Thursday, April 12, 2012

జిలేబీ కి తాకీదు వచ్చేసిందోచ్ !

క్రితం ఏడాది జిలేబీ కి ఉద్యోగ పర్వం నించి టాటా చెప్పెయ్యడం తో , ఏమీ పాలు పోక కాలు గాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే, జంబూ వారు, 'ఇదిగో జిలేబీ ! అలా ఊరికే కూర్చోక, కాస్తా వంటా వార్పూ చూడరాదు ?' అంటూ అన్నేళ్ళు రాజ్యమేలిన వంట గదిని జిలేబీ తల మీద ధామ్మని పడేసేరు.

చ, చ, అసలు పని లేకుంటే, అందరికీ లోకువే సుమా అనుకుని సరే పోనీ మన జంబూ వారే కదా , ఇన్నేళ్ళు వంటా వార్పు చూసేరు. ఇక ఎట్లా ఉద్యోగం retire అయిపోయాం కాబట్టి, ఈ కొత్త ఉద్యోగం లో retyre అయి పోదామని ఒప్పేసు కున్నా !

వంటా వార్పూ అంత సులభమైన విషయం కాదు సుమా అని అప్పుడే అర్థం అయ్యింది. ! చాన్నాళ్ళ బట్టి అసలు వంట గది వైపు రాక పోవడం తో , వంట ఎలా చెయ్యాలో అస్సలు మర్చి పొతే, 'పోనీ లే జిలేబీ' ఆ లాప్టాప్ పెట్టేసుకుని ఆన్ లైన్ లో నేర్చేసుకో అని అయ్యరు వారు ఓ ఉచిత సలహా పడేసేరు.

దాంతో బాటే, అప్పటి దాకా ఎప్పుడో ఒక్క మారు టపా రాసుకుంటూ ఉన్న బ్లాగ్ లోకం లో కూడా జబర్దస్తీ గా జొరబడి , టాట్, ఇక మీదట డైలీ రాయాలి సుమా అని, అలా ఓ వైపు వంట కార్య క్రమమును మరో వైపు బ్లాగ్ టపా వంట కార్య క్రమాన్ని రెండు చేతుల మీదుగా సాగించడం జరిగింది.


ఖుషీ ఖుషీ గా నవ్వుతూ, చలాకీ చలాకీ లా కామెంట్లు కొడుతూ తీరిగ్గా కాలం గడి పేస్తూంటే, ఆ మధ్య లో మన మోహనుల వారి నించి ఓ కబురందింది

'జిలేబీ , నీకు రిటైర్మెంట్ ఇవ్వడం మా బుద్ధి తక్కువ. నీ వెళ్ళాక, వనారణ్యాలకి కష్ట కాలా లోచ్చెసేయి, అదీ గాక, నీకు రిటైర్ మెంటు ఇవ్వడం, తెలుగు బ్లాగ్ లోకానికి తల నొప్పి అయి పోవడం జరిగింది, నీ రాతలతో . కాబట్టి, నీ రిటైర్ మెంటు కాన్సిల్. వెంటనే నువ్వు జాబ్ లోకి చేరి పో' అని తాకీదు వచ్చేసింది!

చ, చ, జనాలు హ్యాపీ గా ఉండ నివ్వరు సుమా ! తీరిగ్గా, టపాలు రాస్తూ కూర్చుంటాం అంటే వద్దంటారు. సరే ఉద్యోగం లో ఉంటా నంటే, నీకు ఏజ్ అయి పోయింది, యు ఆర్ డిస్మిస్' అంటారు సుమీ అనకున్నా.

'అయ్యరు గారు మీ సలహా ఏమిటీ ' అడిగా.

'ఇదిగో జిలేబీ,  నీ చేతి వంట నాకు దక్కే యోగం లేదన్న మాట ఎప్పటికి ' అన్నారు వారు.

అర్థం అయి పోయింది వారికి కూడాను. సలహా ఏమిటీ అని జిలేబీ అడిగింది గాని, ఆ సలహా పాటిస్తుందా అన్నది సందేహం సుమా ఈవిడ అని !

సో, బ్లాగ్ బాంధవులారా, ఇంతటి తో మీకందరికి బాయ్ బాయ్! టాటా వీడుకోలు !

అప్పుడప్పుడు,వనారణ్యాల లోంచి బయట పడితే, గిడితే, జనారణ్యాలకి వస్తే, గిస్తే, నెట్టారణ్యాలు లభ్య మయితే, మళ్ళీ మీకు ఈ జిలేబీ టపా శిరో వేదనలు తప్పవు.

అప్పటి దాకా, బాయ్ బాయ్ టాటా వీడుకోలు.

