Tuesday, April 23, 2013

ఇచ్చట బ్లాగు ట్యూషన్ చెప్ప బడును !

ఆ, పిల్లలూ అందరూ వచ్చారా ?

ఎస్ మేడం !

మొదట మనం బ్లాగు మాతరమ్ తో మన తరగతి ని ప్రారంభిద్దాం !

అందరూ చెప్పండి ...

వందే బ్లాగారం వందే బ్లాగారావు ...

ఆ పిల్లలూ ఇప్పుడు మీ పేర్లు చెప్పండి

నా పేరండీ  నా పేరండీ  ....

హాయ్ ఐ యాం ....

ఏమబ్బాయ్ , అట్లా పనీ పాటా లేక కూర్చున్నావే ? ట్యూషన్ లో చెప్పే పాటా లు సరిగ్గా వింటున్నా వా ?

మేడం, కాలక్షేపం కోసం సరదాగా బ్లాగు ఎట్లా రాయడం అని నేను రాసు కొచ్చే నండీ !
ఎరా అబ్బాయ్, ఈ వ్యాసం ఎక్కడో చదివి నట్టుందే  మరి ?

లేదండీ ఇది నా స్వంతం అండీ

ఏమమ్మాయ్ మధురా బ్లాగ్ క్లాసులో జంతికలు తింటూ కూర్చున్నావ్ ? ఏమైనా కాస్తా రాయ కూడదూ ?

రాసేసా మేడం, జంతికలు మీద వ్యాసం !

ఆ, సరే అబ్బిగా, ఏమిట్రా పక్క వాడి తో బాతా ఖానీ కొడుతూ కూర్చున్నావ్ ?

ఏమీ లేదండీ, నేను జెప్పేది ఎవరైనా వింటారా అని చూస్తున్నా

మా నాన్నే మా నాన్నే

ఏమమ్మాయ్ బ్లాగ్జోతి ఈ మధ్య క్లాసులకి నల్ల పూసవై పోయెవ్ ?

మా ఇంట్లో అమ్మ చివాట్లు పెట్టిందం డీ !

ఆ కిట్టిగా, ఏమిరా రాస్తా రాస్తా ఉండావ్ ?

రాము లోరి మీద ముక్క రాస్తున్న నండీ

ఆ అబ్బాయ్, అట్లా నా వైపు చూసి తెగ నవ్వుతున్నావ్ ?

మేడం, మీరూ నవ్వా లనుకుంటే నవ్వండి !


ఏమమ్మా జిలేబీ ఏమిటి తెగ ఆలోచిస్తా ఉండావ్ ?

మేడం, మీరు ఎప్పుడు రిటైర్ అవుతారో?

ఆ ! ఎందుకే !

నేను కలాసులు తీసుకుందా మని !
వామ్మో వామ్మో ఏమి తెలివే నీకు ! నీ బలాగు బంగారం కాకులెత్తుకు పోనూ ....


చీర్స్
జిల్లాలంగడి జిలేబి !

5 comments:

  1. టీచర్ గారండీ నా బ్లాగు లో మేటర్ పక్క వాడెవడూ కొట్టేయకుండా ఉపాయం చెప్పండి...

    ReplyDelete
  2. << ఏమమ్మాయ్ మధురా బ్లాగ్ క్లాసులో జంతికలు తింటూ కూర్చున్నావ్ ? ఏమైనా కాస్తా రాయ కూడదూ ?

    రాసేసా మేడం, జంతికలు మీద వ్యాసం !

    LOL :D :D
    భలే రాసారండీ..

    ReplyDelete
  3. గురువును ముంచిన శిష్యురాలు...

    ReplyDelete
  4. వచ్చేతున్నా మొచ్చేతున్నాం మాట్టారూ! మాకూ చూసన్ చెప్పాల, మిక్చర్ బండోల్లం తల్లీ! ఏమిచ్చుకోలేం, మిక్చర్ పొట్లమిచ్చుకుంటాం గురు దక్షణ.

    ReplyDelete
  5. ఏమి రాయకుండా చదివి టపాలు (వాతలు) పెట్టె నా లాంటి వారిని గూర్చి రాయాల్సింది
    ఇంకొంత బాగున్ను

    ReplyDelete