Wednesday, March 14, 2012

జ్యోతిష్యం ఒక కళ !

కళ అంటే మనసుకి విశ్రాంతి ని కలుగ జేసేది. మానసోల్లాసం మానసిక వికాసం. మనసు ఆరాటం తీర్చేది. కాస్త శాంతి, కాస్త ఊరట, కూసింత ఓదార్పు - దానికి పెద్ద లక్ష్యాలంటూ ఉంటె - మానవ సేవయే .

ఏమండి మా అమ్మాయీ వివాహం ఎప్పుడో కాస్తా చూసి చెబ్దురూ  అంటే - దానికే ముంది జిలేబీ గారు,  చూసేద్దాం అని ఊరట ఇచ్చే జ్యోతిష్యులు తరుచు కనబడుతూనే ఉంటారు.

కొద్ది పాటి జ్యోతిష్య జ్ఞానం ఉన్న  వ్యక్తి  కూడా ఈ ఊరట ఓ తల్లి కి ఇవ్వ గలడు - ఆ ఊరట - అమ్మాయి పెళ్లి అవుతుందో లేదో గాని కొన్ని మార్లు విజయం - ఆ సమయానికి ఆ తల్లి ఆరాటం సద్దు మణుగు తుంది.

ఏమండి - మా నాన్న గారు - ఆరోగ్యం బావోలేదు. కాస్త చూడండి జాతకం -

ఏమయ్యా డాక్టర్ గారి దగ్గిరికి వెళ్ళ లేదా?

వెళ్ళా నండి - అయినా కాస్త చూసి చెబుదురూ...

డాక్టర్ చెప్ప లేడా ? లేక డాక్టరు చెప్పే చేదు నిజం జీర్ణించు కోవడానికి మనసు బరువెక్కు వవు తుందా ?

వెస్ట్రన్ వరల్డ్ లో సైకాల జిస్ట్ మాటలతో ఓదార్పు నివ్వడానికి ప్రయత్నిస్తాడు.

మన దేశం లో పెద్దలు కర్మ సిద్ధాంతం తో ఓదార్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

జ్యోతిష్కుడు తాను నేర్చిన విద్య తో జనానికి ఏదైనా ఉపయోగం ఇవ్వగల డేమో  నని చూస్తాడు.

ఇక కుహనా 'జ్ఞానులు - అన్ని ఫీల్డ్స్ లోనూ కుహనా  ఎక్స్పర్ట్లు ఉన్నారు. !

సైకా ల జిస్ట్ ఫెయిల్ అవుతాడు.

మన దేశం లో పెద్దలు ఫెయిల్ అవుతారు.

జ్యోతిష్కుడు కూడా ఫెయిల్ అవుతాడు.

ఎందుకంటే సక్సెస్ ఫైలూర్ డెఫినిషన్ మనం ఆపాదించుకున్న వి. ఒక పరిధి దాటి ఎవరి చేతిలోనూ ఏదీ లేదు. పై పెచ్చు 'మరణం - the great leveler' అంతు బట్టని నిత్య సత్యం. జీవనం లో కాలవాహిని లో పరమ సత్యం.

ఓ డైరెక్టరు సదుద్దేశం తో, ప్రజలకి మంచి ని తెలపాలని, దేవస్థానం   అన్న పిక్చర్ తీస్తాడు, విశ్వనాథ్, ఎస్పీబీ లాంటి గొప్ప కాంబినేషన్ తో తీస్తాడు,  - జనాలకి ఓ పాటి వినోదాన్ని కలిగిస్తుందేమో చూద్దామని .

ప్రజలకి నచ్చదు పిక్చర్ ఫ్లాప్. ఉద్దేశం మంచిది. ప్రయత్నం కూడా పూర్ణత్వం తో చేసినది. కాని ఫలితం శూన్యం.

దీన్ని ఫైల్యూర్ అంటామా? 

ఇది ఇరవై ఒకటవ శతాబ్దపు పిక్చర్ కానే కాదు. కాక పోవచ్చు. ఇరవై రెండో శతాబ్దపు పిక్చర్ ఈ తరం లో తీస్తే - దాన్ని ఆస్వాదన ఈ తరం వాళ్ళ కి కుదురు తూందా?


