాంతం గురించి జ్యోతిష్య శాస్త్ర సృష్టికర్తలకి తెలుసు అని ఇప్పటి జ్యోతిష్యులు అనడం వల్లే కాంట్రోవర్సీ వచ్చింది.// అంటున్నారు. రెండిటికీ ఎంత తేడా ఉందో నేను చెప్పనవసరం లేదనుకుంటున్నాను.

    అర్యభట్టుడు ముమ్మాటికీ భారతీయుల పూర్వీకుడు, అందునా జ్యోతిష్కుడు కూడానూ..! అందువల్ల, భూమి గుండ్రంగా ఉందని మన పూర్వికులకు తెలుసు అని ఇప్పటి జ్యోతిష్కులు చెప్పడంలో అబద్ధం ఏమీ లేదు.

    అయితే గ్రహాలు, మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయా అనే దగ్గరే వివాదం వస్తోంది. తేడా గుర్తించండి..!

    ReplyDelete
  40. గెలీలియో కూడా తన జీవితంలో కొంత కాలం పాటు జాతకాలని నమ్మేవాడు, కొంత కాలం జాతకాలు చెప్పి డబ్బులు సంపాదించాడు కూడా. ఆర్యభట్టు జ్యోతిష్యాన్ని నమ్మినంతమాత్రాన జ్యోతిష్యం నిజమైపోదు. వైదిక జ్యోతిష్యం 2500-3000 సంవత్సరాల క్రితం రచించబడినది. ఆర్యభట్టుకి సూర్యకేంద్రక సిద్ధాంతం తెలిసినా, భూమి గుండ్రంగా ఉందని తెలిసినా అతను పుట్టకముందు రచించబడిన జ్యోతిష్య శాస్త్రాన్ని అతని పేరుతో క్రెడిట్ చెయ్యలేము.

    ReplyDelete
  41. అప్పట్లో యూరోప్‌లో పాలకవర్గాలవాళ్ళు సైంటిస్ట్‌లకి ఎలాంటి ఆర్థిక సహాయం అందించేవాళ్ళు కాదు. సైంటిస్ట్‌లు కూడా జాతకాలు చెప్పుకుని డబ్బులు సంపాదించేవాళ్ళు. ఇండియాలో కూడా ఆర్యభట్టు, బ్రహ్మగుప్తులు జ్యోతిష్యాన్నే వృత్తిగా స్వీకరించినా అది ఆశ్చర్యకరం కాదు.

    ReplyDelete
  42. ప్రవీణ్ గారూ..!
    మీరు కాస్త సవివరంగా కామెంటి ఉంటే బావుంటుంది. ఎందుకంటే, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోడానికి తల ప్రాణం తోకకొచ్చేస్తోంది.
    //ఆర్యభట్టు జ్యోతిష్యాన్ని నమ్మినంతమాత్రాన జ్యోతిష్యం నిజమైపోదు//
    నిజమని నేననడం లేదు. భూమి గుండ్రంగా ఉందని మన పూర్వికులకు తెలుసు అని ఇప్పటి జ్యోతిష్కులు చెప్పడంలో అబద్ధం ఏమీ లేదు అని మాత్రమే అంటున్నాను.
    ఇహ, //ఆర్యభట్టుకి సూర్యకేంద్రక సిద్ధాంతం తెలిసినా, భూమి గుండ్రంగా ఉందని తెలిసినా అతను పుట్టకముందు రచించబడిన జ్యోతిష్య శాస్త్రాన్ని అతని పేరుతో క్రెడిట్ చెయ్యలేము.//దీని గురించి మాట్లాడితే, అర్యభట్టు ముందు జ్యోతిషం ఉందా లేదా అనేది అనవసరం, ఇప్పటి జ్యోతిష్కులు అర్యభట్టుని సిద్ధాంతాలు వాడుతున్నారా లేదా అనేదే అలోచించండి.
    నాకు తెలిసున్నంతవరకూ అర్యభట్టుని సిద్ధాంతాలు ప్రతీ వైదిక జ్యోతిష్కుడూ వాడతాడు. అందువల్లనే గ్రహణాలు ఏర్పడే సమయాలు, గ్రహాల గమనాలు గురించి ఖచ్ఛితంగా చెప్పగలుగుతున్నారు.

    విషయం ఇప్పటికే చాలా పక్కకి వెళ్లిపోయింది. మీరు మొదట అన్నది//మన పూర్వికులకి తెలిస్తే ఆ విషయం ఇంత కాలం వరకు ప్రజలకి చెప్పకుండా ఎక్కడ గాడిదలు తోలుతూ కాలక్షేపం చేశారు?//అని.
    అది తప్పని చెప్పడానికి మాత్రమే నేను కామెంటడం మొదలుపెట్టాను.
    ఇక్కడితో, ఈ విషయంపైన మీతో వాదనకి స్వస్తి..!
    (నాకు పూర్తిగా అవగాహన లేని విషయాలమీద తెలుసో తెలీకో వాగేసాను. ఎవరైనా పెద్దవారు, తప్పులు సరిదిద్దితే సంతోషిస్తాను.)

