Wednesday, June 12, 2013

ఈ సుబ్బు, సత్తి బాబు, అయ్యరు వీళ్ళంతా ఎవరు ?


ఒకరేమో సుబ్బు ని హటాత్తు గా తెచ్చి కాఫీ మిష తో పని కలిపిస్తారు .

మరొకరేమో సత్తి బాబు పేరిట వదినా కాఫీ అంటూ వచ్చి మనకు ఖబుర్లు చెబ్తారు

మరోకావిడేమో , 'మా అయ్యరు ' అంటూ అప్పుడప్పుడు మేళ మాడు తోంటూ ఉంటుంది హాటు స్వీటు లు ఇస్తూ .

మరొకరేమో , (ఈ మధ్య ఈయన ఏమైయ్యారో అసలు కనిపించడం లేదు , వినిపించడం లేదూన్ను !) పద్మావతి ని లాక్కొచ్చి కథలు చెబ్తూంటారు  ( చెబుతుండే వారు అని గతించిన కాలము లో చెప్పవలె కాబోలు !)


ఇట్లా మన పంచ దశ లోకం లో ఇంకా కొందరు ఉండ  వచ్చు ! మీకు తెలిసన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళుంటే చెప్పగలరు !

ఇంతకీ వీళ్ళంతా ఎవరు ! ? వీళ్ళకీ ఈ టపాలు రాసే వాళ్ళకీ ఈ అవినాభావ సంబంధం ఏమిటి ?

దీని పై మీ అభిప్రాయములు తెలుప గలరు !!

చీర్స్
జిలేబి
 

4 comments:

  1. జిలేబి గారు ,

    సహజంగా మనం ఏదైనా చెప్పదలుచుకొని చెప్పలేకపోతున్నప్పుడు ఇంకొకళ్ళ ద్వారా చెప్పటం జరుగుతుంటుంది . అలాంటి సందర్భాలలో ఊపిరి తీసుకొని మనల చేత నామకరణం చేయించుకొన్నవారే వీళ్ళందరూ వీళ్ళందరూ ఊహాజనితులు అన్నది నా భావన . నిజం మీరే సెలవీయవలె .

    ReplyDelete
    Replies

    1. శర్మ గారు,

      అంతరాత్మల ఆపొసిట్ నేచర్ కలిగి ఉంటాయేమో మరి అంటారా ?

      జిలేబి

      Delete
  2. వీళ్ళంతా "అంతరాత్మలు" అనుకుంటా.

    ReplyDelete
    Replies

    1. అప్పు తచ్చు ఐ పోయింది బోన గిరి గారు, మీ ప్రశ్న కి జవాబు శర్మగారి కామెంటు కి పడి పోయింది !

      శర్మగారు

      మినిమమ్ మా అయ్యరు గారు మాత్రం ఊహాజనితం గాదందోయ్ ! నిక్కచ్చిగా , మూడు పూటలా నాకు వంట జేసి బెట్టె పెనిమిటి !!

      చీర్స్
      జిలేబి

      Delete