Wednesday, February 27, 2013

విప్రలంభ శృంగార యోగి !


విప్రలంభ శృంగార యోగి !
***photo courtesy googlaaya namah***
 

"మన దగ్గిర చుట్టమైన రాముడు
మహావీరుడూ ,
ప్రకృతి సౌందర్య పిపాసీ ,
దుష్టశిక్షకుడూ ,
శిష్టరక్షకుడూ,
ముఖ్యం గా విప్రలంభ శృంగార యోగిన్నీ !"
 
(వాల్మీకి మహర్షి విరచితం రామాయణం మూడో సంపుటం అరణ్య కాండ వాడుక భాషలో శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
వచనానువాదం - పబ్లిషర్స్  అద్దేపల్లి అండ్ కో - సరస్వతి పవర్ ప్రెస్ -రాజమహేంద్ర వరము - మొదటి కూర్పు 1956- 'సూచన' -ముందు మాట నించి )  
 


జిలేబి
 

Tuesday, February 26, 2013

పద్మావతీ టైమెంత ?

స్వామి వారడిగేరు - దేవీ పద్మావతీ టైమెంత ?

అమ్మవారు అలవోకగా చేతి గడియారం వైపు చూసింది.

రిస్ట్ వాచు లో స్వామి వారు జగజ్జేగీయ మానం గా కనబడ్డారు.

అబ్బా, వీరి సొబగే  సొబగు! ప్చ్! స్వామి వారిని మాత్రం ఆ స్విస్సు వాడు గడియారం లో పెట్టేడు. తన్నో, మంగ తాయారు నో కూడా చేర్చి ఉండ వచ్చుగా ? ఊహూ !

'ఎందుకో' ఎప్పుడూ టైమెంత అనని అయ్యవారు ఇట్లా ఈ వాచీ వచ్చినప్పటి నించి గంట కో మారు టైమెంత అనడం మొదలెట్టేరు !

'ఊరికే నే లే .  టైం ఎంతో తెలుసు కుందా మని . అంతే మరే ప్రత్యేకతా లేదు ' చెప్పేరు స్వామి వారు.

అబ్బబ్బా, ఏమి బడాయి ఈ స్వామీ వారిది ? ఆ గడియారం కంపెనీ వాడు, స్వామి వారికి ఓ గడియారం బహుమానం క్రింద ఇస్తే, స్వామీ వారు తన చేతికి కట్టి పద్మా బాగుందా అన్నాడు.

స్వామి వారి ముఖ వర్చస్సు అందులో చూసి 'ఆహా' అని అనుకో కుండా ఉండ లేక పోయింది పద్మావతీ దేవి.

చదువరీ, ఇంతకీ ఇట్లా స్వామి వారు ప్రతి గంట కీ అమ్మవారి ని టైమెంత అని ఎందుకు అడిగినట్టు ?


చీర్స్
జిలేబి. 

Saturday, February 23, 2013

కొండ దేవర స్విస్సు అకౌంటు కోసం పోనాడు !

స్విట్జర్ లాండు.

అతి పాపులర్ ఐన స్విస్సు బాంకు ముందు నిలబడ్డాడు  కొండ దేవర.

అక్కడ అటూ ఇటూ పోయే జనావళీ టై సరి జేసు కోవటం జూసి తానూ తన మెడలోని పూమాలని సరి జేసు కుని బాంకు లోకి అడుగు పెట్టాడు సామి.

'ఎస్ హౌ కేన్ ఐ హెల్ప్ యు సర్' అన్నది కౌంటరు దగ్గిర ఉన్న స్విస్సు భామామణి .

ఆవిడకి తెలుసు ఈ లాగా గెట్ అప్ లో వచ్చిన వాళ్ళు ఖచ్చితం గా 'భారద్దేశం' అనబడే దేశం నించి వచ్చే ఉంటారని, వీళ్ళకి అంగ్రేజీ తప్పించి లోకల్ భాష ఐన స్విస్ జర్మన్ తెలీదనీను. అందుకే ఆంగ్లం లో సంభోదించింది.

స్వామి కొద్దిగా జంకి 'దీర్ఘాయుష్మాన్ భవ ' అన్నాడు.

కౌంటర్ అమ్మాయి అర్థం కాకుండా నవ్వుతూ 'ఎస్ సర్' అంది.

కొద్దిగా ముందుకి వంగుతూ స్వామి చెప్పాడు, 'నాకో స్విస్సు అకౌంటు ఓపెన్ చెయ్యాలి - సీక్రెట్'!

ఎస్ సర్, మెజారిటీ ఆఫ్ అవర్ అకౌంట్ హోల్డర్స్ ఆర్ ఫ్రం యువర్ కంట్రీ సర్ - ఉయ్ గివ్ బెస్ట్ సర్వీస్'

'మా 'దివాణం' వాళ్ళు మీ ఊరి గడియారం లో నా ఫోటో పెట్టడానికి కమీషన్ నాకిస్తా మన్నారు.' చెప్పాడు స్వామి. కానీ ఆ కమీషన్ మా దేశం లో ఇవ్వడం కుదరదట నాకు, ఇక్కడే ఇస్తారట, అందుకే ... నాకిక్కడే అకౌంట్ కావాలి'

ఎస్ సర్ నో ప్రాబ్లెమ్ !

స్వామి ఈ మారు మళ్ళీ మెడలోని పూమాలని సర్దుకుని, 'ధన్యవాద్' చెప్పాడు .

ఆ అమ్మాయి కూడా ధన్యవాద్' అంది .

ఆ బ్యాంకు వాళ్ళు ఇట్లాంటి చిన్ని చిన్ని హిందీ పదాల్నీ , మరిన్ని చైనీసు పదాల్నీ పదాల్ని కౌంటర్ అమ్మాయిలికి చెప్పి పెట్టేరు వచ్చిన కష్ట మరలని సంతోష పెట్ట డానికి ~

స్వామీ సంతృప్తి గా తలూపి అక్కణ్ణించి ఓ SMS - కొట్టాడు - డీల్ డన్ -స్టార్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ - అని !


