Tuesday, July 24, 2012

అసూర్యం పశ్య !

ఓ దొరసనాని అసూర్యం పశ్య !

తన మానాన తా బతికేసుకుంటూ కుటుంబాన్ని లాక్కోచ్చేది.

మగడు ఏమి తెచ్చినాడో దానిని బట్టి ఇంటిని సర్దేది. గృహ శోభ తానె అయి , వన్నె తెచ్చింది.

ప్చ్!

కాలగతిన ఓ రాజా రామ మోహన్ రాయ్ ,గురజాడ, సర్వే పల్లి, ఆ గృహ శోభ కి మరింత వన్నె తెద్దామని కొత్త పుంతలకి వరవడి చుట్టేరు.

కాలం మారింది.

ఇప్పుడు ఓ షబనా, ఓ తస్లీమా, ఓ శోభా దే, గృహ శోభ కి మరిన్ని మెరుగులు తెద్దామని సరి కొత్త ఆలోచనలకి పట్టం కడుతున్నారు.

ఓ స్త్రీ నీ నాడు ఒకరు నిర్ణ యించారు . నీ ఈ నాడు మరొకరు నిర్ణయిస్తున్నారు.

మరి నీ మాటేమిటి? నీ రాబోయే కాలం ఎవరి చేతిలో ఉన్నది? అది నీదేనా ?

లేక ఒకప్పటి అసూర్యం పశ్య మళ్ళీ 'అసంపుస్ప్రశ్య   అయి పోతోందా ?

ఎవరీ ప్రశ్న కి సమాధానం చెప్ప గలరు?

జిలేబి.

5 comments:

  1. ఇదేదో కవితాలావుందండి, మీ కవితాప్రశ్నకు మూడు చీర్లు.

    ReplyDelete
  2. కాలగతిన ఏదైనా మారవచ్చును.
    రాజా రామ మోహన్ రాయ్ ,గురజాడ, సర్వే పల్లి,
    పురుషులే కదా! అభివ్రుద్దిన్ని మనసారా కాంక్షించారు.
    అందరూ స్వాగతించి నట్లే..కనబడింది గాని వ్యతిరేకించిన వారు లేరా!? అలా ఇప్పుడు కూడా ఉన్నారు
    ఇప్పుడు ఇంకా వెర్రి తో.. చెడిపోతామంటే ఏం చేద్దాం చెప్పండి ? మంచి-చెడు విచక్షణ ఉంటే కొంత బెటర్.
    చెడిపోవడానికి పోటీ పడతాం అంటే!? అదోగతి.

    ReplyDelete
  3. ఏది మంచి ఏది చెడు? ఈ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది.

    అనేక విషయాలు సమకాలీనంగా అర్ధం కావు. దీనికి కారణం మనసులో ఉన్న నిన్నటి ఆలోచనలు.

    Yesterday's people can't understand today's trends or predict tomorrow's developments.

    ReplyDelete
  4. కాలమే సమాధానం చెప్పాలి.

    ReplyDelete