Saturday, May 19, 2012

మీటింగ్ మిస్టర్ సుబ్బూ ఆన్ ది స్ట్రీట్ - (సుబ్బూ సుభాషితాలు )

నిన్న బ్రాడీ పేట లో వాకింగ్ వెళ్తూంటే డాక్టర్ రమణ గారి సుబ్బు హటాత్తు గా ప్రత్యక్షమై 'ఏమండీ జిలేబీ గారు బాగున్నారా ' అన్నాడు!

'ఓహ్, సుబ్బూ గారు మీరా ' అన్నా 

'అబ్బే, ఆ గారూ వగైరా ఎందుకు లెండి. జస్ట్ కాల్ మీ సుబ్బూ' అన్నాడు వినయంగా.

ఏమోయ్ సుబ్బూ అన్నా వాడన్నాడు కదా అని.

'అదేమిటండీ ఏకవచనం లో పిలుస్తారు ?' అన్నాడు సుబ్బు సీరియస్ గా.

'అదేమిటోయ్, నువ్వే కదా సారీ మీరే కదా జస్ట్ కాల్ మి సుబ్బూ అన్నావు సారీ అన్నారు' అన్నా.

'అదేంటి, జస్ట్ కాల్ మీ సుబ్బూ అంటే, వెంటనే 'ఏమోయ్' అనెయ్యడమేనా ?'  

'మరి?' అన్నా ఏమనాలో తెలియక.

'మొహమాటానికి ఎన్నో అంటూంటాం. వెంటనే దాన్ని వంద శాతం పాటించడమేనా ?'

'సారీ సుబ్బు గారు, తప్పైపోయింది క్షమించండి'

అదేమిటండీ, జస్ట్ కాల్ మీ సుబ్బూ, ఇట్స్ ఓకే ' అన్నాడు మళ్ళీ.

'మిస్టర్ సుబ్బు, కాఫీ తాగుతారా '

కాఫీ ఎందుకు లెండి, ఈ మండే ఎండలో కూడా మా డాక్టరు బాబు ఎప్పుడు వెళ్ళినా కాఫీ ఏ కొట్టిస్తుంటాడు. మీరు కూల్డ్రింక్స్ కొట్టించండి ' అన్నాడు.

మరి కూల్డ్రింక్స్ అంటే, వాటి పాలిటిక్స్ గురించి సుబ్బు చెబుతాడేమో అని కొంత అనుమాన పడి, ' మిస్టర్ సుబ్బూ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ?' అన్నా.

'అసలు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అంటూ ఏదైనా ఉందంటారా ?'

'వై మిస్టర్ సుబ్బూ. ఈ మధ్య పెక్డ్ బాటల్స్ లో కూడా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ వస్తోంది కదా ' అన్నా.

'చూడండి, మిస్, ఫ్రెష్ అని వాడంటాడు మరి మనకి తెలియదా అది ఎంత ఫ్రెష్ అనో '

సరే పోనీ, చాయ్ తాగుతారా మిస్టర్ సుబ్బూ..'

అదీ, అలాగ చెప్పండి, ఇట్స్ అవర్ నేషనల్ డ్రింక్. కాబట్టి చాయ్ తాగడం బెటర్'

'మిస్టర్ సుబ్బూ.,. నేషనల్ డ్రింక్ అన్నంత మాత్రాన మీ కిష్టమైన కాఫీ వదులు కోవడ మేనా ?' అన్నా దక్షిణ దేశ కాఫీ పాలిటిక్స్ ప్లస్ ప్లాంటేషన్స్ గుర్తుకు తెచ్చు కుంటూ.

'చూడండి, మిస్, మనం కాఫీ ఇప్పడు వద్దే వద్దు అన్నా మనుకొండీ, డిమాండ్ ధమాల్ దానికి. ధర పడి పోతుంది. చాయ్ ధర షూట్ అప్ అవుతుంది.'

అయితే ?

'చాయ్' ధర ని తగ్గించడానికి చాయ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు '

'అవురా, చాయ్ ఎక్స్పోర్టింగ్ మార్కెట్ నించి, చాయ్ ఇంపోర్టింగ్ మార్కెట్ అవుతుందన్న మాట మన దేశం ?'

'హ్హ హ్హ హ్హ' నవ్వాడు మిస్టర్ సుబ్బూ.

హుష్ కాకి. సుబ్బూ గాయబ్. మళ్ళీ బ్రాడీ పేట లో నడక మొదలెట్టాను!

(బ్రాడీ పేట లో షికార్, సుబ్బూతో ముఖాముఖి- డాక్టర్ రమణ గారికి అంకితం!))

చీర్స్
జిలేబి.

11 comments:

  1. ఏవండి జిలేబమ్మ గారు ...

    ఎలా ఉన్నారేటి ?

    ReplyDelete
    Replies
    1. @రాఫ్సన్ మహాశయా,

      బహు కాల దర్శనం. బాగు బాగు ! సర్వం విష్ణు మాయ!

      చీర్స్
      జిలేబి.

      Delete
  2. "రవణ మావా! కాఫీ." అంటూ హడావుడిగా వచ్చాడు సుడిగాలి సుబ్బు.

    "కూర్చో!"

    "ఇందాక నీ ఫ్రెండ్ జాంగ్రీ కనిపించారు."

    "సుబ్బూ! నీ మతిమరుపుతో పేర్లు మార్చేస్తుంటావు. వారి పేరు జాంగ్రీ కాదు. జిలేబి. వారిని నీ వాగుడుతో ఇబ్బంది పెట్టలేదు గదా!"

    "నో! నో! జిలేబి గారూ, నేనూ ఇంచక్కా కబుర్లు చెప్పుకున్నాం. నీకు నా కబుర్లంటే చులకన గానీ.. జిలేబి గారు నీకులా కాదు. చాలా తెలివైనవారు. "

    "సర్లే! అఘోరించావ్. ఒరే నాన్నా సుబ్బూ! ఏదో పరువుగా బ్రతుకుతున్నాను. నువ్వు నా బుర్ర తింటున్నట్లు ఇంకెవరి బుర్రా తినకు. అంతగా ఆకలేస్తే రోజూ ఇంకో ఉప్మా పెసరట్ తిను."

    ఇంతలో కాఫీ వచ్చింది.

    కాఫీ సిప్ చేస్తూ.. "అన్నట్లు నీకీ విషయం తెలీదు కదూ!" అంటూ చెప్పడం మొదలెట్టాడు మా సుబ్బు......

    (ఇవ్వాళ మా సుబ్బుని పలకరించిన జిలేబి గారికి ధన్యవాదములతో.. )

    ReplyDelete
    Replies
    1. డాక్టరు గారూ, మీకు వ్యాపారం నేర్పిద్దామని నేను విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం సున్నా. మీ సుబ్బు కాపీ రైటును ఆవిడ వాడుకున్నందుకు ఫీజు అడగకుండా మీరు కామెంటడం బాగుందా? ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో?

      Delete
    2. ఔరా!

      డాక్టర్ రమణ గారికి ఆల్రెడి ఖబురు అందించేసాడన్నా మాట సుబ్బు! ధన్యవాదాలండీ డాక్టరు గారు రమణ గారు.

      @జైగొట్టిముక్కల వారు,

      డాక్టరు గారు పాత కాలపు డాక్టరు లా ఉన్నారు.! నో 'బిజి' నెస్ !

      చీర్స్
      జిలేబి.

      Delete
  3. జిలేబి గారు సుబ్బు కలిసినప్పుడు ఎన్నికల పలితాలు ఎలా ఉంటాయో అడగ కుండా వదిలేశారేం

    ReplyDelete
  4. @బుద్ధా మురళి గారు,

    దానికి డాక్టరు రమణ గారే అడగాలి! ఆ విషయాలు వారి ద్వారానే తెలియాలి మరి !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. Mr. సుబ్బు అస్కింగ్ కూల్ డ్రింక్ మరేమో మీరు చాయ్ డ్రింక్పించారు. ఎంతైనా తెలివైన వారు మీరు.

    ReplyDelete
  6. జిలేబీ గారు!.. మీరు ఎంత హాట్ అయితే మాత్రం.. పాపం సుబ్బు తో.. హాట్ టీ ..తాగిస్తారా!?
    గుంటూరు కేంద్రంగా టుబాకో,మిర్చి ఎక్స్పోర్ట్ కావడం లేదు. మీరేమో.. మళ్ళీ "టీ " ని కూడా ఇంపోర్ట్ చేసుకోమంటున్నారు.
    మీరు బహుళజాతి సంస్థల ఏజంట్ ..!? మేము ఒప్పుకోం. నేషనల్ డ్రింక్ .. కూడా మాకు వద్దు. ఏదో కాఫీ తో బతికేస్తాం.
    మరి డాక్టర్ గారికి "సుబ్బు" సుభాషితం లేనిదే.. "బిజీ"లెస్ లైఫ్ ఎలాగూ..అంటా!?

    ReplyDelete
  7. ఎక్పోర్ట్ నుంచి ఇంపోర్టుకు తేగలిగినదే గొప్ప.

    ReplyDelete
  8. మంచి కాఫీ లాంటి post లో నా comment లేక పోతే ఎలా?

    మీకేవ్వరికి ఏమి భయం లేదు

    కాఫీ , టీ , జూస్ ఏదైనా సరే లాగించేందుకు నేను ready

    :)

    వాస్తవం లో ఆనందం పాళ్ళు 1 % అయితే ఊహల్లో 101 % ఉంటుంది
    బాగుంది
    ?!

    ReplyDelete