(మా స్వామి ఇంకా ఏ ఏ ఊళ్ళో అకౌంట్లు తెరవబోతాడో మరి !-

కొన్ని రోజులు పోతే నాయుడు హాల్ వాళ్ళు వచ్చి మా ప్రాడెక్ట్  మీద స్వామీ వారి బొమ్మేట్టేసు కుంటాం కూసింత కమీషను మీకూ ఇస్తాం అంటారేమో మరి !)

జిలేబి. 

Thursday, February 21, 2013

స'రస' సాహిత్యపు "జిలేబి" సరస నుండు!

రామ రామ ! - కంది వారు 'తెలుగు పద్యం చచ్చిందా అంటే , అయ్యో రామా , తెలుగు పద్యం జీవ మున్న పద్యము, దానికి చావులేదు అంటున్నారు తోపెల్ల  బాలసుబ్రహ్మణ్య శర్మ గారు !

మధ్య లో సరస సాహిత్యపు "జిలేబి" సరస నుండు అని జిలేబీ ని అక్కుజేర్చు కునేసారు!

ధన్యవాదాలండీ తోపెల్ల  వారు !
మహాభాగ్యం!

సరస సాహిత్యపు "జిలేబి" సరస నుండు

“కంది శంకరార్య” బ్లాగు కాంచు చుండ
పండితార్య” శ్రీనేమాని” పద్యధార
ముదము నిచ్చుచు”నేల్చూరి” మేథ తెలియు
“విష్ణు నందను” డనువైద్య విభుని జూడ
“మన తెలుగు చంద్ర శేఖరు” మహిమ గనుము
“గన్నవరపు” మెరపులుండు ఘనము గాను
“గోలి” వారి సద్యస్ఫూర్తి గ్రోలు చుండ
అన్న” మిస్సన్న” ధీశక్తి హాస్య రక్తి
జిగియు బిగియు జూడ దగును “జిగురు” వారి
కనుము”గండూరి” పద్యమ్ము గంగ యనగ
కవన వన “కమనీయము” నవవిధముల
“సంపతకుమార” పాండిత్య సహజ రీతి
సహజ పద్యంపు” సహదేవ” శక్తి జూడ
“నాగరాజు” నుడువ భవ్య నవ్య కవిత
“లక్కరాజు” వారిచ్చెడి లాస్య కవిత
“పోచిరాజం”త కవితల ప్రోది చేయ
నిత్యము “వసంత కోకిల” నిండు దనము
“మూర్తి” ముత్యాల పద్యాల మురిపెమివ్వ
“ఊక దంపుడు” కబ్బమ్ము నూదు వెండి
రాణ కెక్కిన “రాంభట్ల” రచన చదువ
“వామనకుమారు” ధారగ వర్ష మిడగ
సరస సాహిత్యపు "జిలేబి" సరస నుండు
అక్క” రాజేశ్వరి” కవిత లెక్క పెట్ట
వీణ మీటు “లక్ష్మీదేవి” వాణి యెపుడు
ప్రభల రామలక్ష్మి కవితా ప్రభల వెలుగ
అరస విరస సరసమ్ము లణగద్రొక్క
తెలుగు పద్యమెటుల చచ్చు? తెరచిచూడ
జీవి నిర్జీవి యగుచుండు జీవ గతిని
జీవ మున్న పద్యమునకు చావులేదు!
 
***తోపెల్ల  బాలసుబ్రహ్మణ్య శర్మ***
 
చీర్స్ 
జిలేబి Tuesday, February 19, 2013

కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు!

 
కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు!
సరికొత్త తెలుగు చిత్రం 
 
టైటిల్ క్రెడిట్ - జిలేబి
కథ కాన్సెప్ట్ - కృష్ణ ప్రియ 

*ఫోటో క్రెడిట్ 'గూగ్లాయనామః'* 
 
ఈ మధ్య మా సీతమ్మ తల్లి మరీ మరీ పాపులర్ అయిపోనాది !

సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు ఓ చిత్ర రాజం !

సీతమ్మ తలలో పేలు ! - ఓ పేరొందిన బ్లాగర్ గారి టపా !

సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి సాధించినది ఏమిటి ? మరో రౌడీ రాణి ప్రశ్న !

రామా, చట్  మ (ర) లా నీ (పై) కంప్లైంట్ ! ఓ జిలేబీ టపా !

ఆ పై ప్రతి ఒక్కరూ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు మీద టపా సినిమా రెవ్యూ రాసి పడెయ్యడం !

ఈ మధ్య యు ట్యూబ్ చూస్తే, మంగమ్మ వాకిట్లో మందార చెట్టు ! అన్న మరో 'మినీ సినిమా' కనబడ్డది!

వావ్ అనుకుంటే, కృష్ణ ప్రియ 'బ్లాగిణి'  గారు కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు కి కథ చెప్పెసేరు !

టూకీ గా 'కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు ' కథ కమామీషు!

కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు.. కాన్సెప్ట్
 
(గమనిక ఈ సినిమా టైటిలు కథ పేటెంటు రైటులు
సర్వం జిలేబీ &  కృష్ణ ప్రియ గారివి!
 
All right reserved!)

అక్కా చెల్లెళ్లు చెగోడీలు, పాలకాయలూ, అరటి పండ్లూ, చెరుకు గడలుతింటూ, తగువులాడుకుంటూ,..సద్దుకుపోతూ, ఊరెంబడ తిరుగుతూ, ఉంటారు

వెంట బడిన అబ్బాయిలని ‘పిలకెక్కడ రా నీకూ :) ‘ అనుకుంటూ వారి భరతం పడుతూ ఉంటారు !

అప్పుడేమో, ఆఅ ఊళ్ళోకి మన హీరో వస్తాడన్న మాట.

హీరో కి కర్వేపాకు అంటే మరీ మోపెడంత గంపెడంత ప్రియం.

