Friday, June 14, 2013

అయ్యరు గారు ఊరెళితే !

'
ఇదిగో జిలేబీ ఈ సారి నేను నిన్ను విడిచి ఊరెళ్ళి రావలసి వస్తోంది , నువ్వెట్లా మేనేజ్ చేస్తావేమో మరి '  మా అయ్యరు గారు ఊరు వెళుతూ విచారం గా ముఖం పెట్టేరు .

'ఆ మీరు ఊరు వెళ్లి రండి నాకేం, బ్రహ్మాండం గా ఉంటా ' అన్నానే గాని, లోపల బిక్కు బిక్కు మంటోంది .

రోజూ అయ్యరు  గారు చేసే బ్రహ్మాండమైన భోజనం గావించేస్తూ , వారి మీద రాజ్యం ఏలుతూ, వారిని ఆదమాయిస్తూ  గడిపేస్తూ ఉండటం గుర్తుకొచ్చి ఊఫ్ , ఇక వంట మనమే చేసుకోవాలా మరి అని నిట్టూర్చా .

ఫోటో లో మా బామ్మ నవ్వుతూ చూస్తోంది . మా బామ్మ ని మొట్టేయ్యాలని అని పించింది . ఆ వంటా వార్పూ మా అమ్మ నేర్చుకోవే అంటే, బామ్మ, నిఖార్సుగా చెప్పింది అప్పట్లో, 'ఆయ్ , జిలేబీ వంటా వార్పూ నేర్చుకోవడ మేమిటి ? వచ్చే ఆ ఏబ్రాసి గాడెవడో వాడే వండి పెడతాడు లే అని గదమాయించి వంటా వార్పూ నించి విముక్తి కలిగించడం తో అప్పట్లో అబ్బా మా బామ్మ మంచి బామ్మ అనుకున్నా . అట్లే పట్టుబట్టి, వంటా వార్పూ తెలిసిన అయ్యరు గారిని నాకు కట్ట బెట్టేయ్యడం కూడా ఆవిడ చలవే !

ఇన్నేసి సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకుని దర్జా గా బతికిన జిలేబి ఇక వంటా వార్పూ చేసుకుంటూ బతకాలా ? చట్ , జాన్తా నాయ్ , ఎ హోటల్ కో వెళ్లి భోజనం కానిచ్చేద్దాం అనుకున్నా .

నా ఆలోచన పసికట్టేరు లా ఉన్నారు మా అయ్యరు  గారు ' ఇదిగో జిలేబీ, హోటలూ  గట్రా వెళ్లి ఆరోగ్యం పాడు జేసుకో మాక , ఫ్రిడ్జ్ లో దోస వేసుకోవడానికి పిండి వగైరా గట్రా పెట్టి ఉన్నా. అట్లాగే మంచి నీ కిష్ట మైన సబ్జీ పెట్టి ఉన్నా . కుకర్ లో రైజ్ పడేసు కో ! ఆ సబ్జీ కి చింత పండు నీరు కలిపి ఉడకబెట్టేయి , నీకు హాంఫట్ సాంబార్ తయార్ '
అన్నారు

సర్లెండి, సర్లెండి అన్నా ఇప్పుడు ఈయన గారిని కాదంటే ఇంకా పెద్ద లెక్చరు పీకుతారేమో అని భయమేసి !

'నీ ఆరోగ్యం జాగ్రత్తే' అంటూ మరో మారు విచారం కనబరచేరు

తట్ , మీరు వెళ్ళేది ఓ వారం రోజులు దానికి ఇంత సీన్ బిల్డ్ అప్ ఇవ్వాలా ? మా బ్లాగు లోకం వాళ్ళు నా గురించి ఏమని అనుకుంటారు మరి ? ఓస్ , ఈవిడకి ఈ పాటి పని కూడా తెలీదా అని తీసి పారేయ్యరూ మరి ? ' అన్నా

సర్లేవే, నీ బ్లాగు గొడవల్లో , భోజనం గట్రా మరిచి పోయేవు జాగ్రత్త అని మరో మారు జాగ్రత్తలు జెప్పి వెళ్ళేరు

ఆయన అట్లా వెళ్ళిన అర్ధ గంట లో యధాతధం  గా , 'అయ్యరు వాళ్ ' కాఫీ అని కేకేసా బ్లాగులు చదువుతూ .

నిశ్శబ్దం ! ఊప్చ్ , ఇక మనమే కాఫీ గట్రా పెట్టేసు కోవాలా ! ఓహ్ వద్దులే కాఫీ మానేద్దాం అని తీర్మానించేసి  హ్యాపీ అయి పోయా

మరో అర్ధ గంటలో కడుపులో ఆకలి కసామిస అన్నది !

ప్చ్ , ఈ మారు ఎట్లా ఒట్టి  నీళ్ళు తాగి ఊరుకుంటే సరి పోతుందేమో అనుకుని , ఏదో అయ్యరు గారు చెప్పేరు గదా ఫ్రిడ్జ్ లో ఏదో పెట్టేరని అది చూద్దాం అనుకుని చూసా .

దోసకి కావాల్సిన పిండి ఉన్నది . సబ్జీ వేపుడు ఉన్నది !

హమ్మయ్య దోసెలు వేసుకోవచ్చు అనుకున్నా .

ప్చ్, హ్యాపీ గా టపాల  జిలేబీ లు వేసుకునే స్థాయి నించి దిగబడి ఇట్లా దోసెలు వేసుకునే స్థాయి కి పడి  పోయామే అనుకున్నా !

