Tuesday, March 27, 2012

విడాకుల పర్వం లో పిడకల వేట !

పిడకలు అగ్గి పెట్టడానికి బాగా పనికి వస్తాయి.

అవీ, మా బాగా ఈ ఎండా కాలం లో ఎండిన పిడకలైతే, మరీ బాగు ! సర్రుమని రాజు కుంటాయి. కొంత నిప్పెడితే చాలు.

పూర్వ కాలం లో (హమ్మో అంత లోపలే పూర్వ కాలం అయిపోయే!) పిడకలతో అగ్గి బెట్టి, వంట కి , వేన్నీళ్ళు కాచుకోవడానికి చేసుకునేవారు (ట) !

మా బామ్మ కి పెళ్ళయ్యే నాటికి , పదేళ్ళు లోపు.

మా అమ్మగారి కాలానికి పదిహేను.

మా కాలానికి ముచ్చట గా, స్వీట్ సిక్స్టీన్ కాక పోయినా, గవర్నమెంటు వారి లెక్కల ప్రకారం పద్దెనిమిది దాటేక !

మా తరం తరువాయి 'ఇప్పత్తైదు' !

ఇప్పుడు థ్రిల్లింగ్ థర్టీ ప్లస్ !

ఇంకా కొంత ముందు కెడితే, మా బామ్మ , బామ్మ అయిన నాటికి, అమ్మాయి పెళ్లీడు కొచ్చును !

సో, ఈ మారుతున్న కాలం లో లేటు 'మ్యారేజీలు ' విడాకుల కి మూల కారణాలా ?

రెండు, మా బామ్మ చదివింది లేదు.

మా అమ్మ మూడో ఫారం .

మా తరం డిగ్రీ (కాఫీ!)

ఈ తరం హాయ్ టెక్ చదువులు !

రాబోయే తరం హాయ్ హాయ్ టెక్ చదువులు

పెరిగిన చదువులకి , విడాకుల సంఖ్యా జోరు కి 'అణు' బాంధవ్యం  ఏమిటే ?

మూడు,

మా బామ్మ 'ఫైనాన్సియల్' జీరో.

మా అమ్మగారి 'ఫైనాన్సు' అయ్య గారి బొక్కసం మేనేజ్ మెంటు మాత్రమె

మా కాలానికి, చేతుల్లో డబ్బులు ! (జాకెట్లలో పర్సులు అని చెప్పాలి కామోసు !)

ఈ కాలానికి, వానిటీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు 'హాయ్ టేక్' ఉద్యోగాలు !

రాబోయే కాలానికి మరీ జూమింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడం !


సో, ఈ మారుతున్న కాలం లో 'లేటు మ్యారేజీలు ' విడాకుల కి మూల కారణాలా ?

పెరిగిన చదువులకి , విడాకుల సంఖ్యా జోరు కి 'అణు' బాంధవ్యం  ఏమిటే ?

పెరిగిన సో కాల్డ్, 'ఫ్రీడం' కి , విడాకుల సంఖ్యా జోరు కి 'అనుమాన' బాంధవ్యం  ఏమిటే ?


మూడు ప్రశ్నలతో పిడకల వేట మొదలు !


జిలేబి.

22 comments:

  1. కారణాలు ఏవేనీ కానివ్వండి! పూర్తి విడాకులు లేదా పాక్షిక విడాకులు తీసుకొనేవారు బాగానే ఉంటారు. (పాక్షిక విడాకులు అంటే నా ఉద్దేశ్యం - విడాకులు తీసుకోకపోయినా, విడిపోయి ఉండడం) ఎటొచ్చీ, వారి సంతానం పడే నరక యాతన వర్ణనాతీతం. మూడూ నాలుగేళ్ళు నిండని పిల్లలకు గొడవ ఏమిటో అర్థం కాదు. కానీ తల్లిదండ్రులు కలిసి ఉండరు. పాపం - వారు ఎవరికి చెప్పుకుంటారు? ఏమని చెప్పుకుంటారు?

    నాకు తోచినంతమటుకు - ముఖ్య కారణం "విలువలు". కొత్తగా అబ్బినవీ - ఈ కాలంలో కోల్పోతున్నవీను.

    ReplyDelete
  2. జిలేబీలు ఇలాంటి చేదు నిజాలు చెప్పకూడదు. పిడకలకీ, అణు విద్యుత్తు కీ ఎంత తేడా వుందో, పాత కాలం పెళ్ళిళ్ళకీ, ఇప్పటి పెళ్ళిళ్ళకీ తేడాలు వుంటున్నాయి. పూర్వ కాలంలో అమ్మాయిలకి అందం, సంగీతం, వంటా, నృత్యమూ.. కుట్లూ, అల్లికలూ, వొడియాలు పెట్టడం వగైరాలు వచ్చి వుండాలి. ఇప్పుడు అమ్మాయిలకి, అందం, డిగ్రీ, మాంచి కత్తి లాంటి హైటెక్కు ఉద్యోగం, ప్లస్ ఒక 'ల' కారమో 'కొ' కారమో కట్నమూ (స్థాయిని బట్టి), ఫ్లాట్లూ, ఫాషన్ పోకడలూ, వంటా, వ్యాపకాలూ అన్నీ వుండాలి! పిల్లనీ కనాలి, ఉద్యోగమూ చెయ్యాలి. మొగవాళ్ళ రోల్ ఎంత మారిందో గానీ, ఆడవాళ్ళకి రెండు వైపులా వాయింపు ఎక్కువవుతుంది. ఆర్ధిక స్వాతంత్ర్యం వల్ల విడాకులెక్కువవుతున్నాయో, మరి మగవాళ్ళ లాంటి ఎవల్యూషన్ లేని స్పీషీస్ తో ఎప్పటికీ ఎవల్యూట్ అవుతూనే వస్తున్న ఆడ స్పీషీ కీ, తేడాల వల్ల విడాకులు ఎక్కువవుతున్నాయో, దేవుడికే తెలియాలి.

    ReplyDelete
  3. సుజాత గారూ ... నాకూ తెలియదు..... దహా

    ReplyDelete
  4. సుజాత గారి మాటే నా మాట కూడాను.

    ReplyDelete
  5. Curious to know why Mrs.Sujatha hates men. But men have already enough evolved long long ago. There is nothing left in the process for them as this sophisticated civilization developed by them amply testifies. Women have started just now and they are bowled over by their new-found little freedom.

    ReplyDelete
  6. మ్యారేజీ అంటేనే ఇద్దరు కలిసి ఉండడం. అలాంటప్పుడు ఎవరు ఒప్పుకున్నా, కోక-పోయినా ఒకరి ఆధిక్యం ఉంటుంది. పెళ్ళి అంటే "సమ-యోగం" అనుకునే తుప్పు పట్టిన పాత భావాల (:)) తలదన్నే వైయక్తిక ఆధిక్య భావాలు ముదిరే కొద్దీ విడాకులు పెరుగుతూనే ఉంటాయి. అందుకే ఈ గోలలన్నీ దేనికి... సహజీవనాలో, స్వలింగ సంబంధాలో పెట్టుకుంటే సరిపోతుందన్న భావనలూ ముదురుతున్నాయి. ఇంకా పెళ్ళీ పెళ్ళీ అని పట్టుకు పీకులాడతారేంటి జిలేబీ... :(