ఏ  ఇంట్లో కర్వేపాకు చెట్టు ఉందో ఆ ఇంటి అమ్మాయినే మను వాడ తా నని ఘోరాతి ఘోరం గా తన బామ్మ  జిలేబీ దగ్గిర మన హీరో శపథం పట్టి ఆ ఊరు వచ్చాడన్న మాట !
అప్పుడేమో, హీరో బామ్మ జిలేబీ కర్వేపాకు గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ చెబ్తుం దన్న మాట !
ఫ్లాష్ బ్యాక్ ఏమో ఆఖరి దాకా డైరెక్టరు ప్రేక్షకులకి చెప్పడన్న మాట.

హీరొయిన్ ఎవరు సినిమా లో ?
బులుసు గారి ఫేవరైట్ సినీ తార ఇలియానా అన్న మాట.

హీరో ఎవరు మరి ?
పనిలేక రమణ గారి ఫేవరైట్ సినీ తారడు  అన్న మాట !

అప్పుడేమయ్యిం దంటే ....

ఎవరండీ అక్కడ ! కథ పొడిగించండి మరి !
 
ఎక్కడండీ రాజ్ కుమార్  & బులుసు గారలు ?
 కామెడీ ట్రెక్ రాయడానికి త్వరపడండి మరి !
కథా చిత్రానువాదానికి S. చందూ గారు
ఎక్కడున్నా వెంటనే రావలెను !
 
చిత్రం డైరెక్టు టు హొమ్ టెలికాస్ట్ చెయ్య బడును!
 
తలా ఓ వెయ్యి రూపాయలు చందా కట్టి
మీ ఒన్స్ ఇన్ లైఫ్ టైం మూవీ ప్రీమియర్  అడ్వాన్సు బుకింగ్ కి వేగిర పడండి !
 
చీర్స్
జిలేబి.

Monday, February 18, 2013

మనకు జ్యోతిష్యం మీద ఎందుకు ఎందుకు నమ్మకం తక్కువ ?


'ఏమోయ్ జిలేబీ మళ్ళీ జ్యోతిష్యం మీద పడ్డావు ?' అడిగారు మా అయ్యరు గారు.

ఏమని చెప్పనండీ ? అన్నా.

'అది కాదు, మళ్ళీ జ్యోతిష్యం పుస్తకాలు, వారఫలాలు గట్రా ముందర పెట్టుకుని అట్లా తీక్షణం గా చూస్తుంటే ను... '
మా అయ్యరు గారు మధ్యలో ఆపేరు.

'మనకు జ్యోతిష్యం మీద ఎందుకు నమ్మకం తక్కువ ? అ న్నదాని గురించి ఆఅలొచిస్తా ఉన్నా.

ఓహో అన్నారు మా వారు.

అవును మన జమానాకి జ్యోతిష్యం మీద నమ్మకం ఎందుకు తక్కువ?'

అసలు ఈ 'నమ్మకం' జ్యోతిష్యం ఒక్కదాని మీదేనా  తగ్గింది ?  కాదను కుంటా. స్వతహా గా,చాలా వాటి మీదా కూసింత నమ్మకం తక్కువై పోతూనే ఉంది అను కుంటా, అంటే మన ముందటి తరం వారికిన్నూ, మనకున్నూ బేరీజు వేసుకుంటే వారి కున్న నమ్మకాలు వాటి మోతాదు మనకు తక్కువే అయి పోయి ఉంటాయే మో ?

నమ్మకానికి, తర్కానికి చుక్కెదు రేమో ఎప్పుడూను ! అంటే జ్యోతిష్యం లో తార్కిక ఆలోచన లేదా? ఎందుకు లేదు ? జ్యోతిష్యం లో  -' If , Iff, Else' - అదిన్నూ, mind boggling  logical ఆలోచనా పరిధి కూడా విస్తారం గా ఉన్నది.

అయినా జ్యోతిష్యం ఎందుకు నమ్మకాన్ని కోల్పోతోంది అదిన్నూ, మన దేశం లో - ఈ దేశం లో ఈ విషయం పై రాయ బడ్డ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఎందుకు ఈ 'సాయిన్సు' దెబ్బ తిం టోంది ?

లాప్ టాప్ ల పై weather apps ని పెట్టుకుని మనం  అంతర్జాలం ద్వారా ఇవ్వాళ వర్షం వస్తుందని గొడుగు తీసుకెళ్ళే కాలం లో ఉన్నాం. అంటే, weather apps లో దాని లాజికల్ మ్యాప్ కి తగిన weather data ఉండ బట్టి.

Weather apps ఒక్క వాతావరణం మీదే తన పాండిత్యాన్ని క్రోడీ కరిస్తుంది.

జ్యోతిష్యం అట్లా కాదు.

దునియా లో ఉన్న అన్ని విషయాల మీద 'కామెంటరీ' ఇవ్వ గలదు !

అంటే, జాక్ ఆఫ్ ఆల్ అన్న మాటా ?

ఇట్లా పరి పరి విధాలా తనవి కాని సబ్జెక్ట్ కూడా జ్యోతిష్యం తన లో కలుపు కొని అట్లా మానవ సంబంధాల మీదా , ఇట్లా , వెదర్ ఫోర్ కాస్ట్ ల మీదా, 'ఇందు గల దందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా జ్యోతిష్య స్వరూపమే అని విశ్వ జనాంతికం గా అన్నిటి మీదా సర్వ హక్కులూ నాకున్నవి అని జ్యోతిష్యం గొప్పలు చెప్పు కోవడం వల్లా ?

కాకుంటే ఇప్పటి సాయిన్సు కున్న   supportive empirical data , జ్యోతిష్య శాస్త్రానికి తక్కువ గా ఉండడం వల్లా ?

అబ్బా ఈ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తే అసలు ప్రశ్నలే ప్రశ్నలు మరి

ఏమంటారు మీరు ?

జిలేబి.
(ఫెబ్రవరీ సెకండ్ హాల్ఫ్ లో జ్యోతిష్యం మీద ఎక్కువ చర్చలు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది)
 

Friday, February 15, 2013

ఇచ్చట ఫ్యామలీ అద్దెకు ఇవ్వబడును !'ఇచ్చట ఫ్యామిలీ అద్దెకు ఇవ్వబడును ' అన్న బోర్డు చూసి ఆ నాజూకు అమ్మాయి లోపలికి వచ్చింది.

