Tuesday, April 3, 2012

హై 'టెక్కు' మహిళలకు గులాం !

"చ చ చ అసలు ఈ లోకం లో మగ వాళ్లకి అసలు తమకంటూ ఓ స్టేటస్ లేకుండా పోతోందీ, అంతా హై టెక్ మహిళలకు గులాం సలాం అయి పోయింది " విసుగ్గా కనబడ్డ ప్రతి ఒక్క దాన్నీ తన్నేసు కుంటూ ఇంటి లోపలి వచ్చాడు మనవడు.

'ఏమిరా మనవడా, వస్తూ వస్తూ నే ఆండోల్ల మీద పడ్డావు ' గదమాయించాను మనవడి ని.

'ఇదిగో బామ్మా, మీ కాలం నించే ఇది మొదలయ్యింది ' అన్నాడు వాడు.

ఏమిట్రా అన్నా

'ఏమిటి అంటే ఏమిటి ? అసలు మేమంటూ అసలు ఉన్నామా ? మా కంటూ ఒక స్టేటస్ ఉందా ? ' అన్నాడు.

ఏమయ్యిందేమిటి ?

ఎల్కేజీ లో మిస్సు కస్సు బస్సు. ప్రైమరీ లో మేరీ టీచరు అథారిటీ. ఆ పై కాలేజీ లో లేడీ ప్రోఫెస్సర్స్ గదమాయింపు. పోనీ లే అని ఈ 'హాయ్ టేక్' ఐటీ ఉద్యోగం లోకి వస్తే ఇక్కడా ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ లో వుమనేజ్ మెంట్' అన్నాడు వాడు.

ఫక్కున నవ్వు వచ్చింది. అదేంట్రా , ఉమనేజ్ మెంట్ అంటా వేమిటి ?

'అవునే బామ్మా, పెళ్లి అయ్యేంత వరకు ప్రాజెక్టు లో దేశాలెంబడి తిరిగి ఆ పై పెళ్లి అయ్యాక ప్రాజెక్ట్ లీడ్ అయ్యి ఇంటి కుంపటి ని తీరిగ్గా చూసు కుంటూ, క్వాలిటీ మేనేజ్ మేంటూ, మన్నూ మషానం అంటూ,   see, ఎంత బాగా, eye పెట్టి  CMMI V ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అని క్రెడిట్ కొట్టేస్తూ, చ చ చ అసలు మాకు రెస్పెక్ట్ అంటూ ఏదైనా ఉందా అంట ' అన్నాడు

వాళ్ళ అమ్మ వచ్చింది .

కోడలా, మనవడు వయసుకు వచ్చేడు. ఓ మంచి అమ్మాయి ని చూసి కట్ట బెట్టేయి ' అన్నా . 'ఆ వచ్చే అమ్మాయే, వీడి మానేజ్ మెంట్ చూసేసు కుంటుంది కూడాను'

'వాడు వింటేనా ? అసలు ఉద్యోగంకి పోయినప్పటి నించి వాడికి వైరాగ్యం వచ్చేసింది ' అంది కోడలు పిల్ల.

'ఇదే సరి ఐన సమయం చూసి ముడేట్టేయి '

'దేశం లో అమ్మవారి రాజ్యం ! ఇంట్లో  ఆండొల్ల రాజ్యం. చ చ చ ' అన్నాడు మనవడు.

చూడమ్మాయి, వాడు వద్దని చెప్పటం లేదు కదా ! ఓన్లీ కంప్లైంట్ అంతే !

మా అయ్యరు వారు హిందూ దిన పత్రిక నించి ఓ మారు తల బయట పెట్టి, మళ్ళీ పేపర్లోకి తల దూర్చేసేరు.
వారికి పేపరు కనబడితే చాలు, వేరే ఏదీ అక్కరలే మరి. మనమోహనుల వారి పాలిసీ. అన్నీ పాలిసీ మేటరు లోనే ఉండాలి అంతే.


రాజ్యం వీర భోజ్యం ! ఈ జమానాకి, 'రాజ్యమే' హైటెక్ మహిళా భోజ్యం !

చీర్స్
జిలేబి.

15 comments:

  1. ఎంతయినా అనుభవమంటే అది. ఎంచక్కా ఏం జరుగుతుందో మీ అయ్యరువారు ఓ లుక్కేసి - అబ్బే పెద్దగా పట్టించుకోవలసిన విషయం కాదని మళ్ళీ పేపర్లో తల దూర్చేశారు. మీ మనవడికీ తెలిసొస్తుంది లేండి. ఖంగారేమీ పడకండేఁ?!?

    ReplyDelete
    Replies
    1. తెలుగు భావాలు గారు,

      అట్లాగే అండీ ! మీరు చెబ్తే కాదంటా మా !

      చీర్స్
      జిలేబి.

      Delete
  2. ఎంత హై టెక్కు అయినా, ఉమెన్ మేనేజ్మెంట్ అయినా సరే అది బయట ప్రపంచమే! ఇంట్లో కాలు పెట్టగానే.. నేనో సగం నీవో సగం ఒకటై ఇద్దరం .. అనుకుంటే ఏ బాధ లేదని చెప్పి త్వరగా అక్షింతలు వేయించండి ..ఓ..పనైపోద్ది. లేకపోతే.. ముదిరిన బెండకాయ మాదిరి :)

    ReplyDelete
    Replies
    1. వనజ వన మాలీ గారు,

      అంతే అంతే !

      బెటర్ హాఫ్! ఫిఫ్టీ ఫిఫ్టీ

      చీర్స్
      జిలేబి.