    ReplyDelete
  7. పెళ్లి చేసుకుందాం అని ఆలోచిస్తుంటే ఈ విడాకుల గోల ఏమిటిబాబోయ్... ఒకటి మాత్రం నిజం ఇన్ని చెప్పుతారు కాని.. బాగా ఉన్న అబ్బాయి మాములు అమ్మాయి చేసుకుంటాడు కాని.. బాగా ఉన్న అమ్మాయి మాములు అబ్బాయిని టచ్ కూడా చేయరు.. కనీసం సమానంగా ఉన్న అబ్బాయిని చేసుకుంటే కలిసి ఉండే వాళ్ళు తక్కువా సో నేను చెప్పేది ఏమిటి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న థింకింగ్ కూడా మారాలి.. సైకిల్ వాడు కారు.. కారు వాడు విమానం ఇలా థింక్ లేకపోతె అంత హ్యాపీ నే... ఎదిగినకొద్దీ ఒదగమనీ అన్నారు పెద్దలు కాని ఈ తరం విడాకులు అంట్టున్నారు

    ReplyDelete
  8. *మరి మగవాళ్ళ లాంటి ఎవల్యూషన్ లేని స్పీషీస్ తో ఎప్పటికీ ఎవల్యూట్ అవుతూనే వస్తున్న ఆడ స్పీషీ కీ,*

    ఎవల్యూషన్ అని మీరు ఎమనుకొంట్టున్నారో, అది మగవారి వలననే జరిగింది ! వారి స్థాయిని అందుకోవాలని ప్రయత్నించిన కొందరు మహిళలు, మొదటి తరంలోనే చేతులు ఎత్తేయటమే కాకుండా, ఇంకా ఆరోపణలు చేస్తున్నారు. మగవారిని సాహిత్యం పేరుతో, కొత్త పదాలతో ఆడిపోసుకోవటమే మీ దృష్ట్టిలో ఆడ స్పీషీస్ సాధించిన గొప్ప ఎవల్యూషన్ లాగా ఉంది.

    Please read this

    ఈ నాటి కుటుంబ వ్యవస్థ మగవాళ్ళ కి వరమా? శాపమా?
    http://wp.me/pGX4s-wI


    *ప్లస్ ఒక 'ల' కారమో 'కొ' కారమో కట్నమూ (స్థాయిని బట్టి), ఫ్లాట్లూ ...*

    అంత కట్నం ఇచ్చి పైస్థాయి వారినే పెళ్లి చేసుకొవాలను కునే బదులుగా తమకన్నా తక్కువస్థాయి వారిని పెళ్లి చేసుకొవచ్చుగా? ఉద్యోగం లేని మగవారినో లేక తమకన్నా తక్కువ స్థాయిలో ఉండే మగవారినో ఎందుకు పేళ్లి చేసుకొవాలనుకోరు. మీలో వచ్చిన మార్పు ఎంత?

    ReplyDelete
  9. @సుజాతా గారు,
    మగవారి ఎవల్యుషన్ లేకపోతే మీరు ఈ చదువులు చదివి, ఉద్యోగాం చేసేవారు కాదు. మిమ్మల్ని చదువు చదివించిన మీ నాన్న మొదలు కొని, మీరు చదివిన పుస్తకాలలో రచయిత, కవులు, శాస్రవేత్తలు అంతా 98% మగవారే. ఇప్పటికైనా ఎవరు మొదట "ఎవల్యుషన్" స్పీషీస్ , ఎవరు "ఇల్యుషన్" స్పీషీస్ తెలుసుకోండి. ఇన్నాళ్లు ఇల్యుషన్ లో ఉంట్టూ, మగవారితో చదువుకొని పోటిపడగల మనుకొన్న వారికి ఇప్పటికైనా వారి గురించి వాస్తవం అర్థమైతే చాలు.

    ReplyDelete
  10. *బాగా ఉన్న అమ్మాయి మాములు అబ్బాయిని టచ్ కూడా చేయరు.కనీసం సమానంగా ఉన్న అబ్బాయిని చేసుకుంటే కలిసి ఉండే ...*

    ఈ మాత్రం అర్థం కాలేదా,కష్ట్టపడకుండా పెళ్లి పేరుతో తమ కన్నా పైస్థాయికి ఎదగాలని, మగ ఇంటి వారి పేరు ప్రఖ్యతులు, సంపదలో భాగం మవ్వాలని ఆశిస్తారు. వాస్తవమేమీటంటే మనిషి జీవితంలో కష్ట్టపడినంత మాత్రాన ఎక్కువ డబ్బులు సంపదిస్తాడని గేరంటి ఎమీ లేదు. ఈ సంగతి మగవారి కన్నా ఆడవారికి,వారి కుటుంబసభ్యులకి చాలా బాగా తెలుసు. అందుకనే పెళ్లికి ముందే తమ కన్నా పైస్థాయి వాడిని చేసుకొంటే, ఆ తరువాత అతను సంపాదించేది అదనపు బోనస్ లాంటిది.

    ReplyDelete
  11. సమభావం పెంచుకోలేకపోతున్నారు.

    ReplyDelete
  12. శ్రీనివాస్ గారు.. చాలా చక్కగా మీ అభిప్రాయం చెపుతున్నారు. మీ ప్రొఫైల్ మాత్రం రహస్యంగా ఉంది సరే అభిప్రాయం చెప్పడానికి వివరాలు ఇవ్వవలసిన అవసరం లేదనుకోండి.

    నిజంగా మీరన్నట్లు మహిళ ల చదువుల పట్ల,ఉద్యోగాలు చేయడం పట్ల పురుషుల సహకారం ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అదే కుటుంబంలో మగవారు భార్యల పట్ల చూపే అనుచిత ప్రవర్తన బాహ్యంగా తెలియకపోవచ్చును కదా! ఒక పురుషుడు..అక్క చెల్లెళ్లకి ,బిడ్డకి ఇచ్చిన ప్రోత్సాహం,సహకారం భార్యకి ఇవ్వగలడా? సమస్య అక్కడ ఉందని ఉంటుందని మీరు ఎందుకు అనుకోరు? ఆడవాళ్ళు ఊరికే మగవాళ్ళని ఆడి పోసుకుంటున్నారు అనుకుంటారు.

    మగవారు యెంత ఆస్తిపాస్తులు ఉద్యోగాలు ఉన్నా కట్న కానుకలు ఆశించినట్లే..అమ్మాయిలూ..ఆర్ధికంగా బాగున్నవారినే ఎంపిక చేసుకోవడంలో తప్పు ఏముంది. ? ఈ రెండు విడనాడి అవగాహనతో..మనఃపూర్వకంగా..స్థాయి,కుల,మాట బేదాలు మరచి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నవారు ఉన్నారు. మార్పుని చూస్తున్నాము. ఈ కాలం అమ్మాయిలూ ప్రేమించిన అతని కోసం అన్నీ విడనాడి దైర్యంగా ముందుకు వెళుతున్నారు కూడా.

    ఏమైనా ఎవరి అనుభవాలని బట్టి వారి వారికి అభిప్రాయాలు ఏర్పడతాయి. సమస్యని ద్వేషంతో కాకుండా సహృదయంతో చూడటం మొదలెడితే..చాలా సమస్యలు ఉండవు. ఏమైనా కట్నకానుకలు ఆశించని,అహంకారం ప్రదర్శించని సహకారాన్ని ఇచ్చే పురుషులు యెంత అవసరమో,ఆర్ధిక స్వేచ్చ లభించి విపరీత దోరణి లతో..కొట్టుకుని పోతూ.. ఉన్న అమ్మాయిల ఆలోచనా విదానంలోను మార్పు రావడం అవసరం కూడా.

    సంప్రదాయాలు-కట్టుబాట్లు కుటుంబ జీవనం స్థానే..

    (ప్రేమ?),అవసరార్ధ వివాహాలు -విడాకులు-సహజీవనం..భారతీయ జీవన విధానం లోను భాగం అయిపోతున్నాయి. :(:(

    ReplyDelete
  13. *శ్రీనివాస్ గారు.. చాలా చక్కగా మీ అభిప్రాయం చెపుతున్నారు.*
    థాంక్స్. నా మాటలు వింటే, మీరు ఆకాశంలో మీ సగం కూడా మగవారిదే అనేస్తారేమో :) మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన అది నిజం. ఓల్గ గారు మీకా విషయం చెప్పకుండా దాచిపెట్టి, మార్క్సిజం -ఫెమినిజం అని పెద్ద పెద్ద మాటలతో పుస్తకాల మీద పుస్తకాలు రాసి, కంఫ్యుజన్ చేసి ఆమే వాదన వినిపించారు :)
    జీవితం వాస్తవాల మీద నడుస్తుంది, వాదాల మీద, కలల మీద (సిద్దాంతలతో) కాదు. మీకు సమయం దొరికినపుడల్లా naa వాదన వినిపిస్తాను. ఎలాగు ఒక కోడుకున్నారు కాబట్టి మీరు నాకు మద్దతు ఇస్తారులేండి :)

    మీకొక చిన్న ప్రశ్న ఓల్గ గారి భర్త పేరు తెలిస్తే చెప్పండి. ఎమీలేదు, తెలుసుకోవాలని ఒక క్యురియాసిటి.

    ReplyDelete
  14. లేటు మారేజ్ లూ, పెరిగిన చదువులూ, ఫ్రీడం... వీటన్నిటికీ విడాకులకూ ఎటువంటి సంబంధం లేదేమోనండీ..ఓర్పు లేకపోవడం, అన్నీ తమకే తెలుసునన్న అహం, పరిగెడుతున్న జీవన విధాన౦ వలన విశ్రాంతి లేకపోవడం, ఆ కారణంగా మానసిక ఆశా౦తత కారణాలనిపిస్తుంది.

    ReplyDelete
  15. శ్రీనివాస్ గారు.. వ్యక్తి స్వేచ్చని మనం వ్యాఖ్యానించడం ఎందుకులెండి.

    వివాహం,విడాకులు,సహజీవనం జీవితంలో భాగం అయ్యాయి అని పైన చెప్పాను కదండీ!

    నేను ఇక ఈ విషయం పై క్లియర్ గా చెప్పబోవడం ఎందుకు.?

    రచయితలూ వారి అనుభవాలనే కాదు,ఇతరుల అనుభవాలని కూడా తమ ఆలోచనా స్థాయికి మార్చుకుని అన్వయించుకుంటూ..రచనలు చేస్తారు. రచనల ద్వారా వాదాలు,భావాలు వ్యక్తీకరించడంఅనేది చాలా సహజం. ఎటొచ్చి అవి వ్యక్తి గతం లోనుండీ,చూసిన సమాజం లోనుండి కూడా వారు పరిగణలోకి తీసుకోవచ్చును,రచనలు సృజించవచ్చును కదండీ!

    ధన్యవాదములు.

    ReplyDelete
  16. @SujataMar 26, 2012 11:12 PM:

    "మాంచి కత్తి లాంటి హైటెక్కు ఉద్యోగం"

    ఉద్యోగం చేయాలి కానీ తన జీతంలో కొంత భాగం ఖర్చులకు ఉంచుకొని మిగిలినదంతా తండ్రికి లేదా భర్తకు ఇవ్వాలి.

    "ఆర్ధిక స్వాతంత్ర్యం వల్ల విడాకులెక్కువవుతున్నాయో"

    కేవలం సంపాదనే ఆర్టిక స్వాతంత్ర్యం కాదు. డబ్బుపై హక్కు లేనప్పుడు ఆడవారు డబ్బు సంపాదించి పెట్టే యంత్రంగా మారిపోతారు. "కార్యేషు దాసి" లాగే ఇదీ ఇంకో రోలుప్లే అవుతుంది.

    ReplyDelete
  17. వనజ గారు,
    ముందుగా నేను రాసే ఏ వ్యాఖ్య కూడా ఇతరులను విమర్శించటానికి కాదని గుర్తుంచుకోవాలి.

    ఇక అసలు విషయానికి వస్తే, కొంతమంది అమ్మాయిల అతి తెలివిని, వారి సాహసని చూస్తే, అతిత్వరలో ఉన్న పేరు పోగొట్టుకొని వారి పాట్లు, వారు పడతారని పిస్తుంది. అప్పటికే పరిస్థితి చేయి జారి పోయి ఉంట్టుంది. వారు ఎమీ చేయలేరు. నాకు తెలిసిన సంగతి ఒకటి చెప్తాను . పెళ్లి రేపనగా, ఉదయం నుంచు పెళ్లి కూతురు ఇంట్లో కనపడలేదు. తల్లిదండృలు ఆందోళన తో అన్నిచోట్ల వేదకి ,పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వటానికి వేళితే, అక్కడ పోలిసు వాళ్లు మేము మీ ఇంటికే వస్తున్నాం. మీ అమ్మాయి తనకు బలవంతగా ఇష్ట్టం లేని పెళ్లి మీరు చేస్తున్నారని, బెదిరించారని ఫిర్యాదు చేసింది అని చెప్పటం మొదలు పెట్టారు. హతాశుడైన ఆతండ్రి, కుటుంబం అవమాన భారంతో , అన్నిటిని అమ్ముకొని, ఒక నేలలోనె ఆ వూరిని వదలి వెళ్లి పోయారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు, ఊరికి ఒకటి జరుగుతున్నాయి. వీరేమి మంచి చెడు తెలియని వారు కాదు, లేక చదువు సంధ్యా లేని వారు కాదు. అన్ని తేలిసి ఇలా చేసే వారిని ఏమనుకోవాలి?

    మగవారు మొసగాళ్లో, దుర్మార్గులో ,ప్రపంచంలో ఉన్న అన్ని అవలక్షణాలు కలిగిన వారై ఉండవచ్చని, అందరికి కనీసం ఒక ఊహ అన్న ఉంట్టుంది. పెళ్లి కూతురిని ఎవరు అంత తక్కువ స్థాయిలో ఊహించుకోరు. కుటుంబ గౌరవం అనేది ఒకటి ఉంట్టుంది. కొంతమంది అమ్మాయిలు /ఆడవారు ఎప్పుడైతె ఇలా చేయూటం మొదలు పెడతారో, ఇక కుటుంబం అనే పదానికే అర్థమేలేదు. పైపెచ్చు దీని ప్రభావం అందరి ఆడవారి పైన పడుతుంది. అందులో మంచి వారు కూడా ఉండవచ్చు.

    ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తున్న ఒకతను పెళ్లి చేసుకొన్నాడు. ఆమే కూడా ఉద్యోగం చేసేదే. ఒక నెల తరువాత సాయంత్రం ఉద్యోగం నుంచి ఇంటికి రాలేదు. ఇతను ఆందోళనతో ఊరంతా వేతికితే, చివరకు అతనికి తెలిసిందేమిటంటే,ఇతనిని వదలివేసింది. ఆమే తనకు నచ్చిన, ఆఫీసులో తనతో పాటుగా పనిచేస్తున్న కోలిగ్ తో కలసి ఉండటానికి నిర్ణయించుకొంది. ఆ నిర్ణయించు కోవటం ఆమే పెళ్లి కి ముందరే నిర్ణయించుకోవచ్చు కదా! ఇతని జీవితం నాశనం చేయటమేందుకు? రేపు ఇతను పెళ్లి చేసుకొవాలనుకొన్నా రెండో పేళ్లి వాడనే ఒక ముద్ర, మొదటి ఆమేను ఎమీ చేశాడొ, ఒక నెలలోనే వదలి పెట్టి పోయిందని ఇతనిపైన అనుమానం.
    ఇప్పటి వరకు మగవారు ప్రత్యక్ష /పరోక్షం గా ఆడవారికి ఎంతో సహకరిస్తూ వచ్చారు. ఇటువంటి సంఘటనలతో, మగవారి దృష్ట్టిలో ఆడవారి పైన గౌరవం తగ్గటం ఎప్పుడైతే మొదలౌతుందో (నిజం చెప్పాలంటే మొదలైంది కూడా), వారు సహాయనిరకారణ చేయటం మొదలు పెడతారు. ఆరోజు ఎంతో దూరంగా లేదనిపిస్తునాది.దానిని వారు గుర్తించలేదు. అంతా తమ ప్రయోజకత్వం, తామకే అన్ని తెలుసు, భారతదేశం అమేరికా లాగా ఊహించుకొంట్టు హద్దులు దాటి ప్రవర్తించటం చూస్తున్నాము.

    ReplyDelete
  18. Sreenivasa garu.. Thank you very much. I agree with your opinion.

    ReplyDelete
  19. *వ్యక్తి స్వేచ్చని మనం వ్యాఖ్యానించడం ఎందుకులెండి. *
    నేను వ్యక్తిగతం గా ఆమేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఆమే ఒక మంచి రచయిత అని , నాలుగు పేజిలు చదివితే తెలిసిపోతుంది. నేను రచయితను కాను, అటువంటి వారితో పోల్చుకోవటానికి అర్హతే లేదు. ఒకటి చెప్పండి, ఆమే ఎవరో, నేను ఎవరో! ఆమెను అనవలసిన అవసరం నాకు ఏమి ఉంది? పైగా మగవాడిని, మా జీవితంలో కష్ట్ట నష్ట్టాలకు ఇతరులను నిందించటం మగవారి స్వభావంకాదు కదా! :) కాకాపోతే ఆమే భర్త పేరు , ఆయన ఏమైనా సాహిత్యం రాస్తాడాని తెలుసుకో దల్చుకొన్నాను.

    వాస్తవానికి ఇలా వ్యాఖ్యలు రాయటం, పెద్దగా ఆసక్తి లేదు. కొన్ని సంఘటనలు తెలిసిఉన్నపుడు, ఇలా ప్రతిస్పందించవలసి వస్తుంది. ఎన్నో పుస్తకాలు చదివే అలవాటున్న, సుజాతగారు కూడ మగవారిని నిందిస్తూ రాస్తే, రాయవలసి వచ్చింది.
    ఈ టపాకి ఇంతటితో నా వ్యఖ్యలు సమాప్తం.
    థాంక్స్ జీలేబి గారు, నా వ్యాఖ్యలు ప్రచురించినందుకు.

    ReplyDelete
  20. నేను శ్రీనివస్ గారితొ 100% ఏకీభవిస్తాను. నాకు తెలిసిన కొన్ని సంఘటనలు చెప్పాలనిపిస్తుంది.
    1) మా స్నెహితురాలి అక్క కి సంభందాలు చూసెటప్పుడు, వాళ్ళకి చాల సంబంధాలు వచ్చాయంట, పెళ్ళై మూడు నెలలకె విడిపొయినవి, వచ్చిన ప్రతీ సంబంధం గురించి వాళ్ళు చెప్పె మాట ఒక్కటె, అబ్బాయి తప్పేమి లెదు, ఆ అమ్మాయే ఎవరినొ ప్రెమించి
    వెళ్ళిపొయింది. కాని, అది ఎంత నిజమైన వీళ్ళకి అనుమానం ఉంటుంది కద, దాంతొ వీళ్ళు వెనకడుగు వేసెవాళ్ళు. పాపం ఆ అవతలి వాళ్ళు వీళ్ళకి ఎంతొ నచ్చచెప్పేవాళ్ళంట. అబ్బయి చాల మంచివాడని, ఏ అలవాట్లు లేవని, కాని వీళ్ళ అనుమనం తొ ఒప్పుకొలెదు.