'ఎస్ మేడం , హౌ కేన్ ఐ హెల్ప్ యు ' అంది అక్కడ కూర్చున్న కోమలాంగి.

'నాకో ఫ్యామలీ అద్దెకు కావాలి' చాలా క్యాషువల్ గా చెప్పింది నాజూకు అమ్మాయి.

కోమలాంగి తన దగ్గరున్న ఫ్యామలీ ఆల్బమ్స్ చూపించింది.

'ఎన్ని రోజులకి కావాలండీ అద్దెకు?'

జస్ట్ ఫార్ వీక్ ఎండ్

వీక్ ఎండ్ చాలా ఎక్స్పెంసివ్ వీక్ డేస్ అయితే కాస్తా చవక' చెప్పింది కోమలాంగి.

ఓ ఐసీ. నో ప్రాబ్లెమ్. నాకు వీక్ ఎండ్ కే  కావాలి

ఓకే. స్పెసిఫికేషన్ చెప్పండి. ఫ్యామలీ లో ఎంత మంది ఉండాలి ?

నాజూకు అమ్మాయి చెప్పడం మొదలెట్టింది.

వీక్ ఎండ్ రెండు రోజులకి కావాలి. ఫ్యామలీ లో పేరెంట్స్, గ్రేండ్ పేరెంట్స్, మావయ్యల ఫ్యామలీ రెండు, అత్తయ్య ఫ్యామలీ ఒకటి, అక్కయ్యా వాళ్ళు నలుగురు, అన్నయ్యా వదినలు ఇద్దరు'

హబ్బీ ఏమైనా..... ??? కోమలాంగి ప్రశ్నార్థకం గా ఆగింది.' హబ్బీ ఎమన్నా కావాలా? అడుగుదాని అనుకుని.

'నో నో ... నో హబ్బీ. .. ఐ యాం డేటింగ్... కాబోయే అతని కోసం ఫ్యామలీ పరిచయం చేద్దామని అంతే !' చెప్పింది కోమలాంగి.

ఓహ్... నో ప్రాబ్లం... ఇది మా బిల్లు పూర్తి రొక్కం కట్టి వెళ్ళండి. మీరు చెప్పిన అడ్రెస్స్లో మీ ఫ్యామలీ మీరు చెప్పిన డేట్స్ కి వచ్చేస్తారు' చెప్పింది కోమలాంగి.

వాళ్లకి ఏమైనా టిప్స్ వగైరా...?

నో మేడం ! ఆల్ సర్విస్ చార్జెస్ కలిపే మా సర్విస్' చెప్పింది కోమలాంగి.

నాజూకు అమ్మాయి  తృప్తి గా తలపంకించి షాప్ నించి బయటకు పడి కారు ఎక్కింది. !

కొంత సేపట్లో నే మరో యువకుడు వచ్చి, 'హల్లో - నాకో ఫ్యామలీ అద్దెకు కావాలి!' చెప్పాడు. యు నో ఐ యాం డేటింగ్ ఏ గర్ల్'

ఎస్ సర్... మీ ఫ్యామలీ సైజు వగైరా చెప్పండి' ఈ లిస్టు చూడండి ఉజ్జాయింపుకి - జస్ట్ ఇప్పుడే కస్టమైజ్ చేసాం మరో కస్టమర్ కి... మీకు సూట్ అయితే అట్లాగే తీసేసు కోవచ్చు. అఫ్కోర్స్ మీరు మీ చాయిస్ ఇంకా మార్చు కోవచ్చు కూడా' చెప్పింది నాజూకు అమ్మాయి..

ఆ వీక్ ఎండ్ లో....

నాజూకు అమ్మాయి, ఆ యువకుడు కలిసి తమ తమ ఫ్యామలీ తో ఫోటో లో దిగ బడ్డారు!...

'డార్లింగ్... we can get married... we have established our family!' చెప్పాడా అబ్బాయి.

ఎస్. సంతృప్తి గా చెప్పింది అమ్మాయి కూడా...


చీర్స్
జిలేబి.

Thursday, February 14, 2013

సన్నాసి బుట్టలో పడ్డాడు ( వాలం 'టీనో ' పాఖ్యానం!)కాలా కాలం గా సన్నాసులు బుట్టలో పడటాన్ని కొనియాడే శుభ దినం సందర్భాన ఇవ్వాళ సన్నాసుల వారి కథా, బుట్ట బొమ్మ కథా తెలుసు కుందాం !
 

జిలేబీ పెళ్లి రోజు .
 

బుట్ట లో జిలేబీ ని పెట్టుకుని వస్తూంటే , బుట్ట బొమ్మ లాంటి అమ్మాయి నాకు కాబోయే అర్ధాంగీ అని మురిసి పోయిన జంబు నాధన్ కృష్ణ స్వామీ అయ్యరు గారికి అవ్వాళ తెలిసి రాలే, బుట్టలో బొమ్మ పుత్తడి బొమ్మ కాదని, పేరు మాత్రమె జిలేబీ అని, తానె బుట్టలో బోల్తా పడ్డాడనీ నూ.
 

ఆ పై మూడు రాత్రుళ్ళు (ఈ మూడు రాత్రుళ్ళ ముచ్చట గురించి నేను చెప్పను బాబు మరీ సిగ్గు !) కానించిన తరువాయి శ్రీ అయ్యరు వారు 'జిలేబీ, మాంచి ఫిల్టరు కాఫీ ఒక్కటి పట్టుకు రావోయ్ " అంటే జిలేబీ బిక్క మొగం బెట్టి,
"అయ్యరు గారు, మీకు వంట బాగా వచ్చనే బామ్మ నాకు చెప్పి నన్ను మిమ్మల్ని కట్టు కొమన్నారు " అని బిక్క మొగం పెడితే, వంశ పారంపర్యం గా వచ్చే అయ్యరు హోటలు వృత్తి ఇంట్లో కూడా వంట గాడేనా, గాదేనా నా గతీ , రాధా, నా జిలేబీ ఇది నీకు తగునా సుమీ అని మా అయ్యరు వారు ఉసూరు మన్నారు !
 

ఈ మా పెళ్ళి ఈ సో కాల్డ్ యాదృచ్చికమో, కాక 'తాళీ' బలీయమో జంబూ వారికే తెలియాలి !
ఈ సన్యాసి బుట్టలో పడే కార్యక్రమము నే పెళ్లి దినాన అబ్బాయి వారి 'కాశీ యాత్ర ' గా పరిగణించడం బట్టి తెలియ వస్తున్నది ఏమనగా, ఈ వాలం టీను దినం మన పూర్వ ప్రాచీన సాంప్రదాయ పద్ధతే అని, దీనిని కాపీ క్యాటూ చేసి కాపీ లెఫ్టు చేసి సంతు వాలం టీను దినము గా మార్చి వేసి నారని మనము విశ్వసించ వలె.
 
 
అయ్యలారా, అమ్మలారా , ఇవ్వాళ సంక్తు వాలం 'టీన్' జరుపు కొనుడు అబ్బాయి లారా, అమ్మాయి లారా మీకందరికీ ఇదే శుభ కామనలు !
 

మీరు జంబూ అయితే, మీకు జిలేబీ ఖచ్చితం గా లభ్యమవు గాక!
 

తప్పి మీరు జిలేబీ అయితే, తప్పక ఎవడో ఓ సన్యాసి మీ బుట్టలో పడడం ఖాయం!
 

ఇంతటి తో ఈ సన్యాసి బుట్టలో పడ్డాడు అనబడు బుట్టో పాఖ్యానం పరి సమాప్తము !
 

ఇది చదివిన వారికి, వినిన వారికి చదివి వినిపించిన వారికందరికీ ఆ పద్మావతీ అలమేలు మంగా సమేత మా ఏడు కొండల పెరుమాళ్ళు(ఈయన రెండు మారులు బుట్టలో పడినట్టు ఉన్నాడు సుమీ !) సకల మంగళములు కలుగ జేయు గాక!
 

చీర్స్
ఫక్తు, జిలేబీ డే!

Wednesday, February 13, 2013

అజ్ఞాతలు అందరూ మేధావులే - అన్నా నీ మనసు తెలీక తప్పిదమై పోయే!

ఈ బ్లాగ్ లోకం లో అజ్ఞాతల కి అసలు విలువ లేకుండా పోతోంది!

అజ్ఞాతల్ అనగా ఎవరు ! జ్ఞాతుడు కాని వాడు. అనగా 'జ్ఞాతత్వములకు ' అతీతుడై న వాడు! అటువంటి అతిధి మన మీద ఎప్పుడూ కినుక వహించి కామెంటు చెళ్ళు మని కొట్టును! అది అజ్ఞాత జన్మ హక్కు !

ఈ జన్మ హక్కును పరి పరివిధాల మనం తెగ్గోస్తున్నాం. ఇది చాలా బాధా కరమైన, చింతించ వలసిన విషయం మరి!

ఆయ్ జిలేబి, మా టపా మా బలాగు, మా ఇష్టం. అజ్నాతలు అల్లా టప్పా కామెంటులు కొట్టే రంటే 'ఖబడ్దార్' జాన్తా నహీ ! సవాలే సవాల్ ! వాళ్ళని చీల్చి చెండా డు తాం అంటారా ? బలాగు అయ్యలారా, అమ్మ లారా మరో  మారు సావకాశం గా ఆలోచించండి!

మన బలాగు లోకం లో అన్నీ తెలిసిన వాళ్ళు మన టపా లని చదివి ము ము నగవు లేకుంటే వః వహ అనుకుని అట్లే వెళ్లి పోతారు. వాళ్ళు మన టపా చదివేరా, లేకుంటే వారికి నచ్చిందా (ofcourse, you know I write for my satisfaction, yet you know.... I like to know if you liked you know...!) అన్న విషయం మనకు తెలీకుండా పోయి మనం ప్చ్, మన టపా కి ఇంతే రెస్పాన్స్ అనుకుంటాం.

అప్పుడు తటాల్మని విద్యుల్లత లా , ఆకాశం లో మెరిసే తారలా ఓ అజ్ఞాత వచ్చి ఓ కామెంటు కొట్టి వెళ్లి పోతాడు.

మనం ఆ కామెంటు చదివి తలా తోకా అర్థం కాకుండా, ఓరీ వీడి బండ బడ, మనం అంత కనా కష్ట పడి  ఓ టపా రాస్తే, ఈ అజ్ఞాత 'ముకడా' వాడు ఇట్లా రాసి పోతా డా అని వాపోయి, 'ఏయ్ , అజ్ఞాతా - దమ్ముంటే నీ నిజ మైన పేరుతో రా... మొనగాడి వైతే, సత్తా ఉన్న వాడి వైతే నీ ముకడా తెరూ అంటాం!

జవాబు ఉండదు. సైలెంట్! మనం రేయనక పగలనక పది నిమిషాలకో మారు మన టపా చూస్తాం. వచ్చాడా వచ్చాడా ఆ అజ్ఞాత ముకడా వాడు ? ఎక్కడి వాడు ? ఏమి రాసాడు రిప్లై ? ప్చ్ జవాబు ఉండదు.

ఆ అజ్ఞాత ముకడా వాడు మరో టపా కి వెళ్లి అక్కడో కామెంటు కొట్టి వెళ్లి పోయుంటాడు ఈ మధ్య లో.

ఇక చూడండి, 'వ్యాఖ్యల పేచీ యే  మరి తండో ప తండం గా! హారం లో రంజు గా అజ్ఞాతల కామెంటు వరదలు పొంగి పొరలును!

ఈ అనా నీ మస్సు  ల కి అందుకే మనం సరిఅయిన విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి వాళ్ళని మన అక్కున జేర్చుకుని వాడి కోసం కాకుంటే ఆవిడ కోసం నేను ఒక టపా అంకితం ఇచ్చి వాళ్ళని 'నైసు ' చేసుకో దలచుకున్నా !

'అన్నా' నీ మనసు తెలీక తప్పిదములు చేయుచున్నాము !
నీవు జ్ఞాత తత్వములకు అతీతుడవు !

నీవు ఇందు గలడందు లేవని లేదు !
ఎందెందు వెతికినా నువ్వు గలవు.
పూర్వ కాలం లో నిన్ను 'ఆకాశ రామన్న' అనెడి  వారు.
ఈ కాలం లో నువ్వు 'అనానీ' మస్ వాడి వై పోయేవు.
అన్నా , నీ మనసు తెలీక నిన్ను గౌరవించాలని తెలీని వాళ్ళం.
కరుణించు దేవా ఆకాశ రామన్న!చీర్స్
జిలేబి.

Tuesday, February 12, 2013

మనలో పరమాత్మ ఎక్కడున్నాడు - భాగం రెండుశ్రీ కాలక్షేపం కబుర్లు శర్మ గారు విస్తారంగా మనలో పరమాత్మ ఎక్కడున్నాడు - అన్న టపా ని రాసేరు.

చాలా విపులం గా  చెప్పేరు.

నారాయణ సూక్తం లో కవి చమత్కృతి యా అన్నట్టు ఒక వాక్యం వస్తుంది - అథొ  నిష్ట్యా వితస్త్యాన్తే ' అన్నది అది.

ఈ పదబంధాన్ని మొదటి మారు చదివినప్పుడు అస్సలు అర్థం కాలేదు.

అథో  నిష్ట్యా - నిష్ట్యా అంటే ఏమిటి ?

వితస్త్యాన్తే - వితస్తి   అంటే ఏమిటి ?

అన్నదాని గురించి అట్లా ఇట్లా లాగించి గూగిలించి, సంస్కృత భాషా ప్రవీణు లైన కొందరిని అడిగి తెలుసుకున్నదాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. మీలో మరింత ఉత్సుకత కలిగిస్తుందని ఆశిస్తాను !

ఈ టపా చదివే ముందు శర్మ గారి పై న పేర్కొనబడ్డ టపా మొదట చదివితే కొంత సందర్భం అవగతం !

సో, ఇది భాగం రెండు అన్న మాట-

నిష్ట్యా అంటే, మన కంఠాన్ని తడిమి చూస్తే ఒక ఎముక తగులుతుంది చూడండి అదన్న మాట ఆంగ్లం లో దీన్ని 'Adam's apple' అంటా రను కుంటా.

వితస్తి అన్నది ఒక కొలబద్ద. అంటే మన హస్తాన్ని సాగ దీస్తే, బొటన వేలికిన్ను చిటికిన వేలికిన్ను మధ్య ఉన్న దూరం. సుమారు పన్నెండు అంగుళాలు.

ఇప్పుడు ఆ కంఠ ఎముక (ఇది దుష్ట సమాసమెమో మరి - శ్యామలీయం వారు చెప్పాలి!) నించి మీ చేతిని అట్లా విస్తరించి కొలత బెట్టండి ఏమి తగులు తుంది ?

హృదయం కదూ ? సో, అథొ నిష్ట్యా వితస్త్యాంతే - ఆ పన్నెండు అంగుళాల దూరం లో ఉండే హృదయం లో అన్న మాట.  హృదయం నాభ్యం ఉపరి ఉన్నది కదూ.

ఇంత కష్ట పడి  హృదయాన్ని కవి వివరించా లా ? చెప్పాలా? చమత్కృతి కాకుంటే ? 'సులభం గా 'హృదయేషు లక్ష్మీ' అని చెబ్తే సరి పోదూ?

ఈ ఆలోచన రాక పోదు మనకి. ఈ సందేహాన్ని నివారించ డా నికి మరో నారాయణ సూక్త పంధా(వైష్ణవ సాంప్రదాయంలో )  (version?) లో సులభం గా హృదయోర్మధ్యే అని చెప్పేశారు.

సరే, సర్వాంతర్యామి. భగవంతుడు అన్ని చోట్లా ఉంటా రంటారు కదా.. మరి ఇట్లా, ఒక స్థలం లో ఆయన్ని 'localization' చేయ్యటం ఏమిటంటారా ? 'If you cannot find Him in you, so far as you are concerned, He is nowhere for you'  అని మరో కవి ఉవాచ !

సో, అదన్న మాట విషయం. కొంత ఆలోచించి చూడండి కవి చమత్కృతి కాదూ  ఇది మరి ?

ఇట్లాంటి చమత్కారాలు వేదంలో  చాలా ఉన్నవి- ఆ మధ్య ఎపుడో ఒకసారి రాసాను కూడా... పురాణీ దేవీ యువతిహి ' అని ఉషస్సు గురించి చెబ్తాడు కవి. (Old Woman, but young girl - అంటే జిలేబీ లా అన్నమాట !)


చీర్స్
జిలేబి.

Monday, February 11, 2013

జిలేబి టపా సక్సెస్ మీట్ !

ఈ మధ్య సినీ మా లోకం వరుస చూస్తుంటే ప్రతి దానికి ఓ మీట్, ఓ లాంచ్ పెట్టేస్తున్నారు!

మొట్ట మొదట ఆడియో లాంచ్ అంటూ ఓ తతంగం !

ఆ పై సినిమా విడుదల అయ్యాక సక్సెస్ మీట్ అంటూ మరో ప్రహసనం !

అట్లా నేను కూడా ఇక మీదట ప్రతి టపా కి ఓ సక్సెస్ మీట్ పెట్టాలని ఆలోచిస్తున్నా !

అంటే ఇప్పుడు ఓ టపా కొట్ట బోతున్నా ననుకోండి, ముందస్తే, 'ఫ్లాష్ ఫ్లాష్ ! రాబోతోంది జిలేబీ టపా- ఓ ఫన్ ఆర్ట్ విత్ బాపు జిలేబీయం' ! అని ఊదర గొట్టి సేల్ఫు డబ్బా వాయించడ మన్న మాట !

ఆ పై ఆ టపా పేలి వరస బెట్టి కామెంటు పరంపరలు వస్తే, వాటి కన్నింటికి జవాబు కామెంటు లు ఇస్తూ మళ్ళీ ఓ సత సహస్ర వందనాలు అర్పించు కోవటం -'  కర్మాణాం  సుకర్మః కామెంటు జవాబుహు ' అన్న చందం లో సుకర్మల ని చేసుకుంటూ బతికేయ్యడం అన్న మాట!

ఆ పై మరో సరి కొత్త పంధా మొదలెట్టాలన్న నా ఉద్దేశ్యమే ఈ 'జిలేబీ టపా సక్సెస్ మీట్' అన్న టపా అన్న మాట !

అంటే, వరస బెట్టి మనకు కామెంటిన వాళ్ళలో కొంత మద్ది పెద్ద వాళ్ళని పిలిచి, వాళ్ళ చేత ఆ హా ఓ హో అని పించి ఈ బలాగు టపా రాజ్యం లో జిలేబీ ఓ మకుటం లేని మహా వృద్ధ నారి లాంటి మెప్పులు కొట్టేసి, ఆ పై 'modesty is my best policy you know!'  అన్నట్టు ముము నగవులు చిందించి అందరికీ తలో శాలువా, దుపట్టా కప్పేసి సక్సెస్ మీట్ లో మన ప్రొడ్యూసర్ అయిన గూగులో న్నీ నూ కాస్త పొగిడేసి, ఆ పై కళ్ళలో అనాధ భాష్పాలు రాల్చేసి !....

అబ్బబ్బా, జిలేబీ టపా సక్సెస్ మీట్ కి మరో సక్సెస్ మీట్ టపా రాయాలండోయ్ !


చీర్స్
జిలేబి.

Sunday, February 10, 2013

రాబోయే జన్మలో నేనెవర్ని?


రాబోయే జన్మలో నేనెవర్ని అన్న ఈ ప్రశ్న కి జవాబు మనకు తెలియడానికి ఆస్కారం ఉన్నదా ?

నువ్వు పూర్వ జన్మలో ఇట్లాగ ఉండే దానివోయ్, అట్లాగ జీవితం గడిపేవు  ... లాంటి 'జాతక' ఫలా ల ఖబుర్లు చెప్పే వాళ్ళు ఉన్నారు.

మనకు ఈ జన్మలో రాబోయే కాలం లో ఏమగునో ఎట్లా ఉంటుందో  లాంటి వి తెలుసు కోవటానికి చాలా కుతూహలం ఉంటుంది . మళ్ళీ ఎ మహార్జ్యోతిష్య శర్మ గారో చెప్పే దానికి ఉన్నారు కూడాను.

అయితే, ఏకంగా మనం రాబోయే జన్మ లో ఎట్లా ఉంటామో, ఎక్కడ జన్మిస్తామో మనకు తెలిస్తే ?

వాహ్ , వాహ్  జిలేబీ ఇట్లాంటి ఆలోచనలు నీకెట్లా వస్తాయి సుమీ అని హాశ్చర్య పడి  పోతున్నారు కదూ మీరు ?

ఈ ప్రశ్న ఎందుకు వేసా నంటే, అట్లాంటి వి తెలియ డానికి  అసలు ఆస్కారం ఉన్నదా అన్న పాయింటు కోసమే మరి.

అంటే మనం చేసే కర్మలు కర్మ సిద్దాంతం ప్రకారం, మన కర్మలు చేతలు ఎక్కువయ్యే కొద్దీ, మన రాబోయే కాలం కూడా ever dynamic state లో ఉంటుంది కదా మరి  , నిర్ధారణ గా, మనం ఇలా ఉంటాం రాబోయే కాలం లో అని తెలియడం, నిర్దుష్టం గా తెలియడం అన్నది కాని పని అవుతుం దేమో  కదా మరి ?

అంటే, అది నిర్ధారణ కావడానికి మానవుడు బాల్చీ తన్నేక, బాలన్సు షీటు ఖరారు అయ్యి, ఆ పై ఆతని రాబోయే కాలపు జీవనం నిర్ధారణం అవుతుందా మరి ?

సో, మన బాలన్సు షీటు నిర్ధారణ  మనం బాల్చీ తన్నితే కాని తెలీని పరిస్థితి లో ఉన్నా మన్న మాట మనం !

మరి ఈ కంపనీలు, బిజినెస్సు వాళ్ళు మాత్రం ప్రతి సంవత్సరం బాలన్సు షీటు రాసి పడేస్తారు ! ఆ పాటి సులువు మనకు లేకుండా పోయెనే మరి !

ఏమంటారు ?

జిలేబి.

Friday, February 8, 2013

ఓ ఫన్ ఆర్ట్ విత్ బాపు జిలేబీయం ! - బాపు దస్తూరి తో టపా

బాపూ దస్తూరి తో ఎలా రాయడం ?
బాపూ దస్తూరి తో ఇలా రాస్తారండీ !
మీరూ రాయాలనుకుంటున్నారా ?
అయితే ఈ టపా చదవండి ! అందులో ఉంది కిటుకు !

మొదట మీ కంప్యూటర్ లో సుగుణ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ పై జిలేబీ బ్లాగు మీకు బాపు దస్తూరి తో కనిపించును !

సుగుణ ఫాంట్ ఎక్కడ లభ్యము ?

http://wiki.etelugu.org/Telugu_Fonts

బాపు ఫాంట్ అన్న పేరుతో ఉన్నదానిని డౌన్లోడ్ చేసుకోవాలి.

ఈ ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని కాపీ చేసి C > Windows > Fonts లో పేస్ట్ చేస్తే జిలేబీ టపాలు బాపు ఫాంట్ లో కనిపిస్తాయి.

చీర్స్
జిలేబి.
 

Thursday, February 7, 2013

చదువా ధనమా వీరమా ?

చదువరీ !

నీకు ఇదే పరీక్ష! చదువా ధనమా వీరమా ? ఈ మూడింటి లో ఏది గొప్ప తెలుపుడూ !

'చదువెందు కు.... ' అన్న సామెత ఉన్నది.

అట్లాగే న చోర  హార్యం న చ రాజ్య భోజ్యం ... అన్న సూక్తమూ ఉన్నది.

ఇవి రాసిన వాళ్ళంత తలపండి న వాళ్ళు. అంటే జీవితం లో డక్కా మొక్కీ లు తిని మొదటి సామెత చెప్పిన వాళ్లై  ఉంటారు.

రెండో కేట గిరీ అందని ద్రాక్ష పళ్ళు తీయన అన్నట్టు, మనకొచ్చింది చదువు కాబట్టి, దాన్నే కాస్త గొప్ప గా చెబ్దామని సూక్తం చెప్పేసి ఉంటా రను కుంటా !

ధనం మూలం ఇదం జగత్ అని మేధావి చెబ్తాడు.

ఆయ్ , వీరుడు దేశాన్ని కాపాడ క పోతే నీ చదువూ, నీ ధనం  అంతా పరగతం . కాబట్టి వీరుడు లేకుంటే, దేశం లో శాంతి లేదు. శాంతి లేకుంటే చదువూ సంధ్యా లేదు. ఆ పై వ్యాపారమూ గట్రా నూ  లేవు. సో , ధనమూ ధమాల్ !

ఇట్లా ప్రతి దానికీ తమ తమ గోప్పల్ని చెప్పి డబ్బా వాయించి  చెప్పొచ్చు.

ఇంతకీ మీ ఉద్దేశ్యం ఏమంటారు ఈ విషయం పై ?


జిలేబి.

Wednesday, February 6, 2013

నేను పుట్టాను ఈ దేశం 'ఆధార్' లేదన్నది !

బిడ్డ కెవ్వు మన్నాడు.
 
అయ్య కన్నీళ్లు పెట్టు కున్నాడు.
 
మళ్ళీ ఆధార్  కోసం క్యూ కట్టాలా ?
 
బిడ్డా, నీకు  రాబోయే కాలం ఆధార్   'కాళమా'  ?
 
తాత బాల్చీ తన్నేడు.
 
కాటి కాపరి 'ఆధార్' ఎక్కడ అన్నాడు.
 
ప్చ్, తాత ఆధార్ కోసం క్యూ లో నిలబడే 
 
బాల్చీ తన్నేడు అంటే నమ్మడే మరి ?
 
ఆధార్  తీస్కురా కాల్చా లంటే అంటాడు మరి ?
 
పుట్టినా గిట్టినా 'ఆధారే' మరి !
 
భారత మాతా ఎప్పటికి ఈ దేశపు నాయకులకు 
 
ప్రజ అంటే గౌరవం వచ్చును?
 
 
నో చీర్స్ 
జిలేబి.

Monday, February 4, 2013

ఇక మీదట సీరియస్ టపాలు రాయ దలచుకున్నా !

అయ్యరు  గారు, ' ఇక మీదట సీరియస్ టపాలు రాయ దలచుకున్నా  నా బ్లాగు లో' చెప్పా మా జంబునాధన్ కృష్ణస్వామి అయ్యరు గారితో.

అయ్యరు  గారు ఫక్కున నవ్వారు.

ఏమోయ్ జిలేబీ, నీకు సీరియస్సు కి చుక్కెదురే ? ఎట్లా 'సీరియస్' టపాలు రాస్తావ్ ?' అన్నట్టు చూసేరు.

'జాన్తా నాయ్ , ఎట్లైనా క్రిందా మీదా పడి , అట్లా ఇట్లా పొర్లి అయినా సీరియస్ టపాలు రాయ దలచు కున్నా.

'జిలేబీ ఎందుకు నీ కిట్లాంటి ఐడియా వచ్చే?' అడిగేరు మా అయ్యరు  గారు.

కాదండీ, బ్లాగుల్లో చాలా మంది మరీ సీరియస్ టపాలు, రాస్తూం టారు . అట్లాంటి వి చదివినప్పుడు అబ్బా, మన మిట్లా రాయక పోతే గెట్లా  అని 'ప్చ్' అని పెదవి విరుస్తా. అప్పుడు అనిపించి, అట్లా అది 'వటుడింతై' అన్నట్టు సీరియస్ టపా రాద్దారి అని పించడం దాకా వచ్చిం దన్న మాట' చెప్పా.

ఓ, అయితే, ఇది నీ సొంత బుర్ర ఐడియా కాదన్న మాట. పులిని  చూసి... సామెత ఎందుకు లే' అని మధ్య లో ఆపేరు అయ్యరు  గారు.

ఏమిటి మీ అర్థం అంటే నేను....' అన బోయి, అబ్బే, మన గురించి మనమే ఇట్లా 'ట్యూబులో' గాలి పీకేసు కుంటే బాగోదు అనుకుని ఆగి పోయా!

సో, చదువరులారా, ఇక మీదట  మీరు నా బలాగు లో మరీ సీరియస్ టపాలు చదివే 'ఆస్కార్లు' ఉన్నవి. కాబట్టి 'బీ తయ్యార్'!

(ఈ టపా చదివేక మీ అభిప్రాయములను మాకు తెలియ జేయ గలరు. ఇది సీరియస్ టపా కింద వచ్చునా? జిలేబీ సీరియస్ టపా రాయగలదా ? అన్న విషయం గురించి తెలుపుడూ!)


చీర్స్
జిలేబి.

Saturday, February 2, 2013

జిలేబి ఎచట ఉండును ?

 
జిలేబి 
 
క్కువగా 
 
దివిన 
 
పాల  లో 
 
ఉండును!
 
జిలేబి
(గెల్లి గారు ఆ మధ్య
కాలక్షేపం కబుర్లు శర్మ గారి ని-
జిలేబి ఎచట ఉండును 
అని అడిగారు 
దానికై  ఒన్స్ అగైన్!)
 

Friday, February 1, 2013

Modern Mystic of Madanapalle

Modern Mystic of Madanapalle Sri M
 

Full length at:

http://www.cultureunplugged.com/documentary/watch-online/play/8173/The-Modern-Mystic--Sri-M-of-Madnapalle


చీర్స్ 
జిలేబి.
 
(మా జిల్లా కతల్ వెతల్ !)