చీర్స్
జిలేబి

(పీ ఎస్: ఇది 'తూచ్' టపా !, వీలైనప్పుడు, అప్పుడప్పుడు మళ్ళీ పునర్దర్శనం !)

చీర్స్
జిలేబి
IFS (Retyred)-Indian Fun Service Retyred!

29 comments:

  1. All the best for your second stint...

    మా అందరికీ (మీ) పునర్దర్శన ప్రాప్తిరస్తు అని మాకు మేమే దీవించుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. తెలుగు భావాలు గారు,

      దీవెనలు ఫలించాయి!

      చీర్స్
      జిలేబి.

      Delete
  2. are u joking or is it real

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      ఇట్స్ రియల్. సబ్బాటికల్ (అబ్బా అంత త్వరగా అయిపోయిందే!) లీవు ఖతం ! సో బేక్ టు డ్యూటీ !

      చీర్స్
      జిలేబి.

      Delete
  3. ఇదన్యాయం నేనొప్పుకోను..నేనొప్పుకోను..మన ఆటలో అ౦బాలీసులు, మధ్యలో వెళ్ళిపోవడాలు లేవు. వా..వా..ఆ....

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మాయీ వారు,

      అంతే అంతే ! ఎం చేద్దాం ! సబ్బాటికల్ ఖతం !

      చీర్స్
      జిలేబి.

      Delete
  4. ఇది తామర దురద. ఒక మాటు అంటుకుంటే గోక్కొక పొతే కుదరదు. మీరు బ్లాగులు వదిలి వెళ్ళలేరు. నాదీ హామీ.

    కంగ్రాట్స్ మీ retyrement కి..........దహా.

    ReplyDelete
    Replies
    1. బులుసు గారు,

      వదలట మన్నది కుదరనిది. ! అంత త్వరగా మిమ్మల్నందరిని సంతోషం గా వుండమని వదిలేస్తానా ! కుదరదు. కాని ఇక డైలీ టపా తప తప ఉండవు అంతే ! నేట్టారణ్యం లో కి వస్తే గిస్తే మళ్ళీ అప్పుడు మరో మారు !

      చీర్స్
      జిలేబి.

      Delete
  5. Replies
    1. వనజ వనమాలీ గారు,

      అంతా 'వింత' గాధల్లె ఆనంద హేల!

      చీర్స్
      జిలేబి.

      Delete
  6. మీరు తమిళనాడు నుంచీ ఏమైనా వచ్చారా?
    వాళ్ళే తెలుగు అక్షరాలను జిలేబి లా ఉన్నాయి అంటారు!

    ReplyDelete
    Replies
    1. అబ్బా గెల్లి గారు,

      ఇన్నాళ్ళకి మీకు ఈ జ్ఞానోదయం అయ్యిందన్న మాట !
      అంటే ఇన్నాళ్ళు నేను రాసింది తెలుగే నన్న మాట ! వావ్ జిలేబీ యు హేవ్ డన్ గుడ్ జాబ్ !



      చీర్స్
      జిలేబి.

      Delete
  7. చాలా అన్యాయం. వేలాది డాలర్లు బ్లాగు ద్వారా సంపాదించే సత్తా ఉన్న మీరు ఒక సాధారణ ఉద్యోగిగా మారడం దారుణం. ఉద్యోగస్తులు కోట్లాది, తెలుగు బ్లాగ్లోకంలో జిగేలుమని మెరిసే జిలేబీ మీరొక్కరే.

    మీ టాటా వీడుకోలు కాన్సిల్ చేసే ఉపాయమెమి చెప్మా? పోనీ కామెంటుకొక డాలరు ఇచ్చుకుంటాం, ఉద్యోగం మానేయరూ ప్లీస్.

    ReplyDelete
    Replies
    1. జై గొట్టి ముక్కలు వారు,

      ఎం చేద్దమండీ , అంతే అంతే బతుకింతే! డాలర్లకి మనకీ లంకె లేదంతే !

      చీర్స్
      జిలేబి.

      Delete
  8. అన్నట్లు మరిచిపోయా! రిటయిరయిన తరవాత మనల్ని చూసేవాడు లేడు. మీరు బ్లాగు వదలి వెళ్ళలేరు. ఇలాగే వెళ్ళిపోతున్నా అని నేనూ అన్నా! డాక్టర్ గారూ అన్నారు. ఎన్నిరోజులగేము. దురద తీరాలంటే గోక్కోక తప్పదు కదా! మీకిదే శాపం! మీరు బ్లాగు వదలకుందురుగాక!!!

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే గారు,

      మీ శాపమునకు తిరుగు లేదు !

      చీర్స్
      జిలేబి.

      Delete
  9. @kastephale:

    ముందు బుజ్జగిద్దాం, ఇప్పుడే శాపాలు వద్దు. ఎంత చెప్పినా ఉద్యోగమే చేస్తానని ఆవిడ మొరాయిస్తే అప్పుడు మేధోమధనం* చేసి ఇలాంటి తప్పుడు ఆలోచనలు మాన్పించే వ్యూహాలు* కనుక్కొందాం.

    మొదలు పెట్టె వారికే మీ ఇష్టం, బ్లాగు ఆపడం మీ సొంత నిర్ణయం కానేరదు. చదువరులకు కూడా హక్కులు* ఉంటాయి, mind it!

    PS: * మార్కు వేసిన పెద్దపెద్ద మాటల అర్థం నాకు పూర్తిగా తెలీదు. ఏదో show-off చేద్దామని వాడాను!

    నా వాడకం సరి అయితే చెప్పండి. టీవీలో విశ్లేషణ చేసి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటా.

    ReplyDelete
    Replies
    1. జై గొట్టిముక్కల గారు,
      ఆ అమలు చేసేది తొందరగా అమలు చెయ్యండి.మీ కే నా ఓటు.

      Delete
    2. జై గొట్టి ముక్కలు వారు, కష్టే ఫలే వారు,

      ఇక్కడేదో గూడు పుటాణి జరుగు తున్నట్టు ఉన్నదే !

      చీర్స్
      జిలేబి.

      Delete
  10. Replies
    1. మాలా కుమార్ గారు,

      నెనర్లు.

      చీర్స్
      జిలేబి.

      Delete
  11. హమ్మయ్యా... థాంక్సండి. :)

    ReplyDelete
    Replies
    1. శంకర్ గారు,

      హమ్మయ్య పీడా విరగడ అయ్యింది ! సో, థాంక్సండీ అంటారా ! ఆయ్!
      దెయ్యాలు అంత త్వరగా వదలవు సుమా !

      చీర్స్
      జిలేబి.

      Delete
  12. అమ్మ!

    సాయిరాం !!

    " స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే "

    ఉత్తములు దేనిని ఆచరిన్తురో లోకమంతయు దానినే అనుసరించును

    అని ఘంటసాల గారి గొంతులో కొన్ని వందల సార్లు విన్న పుణ్యమేమో

    ఇక నేను మీ బాట లోనే నడుద్దామని నిర్ణయించుకున్నాను

    ఒక మంచి ఆఖరి పోస్ట్ ని plan చేసి మరీ పెట్టుకున్నాను

    రేపు ఎల్లుండి సెలవు హాయిగా
    తనివితీరా తృప్తిగా ఆ పోస్ట్ చేసేసి

    "సాధకుడు" కి REDIRECT అవబోతున్నాను

    sadhakudu@googlegroups.com

    స్వామి శివానంద గారి గ్రంథము పూర్తి అయ్యాక పై address కి ఆ గ్రంథ సారంశమును

    (మీరు ఏమి గ్రహిస్తే అది mail చెయ్యగలరు)

    మన తెలుగు blogger లు అందరిలానే నేను కూడా

    మీ తదుపరి (బ్లాగేతర) జీవితం కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు

    ఆనంద ప్రదం కావాలని ఆశిస్తూ ....

    cheerful cheers Zilebi जी

    (చిరునవ్వు కళ్ళు చెమర్చటం simultaneously ఇదే మొదటిసారి)

    ధన్యోస్మి

    ?!

    ReplyDelete
    Replies
    1. 'తూచ్' టపా KI 'తూచ్' COMMENT !,

      వీలైనప్పుడు, అప్పుడప్పుడు మళ్ళీ పునర్దర్శనం !)


      ?!

      Delete
  13. జిలేబి గారు, ప్రపంచమే ఒకటైనప్పుడు, మీరు ఏ జనారణ్యాలకెళ్ళినా ఫరువాలేదు. ఇప్పటిలాగే రెండు చేతులా రాసేయండి. మన మోహనుల వారిని అడిగానని చెప్పండి. నో బాయ్ బాయ్:) All the best.

    ReplyDelete
  14. Kastephale garu cheppinattu meeru inka blog lu rastune undali , alage mee job kuda manage cheyyandi :) all the best :)

    ReplyDelete
  15. పై లోకాలలోకే ఐడియా వాళ్ళు వెళుతుంటే, మీ వనారణ్యాలకి వాళ్ళు రాలేరా?

    అక్కడనుంచే టపాయించండి. బ్లాగులకి టపా కట్టద్దు.

    ReplyDelete