Saturday, April 7, 2012

ఇచ్చట చచ్చి నోళ్ళ జాతకం చూడబడును !


ఇచ్చట టింకరింగ్ చెయ్య బడును 
ఇచ్చట కుట్టు లు, టైలరింగు చెయ్య బడును !ఇచ్చట చచ్చి నోళ్ళ జాతకం చూడబడును ఇచ్చట మొబైలు రిపైరు చెయ్య బడును
ఇచ్చట సైకిలు ట్యూబ్ కు పంక్చరు వేయ బడును

బోర్డు చూసి లోపలి కి కాలు పెట్టాడు అప్పా రావు.


మహార్జ్యోతిష్ శర్మ గారు తలెత్తి చూసారు


ఏమోయ్ ?


మా అయ్య చాలా సీరియస్ గా ఉన్నారయ్యా ! కాస్త జ్యోస్యం చూద్దురు, వారి కి ?


ఇదిగోనోయ్ బోర్డు చూసావుగా , ఇక్కడ చచ్చి నోళ్ళ జాతకం మాత్రమె చూడ బడును


బతికున్నోళ్ళకి చూడ రాండీ ?


కుదరదోయ్


ఓ పదిహేను రోజులు గడిచాయి . అప్పారావు అయ్య మధ్యలో కాలం చెల్లి పైకి పోయాడు. అప్పా రావు శుభం తరువాయి మహార్జ్యోతిష్ శర్మ గారి దగ్గరకు వచ్చాడు.


ఏమోయ్ మళ్ళీ వచ్చావ్ ?


మా అయ్య పోయాడండీ ! జాతకం తెచ్చాను చూద్దురూ.


శర్మ గారు జాతకం చూసారు.


మహార్జాతకమోయ్  ! మొన్న రామనవమి కి వైకుంటం చేరి ఉండాలే !


అయ్యా ! మీరు మనుషులు కానే కారండీ !


శర్మ గారు తీరిగ్గా జాతకాన్ని విశ్లేషించి అప్పా రావు అయ్య జాతకాన్ని చీల్చి చెండాడి , 'మీ అయ్య ఓ పుణ్యా త్ము డోయ్ అని జోస్యం చెప్పారు !


అప్పారావు సంతోషానికి అవధుల్లేవు.


మా అయ్య అంత గోప్పోడాండీ !


అవునోయ్ !


'ఇది ఉంచండి ' అప్పారావు ఖుషీ గా శర్మ గారి ముందు ఓ పుర్రె నుంచాడు


ఏమోయ్ ఇది ?


నా తరపున కానుక అండి మా అయ్యది


చీర్స్
జిలేబి.

18 comments:

  1. పునరపి జననం, పునరపి మరణం

    నేను జన్మ కిందటే సచ్చితిని, నా జాతకం చూద్దురూ... :))

    ReplyDelete
    Replies
    1. శంకర్ గారు,

      అలాగీ, చూస్తే పోతుంది !

      చీర్స్
      జిలేబి.

      Delete
  2. ఈ జిలేబి మాత్రం 'పులిసింది' .

    ReplyDelete
    Replies
    1. శ్రీ రాం గారు,

      అప్పుడప్పుడు, పులిసిన జిలేబీ తప్పవు !

      చీర్స్
      జిలేబి.

      Delete
  3. Hmmm,

    Direct personal attack (The names that you have used suggest that!)?

    ReplyDelete
    Replies
    1. భరద్వాజ్ గారు,

      This is not a direct attack but a direct satire, అభిమానం తో కూడిన ది, ఒక చెణుకు మాత్రమె !

      చీర్స్
      జిలేబి.

      Delete
  4. బతికున్న దెయ్యాలకి కూడా చెబుతారా ?

    ReplyDelete
    Replies
    1. బులుసు గారు,

      చాలా బతికున్న దెయ్యాలు ఉన్నాయి. వాటికి చెబ్తే, కొంత విశ్లేషణ అర్థం అయ్యే, మార్గాలు ఉన్నాయి. అంతా మహార్జ్యోతిష్ వారి మీద ఆధార పడి ఉంది

      చీర్స్
      జిలేబి.

      Delete
  5. రెండురోజులునుంచి దర్శనాలు లేవు కుశలమా?

    ReplyDelete
    Replies
    1. బహు కుశలమండీ శర్మగారు,

      నెనర్లు మీ అభి మానానికి !

      చెదల, మార్పుల పర్వాలతో విశ్రాంతి కూడా అవసరం! కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్త

      సో, మే ఇరవై ఐదుకి సంన్నాహాలు చేస్తున్నారన్న మాట !

      చీర్స్
      జిలేబి.

      Delete
  6. ఏమండీ జిలేబిగారూ బావున్నారా..

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మాయీ గారు,

      నెనర్లు. బాగున్నా మండీ! కుశలమేనా !

      చీర్స్
      జిలేబి.

      Delete
  7. ఆలస్యంగా చూశాను. జిలేబీ, ఈ పోస్టు మీదేనా? :(

    ReplyDelete
    Replies
    1. పీ క్యూబ్ గారు,

      ఖచ్చితం గా జిలేబీ దే !

      చీర్స్
      జిలేబి.

      Delete
  8. If any body knowing information about the welfare of jilebi please post here, reply.

    ReplyDelete
  9. తెలుగు పాటలు గారు,

    ల ల లా !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. కష్టే ఫలే వారు,

    మీరు రెండు చుక్కలు ఒక్క బ్రాకెట్టు ఆటకి వచ్చేసారన్న మాట !

    చీర్స్
    :)))
    జిలేబి.

    ReplyDelete
  11. శర్మాజీ,

    ఆల్ ఫైన్ ! నెనర్లు. మీ అభిమానానికి. !



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete