Thursday, April 19, 2012

గోవిందా గోవిందా గోవిందా !

గోవిందా గోవిందా గోవిందా !

ఒక వైపు చెవులు పోటెత్తే టట్టు భక్తుల భక్తి పరవశ ఘోషలు.

మరో వైపు, ఘంటసాల వారి భగవద్గీత - పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వారికి....

ఇంకో వైపు, పండితుల వేద పారాయణం - 'సహస్ర శీర్షాః పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ....

అక్కడ , వెంకటేశ్వర సుప్రభాతం -

ఇక్కడ గోవిందా గోవిందా ఓం ఓం ఓం అంటున్న ఘంటా నాదం

మరో వైపు బస్సుల కి పరుగెడుతున్న భక్త జనవాహిని

ఇంకో వైపు సరికొత్త పెళ్ళైన జంట  మరో వైపు ప్రేమ పక్షులు ... ఆ వైపు  షష్టి పూర్తి చేసుకుంటున్న దంపతులు

ఒక వైపు ఉర్రూత లూగించు పవనాలు

మరో వైపు వేడి తాకిడి

ఇంకో వైపు భోజనాల హడావిడి

పుస్తక ప్రచురణల అంగడి

దైవ దర్శనం కోరి వేచి ఉన్న లక్షలాది భక్త జన వాహిని

దేవస్థానం వారి ఆఫీసు బిళ్ళ బంట్రోతు

స్వామీ వారి ఉత్సవ తేరు

ఒక వైపు భక్తి బృందం గోవిందా మరో వైపు పూజారుల మంత్రాల జోరు

వడ్డీ కాసుల వసూలు లెక్కలు ... బంగారం గ్రాముల కొలతలు .... జమా ఖర్చులు ...

వంటా వార్పూ... అన్నదాన పర్వం...

వీటన్ని మధ్యా నిశ్శబ్దం గా నిలబడి,   జనావళి  కి ఇంత పని బెట్టి , నిశ్చేతనం గా   గమనిస్తున్న మా ఏడుకొండల పెరుమాళ్ళు !

ఏడు కొండల వాడా, వెంకట రమణా,

గోవిందా గోవిందా గోవిందా
 
జిలేబి.

11 comments:

  1. * నాకు ప్రమోషనొచ్చి లక్ష రూపాయల ఇన్క్రిమెంట్ వస్తే నీ హుండీలో ఒక రెండు వేలు వేస్తానని మొక్కి, మొక్కుబడి చెల్లించడానికి వచ్చిన 'భక్తుడు'
    * కాంట్రాక్ట్ నాకే దక్కితే, ఎంతో కొంత నీకూ ముట్టబెట్టుకుంటాలే అని లావాదేవీ చేయడానికి వచ్చిన 'భక్తుడు'
    * మీ అమ్మ కడుపుగాలా, పుష్కరిణిలో సబ్బు వాడొద్దంటే, ఏకంగా రిన్ సోపెట్టి బట్టలుతికేస్తున్నావురా అని దేవస్థానం ఉద్యోగి చేతిలో తిట్లు తింటున్న 'భక్తుడు'
    * ఈ వేచిఉన్న భక్తులందరూ ఎదవలు. హి! హీ! నా బావమరిది వాళ్ళ కొలీగ్ మామయ్యకి తెలిసిన జడ్జి రికమెండేషన్‌తో ఎంచక్కా VIP break లో దర్శనం చేసుకుంటున్నానని మురిసిపోయే 'భక్తుడు'
    * ప్రసాదమంటే, స్వామివారి ఉచ్చిష్టం. అది రవ్వంతైనా చాలులే అని ఆలోచించక, అడ్డదారుల్లో లడ్లు సంపాదించాలని ప్రయత్నించే 'భక్తుడు'
    * కలియుగ వైకుంఠంలో ఎదురుగా ఉన్నది సాక్షాత్ శ్రీ మహావిష్ణువేనని ఎరుగక, ఒక ఐదు సెకండ్లు అక్కడే నిల్చొని స్వామిని చూడనిస్తాడని అక్కడున్న సిబ్బంది చేతిలో వంద రూపాయల లంచం పెట్టే 'భక్తుడు'

    ఇట్టాంటి ఎందరో భక్తుల అతి తెలివి లేదా తెలివి తక్కువతనం చూసి, నిశ్చేష్టుడై పాపం అలా నిలబడిపోయిఉంటే, మీరేవిటండీ 'జనావళికి పనిబెట్టాడని' మా స్వామివారిమీద నిందలేస్తారు? ఆఁయ్‌!!! అమ్మా!!!

    ReplyDelete
    Replies
    1. తెలుగు భావాలు గారు,

      హమ్మోయ్, ఇన్ని విధాల స్వామీ వారికి కానుకలు వస్తున్నాయన్న మాట !

      జిలేబి.

      Delete
  2. ఎంకన్న బాబు అన్ని చూస్తున్నాడు, నిశ్చలంగా నిలబడి...కుంచం నిండాలి...పాపం పండాలి...

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      పాపం పండినా, ఫలితం ఉంటుం దంటారా ?

      జిలేబి.

      Delete
  3. తిరుపతి వెళ్ళారా౦డీ...

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మాయీ వారు,

      మళ్ళీ ఉద్యోగ పర్వం కదా ! కొంత స్వామీ వారికి కొంత కానుకలు చెల్లించు కోవాలి కదా మరి !

      జిలేబి.

      Delete
  4. అంతస్థ మాత్మానం మజం నదృష్ట్వా భ్రమంతి మూఢాః గిరి గహ్వరేషు

    ReplyDelete
    Replies
    1. అయ్‌బాబోయ్‌!!! అంటే మీరు తిరుమలకు వెళ్ళరా శ్యామలరావుగారు?

      Delete
    2. శ్యామలీయం వారు,

      జేబులో ఉన్న పది రూపాయలు విలువెక్కువ, కనబడని నిధి నిక్షేపాల కన్నా !

      చీర్స్
      జిలేబి.

      Delete
  5. జిలిబిలి 'జిలేబి' తినితిని
    కలియుగ వైకుంఠ 'లడ్డు' ఘనమనిపించెన్
    అలివేలు మంగ దాసుని
    యలికము సాక్షాత్కరించె నద్భుత రీతిన్

    ReplyDelete
    Replies
    1. లక్కాకుల వారు,

      నెనర్లు ! అలివేలు మంగా దాసుడు వరాల మారాజు గదండీ మరి !


      చీర్స్
      జిలేబి.

      Delete