Saturday, June 9, 2012

మేం వయసు కొచ్చేసాం!

మేం వయసు కొచ్చేసాం!

అదేమిటండీ, ఏ స్వీట్ సిక్స్టీన్ లోనో, కాకుంటే, టీన్ అటారః లో నో చెప్పాల్సిన మాట ఇట్లా రిటైర్మెంటు ఏజు లో చెబ్తున్నారు ?

అవునండీ, మరి, వయసు కొచ్చాం అంటే, ఏ వయసుకు అని అడగకుండా, మీరే అట్లా ఊహించు కుంటే ఎలా మరి !

ఇంతకీ ఏ వయసు కొచ్చారు?

మతిమరపు వయసు కొచ్చామండీ మరి !

అదేమిటండీ ??

అంతే కదండీ మరి, నిన్న మా జంబునాధన్ అయ్యరు గారి తో బజారు కెళ్ళి వారిని మధ్య దారిలో మరిచి ఇంటికి వచ్చాక,

'అయ్యోరామా, అయ్యరు గారు ఏమయ్యారు చెప్మా బామ్మా అంటే,

'ఔరా, వీర్ని మరిచి పోయామే ఎట్లా మరి అని వయసు కోచ్చేసాం అని తీర్మానించు కునేసా ! అదన్న మాట విషయం.

'జాంబజారు జగ్గు నా సైదా పెట్టై కొక్కు ' అని అరవం లో ఒక (మా) పాత కాలపు పాట ఉందండోయ్ !

అదేమిటండీ, పాత కాలపు పాటల్ని గుర్తుకు పెట్టుకున్నారు.

 (ఈ మాట అంటే, శ్యామలీయం వారు, అదీ సరిగ్గా గుర్తుకు పెట్టు కోలేదు సుమీ అంటారేమో మరి !- రుస రుస బుస బుస గుండమ్మ కథ లోనిది అని చెప్పినట్టు!) ,

మరి మీ ఈ కాలపు అయ్యరు గారిని మరిచి పోయారు సుమీ అంటారా ?

మరి ఈ 'మతిమరుపు' వయసు కొచ్చాం కాబట్టి, ఈ వయసు జాడ్యం కూడా ఇది మరి, పాతవన్నీ టపీ టపీ మని గుర్తు కోచ్చేస్తాయ్,

ప్రతి దానికీ, 'మా చిన్నప్పు డండీ అని మొదలెడతాం చూడండీ ,

కాకుంటే, మేం చదువుకునే రోజులల్లో అంటూ కథలు చెప్పడం మొదలెడతాం చూడండీ అప్పుడే తెలిసి పోతుంది మరి, మేం వయసు కొచ్చేసామని !

మా కాలం లో నండీ మరి ......

మిస్సమ్మ అనే చిత్రం లో 'పల్లెకు పోదాం, పారు ని చూద్దాం' అని ఓ బ్రహ్మాండమైన హిట్ సాంగ్ వుండే దండీ! ....


చీర్స్
జీరింగ్లీ జిలేబి.

10 comments:

  1. మీరు ఇప్పుడు వయసుకోచ్చారా..మేము ఎప్పుడో వచ్చేశాము సుమండీ...

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మాయీ వారు,

      పదండి ముందుకు
      పదండి తోసుకు
      పెడదాం పెడదాం
      'మతి' మరు 'పూస' క్లబ్!

      చీర్స్
      జిలేబి.

      Delete
  2. అయ్యో! జంబునాధం గారు మీకోసం వెతుక్కుంటున్నట్లుంది, చూడండి. :)

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      వారు మహా ఘటికులండీ, అక్కడ ఇక్కడా వెదికి ఇంటికి వచ్చి మనవరాలి తో బహు సంతోష పడి పోయేరు. హమ్మయ్య జిలేబీ తంటా వదిలింది, ఎవరో జిలేబీ ని 'కిడ్' నాప్ చేసేసేరు సుమీ అని.

      మనవరాలంది, బామ్మ వంట గది లో కత్తి నూరు తోందని !

      చీర్స్
      జిలేబి.

      Delete
  3. >మిస్సమ్మ అనే చిత్రం లో 'పల్లెకు పోదాం, పారు ని చూద్దాం' అని ఓ బ్రహ్మాండమైన హిట్ సాంగ్ వుండే దండీ! ....

    మీకు పాతసినిమాలు తెలుసు. మీకు పాతసినిమాలలోని పాటలూ తెలుసు.
    అందుచేత మీరే వయసులోకి వచ్చేసారో తెలుస్తూనే ఉంది. కాబట్టి మీ యిష్టం వచ్చినట్లు (క్రాస్)మేచింగు చేసేసుకోండి వాటిని. తగులే భలే వినోదం అనీకూడా ఒక మంచి పాత పాట ఉంది. అది మీకే సినిమాలో కావలిస్తే దానిలో చచ్చినట్లు ఉంది. దట్సాల్.

    ReplyDelete
  4. శ్యామలీయం వారు,

    అగులే భలే కధనం,
    తగులే భలే వినోదం
    టీం అండ్ టైం పాస్!

    'బ్లాగొక్కింతయు లేదు టపాలున్ దప్పె!
    చేరి, మతి మరుపున్ మీద పడే !


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. palleku podam parunu chudam -- song from devadas, not missamma

    ReplyDelete
  6. అమ్మయ్యా అసలు విషయం కనిపెట్టేసాను. సినిమా పాటలు మర్చిపోతే ఓ టపా, అయ్యరు గారిని మర్చిపోతే ఇంకో టపా.
    మమ్మలని మరిచిపోతే ?????

    ReplyDelete
    Replies
    1. ప్రశ్నః మనని జిలేబీ గారు మర్చిపోతే?
      జవాబుః టపటపా

      Delete