Sunday, March 18, 2012

సీ బ్లా సం వర్సెస్ జూ బ్లా సం వెరసి మనోల్లాసం !

 అప్పటిదాక కునుకు తీస్తున్న జిలేబీ గారు ఉలిక్కి బడ్డారు !

సీ బ్లా సం వారు పిలుపిచ్చారు ,

తెలుగు బ్లా స రీ స రు లారా , వెంటనే మీ నిద్రని వదలండి . మీరు ఈ అంతర్జాలం లో బ్లాగ్ లోకం లో ఏమి జరుగు తున్నదో ఒక్క సారి గమనించండి అని.

ఏ పనీ పాటా లేని సాదా సీదా బ్లాగ్ జీవితం గడిపేసు కుంటూ, టీం పాస్ టైం పాస్ చేస్తున్న జిలేబీ కి సందేహం వచ్చింది.

ఈ బ్లాగ్ లోకం లో తను ఓ మూడు సవత్సరాల పై చిలుకు కాలం వెళ్ళ బుచ్చు తోంది. తాను సీ బ్లా నా లేక జూ బ్లా నా అని !

అబ్బే మరీ రేటైరేడ్ వాళ్ళం కాబట్టి సీ బ్లా సం తరపున మనమూ ఒక వకాల్తా పుచ్చు కుని ఆయ్ ఈ జూ బ్లా వాళ్ళు మన లోకాన్ని 'వుడేలు' మని పిస్తున్నారహో అని వారి తో బాటు ఓ ముర్దాబాద్ ముర్దాబాద్ చేద్దారి అని.

అంతలోనే పుటుక్కున మరో జూ బ్లా సం సో రుడు ఒక్కండు, ఓ ఫైరింగ్ షాట్,  గన్స్ ఆఫ్ నావేరోన్ లాగా గన్స్ ఆఫ్ బ్లాగ్స్పాట్ ఇచ్చాడు, " జూ బ్లా , లారా , అందరూ అట్టెన్షన్ ఇది మన మీద కుట్ర చేస్తున్న సీ బ్లా సం వారి 'ఉమ్మడి ' ప్రయత్నం ! దీనిని మనం వేరులోనే తుదముట్టించాలి' అని ' తెలుగు బ్లాగు వీర లేవరా , దీక్ష బూని సాగరా,  ఫ్యూచర్ నీదేరా, కదం తొక్కి పాడరా, ఈ బ్లాగ్ లోకం మనదే నని !

అయ్య బాబోయ్, ఏదో రిటైర్ అయిపోయిన వాళ్ళ మని సీ బ్లా సం వైపు మొగ్గితే ఎట్లా, ఈ బ్లాగ్ లోకం లో మనం ఎల్లప్పుడూ ఎవర్ ఫ్రెష్ 'గ్రీన్' హీరోయిన్' గా వుండ వలె నంటే మనం జూ బ్లా సం వైపు మొగ్గాలి కదా అన్న సందేహం వచ్చే.

ఎంతైనా రాబోయే కాలం జనాలు గత కాలపు జనాలకన్నా మరీ తెలివైన వాళ్ళు కదా ! కాబట్టి చడీ చప్పుడు చెయ్యక మనం జూ బ్లా సం కే ఓటేద్దా మని అనుకున్నా.

ఎంతైనా , మనం రాసే రాతలు కొంత కాలానికి ఎట్లాగు ఏ హార్డ్ వేర్ లోపలో గప్పు 'చిప్పు' గా కాల వాహిని లో కలిసి పోతుంది. అసలు మనం రాసే రాతలకి కాల గతి లో ఏదైనా గుర్తింపు వుంటుందా అని సందేహమే !అట్లాంటి ది , ఏదో వీలైతే చదువుతాం, లేకుంటే 'టపా' కట్టేద్దారి ' అని వెళ్లి పోదాము 'గప్పు' మని !

చీర్స్
జిలేబి.

26 comments:

 1. "అసలు మనం రాసే రాతలకి కాల గతి లో ఏదైనా గుర్తింపు వుంటుందా అని సందేహమే !"

  జిలేబీ గారూ .. మీ మాటే నా మాట కూడా అండీ..
  యద్దనపూడి, యండమూరి కూడా ఇంతగా కొట్టుకున్నారో లేదో రచనల్లో గుర్తింపు కోసం..

