Thursday, April 11, 2013

ఉగాది 'ఫన్' చాంగ 'జిలేబీయం !

బ్లాగ్ చదువరు లందరికి
జిలేబీ యమైన
శ్రీ విజయ నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు !

ఇక ఉగాది అంటే మనం ప్రతి ఒక్కరం ఫన్ చాంగ శ్రవణం కోసం వేచి వుంటాం !

పూర్వ కాలం లో ఇంట్లో పెద్దలు పంచాంగం తెరిచి చదివి చెప్పే వారు, కాకుంటే గుళ్ళో అయ్యవారు చెప్పే వారు.

పచ్చడి లాగించి వారు చెప్పే గళ్ళూ, ఆ గళ్ళలో అట్లా ఇట్లా మారే గ్రహాలూ అవి మన పై జరిపే అగాయిత్యాలు , ప్రేమాయణాలు ఒక్కటని ఏమిటి అవన్నీ కలిపి మనల్ని వచ్చిన ఈ ఉగాది లో ఎట్లా 'దీవించును ' అని తెలుసుకుని అర్థమైతే మనకు నచ్చితే వాటిని గుండెల్లో పెట్టేసుకుని మహాదానంద పడి  పోయే వాళ్ళం .

ఆ  గ్రహాలు మనతో చెడు గుడు లాడతాయంటే కొంత గాభరా పడి ముక్కోటి దేవత ల లో సెలెక్టివ్ representative ని మస్కా కొట్టో , కాకుంటే నవ గ్రహాల లో వారిని సెలెక్టివ్ గా తాజా చేసుకునో వగైరా వగైరా mitigation ప్రాసెస్ మొదలెట్టే వాళ్ళం !

ఈ e-కాలం లో మనం మరీ మా గొప్ప జ్ఞాన వంతు లయిన వాళ్ళం !

కాబట్టి ఈ కాలం లో బ్లాగుల్లోను , ఇంటర్నెట్ లో ను, టీవీ ల లోను 'ఫన్' చాంగ శ్రవణం కంటాం  వింటాం ! ఓ పది పదిహేను దాక   ఈ ఫన్ చాంగ e-పటన , శ్రవణ తరువాయి మన బుర్ర గిర గిరా తిరుగును !

ఒక మహార్జ్యోతిష్ శర్మ గారు ఓయీ జిలేబీ జాగ్రత్త సుమ్మా నీకు రాబోయే కాలం కడు గడ్డు కాలం అంటే, మరో బ్లాగ్ జ్యోతిష్ శాస్త్రి గారు 'ఇదిగో జిలేబమ్మా , నీకు రాబోయే కాలం భేషైన కాలం అంటే , కొంత జుట్టు గీక్కుని, వాటికి బేరీజు వేసు కుని, పోనీలే రాబోయే కాలం ఓ మోస్తరు ఉంటది అని అనుకుంటాం !

ఇవన్నీ కలగలిపి పంచ దశ లోక వాసుల కోసం ఈ జిలేబీ చెప్పు ఈ శ్రీ విజయ నామ సంవత్సర ఫన్ చాంగ బ్లాగ్ టపా పటనం  ఏమనగా ... 

అయ్య లారా అమ్మ లారా ... 

ప్రతి రోజు మీరు జిలేబీ టపా ని వీక్షిం చండి మీకున్న ఏ విధమైనట్టి 'కాల' దోషాలు ఉన్నా అవి re-solve అయి పోవును ! అనగా అవి సాల్వ్  తమకు తామే అయి పోవడమో, లేకుంటే re-solve అయి పోవడమో జరుగును. 

ఆ పై 
మీరు జిలేబీ రోజు వారి టపా వీక్షించి టపా కి తప్పక కామెంటు కొట్టి న మీకు శ్రీ విజయ నామ సంవత్సరం లో అంతా శ్రావ్యం గా, సవ్యం గా కనసోంపు గా దివ్యంగా మంగళం గా అన్నీ మీకు శుభములే జరుగును !

ఇతి శ్రీ విజయనామ సంవత్సర జిలేబీ నామ్యా 'ఫన్' చాంగ బ్లాగ్ టపాః !

అందరికీ ఉగాది శుభ కామనలతో 

శుభోదయం !
జిలేబి
 

8 comments:

  1. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

    ReplyDelete
  2. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete

  4. పంచాంగాన్ని ఫన్ గా చక్కగా చెప్పారు . మీకు , మీ కుటుంబంలోని అందరకి , మన బ్లాగుల పాఠక దేవుళ్ళకి , మన బ్లాగు మిత్రులకి ఈ విజయ నామ సంవత్సర ఆది శుభాకాంక్షలు .

    ReplyDelete
  5. కామెంట్ కొడుతున్నాను కనుక నాకు ఈ శ్రీ విజయ నామ సంవత్సరం లో అంతా శ్రావ్యం గా, సవ్యం గా కనసోంపు గా దివ్యంగా మంగళం గా అన్నీ శుభములే జరుగును గదా జిలేబిశాస్త్రిగారూ?
    మీకు కూడా విజయనామ ఉగాది శుభాకాంక్షలు...

    ReplyDelete
  6. మీ ఫన్ చాంగ బ్లాగ్ టపా పటనం మమ్ము రంజిపచేసినది..కృతజ్ఞతలు...

    ReplyDelete
  7. జిలేబిజీ కి ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. వీజయ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలండి

    ReplyDelete