      Delete
  3. తోడూ కోడళ్ళు సినిమా లో ఆడవాళ్ళు తగువు వేసుకుంటుంటే ఎస్.వి.ఆర్ గారు
    వచ్చి ...అమ్మో ఆడోల్లు...అని వెళ్ళిపోతారు...)) ఏమైనా అనుభవం అంతే ...వనజ గారు చెప్పినట్లు అక్షింతలు వేయిన్చేయ్యండి...ఓ పని అయిపొతుంది...

    ReplyDelete
    Replies
    1. శశి కళ గారు,


      మా బాగ చెప్పారు, ఎస్ వీ ఆర్ పంచ్ డైలాగ్ !

      జిలేబి.

      Delete
  4. కం. మగవారికి భయభక్తులు
    తగురీతిగ తెలియజెప్ప దగు నతివలకున్
    తెగ పోజుల పిలగాండ్రను
    వగలాడులు నిలువరించ వలెను జిలేబీ

    కం. ఆయ్యరు ముద్దుల మనుమడు
    తొయ్యలి యదుపాజ్ఞలందు తొడరక మరి రే
    పొయ్యన నిలచెడు తరుణిని
    కయ్యంబున గెలువ మగని కగునె జిలేబీ

    కం. సగ మిస్తామని చెబుతూ
    సగం సగం గౌరవంతొ సరిపుచ్చేస్తూ
    మగవాళ్ళాడే డ్రామా
    జగమెరుగును కాన వలదు జాలి జిలేబీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ శ్యామలీయం వారు,

      ధన్య వాదాలు !

      జిలేబీ శతకం కొనసాగింపు బాగుందండీ !

      చీర్స్
      జిలేబి.

      Delete
  5. అంతలా చిరాకు పడిపోతున్నాడంటే, మీ మనవణ్ణి ఏ అమ్మాయి మేనేజ్ చేసిందో కనుక్కోండి ముందు.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయీ గారు,

      మీరు సరి ఐన విషయం కని బెట్టేసారు !

      ఆ ఉపోద్ఘాతం తరువాయి తేలిన విచారణ లో అదే బయట పడ్డది!

      జిలేబి.

      Delete
  6. "దేశ" ముదురు నుంచి దిగువ "మిస్సు" వరకు
    లేని పోని లొల్లి లేవ దీసి
    "ఆండ వాళ్ళ" మీద అక్కసు ప్రకటించ
    శాప నార్థ నాల జల్లు కురియు

    ReplyDelete
    Replies
    1. లక్కాకుల వారు,

      మీ కు నమో నమః !

      జిలేబి

      Delete
  7. * సగ మిస్తామని చెబుతూ సగం సగం గౌరవంతొ సరిపుచ్చేస్తూ మగవాళ్ళాడే డ్రామా జగమెరుగును*

    అయ్యా శ్యామలీయం గారు,
    మీకు అవతలి వారి పైన చాలా దయార్ద్ర హృదయముందని తెలుసు. మగవాళ్లు డ్రామా ఆడుతారా? మీకు అంత పెద్ద గొప్ప మనసు ఉంటే సగం మివ్వటమేందుకు పూర్తిగా ఇచ్చి,సర్వస్య శరణాగతి పొందండి. ఎవరైనా వద్దన్నారా?

    ReplyDelete
  8. శ్రీ నివాసు గారు,

    సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. శ్రీనివాసుగారూ, నాకు స్త్రీజనపక్షపాతముందని బాగానే అవగతం చేసుకున్నారు. చాలా సంతోషం. తొమ్మండుగురు చెల్లెళ్ళ అన్నగారిగా నాకా పక్షపాతలక్షణం జీర్ణించుకుపోయిందండీ. మా బావగార్లందరూ బంగారాలండీ. కాని అరవై యేళ్ళుగా లోకం చూస్తూనే ఉన్నా, అంతా అలాగున్నారా? స్త్రీలలో విద్యావ్యాప్తి కారణంగానే నేమో రోజులు మారుతున్నట్లు అనిపిస్తోంది కాని యెంతశాతం మంది గృహలక్ష్ములకు నిజమైన 'అర్థాంగి' హోదా యిచ్చి గౌరవిస్తున్నారు చెప్పండి? ఏమాత్రం ముఖ్యమైన నిర్ణయమైనా యింకా మగమహారాజులు తీసుకుంటున్నారే కాని సగంమందైనా భార్యలను నిర్ణయించనిస్తున్నారా?

    నిన్న రాత్రే ఒక shopping mall లో ఒకామె ఒక చీరను తెగ ముచ్చటపడటం, ఉత్తరక్షణమే ప్రక్కనున్న పతిదేవులు no no అనేయటం చూసాను. ఇద్దరూ బాగా చదువుకున్నవారిలాగా ఉన్నారు. కాని ఆవిడకు నచ్చిన చీర కొనుక్కునే స్వాతంత్ర్యంకూడా లేకపోవటం చాలా బాధ కలిగించింది. దానికి తోడు ఆ మహానుభావుడు నాతో మాటలకలిపి, 'ఈ ఆడాళ్ళకి డబ్బు waste చేయటమే తప్ప మరేం పని లేదండీ' అనేసాడు!

    ఇప్పుడు చెప్పండి!

    అన్నట్లు మీరు నా వ్యక్తిగత విషయం యెత్తారు. ఫరవాలేదు. మా శ్రీమతి 100% అర్థాంగి హోదాలోనే ఉన్నారు.

    ReplyDelete