  ReplyDelete
  Replies
  1. రాజి గారు,

   అంతే అంతే ! రాస్తాం, ఆ పై పబ్లిష్ చేస్తాం, ఆ పై చదవడం, చదవక పోవడం అంతా మన చేతుల్లో లేవు. మేటరు ఉంటె మన్నిక. లేకుంటే 'చాలిక'! అంతే.

   చీర్స్
   జిలేబి.

   Delete
 2. :))

  నేను సీనియర్రూ కాదూ జూనియర్రూ కాదూ!

  ReplyDelete
  Replies
  1. శ్రీ శరత్తు వారు,

   మీకేమండీ తక్కువ ! ఎవర్ 'గే' హీరో హీరో గారు మీరు. సీ, జూ మతలబు అస్సలు లేదు !

   చీర్స్
   జిలేబి. (వామ్మో వామ్మో, జిలేబీ, ఇంతలా మాటేసి అంటారా, ఇదే వచ్చే మీ పై జగడం కి అని శరత్తు వారు రాబోయే మునుపే పారిపో జిలేబీ!)

   Delete
 3. అగ్గిపుల్ల స్వామి అంశ మీరు :))))))
  నేను అయితే పెద్ద వాళ్ళలో చిన్న - చిన్న వాళ్ళలో పెద్ద.
  ..వెరసీ... తామరాకు పై నీటి బొట్టు.

  ReplyDelete
  Replies
  1. వనజ వన మాలీ గారు,

   అంతే అగ్రిగేటర్ వెబ్సైటు పై అతకని బ్లాగు టపా !!

   ఎవర్ ఫ్రెష్ అండ్ ఎవర్ యంగ్ అండ్ జూ...


   చీర్స్
   జిలేబి.

   Delete
 4. చాప చుట్టేసి చంకని పెట్టుకుపోతే ఏగోలా లేదుకదా!!! జై జై జై చాప చుట్టు సంఘానికీ!

  ReplyDelete
  Replies
  1. కష్టే ఫలే మాష్టారు,

   జై జై జై - త్రీ చీర్స్ మాష్టారు.

   చీర్స్
   జిలేబి.

   Delete
 5. జిలేబి గారు నేనూ మూడేళ్ళ క్రితమే బ్లాగ్ ప్రారంభించా.. మన వల్ల కాదని రెండేళ్ళు వదిలేసి సరిగ్గా ఏడాది క్రితం మళ్లీ మొదలు పెట్టా.. ఇప్పుడు నేనూ జూనియరా? సీనియరా ? తేల్చి చెప్పండి

  ReplyDelete
  Replies
  1. బుద్ధా మురళి గారు,

   మీరు 'retyred' సీ అండి, ఇప్పటి ఎప్పటి జూ బ్లా సం వారండీ

   చీర్స్
   జిలేబి.

   Delete
  2. ahmisaran garikemo ఇక్కడికి అంతా జూనియర్స్ వస్తారు అన్నారు .. ఆ పైన నాకు సమాధానం చెప్పిన దానిలో నేమో మీరు 'retyred' సీ అండి, అన్నారు . నాకు అంతా కన్ఫుజ్ గా ఉంది ఇంతకు నేను ఎవరిని ?

   Delete
  3. ఇదిగో నండీ బుద్ధా వారు,

   నేను ఎవరినీ అని ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేస్తున్నారంటే, ఇది జ్ఞాన సింధువు మీ కు త్రుటిలో దర్శనం కాగలదన్న దానికి చిహ్నం అన్నమాట. (శ్రీ రమణ మహర్షి గారి పంధా లో మీరు ఆల్రెడి పరిణితి చెందిన వారి వున్నారని అర్హ్తమన్న మాట ! బుద్ధ అని కూడా ఓంకారం చుట్టారు మురళి కి !)

   చీర్స్
   జిలేబి.

   Delete
 6. ఇంతకీ నేను ఏ బ్లాగర్ని? జూ.. ? సీ..?
  ఎవరన్నా చెప్పుడి !!

  ReplyDelete
  Replies
  1. శరణ్ గారు,

   ఈ బ్లాగు కి స్వాగతం. ఇక్కడ వచ్చేవరంతా జూ బ్లా సం వారే నండీ !

   చీర్స్
   జిలేబి.

   Delete
 7. లిపిలేనిభాష గారు.. యెవరినివారు తెలుసుకొనుడు మహత్తర విద్య నేర్చుకొని ఉండవలె! అయినా అడిగినారు కనుక నా నోరు ఊరుకొనక చేతికి పని చెపుతున్నాను. విషయాలు చెప్పడంలో ఘనాపాఠి.కాల పరిగణాన జూ.. అనుకొవాలెమో! మీతో పాటి నేను కూడాను.. జూ..నే ! ఆ దైర్యం తోడనే జూ..అనుట సాహసించితిని.

  ReplyDelete
  Replies
  1. వనజ వనమాలీ గారు,

   కరెక్టు గా చెప్పేరు

   Delete
 8. కొంపదీసి దీన్ని సీనియారిటీ వెర్సస్ మెరిట్ టైప్ గొడవ కానీ చేయదలచుకున్నారా?

  ReplyDelete
  Replies
  1. పురాణ పండ వారు,

   అదీ చేసేద్దాం ! మరో 'గోడౌన్! డౌన్ డౌన్ !

   చీర్స్
   జిలేబి.

   Delete
 9. నిజమే నండి, మిక్చర్ బండి వాళ్ళం, తెనుగు సరిగా చదవను రాయనూ కూడా రాని వాళ్ళం బ్లాగులు రాసేస్తున్నాం. ఇంతకీ మేము ఉండచ్చా, పోవాలో తేల్చి చెప్పెయ్యండి.

  ReplyDelete
  Replies
  1. కష్టే ఫలే వారు,

   మిక్చర్ పొట్లం కాగితాలలోనే కథలకి మేటరు వుంటుందని శ్రీ శ్రీ గారి ఉవాచ!

   కాబట్టి మిక్చర్ బండి వాళ్ళు ఖచ్చితం గా ఉండ వలసినదే !

   చీర్స్
   జిలేబి.

   Delete
 10. కష్టేఫలే శర్మ గారు..మీరు సుప్రభాతమునే సరి యగు సమయముగ తలచి మంచిగ సంతోషముగా బ్లాగ్ వ్రాసుకొనుదూ. అలా వ్రాయుటకు అభీష్టమే అర్హత..అని చెప్పుటయే ఉద్దేశ్యం. సీనియర్ బ్లాగర్ లు మన గురువులు. తెలుగులో బ్లాగులు వ్రాయడం యెలా..అని పుస్తకం అచ్చు వేయించి ప్రోత్సహిస్తున్నారు. యెవరో ఏదో అన్నారని అందరిని ఒకేగాట కట్టేయడం సబబు కాదు. జూ& సీ బేదం వలదు అని చెప్పడం మాత్రమే!

  @పురాణపండ ఫణి గారు.. చిన్న వాడు గట్టివాడు అని మెచ్చుకుంటే తప్పా..అండి? (వివాదాలు వద్దండీ!తెల్లారి లేస్తే సంకలినిలల్లొ ముఖాలు చూసుకునేవారం బ్లాగ్ వారలం)

  ReplyDelete
 11. వనజ వనమాలీ గారు,

  అంతే అంతే! అందరం 'blossom' అవుతాము. ! ఒకే బ్లా సం ! అంతే అన్న మాట నో సీ నో జూ. ఒన్ అండ్ ఓన్లీ బ్లాస్సం! అండ్ హ్యాండ్ సం !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 12. :-(
  మనల్ని మనం విడగొట్టుకోవద్దండీ ప్లీజ్ .. మనందరం తె.బ్లా.సం వాళ్ళం సరేనా..

  ReplyDelete
  Replies
  1. సాయి కుమార్ గారు,

   అట్లాగే నండీ !

   చీర్స్
   జిలేబి.

   Delete
 13. జిలేబి గారు, ఎప్పుడో వచ్చి అప్పుడప్పుడూ తొంగి చూసే, పొస్టుల పస కూడా తక్కువే అయిన నేనొ:( ఈ రెండు చుక్కలు, అర సున్నా మీకు నచ్చదు కదూ:)

  ReplyDelete
 14. జయ గారు,

  మీరు ఎవర్ బ్లాస్సమింగ్ వారండి !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete