Tuesday, March 13, 2012

జ్యోతిష్యం ఒక సైన్స్ అండ్ మేథమేటిక్స్

సైన్సు అన్న పదం ఇరవై శతాబ్దం లో కాకుంటే పంతొమ్మిదవ శతాబ్దం లో వచ్చిన పదం.
అంతకు మునుపు ఫిలోసోఫి.

ఉదాహరణకి - న్యూటన్ పుస్తకం ప్రిన్సిపెల్స్ అఫ్ నేచురల్ ఫిలోసఫి.

ఫిలోసఫి అర్థం తీసుకుంటే- అది లవ్ ఫర్ సం థింగ్.

ఈ అర్థం లో తీసుకుంటే జ్యోతిష్యం ఒక ఫిలోసఫి. సైన్సు. దీన్ని చదివిన వాళ్ళు, చదవడానికి ఉత్సుకత చూపే వాళ్ళు ఓ పాటి జిజ్ఞాస తో - దాని మీద "వ్యామోహం" తో కాకుంటే- సందేహం తో ప్రారంభించి ఓ లాంటి పరిణితి వచ్చిన తరువాయీ దాని వెనుక ఉన్న నిగూఢ అర్థాలని వెలికి తీయడం లో తమ ఇంట్యూషన్ ని వాడడం గమనించ వచ్చు.

జ్యోతిష్యం బాగా తెలిసిన వాళ్ళు - వాళ్ళకే సందేహం వస్తే- జవాబు వెంటనే చెప్పక , కొంత సమయం తీసుకుని వారి కాన్షేన్స్ అనుమతిస్తే - కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం సాధారణం గా గమనించ వచ్చు.

అంటే ఈ జ్యోతిష్యం దాని గణాంక పరిధిని దాటి - తార్కికానికి ఆవల - "దృష్టి" ని సారించి అంటే
డిఫరెంట్ డిమెన్ షన్ లో వెళ్లి కొన్నిటికి సమాధానం చెబుతుంది.

సైన్సు పోకడ ని గమనిస్తే - ఈ కాలపు రెండు శతాబ్దాలలో - చాలా మార్పులతో వేగం గా పరిణితి చెందుతూ వస్తోంది. తాము గ్రహాలని చెప్పిన వె  ఇప్పుడు గ్రహం కాదని అంగీకరించడం దాక అంటే వారి "జ్ఞానం' పెరిగే కొద్దీ మన "విజ్ఞానం" కూడా పెరుగుతోందని అనుకోవచ్చు. (కాకుంటే - "అజ్ఞానం" తరుగుతోందని అని కూడా అనుకోవచ్చు)

కొన్ని శుష్క వాదనలతో సూర్యుడు గ్రహమా అని జ్యోతిష్యం ని ప్రశ్నించే "హేతవాదులని" మనం చూడడం కద్దు.
జ్యోతిష్యం డెవలప్ అయిన కాలానికి వాళ్ళు - దాన్ని గ్రహం గా సంబోధించ వచ్చు అనుకోవచ్చు గదా? మనం విజ్ఞానవంతులం అట్లా అనుకుంటే  మన హేతువాదానికి ధోకా వస్తుంది కాబట్టి మనం ప్రశ్నించాల్సినదే !

క్వాంటం థియరీ పరిణితి చూస్తె- నాటి క్వాంటం మెకానిక్స్ మోడల్ నించి మొదలయ్యి -ఇపుడు క్వాంటం ఫిజిక్స్ మరియు ఆధ్యాత్మికం దాక దాని ప్రతిపాదనలు వ్యాపించి ఉన్నది. (ఈ రెండు వేల ఐదు లో అనుకుంటా ను వచ్చిన  What the bleep do we know మూవీ జనావళికి క్వాంటం ఫిజిక్స్ ని పరిచయం చేసే హాలీవుడ్ చిన్ని ప్రయత్నం).


దీనికి మూల కారణం దాని మీద - ఆ సబ్జెక్ట్ మీద పరిశోధనలు మిక్కిలి గా జరగడమే కారణం. క్వాంటం థియరీ మొదలైన కాలానికి అది సో కాల్డ్ సుడో సైన్సు. ఆ కాలం లో దాన్ని సో కాల్డ్ వైజ్ఞానికుల లోకం లో నే సమర్థించిన వాళ్ళు చాల కొద్ది మంది మాత్రమె.

