Saturday, August 17, 2013

జిలేబి బయో డేటా !


మీ పేరు ?

భారతి 

వయస్సు ?

అరవై ఏడు 

వృత్తి 

సంతానోత్పత్తి 

కులం ?

పోయే కాలం లో ఏ కులమైతే నేమిటి ?

తట్ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అధిక ప్రసంగం కూడదు 

సర్ 

ఆధార్ కార్డు ఉందా ?

పిచ్చి ప్రశ్న ! దానికోసమే కదా వచ్చి ఉంట !

వోటర్ కార్డు ?

లేదు 

అట్లీస్ట్ రేషన్ కార్డు ?

లేదు 

మరి బర్త్ సర్టిఫికేట్ ?

నే పుట్టినప్పుడు జనాలు జయహి  జయహి  అన్నారు సర్టిఫికేట్ అప్పట్లో లేదు

పాస్ పోర్ట్ ?

లేదు 

ఎప్పుడు పుట్టావ్ ?

ఆగస్ట్ పదిహేను 1947

మరి ఇన్నేళ్ళ కి ఆధార్ కార్డ్ తీసుకుని ఏం జేస్తావ్ ?

అంటే ?

ఇన్నేళ్ళు ఏం చేసావని మరి ?
 
తెలీదు 

ట ట్ టట్ ! you are dismissed ! Next please


జిలేబి 
 

13 comments:

  1. నిజమే అప్పటినుంచి ఆధార్ లేక నిరాధారంగా ఉండిపోయింది భారతి.

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు,

      అంతే కదండీ మరి ! నిరాధార భారతి అయిపోయింది

      జిలేబి

      Delete
  2. శర్మ గారి కమెంటే నా కమెంట్ .

    ReplyDelete
    Replies

    1. శర్మ గారు,

      నెనర్లు !


      జిలేబి

      Delete
  3. ఈవిడే కాబోలు మొన్న పంద్రా ఆగస్టు నాడు ఎదురైంది.. ఎక్కడికెళ్ళినా "జై తెలంగాణా" అనో "జై సమైక్యాంధ్రా" అనో "జై రాయలసీమ" అనో అంటున్నారు.. ఒక్కడు కూడా మనసారా, గుండె నిండా గాలి పీల్చుకుని "భారత్ మాతా కి జై" అని అనలేదుట.. ఏడుస్తూ చెప్పుకుంది పాపం పిచ్చి తల్లి..

    ReplyDelete
    Replies

    1. వోలేటి వారు,

      అక్షరాలా నిజం ! భారతి ఓ పిచ్చి తల్లి అయిపోయింది

      జిలేబి

      Delete
  4. నిరాధార భారతీ నమో నమ: !!

    ReplyDelete
    Replies

    1. నాగరాజ గారు,

      నమో నమః

      జిలేబి

      Delete
  5. 67 ఏళ్ళకి అధారం కావాలని అప్పట్లో తెలిసి ఉండదు పిచ్చితల్లికి పాపం.

    ReplyDelete
    Replies

    1. ప్రేరణ గారు,

      అప్పట్లో తెలీదు. ఇప్పుడు తెలిసి ఉన్నా అది సరి అయిన పద్ధతి లో సాగడం లేదు !

      జిలేబి

      Delete
  6. మా కుటుంబంలో అందరికీ ఆదార్ card వచ్చింది కాని ఎందుకో వాళ్లకు ఇవ్వాలనిపించలేదు అందరం ఒకసారి apply చేసినా నాకు ఇప్పటికీ reply లేదు!కనుక నేనున్నూ భారతి లాగా నిరాధార నిర్భాగ్యుడిని!

    ReplyDelete
    Replies

    1. సూర్య ప్రకాష్ గారు,

      ఆధార్ అవైటేడ్ అని చెప్పండి మరి !

      జిలేబి

      Delete
  7. భారతికి ఆధారం పోయేకాలం దగ్గర పడిందంటారా!

    ReplyDelete