    ReplyDelete
  43. Round Earth Theory వేరు, Heliocentric Theory వేరు అని చెప్పినంత వరకు మీరు చెప్పినది నిజమే. కానీ ఇప్పటి జ్యోతిష్యులు ఈ రెండు థియరీలు మన పూర్వికులకి తెలుసు అని చెప్పుకుంటున్నారు. జ్యోతిష్యం గురించి ఇన్నయ్య, రావిపూడి వెంకటాద్రి గార్ల రచనలు చదివాను. ఆ విషయం గురించి నేను మాట్లాడాను. సూర్యకేంద్రక సిద్ధాంతం తమకి తెలుసనీ, మేము కేవలం నమూనా కోసం భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగా చెపుతున్నామనీ ఇన్నయ్య గారితో వాదించిన ఒక జ్యోతిష్యుణ్ణి ఒక టివి చానెల్ కార్యక్రమంలో చూశాను. దాంతో ఇన్నయ్య గారు పుస్తకాలలో వ్రాసినది నిజమే అని అర్థమైంది. అందుకే సూర్యకేంద్రక సిద్ధాంతం జ్యోతిష్యులకి తెలుసా, లేదా అనే విషయం ప్రస్తావించాల్సి వచ్చింది.

    ReplyDelete
  44. రావిపూడి వెంకటాద్రి, పెన్మెత్స సుబ్బరాజు గార్ల పుస్తకాలలోని విషయాలు సేకరించి వ్రాసినప్పుడు నేను ఈ విషయాలు అక్కడి నుంచి సేకరించానని చెప్పకపోవడమే నేను ఇక్కడ నేను చేసిన తప్పు. ఇప్పుడు అసలు విషయాలు ప్రస్తావిస్తున్నాను. ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలలోనూ భూమి బల్లపు పరుపుగా ఉందనీ, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడనీ వ్రాయబడి ఉంది. అప్పట్లో జ్యోతిష్యం వ్రాసినవాళ్ళకి కూడా భూమి గుండ్రంగా ఉందని తెలిసే అవకాశం లేదు అని రావిపూడి వెంకటాద్రి గారు వ్రాసారు. దాని గురించి చెప్పాలనుకున్నాను. జ్యోతిష్యాన్ని విమర్శించే విషయంలో నా అభిప్రాయాలూ, రావిపూడి గారి అభిప్రాయాలు ఒకటే. గతంలో ఆయనకీ, నాకూ మధ్య సైద్ధాంతిక విషయాలలో వాదనలు జరిగాయి. అందువల్ల నేను ఆయన పేరు వ్రాయడానికి ఇష్టపడక ఆయన పేరు గానీ ఆయన రచనల పేరు గానీ ప్రస్తావించకుండా విషయం వ్రాసాను. నేను స్థూలంగా వ్రాయడం వల్ల నేను ఆ విషయాలు రావిపూడి గారి రచనల నుంచి సేకరించానని చదివినవాళ్ళకి అర్థం కాలేదు. అదీ విషయం ఇక్కడ.

    ReplyDelete
  45. ప్రవీణ్ గారు వృత్తి కామెంటర్ కావచ్చును. అతడికి జ్యోతిషంగురించే కాదు దేని గిరించీ సరయైన అవగాహన లేక పోయినా అనంతానంతానంతంగా వ్య్యాఖ్యలు అల్లుకుంటూ పోవటం సరదాకావచ్చు.

    కాని ఆయన అన్ని చర్చలలోనికి ఇలా జొరబడి రొదచేస్తూ ఉంటే మిగిలిన వారి అర్థవంతమైన చర్చలు చేయటానికి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా అనవలసి వస్తున్నందుకు విచారంగా ఉన్నా తప్పటంలేదు.

    కాబట్టి, జిలేబీ గారికి తప్పనిసరి పరిస్థితులకారణంగా సూచన యేమంటే దయచేసి మోడరేట్ చేసి చర్చలను నడపండి. మీకు ఇబ్బడి ముబ్బడిగా కామెంట్లు రావటమే ముఖ్యం అనుకుంటే అది వేరే విషయం - అప్పుడు ఒక్క ప్రవీణ్ చాలు!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      If you saw a heat wave, would you wave back? Ignoring is the best form of depreciation!

      cheers
      zilebi.

      Delete
    2. జిలేబీగారు,

      మీరొక ముఖ్యవిషయం మరచిపోతున్నారు. మిగిలిన వారు సరియైన దిశలో చర్చిస్తున్నా, ఒక్కరి కారణంగా అర్థవంతమైన చర్చ అసాధ్యంగా మారటం బాధాకరం.

      నా కెందుకు వచ్చిన చర్చ అనుకుంటే మంచి ప్రశ్నలకూ నేనూ జవాబు లివ్వటం జరగదు కదా!

      మీ అభిమతం ప్రకారమే కానీయండి. స్వస్తి.

      Delete