Friday, July 26, 2013

నవ్వితే నవ్వండి , ఏడవ దలిస్తే మీ ఇష్టం !

నవ్వితే నవ్వండి , ఏడవ దలిస్తే మీ ఇష్టం !

మన జీవితం లో చాలా విషయాలు ఏక కాలం లో జరుగు తూ ఉంటాయి ! అంటే ఒక్క నిమిషం లో నవ్వు మరో నిమిషం లో ఏడుపు కలగలసి వచ్చే విషయాలు ఎన్నో !

అంటే ఇదే వరుసలో ఉండాలని రూలు లేదు ! ఏడుపు వచ్చి ఆ పై నవ్వు వచ్చే సందర్భాలు కూడా ఎన్ని లేవు ?

మన ఇంటి పెద్ద దిక్కు లాక్కుని లాక్కుని బాల్చీ తన్నితే మొదట ఏడుపు, ఆప్యాయత ఎక్కువై , ఆ పై మనసలులో హాయి ఐన నవ్వు పీడా వదిలిందిరా బాబు పిండం గట్టెక్కింది కొన్నాళ్ళ కి ఆసుపత్రి ముఖం చూడ నక్కర లేదు అన్న ఆనందం

అంతలో నే ఇంట్లో పురుడు పోసుకోవడానికి కోడలో  కూతురో మనవరాలో ...  మరి ఆనందం అనందం ఆయెనే !

ఇక నవ్వు ఏడుపు ల కలగలపు హాస్య రచనల్ని చదవడం లో ఉన్న మజా లో ఉండనే ఉంటాయి !

మన రాజకీయాల పోకడ చూస్తె నవ్వాలో ఏడవాలో తెలీని విషయం ! ఇది మరీ ఘోరం కాదా ! ఏమి చెయ్యాలో తెలీని స్థితి కూడా ఎన్నో మార్లు ఏడవడానికి నవ్వడానికి మధ్య సందిగ్ధావస్థ లో పడేసే ఘట్టాలు

ఆఫీసు లో బాసు నవ్వుతూ మనకి ఫిట్టింగ్ పెడతాడు - జిలేబీ యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ నీడేడ్ యు హేవ్ డన్ ఎక్సెల్లెంట్లీ సో ఫార్ ' అంటే మనకి ఉద్వాసన వచ్చినట్టే ! ఉద్వాసన వస్తే నవ్వుతూ హ్యాపీ గా వెళ్లి పోవచ్చు అనుకుంటే , అబ్బో, మన కొలీగ్స్ ఏమని అనుకుంటారు అంటూ ఏడుపు

ఇంట్లో పెండ్లాం జిలేబీ ఇవ్వాళ్టి కి టిఫిన్ ఏమి చెయ్యనండీ అంటూ తెల్లారి ముద్దార అడిగితే , అప్పుడే బ్లాగు లో కామెంటు కొడుతూ ఏదో ఒకటి ఏడువు అని అన్య మనస్కం గా అంటే దాని పరిణామం ?

అమాయకపు భర్త ఆరిందా అర్ధాంగి వీళ్ళ జీవితం లో జరిగే ఘట్టాలు ఇతరులకి నవ్వులు తెప్పించేవి పాపం ఆ భర్త గారికేమో ఏడుపు నవ్వు కలగలిపి తెప్పించేవి !


ఇంతకీ నేను ఏమి రాస్తున్నా !

ఏదో ఒక టైటిలు పెట్టి ఇట్లా జిలేబీ 'చుట్ట' కాలుస్తూంటే నవ్వ మంటావా లేక ఏడవ  మం టావా జిల్ జిల్ జిలేబీ అంటే,

నవ్వితే నవ్వండి , ఏడవ దలిస్తే మీ ఇష్టం !


చీర్స్
జిలేబి
 

5 comments:

  1. మరీ మొహమ్మాటం పెట్టేస్తున్నారు కాబట్టి నవ్వేద్దాం.. సరేనా...

    ReplyDelete
    Replies

    1. 'మోహ' మాట పడి నవ్వేరా మరి ! చూడండి మరి బాతాఖానీ టపా వచ్చేసే !



      జిలేబి

      Delete
  2. నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు!

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం గారు,

      నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే నని ... పాహి రామప్రభో !

      జిలేబి

      Delete

  3. అహ్మద్ చౌదరి గారు,

    మీ బ్లాగు కి ఇట్లా వారానికొకసారి కామెంటు ఎడ్ కొడుతూంటే మరీ చికాకుగా ఉన్నదండి !

    జిలేబి

    ReplyDelete