Thursday, July 11, 2013

మీర జాల గలడా నా యానతి ...


మీర జాల గలడా నా యానతి ... జిలేబి పతి అని చెప్పుకోవాలి నేనైతే !

ఆ మధ్య అయ్యరు గారు ఊరెళితే అని రాసా చూడండీ దాని తరువాయి మా అయ్యరు గారు ఫోన్ చేసి, ఇదిగో జిలేబి , ఇక్కడ తుంగభద్రా తీరం లో ఈ శంకరాచార్యుల వారి మటం లో నే సెటిల్ అయిపోవాలని ఉందోయ్ అంటే వామ్మో వామ్మో, ఇది మొదటి కె మోసమై పోయేటట్టు ఉన్నదే అనుకుని వద్దంటే కాదు సెటిల్ అయి పోతా నని భీష్మించు కుంటే మరీ ప్రాబ్లం అయి పోతుందని

'ఆహా మీ నిర్ణయం అమోఘం' అన్నా మేచ్చేసు కుంటూ.

ఆ మొబైలు బయలు కావల ఉన్న అయ్యరు గారు ఈ సమాధానం ఎదురు చూసినట్టు అని పించ లేదు కామోసు, ఒక్క క్షణం నిశ్శబ్దం  లైను లో .

అంటే ... నీ కేం బాధ లేదా ?

అబ్బే, నా కేం బాధ ! మీకే మరి బాధ గా ఉంటుందేమో మరి అక్కడ ఒంటరి గా సన్యాసాశ్రమం లో ... ప్చ్ అని పెదవి విరిచా ...

అంటే ?

అంటే వేళకి నేను భోజనం చేసానో లేదో అన్న ఆలోచన లో నే అక్కడ ఉంటారేమో మరి ' అన్నా మొదటి క్రాసు వేస్తూ .

ఆ అలా ఎందుకు ఉంటా అన్నారు బెట్టు గా

మరి ఈ ఒక్క వారం  లో మీరు ప్రతి రోజూ ఫోను చేసి జిలేబీ భోం చేసావా అని అడుగుతూ ఉంటే ను అట్లా అనిపించింది అన్నా ఈ మారు రవ్వంత గద్గద స్వరం తో ... స్వరం మార్చడం మా కేమన్నా కొత్త విద్యా ? పెళ్ళికి ముందే బామ్మ మాకు నేర్పించిన ముదితల్ విద్య గదా ఇది మరి !

ఇంతకీ ఇవ్వాళ భోం చేసావా ? కంటం లో ఆతురత ఈ మారు అయ్యరు వారి లైను లో  ...

ఊహూ అన్నా అప్పటికే రెండింతలు మెక్కి ఉన్నా నీరసం గా ... అరవై నాలుగు కళలలో అబద్దం కూడా ఒకటి అనుకుంటా మరి ?

సరేలే జిలేబీ, నువ్వన్నది సబబే మరి ! నేనిక్కడే సెటిల్ అయి పోయే ఆలోచన మానుకుంటా లే, నువ్వేమి బెంగ పెట్టు కొమాకు

అబ్బే, నా కేమి బెంగ లేదండీ, మరి మీ ఆరోగ్యం ఆలోచనలతో చెడి పోతుందేమో అని ... అంతే ! ' నొక్కి చెప్పా ఈ మారు ...

వద్దులేవే, ఏదో , ఓ వారం బాగున్నది గదా అని ఇక్కడే సెటిల్ అయి పోదా మానుకుంటే, ఆ పై మన హోటలు వ్యాపారం ఎవరు చూసుకుంటారు వచ్చేస్తా లే

కైలాసం వెళ్ళినా ఈ అయ్యరు గారు హోటలు తో నే వెళ్ళా లనుకునే రకం ! ఈ పాటి దానికి సన్యాసాశ్రమం లో ఉంటా నంటా డా , ఈయన్ని ఇంకొంచెం 'leg pulling' చేద్దామనుకుని ,

ఆ , హోటలు ఇక్కడ బందు చేసి, అక్కడే పెట్టేసు కుంటే పోలే మరి !

ఇప్పుడు అయ్యరు గారి బుర్ర ఓ బడా లెక్క వేసింది

'అబ్బే, ఇక్కడ హోటలు పెడితే ఎవరోస్తారే, మటం లో నే ఉచిత భోజనం ! అంతే గాక, సరకులు కావాలంటే కొండ దిగాలి , అదీ గాక కొత్త ప్రదేశం ! బిజినెస్సు ఎట్లా నడుస్తుందో ఏమో మరి

అవునవును అన్నా ఈ మారు వంత పాడుతూ ...

అక్కడే సెటిల్ అయ్యే ప్లాన్ బందు చేసి, ఇంటికి వచ్చి చేరండి, అన్నా ఈ మారు అధారిటీ తో 

'ఎంతైనా, చెప్పు జిలేబీ, నీ ఆలోచన ఎప్పుడు తప్పు కాదె అట్లాగే ఇంటికి వచ్చేస్తా లే ! అని పోగిడేసేరు ఈ మారు అయ్యరు గారు

జిలేబీ యా మజాకా !మీర జాల గలడా నా యానతి ... జిలేబి పతి !!


శుభోదయం
చీర్స్
జిలేబి 

7 comments:

  1. >>>'ఎంతైనా, చెప్పు జిలేబీ, నీ ఆలోచన ఎప్పుడు తప్పు కాదె అట్లాగే ఇంటికి వచ్చేస్తా లే ! అని పోగిడేసేరు ఈ మారు అయ్యరు గారు

    ఇంతకీ అయ్యరువారొచ్చారా? రాకేం చేస్తారు లెండి! జిలేబి గారు పెట్టిన మెలికా మజాకా :)

    ReplyDelete
  2. మఠం వద్ద హోటల్ పెట్టి చూస్తే ...

    ReplyDelete
  3. zilebee gaaru... mee anubhavanni rangarinchi maaboti pilla zilebeelaki ilaanti tips ivvandi.. plz... maa ayyaruni koodaa control lo pettukovaalani undi.. kaanee arachetilo imadadamledu..

    ReplyDelete
  4. తఫ్ఫట్లు మీకు...అంతే! భలే లౌక్యం తెలిసిన వారు సుమీ మీరు.

    ReplyDelete
  5. పాపం అయ్యరువారు అమాయకులు కనుక మీ ఆటలు చెల్లుతున్నాయి కాని కాకుంటేనా..?

    ReplyDelete
  6. మా జిలేబీగారు మహాహాహాహాహా తెలివైనవారు :-)




    ReplyDelete
  7. ప్రాయేణ గృహిణీ నేత్రాః కుటింబినః అన్నాడు కాళిదాసు. ఆయనకి అప్పట్లోనే అయ్యరోరు అంతర్దృష్టిలో కనిపించారు. ఏదేమైనా పెళ్లాళంత తెలివైనవాళ్లు కాదు మొగుళ్లు (ఇది నా అభిప్రాయం), అందుకే పడేస్తాం పడేస్తాం అనే మొగుళ్లు ఈజీగా పడిపోతుంటారు అని నిరూపించారు అయ్యర్ గారు. ఆయన్ని మా సంఘ అంతర్జాతీయ అధ్యక్షునిగా నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నా.

    ReplyDelete