ప్రతి ఒక్క వ్యక్తీ తనదైన పరిధిలో - ఈ జీవిత నౌక ని సాగిస్తూ దానితో బాటు మరి కొందరికి సహాయం చేద్దామనే చూస్తాడు.

ఆ ప్రయత్నం లో - కళ ఒక ప్రక్రియ . ఉద్దేశం మంచిదే. సదుద్దేశం. దాని ప్రయత్నం కొన్ని మార్లు సఫలం మరి కొన్ని మార్లు అసఫలం - కాకుంటే - జనాల భాషలో దైవ నిర్ణయం.

ఎంత గొప్ప జ్యోతిష్కుడైనా , మానవ సత్సంబంధాల వద్దకి వచ్చే టప్పుటికి జ్ఞానం కన్నా విచక్షణ కే ప్రధాన పీట వేస్తాడు.

"ఏమోయ్ జిలేబీ, రేపే నువ్వు టపా కట్టేస్తావ్ " అని ఎ జ్యోతిష్కుడూ ఎంత ఖచ్చితం గా తెలిసినా చెప్పడు. చెప్పలేడు. అది ఆతని విచక్షణ. "దైవాన్ని ప్రార్ధించండీ" అనో, కాకుంటే, "ఈ శాంతి చేసి చూడండి" అనో, కాకుంటే, "ఓ ఆర్నెల్ల తరువాయి జాతకం చూద్దమండీ " అనో దాటు వేస్తాడు. అది మన పరిభాష లో - 'హి హి ఈ జ్యోతిష్కుడు శుంట "!

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం !


చీర్స్
జిలేబి
(జిలేబీ so finally are you done or not ?)

9 comments:

  1. మొదటి రోజు నమ్మకం...
    రెండో రోజు సైన్సూ, మేథ్సూ...
    మూడో రోజు కళ...

    మూడు ముళ్ళూ పూర్తి చేసేశారు. కూజా చంద్రుడు ఏమంటున్నాడో ఒక్క ముక్కలో చెబుదురూ... ప్లీజ్ :)

    దేవస్థానం విడుదల అయిందా? అవునా?

    భ్రూయాత్ కాదు బ్రూయాత్.

    ReplyDelete
  2. పురాణ పండ వారు,

    నెనర్లు. సవరణ లకి .

    దేవస్థానం ఇంకా వెలువడ లేదా ? అయితే వాక్కు అప్రతిహత మగు గాక !

    ఇక కుజ చంద్రుల గురించి నాకు ఒక్క ముక్కా తెలియదండీ. ( ఏమీ తెలియకుండా నే ఈ పాటి టపా 'కట్టారా' అనమాకండీ, అంతా 'ఫైళ్ళు' రాసి రాసి గవర్నమెంటు వారికి మెమో లు రాసి రాసి రిటైర్ మెంటు రోజుల్లో ఈ పాటి మెమోలు రాసు కుంటున్న వారం !!!)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  3. It is one way to interpret the phenomenon of Astrology; moreso in defining the ecology around it. But is a science without doubt. Waiting for the weekend leisure to publish my third article.

    ReplyDelete
    Replies
    1. Waiting for that తెలుగు భావాలు గారు.

      చీర్స్
      జిలేబి.

      Delete
  4. జిలేబీగారు,
    జ్యోతిషం ఒక శాస్త్రమో, కళయో, నమ్మకమో, కాలక్షేపమో యేదన్నా కానివ్వండి.
    ఒక జ్యోతిషసంబంధ మయిన బ్లాగు తెరచే ఉద్దేశం కలుగుతోంది. ఆలోచన అయితే కలిగింది గాని, దాని రూపురేఖలూ నిర్వహణా విధివిధానాలపైన యింకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. మొన్న 'తెలుగు భావాలు' గారి బ్లాగులో వ్యాఖ్యానిస్తూ దీనిని ప్రస్తావించాను. త్వరలోనే తగిన విధంగా ప్రారంభించాలని యోచిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం మాష్టారు,

      శుభమస్తు !

      జిలేబి.

      Delete
  5. చివరికేమి చెబుతారో చూడాలని ఉంది.

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      కథా కాలక్షేపం అయి పోయిమ్డండీ ! చివరికేమీ లేదు !

      చీర్స్
      జిలేబి.

      Delete
  6. అయ్యో! ఇంకా ఏదో చెబుతారని కూచున్నా.

    ReplyDelete