Saturday, June 23, 2012

మూడో మారు జిలేబీ కోరితే ఖబడ్దార్ పెళ్లి కాన్సిల్ !

ఈ మధ్య అరవ దేశం వెళ్ళా.

మా మనవరాలు అరవ పేపరు ఇచ్చి బామ్మా మిర్చీ ఖబుర్లు (శర్మ గారి, ఫణి బాబు గారి ఖబుర్ల లా అన్న మాట !) చదువు, టైం పాస్స్ అవుతుంది అసలే మద్రాసులో వేడి ఎక్కువ కాస్త ఊరట పడతావు అంది.

అరవం మనకి అంత గా చదవడం రాదు. అక్షరాలు కూడా బలుక్కుంటూ చదివా,

మద్రాసు లో ఓ పెళ్లి లో , ఓ పెద్దాయన జిహ్వ చాపల్యం కొద్దీ , గులాబ్ జామూను మూడో మారు వెయ్య మన్నాడు వడ్డించే వాడితో.

వడ్డించే వాడు కాంట్రాక్టరు , కుదరదు పో,  అన్నాడు. ఎందుకోయ్ అని గొడవ పడ్డాడు ఆ పెద్దాయన.

ఆకుకి ఒక్క స్వీటే కాంట్రాక్టు లో వేస్తాం అన్నాడు వడ్డించే వాడు.

మాటా మాటా పెరిగే. జుట్లూ జుట్లూ జగడా లాడే! వీడు వాణ్ని తన్నే. వాడు వీడి బుర్ర రామకీర్తన గావించే. పెళ్లి పెటాకులయ్యే  స్టేజీ కి వస్తే పోలీసొడు మధ్యస్థం చేసి పెళ్లి ఆగి పోకుండా చేసేడు.

అదీ కథ !

సో, మీరు ఏ పెళ్లి కయినా వెళితే ఒక్క పారి మించి జిలేబీ వడ్డించ మని అడగ మాకండీ!

బ్లాగ్ లోకం లో జిలేబీ  లంటారా, అన్లిమిటెడ్ ఎడిషన్ మరి !

ఎంజాయ్ మాడి !

'క్షీరస'
జిలేబి.

5 comments:

  1. ఎప్డి వందాచ్చి. నల్లా ఇరికారా. కుశలమా! నాకూ అరవం వచ్చండీ! జిలేబీలూ అడగం, మా దగ్గరే సుగర్ ఫేక్టరీ ఉందిగా!!!

    ReplyDelete
  2. మీ వైపు నాటుగా గులాబ్ జామూలు, జిలేబీలు వడ్డిస్తారేమో. మా సైడు క్లాసుగా పేరు తెలీని స్వీట్లు మాత్రమే వడ్డిస్తారు. స్వీటు పేరు తెలీదు కావున.. రుచి కుదిరిందో, లేదో కూడా తెలీదు!

    ఐనా.. ఇప్పుడంతా బిక్షాపాత్రలా చేతిలో ప్లేటు పెట్టుకుని తిండమే కదండి! (దీనినే బఫే అందురు!)

    ReplyDelete
  3. ఇంతకీ సమస్య జామూన్లా? జిలేబీలా?

    చివర్లో కన్నడం మాట వేసారు.
    మీకు ఎన్ని భాషలు వచ్చేమిటి?

    ReplyDelete
  4. ఏమిటీ ఈ మధ్యన నన్నూ, మా శర్మగారినీ మీ టపాల్లోకి ఎక్కించేస్తున్నారూ ....

    ReplyDelete
  5. పూర్వం రోజుల్లో సహపంక్తి భోజనాలో, సమిష్టిభోజనాలో ఉండేవి. ఇప్పుడంతా స 'ముష్టి ' భోజనాలే కదండీ.
    భోజనానికి ముందూ, నీళ్ళకి వెనకా అని మనవాళ్లు సామెత ఎప్పుడో చెప్పారు. కనుక ఈ ముష్టిభోజనాల్లో ముందున్నవాడే ధన్యుడు.

    ReplyDelete