Monday, July 22, 2013

గురుపూర్ణిమ గుండు సున్నా !

గురుపూర్ణిమ గుండు సున్నా !

ఇవ్వాళ గురు పూర్ణిమ.

గురువు లేక ఎటువంటి గుణికి తెలియదని త్యాగరాజ స్వామీ వారి ఉవాచ.

అందరికీ ప్రస్తుత జమానా లో గురువు ఉండి ఉండ వచ్చు, ఉండక పోవచ్చు.

గురువు దొరకాలంటే దానికీ పెట్టి పుట్టి ఉండా లంటారు. నేను చెబుతున్నది సద్గురువు ల గురించి.

మన కర్మ కొద్దీ, స్వామీ వారల అదృష్టం కొద్దీ, మనకు గుండు సున్నా గురువు లూ తగలవచ్చు.

గుండు సున్నా ఆహా ఏమి అమోఘం అని మనం వారి సున్నా లో భాగమై పోయి సుడి గాలి లోని నావలా కొట్టుకు పోవచ్చు.

కాబట్టి గురువు ని గురించి సదవగాహన కలిగి ఉండటం అన్నది మన ఈ కాలానికి కావలిసిన కనీస అవసరం. లేకుంటే గుండు సున్నా మనకి కలిగే అవకాశం ఉన్నది

కాషాయం కట్టిన వాడంతా గురువై పోతే మనం గుండు సున్నా లయి పోవడం ఖాయం.

ఓ టీవీ  కొనాలంటే మార్కెట్ లో కెళ్ళి వంద మార్లు విచారణ మొదలెడతాం.

కాని స్వామీ వారల కొచ్చే సరికీ మన ఈ విచక్షణ హుష్ కాకీ అన్న మాట. !

ఇంతకీ గురు పూర్ణిమ అని ఇట్లాంటి సంభాషణ రాస్తున్నారేమిటి మీరూ ఏమైనా గుండు సున్నా గురువు లయి పోయారా అంటారా,మరి జిలేబీ రౌండు గా గుండు సున్నా లా నే కదండీ ఉండేది.?

అందరికీ శుభాకాంక్షల తో,

శ్రీ కృష్ణం వందే జగద్గురుం.

జిలేబి.

6 comments:

  1. నేటి రోజుల్లో గురువు నై దేవుడూ నై!

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే గారు,

      గురువూ నై దేవుడూ నై నేతి నేతి !

      జిలేబి

      Delete
  2. ఈ గురు పూర్ణిమ నిజానికి గురువులకు గుండు చేయిస్తుంది . గుండు సున్నాయే ఈ ప్రపంచపు ఆకారం. కనపడనిది శూన్యం అంటుంటాం , ఆ శూన్యంలోనే వెతుకుతుంటాం . ఈ వెతుకులాటకి గురువు సాయం కోరతాం . ఆ గురువు మనకు మార్గదర్శకుడు కావాలే గాని మనకు గుండు సున్నా చూపించేవాడు కాదు , గుండు చేయించేవాడు కాదు అన్నది అక్షర సత్యమే .

    ReplyDelete
    Replies

    1. శర్మ గారు,

      మా మంచి మాట చెప్పేరు ! పూర్ణమిదం పూర్ణమదః !

      జిలేబి

      Delete
  3. ఇంకేమీ లేకుండా మన మనస్సును నిరామయం చేసేవారు గురుదేవులు.

    ReplyDelete
    Replies

    1. దుర్గేశ్వర గారు,

      సరియైన మాట చెప్పేరు ! సద్గురువు సమీపం లో ఉంటే హృదయం పరిపూర్ణ మే !

      జిలేబి

      Delete