Thursday, June 7, 2012

మీకు మీరే మాకు మేమే, ఎందుకీ రుస రుస బుస బుస !

మీకు మీరే మాకు మేమే, ఎందుకీ రుస రుస బుస బుస అని గుండమ్మ కథ లో అందంగా చెప్పే సేరు.

మా అయ్యరి గారి తో ఈ మాటే అంటే, పెళ్లి కి ముందు మాట వరసకి నేనన్న మాట గుర్తుకు తెచ్చేరు.

'జిలేబీ, పెళ్లి కి ముందు ఏమన్నావ్ '

ఏమన్నా అన్నా.

'మీ దారే మా దారి అండీ ' అన్నావా లేదా ?

అన్నా చెప్పా.

అయితే, ఇప్పుడు మీకు మీరే మాకు మేమే అంటే ఎట్లా ?

అది సరే స్వామీ వారు, పెళ్లి కి ముందు అమ్మాయిని. ఇప్పుడు బామ్మని. కాదా మరి అన్నా.

అవును. అయినా ఆ పలుకు మారాలా ?

కాదా మరి ? మీకు వయసు మీద బడే. మీ దారే మాదారి అంటే, మీకు అసలే కళ్ళు  కనబడడం ఓ మోస్తరు అయి పోయింది. మీదారే మాదారి అని మిమ్మల్ని ఫాలో అవర్ హబ్బీ అని ఫాలో అయితే, నేరుగా ఏ  ఏట్లో  కో మీరు వెళి తే  నేనేమి చేసేది స్వామీ వారు ' అన్నా.

ఆ, అన్నారు మా అయ్యరు గారు.

మా కొండ దేవర అమ్మ వారు కూడా అంతే గా మరి, స్వామి వారు పై తిరుపతి లో ఉంటే, అలిమేలు మంగమ్మ వారు, సేఫ్ గా మంగా పురం లో సెటల్  అయి పోయేరు ఎందుకైనా మంచిది అని, అసలే స్వామీ వారు మరీ 'ఓల్డ్' మ్యాను ! అమ్మవారి పాటి తెలివి మా కుండ కూడదా మరి !

చీర్స్
జిలేబి.  

18 comments:

  1. మోకాళ్ళ నెప్పులున్న అమ్మవారు కొండెక్క లేక రొదగా వున్నా కిందనే వుండిపోయి వుంటారు. అయ్యవారికి అలాంటి బాధలేవీ లేవేమో, చక్కటి ప్రశాంతమైన, గాలి, కోనేరు, వెలుతురు కల ఆహ్లాదకరమైన జలపాతాలున్న కొండెక్కారు. అదేకదా... అర్థం చేసికోరు, ఆపై బామ్మలకు చాదస్తమొకటి.
    "కాన లేరు నీ మహిమా... ఆ ఆ.ఆ...నటన సూత్రధారి ఈ ఈ
    దేవ దేవ పరంధామ నీల మేఘశ్యామా ఆ.. ఆ.. ఆ "

    ReplyDelete
    Replies
    1. శంకర్ గారు,

      అంతా కాల మహిమ. స్వామీ వారు దేవేరి అంతా ఓల్డు ఆయే మరి!~


      జిలేబి.

      Delete
  2. కాదా మరి ? మీకు వయసు మీద బడే. మీ దారే మాదారి అంటే, మీకు అసలే కళ్ళు కనబడడం ఓ మోస్తరు అయి పోయింది. మీదారే మాదారి అని మిమ్మల్ని ఫాలో అవర్ హబ్బీ అని ఫాలో అయితే, నేరుగా ఏ ఏట్లో కో మీరు వెళి తే నేనేమి చేసేది స్వామీ వారు ' అన్నా.

    హన్నన్నా! ఎంత అన్యాయం!! సార్ వాడిని ఈవయసులో వదిలేస్తే, మీదారి మీదని... వామ్మో!!!

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,


      వదిలెయ్యడం మాత్రం లేదండోయ్. అప్పుడప్పుడు ఇలా హడతాలు చెయ్య డన్న మాట

      జిలేబి.

      Delete
  3. ‘ఆయన’ఓల్డ్ మ్యానే గాదు గోల్డ్ మ్యాన్ కూడా గోల్డ్ వెంట మనమూ ఉండాలి కదా!

    ReplyDelete
    Replies
    1. చిలమకూరు గారు,

      గోల్డు మ్యాను కదా ! కాబట్టి ఓల్డు అయినా మనవారే అన్న మాట!

      చీర్స్
      జిలేబి.

      Delete
  4. యూ ఆర్ యాబ్సొల్యూట్లీ కరెక్ట్. ఎవరి మాటా వినకండి... మీ దారిన మీరు వెళ్ళిపొండి. (అమ్మయ్య జంబునాథం గారికి ఇప్పటికైనా విముక్తి లభిస్తోంది :))

    ReplyDelete
    Replies
    1. పురాణ ఫండ వారు,

      అంత సులభంగా జమ్బునాధన్ వారిని వదిలి పెడతా మా ! అప్పుడప్పుడు ఇలా గడమాయిస్తూ వుంటాం ! అదన్న మాట

      చీర్స్
      జిలేబి.

      Delete
    2. మీకు మీరే మాకు మేమే పాట మిస్సమ్మలోది కదూ... గుండమ్మ కధలో ఉందా?

      Delete
  5. "మీ దారే మా దారి" పాలిసీని మార్చడం బాలేదు. "మీకు మీరే మాకు మేమే" అంటూ పాపం ఈ వయసులో ఆయన్ని కష్ట పెట్టడం ఎందుకు?

    "మా దారే మీ దారి" పాలిసి అన్నిటి కంటే ఉత్తమం. పాలసీ ఒకటే, పోసిషన్లు మారిస్తే సరి. A woman's favorite position is Boss (in the house too)!

    ReplyDelete
    Replies
    1. జై గొట్టి ముక్కలు గారు,


      మాంచి మాట చెప్పేరు.!

      చీర్స్
      జిలేబి.

      Delete
  6. >మీకు మీరే మాకు మేమే, ఎందుకీ రుస రుస బుస బుస అని గుండమ్మ కథ లో అందంగా చెప్పే సేరు. ...

    జిలేబీగారూ, ఈ పాట "మిస్సమ్మ" సినిమాలోనిదండీ. గుండమ్మకథ లోనిది కాదు!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      పట్టేసేరు లొసుగు!

      మిస్సమ్మ అయినా గుండమ్మే కదండీ (సావిత్రి గారు!)
      చీర్స్
      జిలేబి.

      Delete
    2. మళ్ళీ తప్పులో కాలేసారూ.
      గుండమ్మ వేషం సూరేకాంతానిది - తిరుగులేదు.. సావిత్రి సూరేకాంతం (మారుటి)కూతురు.

      Delete
  7. "మీకు మీరే మాకు మేమే, ఎందుకీ రుస రుస బుస బుస "

    జిలేబీ గారు వేడి పాలలో మునకేసారు.(పప్పులో కాలేసినట్టు)

    ఈ పాట గుండమ్మ కథ సినిమాలోది కాదు. మిస్సమ్మ సినిమాలోది.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు,

      మీరూ పట్టేసేరు!

      పై సమాదానము చూడవలె!

      చీర్స్
      జిలేబి.

      Delete
  8. Replies
    1. పద్మార్పిత గారు,

      రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు రెండింతలు గా మీకు నచ్చినందులకు నెనర్లు!

      చీర్స్
      జిలేబి.

      Delete