ఈ నేపధ్యం లో జ్యోతిష్యం తానున్న ఇప్పటి దయనీమయిన పరిస్థితి నించి బయట పడాలంటే -దాని మీద విలక్షణమైన , విశిష్టమైన , నిశితమైన పరిశోధనలు జరగాలి. అప్పుడే దాని వికాసం మనం చూడవచ్చు.

చిన్న ఉదాహరణ - జ్యోతిష్యం లో ని గళ్ళకి అధిపతి గా సూర్యుని నించి మొదల్లయీ శని గ్రహం దాక ఇప్పడు సైన్సు చెప్పే ఆర్డర్ లో  నే ఉండటం కాకతాళీయమా , లేక - వారి కాలానికి వారికి కలిగిన మేధస్సు పరిణితి యా?

జ్యోతిష్యానికంటూ - ఒక నియమం, గణితం ఉన్నది. ఆ గణితం ఒక పార్టు. దాని వెనుక దాని అనాలిసిస్ మరో పార్టు. దాని అన్వయం మరో పార్టు. ఈ అనాలిసిస్ ఎక్కడో బురడా కొట్టి కాల గతి లో వక్ర గతి పట్టి నట్టు ఉంది.

మరో ఉదాహరణ- స్టాక్ మార్కెట్ లో " Derivatives" "futures and options" ఎ ఉద్దేశం లేక ఎ మోడల్ తో future ని "predict" చేస్తూన్నారు? బ్లాక్ షోలే మోడల్ అనండి, వేరే మోడల్ అనండి, కాకుంటి probability theory అనండి - దానికంటూ ఒక అర్థం వాళ్ళు చెప్పుకున్నారు. ఓ మోడల్ కాకుంటే "predictability" ఆపాదించుకున్నారు.

రేపటికి ఏమవుతుందో తెలియని దానికి, ఒక మాడల్ తయారు చేసుకుని ఒక సమీకరణం ప్రతిపాదించడం (ఈ సమీకరణం మన కాలం లోనే ప్రశ్న గా నిలబడడం ఇక్కడ విశేషం) మన కాలానికి మనకు చెందిన మేధో పరిణితి. !


అట్లాగే జ్యోతిష్యానికి కూడా ఒక వ్యాఖ్యానం ఉంది కదా? ఈ జ్యోతిష్యం సైన్సు గా విలక్షణం గా పరిణితి చెందాల వద్దా అన్నది మానవ మేధస్సు మీద ఆధార పడి ఉన్నది. ఎ కొద్దిపాటి ఇచ్చుకత, ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని పరిశోధనలు చెయ్యడమో మాత్రం సరిపోదు. ఇది ఒక యజ్ఞం కాకుంటే ట్రెండ్ కావాలి.

అప్పుడే ఈ సైన్సు కాకుంటే ఫిలాసఫీ కూడా పరిణితి చెంది మన మేధస్సు కి దీటు గా వెలుగొందుతుంది. అప్పుడే దాని వికాసం. కాని ఇందులో ఓ తిరకాసు ఉంది. ఏమిటంటే - ఇందులో ఎలాంటి ధనలాభాలు లేవు.

సో, ఎంతమంది దీనికి టేకర్స్ ఉంటారు? చాల తక్కువ మంది మాత్రమె. అదే దీని ప్రస్తుత పరిస్థితి కి కారణం కూడానేమో ? ఆ కాలం లో రాజులు పోషించారు. ఈ విజ్ఞానం వికసించింది.

ఈ కాలం లో మన గవర్న మెంట్లు, వాటికి దీన్ని పోషించే కాకుంటే వికసింప చేసే ఆసక్తి ఉన్నదా అన్నది సందేహమే.  అదే  అమెరిక వాడు కొద్ది పాటి పరిశోధనలతో(వాడు చెయ్యాలంటే, దీంట్లో వాడికి ఏదైనా లాభం కనిపించాలి !- అది వేరే విషయం!)  - పేటెంట్ చేసాడంటే - వెంటనే - బాస్మతి మాది అన్నట్టు కేసు వెయ్యడానికి వేనుకయ్యం మనం !

కా బట్టి వేచి చూడాల్సిందే !

కాకుంటే- ప్రశ్నా శాస్త్రం క్రింద మనం  ప్రశ్న వేసుకోవచ్చు!

