Tuesday, May 8, 2012

ఏమండీ బాగున్నారా ?

ఏమండీ బాగున్నారా  ?

'ఆ, ఎం బాగు లెండి. ఏదో అలా కాలం గడిపేస్తున్నాం. అంతే 

ఏమిటండీ మీరే అలా అనే సారు ?

అంతే కదండీ, ఏదో రిటైర్మెంటు రోజులకి సరిపోతాయని సేవింగ్సు మన్నూ మశానం అంటూ కూడ బెట్టామా? అది చేతికి వస్తుందో లేదో తెలీకండా పోతోంది

దానికేమి లెండి, వస్తుందనే అనుకోవాలి . పిల్లలు బాగా చదివి పైకోచ్చారు గా. వాళ్ళు చేతి కంది రాక పోతారంటారా ?

వాళ్ళు చదివే కాలం లో కష్ట పడ్డాం. బాగా చదివించాలని. ఇప్పుడు దేశానికోక్కడు లేడు. పొలోమని విదేశాల మీద పడ్డారు.

అంటే ఎన్నారై అని చెప్పండి. మరి మీరు మరీ అదృష్ట వంతులే సుమండీ ! పిల్లలు మంచి పోసిషన్ కి వచ్చేరన్న మాట .

ఆ ఎం బాగు లెండి, వాళ్ళు చేతి కంది, ఆ పై కెళ్ళి పోయారు. మన జీవితం ఇంతే కదా ఇక్కడ. నో చేంజ్ అందుకే ఆదుర్దా, అసలు మన పెన్షన్ వస్తుందంటారా ?

మీకో అమ్మాయి ఉండాలే . పెళ్ళయి పోయిందా ?

ఆ ఎం బాగు. పెళ్లి అయింది అయి నాలుగేళ్ళు రెండు పాపలతో ఒకటే కనా కష్టం పడుతుంది.

అదేమిటండీ, పాపలు ఇంటికి దీపాలు కదండీ

ఆ ఎం దీపాలో ఏమిటో ? వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు, అబ్బబ్బ, మా అమ్మాయి ఒకటే కలవరం.

ఏమండీ అదెప్పుడో ఇంకో ఇరవై ఏళ్ల పై బడే కదండీ . దానికిప్పుడే హైరానా పడి పోతే ఎలాగండీ ?

కాదుటండీ మరి, అయినా మనం ముందస్తే దానికి కాబోయే ఖర్చులకి ఇప్పట్నించే కూడ బెట్టాలి. అబ్బబ్బ, ఎం బాగు లెండి జీవితాలు. అన్నిటికి ఒకటే పరుగో పరుగు.

అంతే లెండి. జీవితం భవిష్యత్తు కి అంకితం అయిపోయింది మరి. ప్రస్తుతం వస్తుతః భవిష్యోత్తర 'పురాణం' !


చీర్స్
జిలేబి.

14 comments:

  1. Replies
    1. అంతే నేమో నండీ వనజ వనమాలీ గారు


      జిలేబి.

      Delete
  2. > రెండు పాపలతో
    'ఇద్దరు పాపలతో' అనాలనుకుంటాను.

    [ షౌకత్ అని ఒక డ్రైవరు ఉండేవాడు నాదగ్గర. అతనొకసారి 'నాకు మూడు చెల్లి ఉంది' అంటే పడిపడి నవ్వుకున్నాం అతడు వెళ్ళాక. ]

    ReplyDelete
    Replies
    1. అయ్యా శ్యామలీయం వారు,

      మీరు మరీ కని బెడతారండీ జిలేబీ వ్రాతల లో 'కోతలని'!


      చీర్స్
      జిలేబి.

      Delete
  3. ఇంతకీ "ఏమండీ మీరు బాగున్నారా"?
    చాలా రోజుల తర్వాత కనిపించారు...

    ReplyDelete
    Replies
    1. బాగు బాగు రాజి గారు,

      ఉభయ కుశలోపరి !

      చీర్స్
      జిలేబి.

      Delete
  4. Replies
    1. డబల్ పరుగో పరుగు ఎందుకో ఏమో గారు


      జిలేబి.

      Delete
  5. ఇంతకూ పెన్షన్ వచ్చిందా?లేదా?

    ReplyDelete
    Replies
    1. చిలమకూరు విజయమోహన్ గారు,

      పెన్షన్ వస్తుందన్న ఆశ తో నే జీవితం సాగిస్తున్నామండోయ్!

      చీర్స్
      జిలేబి.

      Delete
  6. ఇంతకీ ఎవర్ని అడిగారు?

    >>>జీవితం భవిష్యత్తు కి అంకితం అయిపోయింది మరి.
    లెస్స పలికితిరి.

    ReplyDelete
    Replies
    1. బులుసు గారు,

      అంతే కదండీ మరి. బహుకాల దర్శనం!

      చీర్స్
      జిలేబి.

      Delete
  7. న భూతో న భవిష్యతి

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      కరెక్టు గా చెప్పేరు. రెండు మూడు రోజులు గా మీ టపాలు కనిపించడం లేదు మరి! మరీ బిజీ అన్న మాట

      జిలేబి.

      Delete