    2) మా స్నెహితురాలి హాస్టెల్ లొ ఉన్న ఒక అమ్మాయి పెళ్ళైన మూడు నెలలకె విడాకులు కావాలని అడుగుతున్నాదంట, ఆ అమ్మయి రెండొ బాయిఫ్రెండ్ అంటె ఇష్తమని చెప్తుందంట. ఆ అమ్మయి మొదటి బాయిఫ్రెండ్ ఈ అమ్మాయికి చెప్పకుండ పెళ్ళి చెసెసుకున్నడంట. పాపం ఆ అమ్మాయి మొగుడెమొ చెన్నై లొ మంచి జాబ్ వదిలి ఈ అమ్మయి కొసం బెంగలూరు వస్తున్నాడంట. ఎందుకంటె ఈ అమ్మయి తన జాబ్ వదిలి చెన్నై రానని చెప్పిందంట. ఇప్పుడెమొ ఆ అబ్బాయి ఈ అమ్మాయి కాళ్ళ వేళ్ళ పడుతున్నాదంట, దయచేసి పరువు తీయకు అని.
    ఇంకా చాల చాల కొకొల్లలు గా ఉన్నాయి ఇటువంటి సంఘటనలు.
    మా ఆఫీస్ లొ ఐతె అబ్బో చాల బాగొతాలు ఉన్నయి. అమ్మాయిలు గత పది ఇరవై సంవత్సరాల నుండి సంపాదిస్తున్నారు బాగ. కాని గత వందల సంవత్స్రాల నుండి అబ్బయిలు సంపాదిస్తున్నారు, కాని మన కుటుంబ వ్యవస్త పాదైపొతుందని ఇప్పుడె మనం ఎందుకు బాధపడుతున్నాం. నేను చెప్పెది స్త్రీలకి ఆర్దిక స్వాతంత్ర్యం ఉండకుడదని కాదు. అదే స్వాతంత్ర్యం అబ్బాయిలికి చాల సంవత్సారాలుగ ఉన్నాది. కాని వాల్లు ఆ స్వాతంత్ర్యం తొ ఒక రక్షణ వ్యవస్త / గోడ ని నిర్మించారు, ఆ రక్షణ వ్యవస్త లొనె మనం , మన తల్లితండ్రులు, మన తాత ముత్తతాలు పెరిగారు.కాని ఆ రక్షణ వ్యవస్త కులిపొతుంది ఇప్పుడు. అబ్బయిలు అందరు మంచివాళ్ళు అని చెప్పడం లెదు, అందులొ కొందరు చెడ్డవాళ్ళు కూడ ఉన్నారు. కాని వాళ్ళెవరు ఆ గోడని పగలకొట్టె సాహాసం చెయలేదు.

    ఫైనల్ గా నేను చెప్పొచ్చెదేటంటె , చాల చాల మంది అమ్మయిలు వాళ్ళకొచ్చిన (అర్దిక) స్వాతంత్ర్యాన్ని దుర్వినియొగపరుస్తున్నరెమొ అని నా అభిప్రాయం.

    తెలుగు లొ టైపు చెయడం ఇదె మొదటిసారి, చాలా కష్టంగా ఉంది. జనాలు పేజీలకి పేజీలు ఎల టైపు చేస్తున్నారొ ??? ఇంకా చాల వ్రాద్దామనుకున్నాను కాని అలిసిపొయాను , ఏదొ కొత్త భాష నేర్చుకున్నట్టు ఉంది.

    ReplyDelete
  21. నేను ఇంతకు ముందు వ్రాసిన ఉత్తరం లొ, 'అమ్మాయిలు గత పది ఇరవై సంవత్సారల నుండి జాబ్ చెస్తున్నారు ' అని వ్రాసాను. అంటె అంతకు ముందు కూడ చేసేవాళ్ళు, కాని వాళ్ళ సంఖ్య చాల స్వల్పం.

    ReplyDelete
  22. శ్రీనివాస్ గారూ, ధన్యవాదములు.

    ReplyDelete