సమాధానం చెప్పగలిగే వాళ్ళు - ( ఈ టపా పోస్ట్ చెయ్యబడ్డ సమయమో- లేక మీరు ఈ టపాని చదివిన సమయో - కాకుంటే - మీరే ఓ ప్రశ్నా సమయాన్ని ఎంచుకోనో, స్థలం బ్లాగ్ లోకం లో మీ బ్లాగ్ అనుకునో!) భాష్యం చెప్పగలరేమో చూడండి!

ప్రశ్న - "జ్యోతిష్యం మరింత పరిణితి చెందుతుందా ? అవదా?


చీర్స్
జిలేబి.
(జిలేబీ why dont you have consisntency?)

25 comments:

  1. Good post and thought provoking

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే శర్మ గారు,

      నెనర్లు మీ ప్రోత్సాహానికి.

      ఈ శీర్షిక మీద మీరిచ్చిన మొదటి కామెంటు ఇంకా పూర్తి కాలేదండోయ్!!


      చీర్స్
      జిలేబి.

      Delete
  2. జిలేబీగారు, మీ నుండి మరొక టపా వస్తుంది జ్యోతిషం మీద అని ఊహించాను. జ్యోతిషం మీద అర్థవంతమైనవి కాక ఆవేశపూరితమైనవి అయిన చర్చలవల్ల ప్రయోజనం శూన్యం.

    నాకు తెలిసి జ్యోతిష్యం మరింత పరిణితి చెందటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్నన్ని పరిశోధనావకాశాలు ముందెన్నడూ లేవు. అయితే అవకాశాలు సద్వినియోగం చేసుకుందుకు సిధ్దంగా ఉన్నామా లేదా అన్నది అస్పష్టం.

    ReplyDelete
    Replies
    1. మరొక్కటి బాకీ ఉందండి మాష్టారు, త్వరలోనే ! ఆ పై ఈ శీర్షిక కి టపా కట్టేస్తా !!

      చీర్స్
      జిలేబి.

      Delete
  3. జిలేబీగారు, ఇప్పటికీ పి.హెచ్‌డి అన్న దాంట్లో ఉన్న మాట ఫిలాసఫీ అనే కదా!

    ReplyDelete
    Replies
    1. అవునండోయ్,

      ఇంకా ఈ ఫిలాసఫీ నడుస్తూనే ఉంది కదా ! మరిచే పోయాను సుమా !

      చీర్స్
      జిలేబి.

      Delete
  4. Philosophy is philos sophos = love of knowledge.

    ReplyDelete
    Replies
    1. ఎస్ ఇండియన్ మినేర్వా గారు,

      absolutely !

      love of knowledge when gets transformed into wisdom then the human has no more to crib about!!

      cheers
      zilebi.

      Delete
  5. I dont think its Science or Math (as in Deterministic stuff). It looks more stochastic and statistical in nature. To that extent, it is scientific. My guess (just a guess) is that the current astrological studies are a result of sampling done over centuries and the quality of the final analysis depends upon the quality of the sample space.

    Unfortunately, nobody has any data about the sample space.

    The major problem is most of the time it says "What is likely to happen" but doesnt explain why. The moment people start thinking "Why", there would be a lot of scope for further research.

    ReplyDelete
    Replies
    1. Bhardwaj gaaru,

      I think you really nailed it on its head like what Jai gottimukkala said.

      Its the 'Why' part that is intriguing really.

      Its like in the modern parlence you have seen a program code and it has so many if else and endifs but you do not why it has so many and not knowing whatfunctionality its covering.

      Thats probably the fate of current status of all the 'rules' of this science( I wish to call it so) that those who know probably try not to go into details or bother to explain rather go into simply accepting them without questioning them. There is no 'Dare to think' attitude except probably some like BV Raman exceptions.

      cheers

      zilebi.

      Delete
  6. జిలేబీ గారూ...
    ఫిలొసోఫె నేచురాలిస్ ప్రిన్సిపియా మేథమెటికా నుంచి క్వాంటం మెకానిక్స్ మీంచి ప్రశ్నా శాస్త్రం వరకూ అన్నింటికీ ముడి పెట్టేశారుగా. :)

    ReplyDelete
    Replies
    1. ఫణీంద్ర గారు,

      'ముడి' వెయ్యడం మాకు దైనందిక చర్య కదండోయ్! చిక్కు తియ్యడం, ముడి వెయ్యడం ఇదే పోద్దస్తమాను ! సో, ఆ కాపబిలిటీ అన్న మాట !!

      చీర్స్
      జిలేబి.

      Delete
  7. Ok... relativity / quantum theory / RelativO-QuantumO theory/ probability/ స్టాక్ మార్కెట్/ మేధస్సు పరిణితి/ ఫిలోసఫి/బాస్మతి ... Akhir E kyaa hai? kyO itnaa tang kar rahaa hai? kyO? kyO?! :((

    /(జిలేబీ why dont you have consisntency?)/ - I think, I got it! Thanks for clue! :P

    ReplyDelete
    Replies
    1. శంకర్ గారు,

      నాకెందుకో డౌటు. ఆ క్లూ ఏమిటో కాస్త నాకూ చెబుదురూ. పుణ్యం వుంటుంది ! నాకే అర్థం కాలే ! మీరు క్లూ అందింది అంటున్నారు ! కాస్త ఈ చెవిన వెయ్యండీ ఆ క్లూ నాకు కూడాను !!

      చీర్స్
      జిలేబి.

      Delete
  8. "ప్రశ్న - "జ్యోతిష్యం మరింత పరిణితి చెందుతుందా ? అవదా?"

    ప్రతీ విషయం పరిణితి కాక తప్పదు. There is no survival without growth.

    దురదృష్టమేమిటంటే నాణానికి రెండు వైపులా ఉన్న వారిలో అత్యధికులు అసలు విషయాన్ని గాలికి వదిలేస్తున్నారు. సూర్యుడు గ్రహం కాదని మాట్లాడే "హేతు"వాదులు దాని స్తితిగతులకు ఈ విషయం అవరోధం కాదనే మాట మర్చిపోతున్నారు. మరో పక్క జ్యోతిష వీరాభిమానులు కొందరు ఎక్స్-రేలని, హైసంబర్గని పెద్ద పెద్ద మాటలతో కుస్తీ పడుతూ, జనాన్ని బోల్తా కొట్టించే శుష్క ప్రయాసాలు చేస్తున్నారు.

    Zilebi, congratulations on stirring the hornests nest. There are atleast 3 response blogs and dozens of comments!

    ReplyDelete
    Replies
    1. జై గొట్టిముక్కల గారు,

      అంతా విష్ణు మాయ. కుజ చంద్ర ప్రభావం ఎక్కుయినప్పుడు ఇట్లాంటి 'అగ్ని' కణాల చర్చా విషయాలు ఎక్కువవు తాయని జ్యోస్యం ! అదే నన్న మాట !

      చీర్స్
      జిలేబి.

      Delete
  9. @Bhardwaj Velamakanni:

    "The moment people start thinking "Why", there would be a lot of scope for further research."

    You hit the nail on its head!

    ReplyDelete
  10. ఈ టపాకు వ్యాఖ్య పెట్టేంత పరిణిత లేదు. మీరు వివరించినతీరు మాత్రం అర్ధవంతంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయీ గారు,

      పోదురు పరిణితి మాట. ఇది జిలేబీ టపాయే కాదండీ !!

      చీర్స్
      జిలేబి.

      Delete
  11. kAdu. nA uddESyaMlO "manaM mariMta pariNati cheMdagalamA lEdA?" anEdi asalaina praSna.

    ReplyDelete
  12. Let us try to understand this "Jyothisha" from a couple of perspectives.
    * People (psychology, society etc.)
    * Pure materialistic perspective
    * Deeper knowledge perspectives (like mathematics, quantum mechanics, string theory etc.)
    * Spirituality perspective

    People
    ======
    It is said in Bhagavadgeeta "there are three kinds of people who seek me":

    ఆర్తో జిజ్ఞాసురర్థార్థీః జ్ఞానేచ భరతర్షభ||

    First are Artah: those feel really helpless and seek his help very badly, like right now. They can use all kinds of help.

    Second are jijnAsuH: those have interest in understanding all possible questions around the subject. These people are usually settled in life, have everything in access and just curious about the subject. They don't want to give up any of their comforts for learning more about the subject.

    The third are JnAnI: they know and understand the subject to one's possible extents. They don't care about the rest of the world, the subject is their world.

    As far I have seen, these three categories are perfectly applicable to "day to day"'s world. So let us take these three and see what the subject means to each.

    Aarta: They are in desperate need of help. They seek and can take any and all "possible" help. For them, they just consider this as either a belief or just a try. They don't really bother whether it really helps them or inner workings of it.

    Here we can see both sides of it: one side there are consultants and the other side are the people who seek them.

    The consultants need to have a living so they try to promote whatever they have. Don't bother about inner workings or don't try to go further in the subject.

    The people who seek, just want to try a stone in the dark. They also don't much worry. They just hear from a neighbor, friend or family member that something worked for them. They just think "what the heck? let me give it a try".

    The bystanders do not fall in this call - almost never.

    JijnAsu: Sort of interesting class. Again two kinds. One is truly interested and seek detail understanding. The other just wants to prove it is wrong and get away with it. If there is a neutral kind, they are either busy with some other subject (less likely) or just happy with their current state (in other words: don't care).

    Most of us are (at least I am) truly interested, have an open mind and try to seek some knowledge. Let me try to understand the subject from all perspectives, get as much information possible and try to analyze, discuss and share our findings.

    The "nay"sayers, have a predetermined mindset and seek some information to prove the subject is wrong. The motivation can be anything from a simple "stand against the crowd" attitude to a more serious "it never worked for me" or a totally extreme "social" reasons. They are outside our context here.

    Interestingly, almost all bystanders are from this category. Nobody who desperately needs help typically tends to refuse to give it a try.

    JnAnI: subject matter experts. Beyond our capabilities of understanding and explanations. They do not participate with us, and they don't care what we think or say.

    More later...

    ReplyDelete
  13. గుత్తిన శ్రీనివాస్ గారు,(పేరు సరిగ్గానే రాసానా?)

    మీరు 'గుత్తిన' కామెంటు సగం విషయవంతం గా ఉన్నది. మిగిలిన వాటిని పంచుకోగలరు. !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  14. నా పేరు సరిగ్గానే వ్రాశారండీ!!!

    నా చిరునామధేయం "వాసు".

    ఇంతకీ "మీరు 'గుత్తిన' కామెంటు సగం విషయవంతం గా ఉన్నది." ని ఎలా చదవుకోమంటారు?

    "కామెంటు సగం" విషయవంతం గా ఉన్నది అనా? లేక కామెంటు "సగం విషయవంతం" గా ఉన్నది అనా?

    ఇదిగో ఇవాళ ఇంకాస్త వ్రాయటానికి ప్రయత్నిస్తాను. కొద్దిగా సమయాభావం (కనీసం అదో వంక) వల్ల వెంటనే వ్రాయలేకపోయను.

    ReplyDelete
  15. నా వ్యాఖ్యలు టపాలను మించిపోతున్నట్లున్నాయి. స్వాధ్యయన ప్రవచనానిచ: వీలైనంత నేర్చుకోవాలని, తెలిసిన కాస్త పంచుకోవాలని ప్రాజ్ఞుల మాట. కానీ మరోపక్క,
    "అయాచితాని దేయాని సర్వద్రవ్యాణి బాలక
    అన్నం విద్యా తథా కన్యాం అనార్థిభ్యోనదీయతే"
    అనికూడా సుభాషితం.


    From a Society's perspective:

    As the society has hierarchy - whatever the people in upper layers say will generally be accepted by others without much resistance. Be it Brahmins in earlier days or doctors, "scientists" or politicians now-a-days.

    As with every subject, the core information and data based on which the subject is built will dilute over time as it spreads out. Only a few truly retain it in full form. Others only exploit it.

    That's is how "jyOthiSa" exists in the society today. With what one knows, one tries to win an easy buck and another tries to gain some respect. On the other side, one tries to gain some easy fame by throwing dirt on it.

    The society, as an entity, attempts to advance only those subjects which it considers important to it in real time.

    It does not typically attempt to advance the subject or at least tries to retain what is presented if it is not having resources at leisure to work on them. It just tries to retain it's social system.

    The current state of our society, as we all know, is to fight for basic necessities in some cases and basic comforts in others. Changed priorities and rapidly changing lifestyles pose a serious challenge on the society's resources to be invested in such low priority topics.

    (If there is any interest, I can touch other perspectives talked in my first comment, too. Writing a line on each is making my comment(s) longer than actual posts. Hope I am not annoying readers and the blogger.)

    ReplyDelete
  16. గుత్తిన శ్రీనివాస్ గారు,

    Its very good that you are sharing your ideas and thoughts on the subject. Most welcome.

    Probably once you have completed can be taken into a post as well , if you wish.

    cheers
    zilebi.

    ReplyDelete