సరే ఇక దోసెలు వేసుకుని ఆ సబ్జీ మళ్ళీ ఉడక బెట్టి అబ్బా 'this is too complicated process, there should be some simplified process of CMMI (Complete Meal Maker Integration!) ' అనుకుని ,ఏమి చేద్దామబ్బా అని ఆలోచించి , ఆలోచించి (దాంతో టే  మళ్ళీ ఆకలి నక నక ఇంకా ఎక్కువై పోయింది !) ఒక నిర్ణయానికి వచ్చి ,
ఆ సబ్జీ ని దోసె పిండీ ని కలిపా 'This stuff became too compact, there should be some 'free flow' for the dosa to come properly' అనుకుని కొంత నీళ్ళు కలిపి పాన్ మీద దోసెలు వెయ్యడం మొదలెట్టా !

మొదటి దోసె హాంఫట్ అని తుస్సు మన్నది . సరే పోనీ లే అని పాన్ ని ఇంకా గరం కానిస్తే  రెండో దోస నించి  సరిగ్గా దోసె క్రిస్పీ గా రావడం మొదలెట్టింది !

వావ్, ఐ హావ్ మేడ్ ఎ కంప్లీట్ మీల్  టుడే ! అనుకుని 'Mixed Vegetable Dosa' చెయ్యడం నేర్చేసుకున్నా అని బహు సంతోష పడి  పోయా !

మా ఆఫీసులో వాళ్ళు మేమ్  సాహిబా, అయ్యరు  గారు ఊరు  వెళ్ళేరు కదా, మీకు భోజనం ప్రాబ్లెమ్ అయి పోయి ఉంటుందే అంటే, 'No, no, you see, I have made Mixed Vegetable Dosa'  అని  గొప్ప గా చూపించా టిఫన్ బాక్స్ ఓపెన్ జేసి . 

'మేమ్  సాహెబ్, మీరు ఏ  విషయం లో నైనా ఘటికులే మరి '  ఓ కాంప్లిమెంట్ ఇచ్చేసి వెళ్లి పోయేరు కొలీగ్స్ .

జిలేబీ యా మజాకా ! ఇదిగో బలాగు బలాదూరు భామా మణులు , మీరేమీ వర్రీ అవకండి మనకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు ! అంతా కొంత బుర్ర ఉపయోగిస్తే చాలు అంతే !

ముదితల్ నేర్వగరాని విద్య గలదె, ముద్దార నేర్పించినన్ అని ఊరికే అన్నారా మరి ? ముద్దార  ఎవ్వరూ నేర్పక పోయినా ముదితలికి 'నేర్పు' అన్నది 'స్వయం' భాసితం !


శుభోదయం
చీర్స్
జిలేబి


 

11 comments:

  1. కధ బాగుంది కాని వనజగారికి పంపితే ఇంకా బాగుంటుంది కదూ! :)

    ReplyDelete
    Replies

    1. ఇది మరీ ఘోరాతి ఘోరమండీ కష్టే ఫలే వారు ! అంత కష్ట పడి Mixed Vegetable Dosa చెయ్యటం నేర్చుకుంటే, ప్చ్ కథ బాగుంది వనజ గారి కి పంపించండి అంటారా !! వాట్ ఏ పిటీ !

      వనజ గారి కి ఆల్రేడి రెండు కథ ల లింకు ఇచ్చేసే నండీ ఉడతా భక్తీ గా !

      చీర్స్
      జిలేబి

      Delete
  2. Replies
    1. దీపా గారు,

      నెనర్లు మీకూ నా బాధలు నచ్చినందులకు !!

      చీర్స్
      జిలేబి

      Delete
  3. కూటి కోసం కూలి కోసం పట్టణంలో ఉండిపోయి భర్త మాట చెవిన పెట్టని జిలేబీ గారికి ఎంత కష్టం, ఎంత కష్టం

    (శ్రీశ్రీకి క్షమాపణలతో)

    ReplyDelete
    Replies
    1. జై గొట్టి ముక్కలు వారు,

      వామ్మో , ప్రాబ్లమ్ మనది కానంత వరకు ఇట్లా ఎవరినైనా చెప్పోచ్చ్చు !! జేకే !

      ఆ శ్రీ శ్రీ ఇంతకీ ఏమన్నారండీ ?(పోతా పోతా ఆకశానికి అని పైకెగిరి పోయేడు గలాసు తో సహా మానవుడు !ప్చ్ )


      జిలేబి

      Delete
    2. "ప్రాబ్లమ్ మనది కానంత వరకు ఇట్లా ఎవరినైనా చెప్పోచ్చ్చు"

      Everything is easy for a person who does not have to do it!

      Delete
  4. ఇటువంటి కష్టం పగవారిక్కూడా రాకూడదని నా సానుభూతిని తెలియజేసుకుంటున్నాను...
    జై వెజిటబుల్ దోశా జై జై వెజిటబుల్ దోశా...

    ReplyDelete
  5. ఈసారి జిలేబీలు వేయడం నేర్చేసుకుంటే సరి.. one more feather in your cap...

    ReplyDelete
  6. 'మేమ్ సాహెబ్, మీరు ఏ విషయం లో నైనా ఘటికులే మరి !

    ReplyDelete
  7. ఇంత పనిపెట్టిన అయ్యరుగారు డౌన్ డౌన్

    ReplyDelete