Sunday, March 24, 2013

ఈ ఒక్కరోజు వదిలెయ్యి జిలేబి ప్లీజ్ !

'
ఇదిగో జిలేబీ ఇట్లా వారం మొత్తం నా చేతే వంట చేయిస్తే ఎట్లా ? మినిమమ్ ఆదివారమైనా నాకు రెష్టు ఇవ్వొచ్చు గా ' మా అయ్యరు గారు దీనం గా ముఖం పెట్టేరు .

రాస్తున్న బ్లాగు టపా మధ్య లో ఆపి 'ఆయ్ , టపాలు గట్రా రాస్తున్నప్పుడు 'నో డిస్టర్ బెన్స్ ' అన్జేప్పానా లేదా !' ఇంతెత్తు కు ఎగిరా.

అది కాదె జిలేబీ, వారం మొత్తం మీద నా చేత వంటా వార్పూ కార్యక్రమం పెట్టేవు, ఆ బలాగులూ , టపాలు, ఆఫీసు గట్రా బిజీ బిజీ అంటూ  - ఈ ఒక్క ఆదివారమైనా నాకు 'ఫ్రీ డం' ఇవ్వొచ్చు గా ' దీనాతి దీనం గా ముఖం పెట్టేరు మళ్ళీ అయ్యరు గారు.

అయ్యరు గారి వైపు నింపాది గా చూసా . ఈ అయ్యరు  గారికి ఇట్లాంటి చలువలు ఇస్తే, హమ్మో, ఇంకేమన్నా ఉందా ! ఇవ్వాళ ఈ ఒక్క రోజం టారు  ఓ వారం గడిచేక రెండు రోజులు అంటారు ... అట్లా మొత్తం మనమీదే వంట కార్య క్రమం పడే చాన్సు ఉంది ! జిలేబీ బహు పరాక్ బహు పరాక్ ! మిస్టర్ జిలేబీ మాటలు చాలా కేర్ఫుల్ గా గమనించాలి ! లేకుంటే నీకు రాబోయే కాలం లో తంటాలే  బామ్మ ఫోటో నించి గట్టి గా లుక్కు ఇచ్చింది .

అయ్యరు  గారు కూడా ఫోటో వైపు చూసేరు . హు హు అన్నారు. ' బామ్మ నీకేం చెబ్తోంది ?' అడిగేరు ఈ మారు సందేహం గా .

బామ్మ చెప్పిన మాటంటే ఇంకేమన్నా ఉందా ! అందుకే మాట మార్చి చెప్పా - అయ్యరు  గారు ... ఎందుకు ఆదివారం సెలవు కావాలంటారు ? కావాల్సి వస్తే సోమ వారం తీసు కోండి  మంగళ వారం కూడా చేర్చి తీసుకోండి  ' ఆప్యాయం గా అన్నా.

తలూపారు ఆనందం  గా అయ్యరు  గారు. ' అయితే జిలేబీ ఆ రెండు రోజులు నువ్వు వంట చేస్తా వన్న మాట '

నేనన్నా నా అట్లా ?

మరి ??? సందేహం గా చూసేరు అయ్యరు  గారు.

నేను ఎట్లాగూ ఆఫీసు వెళ్లి పోతా గదా ... అక్కడే లంచ్ అండ్ డిన్నర్ గావించేస్తా ... మీరు మీకు కావాల్సి వస్తే వంట చేసు కొండీ వద్దనుకుంటే హోటలు కె ళ్ళం డి ! '

ఇదిగో జిలేబీ నేనెప్పుడూ  హోటలు గట్రా ల లో తిననని నీకు తెలుసుగా ' ముఖం లో జోష్ వెళ్లి మళ్ళీ దీనత్వం వచ్చే సింది అయ్యరు గారికి !
అట్లా దారికి రండి ! సో, బుద్ది గా వెళ్లి ఆ వంటా వార్పూ కార్య క్రమం చూడండి ' చెప్పా మళ్ళీ బ్లాగులో తల దూర్చేస్తో .

అంతే నంటా వా జిలెబీ ?

అంతే  అంతే ! ఏం  బామ్మా నువ్వేదన్నా చెప్పదలచు కున్నావా ? అడిగా ఫోటో లో ని బామ్మని - ఈ బామ్మే కదా ఈ అయ్యరు గారిని ఇట్లాంటి మంచి మొగుణ్ణి చూపించింది ? వంటా వార్పూ తెలిసిన మానవుడు జిలేబి, కాబట్టి గట్టి గా కట్టి పెట్టేసు కో అంజెప్పింది  మరి బామ్మ మాట జవదాట కూడదు గదా !

'వద్దులే ! మళ్ళీ ఆ ఫోటో కి అంకితం అయి పోయిన బామ్మని ఎందుకు లాగుతావు ! ఆవిడ  నీకన్నా పెద్ద పెంకి ఘటం ! ఇంకా పెద్ద లెక్చరు పీకును !' అయ్యరు  గారు బుద్దిగా వంట గదిలోకి వెళ్లి పోయేరు !

హమ్మయ్య! ఇక మనం ఫ్రీ గా హ్యాపీ గా బ్లాగాడు కోవచ్చు సుమీ !

హల్లో ... ఎవరి  టపా కి కామెంటు పెట్టాలండీ ?


చీర్స్
జిలేబి !
(జ్యోతి వలబోజు గారి టపా చదివేక సరదా గా !)

2 comments:

  1. :) జిలేబీ గారు సరదాకి చెప్పినా నిజాలు ఉండునేమో అన్నంత సరదా గా వ్రాసినారు

    ఇదియే కదా జిలేబీ వారి స్టైలు .

    ReplyDelete
  2. వనజ వనమాలీ గారు,

    అంతే అంతే ! అంతా విష్ణు మాయ !

    మా ఏడు కొండల పెరుమాళ్ళ కే తెలియాలి లోగుట్టు !

    పాపం ఆయన కూడా దిక్కు తెలీక 'తెల్ల మొగం' పెట్టి ఉన్నాడు అమ్మవార్ల దయ వల్ల ! అదిన్నూ ఇరువురు జిలేబీ లా యేను మరీ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete