Sunday, April 27, 2014

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? (భాగం మూడు )


అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? (భాగం మూడు ) - ఆధ్యాత్మ ఉపనిషత్ 

ఈ ఆధ్యాత్మ ఉపనిషత్ లో ఉన్న జ్ఞానం అపాంతరత అను నతనికి   అపాంతరత  నించి బ్రహ్మకి , బ్రహ్మ నించి ఘోర అంగీరసు  నికి, ఘోర అంగీ రసు ని నించి  రైక్వునికి రైక్వుని నించి రాముని కి రాముని నించి అందరికి తెలియ వచ్చినది గా ఈ ఉపనిషత్తు చివరిలో ఉన్నది 

ఇందులో అపాంతరత ఎవరు , ఘోర అంగీరస ఎవరు రైక్వుడు రాముడు ఎవరు అన్నది కొంత పరిశోధించి తెలుసుకోవలసిన పేర్లు ! (రాముడు రామాయణ కాలపు రాముడే నా ?)

ఇక ఈ ఉపనిషత్ లో మొదటి వాక్యం 

అంతః శరీరో నిహితో గుహాయామజ ఏకో నిత్యమస్య ! --> శరీరాంతర గుహ లో (!) నిత్యమై ఉన్నవాడు ఒకడున్నాడు అన్న 'statement of fact' తో ఈ ఉపనిషత్తు మొదలవుతుంది 

ఇందులో ఉన్న కొన్ని 'జలక్కులు ' :

ఘటాకాశం మహాకాశ ఇవ ఆత్మానం పరాత్మని !

కుండలో ఉన్న స్థలం (ఆకాశం) పూర్ణ మైన ఆకాశం లో ఉన్నట్టు ఆత్మ పరాత్మ లో ఉన్నది (కుండలో ఉన్న ఆకాశం లో మహా ఆకాశం లో కలిస్ పోయేటట్టు నీ ఆత్మని పరాత్మ లో కలిప డానికి ప్రత్నించు అన్న అర్థం లో కూడా చెప్ప వచ్చు )


యత్రైష జగదాభాసో  దర్పణ అంతః పురం యథ
తద బ్రహ్మ అహం ఇతి జ్ఞాత్వా కృతకృత్యో భవాన్ అఘ !

అహం బ్రహ్మా అన్న జ్ఞానం తో - ఒక దర్పణం లో కనిపించే నగరం లామొత్తం ఈ బ్రహ్మ లో ఉన్నదని గ్రహించి పూర్ణత్వాని పొందు  !

దర్పణ అంతః, పురం  - అన్నది ప్రసిద్ధ మైన  ఉపమానం - A city reflected in a mirror

(Realizing that  ‘I am that Brahman’ in which this world appears  like a city reflected in a mirror, find fulfillment, O sinless one!)

(ఇట్లాంటి వర్ణ న ఆది శంకరుల వారి దక్షిణా మూర్తి శ్లోకం నించి -->

"విశ్వం దర్పణ దృశ్య మాన నగరీ తుల్యం ! ")

క్రియానాశాత్ భవేత్ చింతా నాశ , తస్మాత్ వాసనా క్షయః 
వాసనా ప్రక్షయో మోక్షః సా జీవన్ముక్తి రిష్యతే !

కొద్ది గా విచిత్రం గా అనిపిస్తుంది - క్రియానాశాత్ చింతా నాశః అనేది . ఆలోచన ల త్రుంచడానికి క్రియ ని త్రుంచు అనడం .  May be excessive action ? Destroy excessive action so you destroy excessive thinking ?

చింతా నాశాత్ వాసనలు తగ్గడం, వాసనలు పూర్తి గా ప్రక్షాళన మైతే మోక్షం ; ఆ పై జీవన్ముక్తి !

అజ్ఞాన హృదయ గ్రంథె నిహి  శేష   విలయః తదా 
సమాధినా వికల్పేన యదా అద్వైత ఆత్మ దర్శనం !

(వికల్పేన సమాధినా యదా అద్వైత ఆత్మ దర్శనం తదా హృదయ గ్రంథె అజ్ఞాన విలయః నిహి శేషః  !)

With the vision of the non-dual Self through unwavering concentration comes the dissolution without residue of the knots of ignorance in the heart.

ఇత్థం వాక్యైహి తథా అర్థః అను సంధానం శ్రవణం భవేత్ !
యుక్త్యా సంభావితత్వా అనుసంధానం మననమ్ తు తత్ !

తాభ్యం నిర్విచికిత్సే అర్థే చేతసః స్థాపితస్య యత్ 
ఏకతానత్వమేతద్ది నిధి ధ్యాసన ముచ్యతే !  

ధ్యాత్రు ధ్యానే పరిత్యజ్య క్రమాత్ ద్వయే  ఏక గోచరమ్
నివాత దీపవ చిత్తం సమాధిరభిధీయతే !

(శ్రవణం మననం ధ్యానం నిధిధ్యాస ల గురించి విపులమైన వివరణ !)

‘To listen’,- శ్రవణం  is to pursue by means of sentences their import. On the other hand, ‘thinking’ - మననమ్ consists in perceiving its consistency with reason.
 

Meditation’- ధ్యానమ్  is indeed the exclusive attention of the mind fixed on (the import) rendered indubitable through listening and thinking.

 ‘Concentration’ - నిదిధ్యాస is said to be the mind which, outgrowing the dualism between the meditator and meditation, gradually dwells exclusively on the object (of meditation) and is like a flame in a windless spot - నివాత దీపం !

అమునా వాసనాజాలే నిశ్శేషం ప్రవిలాపితే !
సమూలోన్మూలితే  పుణ్య పాపఖ్యే కర్మ సంచయే !

 వాక్యమప్రతి బద్ధం సత్ ప్రాక్ పరోక్షవ భాసితే !
కరామలకమవబోధ పరోక్షం ప్రసూయతే  

(కర అమలకం - చేతి లోని ఉసిరి కాయ !)

When the load of innate impulses is dissolved without residue by means of this (cloud of virtues) and heaps of karmans, good and evil, are totally eradicated, the major text, which at first shone forth immediately, now unobstructed, yields immediate awareness as (clear) as the myrobalan in the palm (of one’s hand). (myrobalan in the palm - చేతి లో ని ఉసిరి కాయ )

ఈ చేతి లోని ఉసిరికాయ కొంత ఆలోచింప జేసే ది ! బుద్దుడు తన ఏడు వారాల అభోజనం తరువాయి మొదట గా తీసుకున్న ఫలం ఉసిరి కాయ గా బౌద్ధ గ్రంథా లో ఉదంతం ఉంది ( దేహం లో ని మలినాన్ని పోగొట్ట డానికి - అన్ని రోజుల fasting తరువాయి భోజనం తినడానికి ముందు మందు లా అన్న మాట !)  బుద్ధుడు చేతిలో ఈ ఉసిరి కాయ పెట్టుకుని ధ్యాన ముద్ర లో ఉన్నట్టు - చీనా  వైద్యుల పుస్తకాలో చూడవచ్చు ! 

అంతే గాక ఈ ఘోర ఆంగీరస ( ఈ ఉపనిషత్తు ఎవరి ద్వారా తెలియ జేయ బడ్డ దో వారి లో ఒకరు )  జైనుల ఒకానొక గురువు అయి కూడా  ఉండ వచ్చన్న నమ్మకం  ఒకటి ఉన్నది !

ఇక కర్మ యొక్క ఫలం గురించి ఆలోచింప దగ్గ వాక్యం ఉన్నది  ఈ ఉపనిషత్తు లో - > కర్మ ఫలితం జ్ఞానం వల్ల ఆ తరువాయి శేషం అవుతుందా అంటే కాదు అని చెబ్తుంది ! ఇది ఎట్లా అంటే ఒక వ్యాఘ్రాన్ని చంపాలనుకుని వదిలిన బాణం --> అది వ్యాఘ్రం కాదు - ఆవు అని తెలిసినంత మాత్రాన ఆ వదిలిన బాణం తన గురిని కొట్ట కుండా ఉండదు - అట్లా అన్న మాట !

జ్ఞానోదయాత్ పురారబ్ధం కర్మ జ్ఞానాన్ న నశ్యతి  !
అదత్వా స్వఫలం లక్ష్యం ఉదిష్యోత్ సృష్ట బాణవత్ !

వ్యాఘ్ర బుద్ధయా వినిర్ముక్తో బాణః  పశ్చాత్తు గోమతౌ !
న తిష్ఠతి భినత్యేవ లక్ష్యం వేగేన నిర్భరమ్ !!

ఆధ్యాత్మ ఉపనిషత్ - శుక్ల యజుర్ వేద లోనిది - సంస్కృతం 

ఆధ్యాత్మ ఉపనిషత్ ఆంగ్లానువాదం 



శుభోదయం 
జిలేబి (బీ లేజి )
క్రియానాశాత్ భవేత్ చింతా నాశ , తస్మాత్ వాసనా క్షయః !!

Friday, April 25, 2014

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - ( భాగం రెండు )


అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - ( భాగం రెండు ) - అథర్వ శిర ఉపనిషత్ 


అథర్వ శిర ఉపనిషత్ లేక అథర్వ శీర్షోపనిషత్ -

అథర్వ వేదీయ శైవ ఉపనిషత్ . అర్థమనర్థ ప్రోచ వాచకం . 

"దేవా హ వై స్వర్గ లోక మాయస్తే రుద్రన్ పృచ్చన్,  కో  భవాన్ ఇతి ?"  

దేవతలు రుద్రుని గురించి తెలుసు కోవడానికి కైలాస వాసుడైన రుద్రుని ప్రశ్నిస్తారు - స్వామీ మీరెవ్వరు ?

దానికి సమాధానం గా రుద్రుడు చెప్పడం ఈ ఉపనిషత్ సారం . 

"సో బ్రవీద మమ ఏకః 
ప్రథమం ఆసన్,  
వర్తామి చ ;
భవిష్యామి చ;
న అన్యః కశ్చిన్
మత్తో వ్యతిరిక్త ఇతి !"

"ఆది లో నేనే ఉన్నాను ;
వర్తమానం లో నేనే ఉన్నాను ;
భవిష్యత్తు లో ను నేనే ;
నన్ను తప్పించి వేరెవ్వరూ లేరు "


ఈ ఉపనిషత్తు లో అంతర్యామిన్ ప్రస్తావన మన శరీరం లో హృదయం లో ఉన్నాడన్న ప్రస్తావన ఇట్లా వస్తుంది . 

హృది స్థా దేవతా సర్వా హృది ప్రాణాః ప్రతిష్టితాః ! హృది త్వం అసి యో నిత్యం తిస్రో మాత్రాః పరస్తు సః !"

సర్వ దేవతలు హృదయం లో ఉన్నారు; ప్రాణం హృదయం లో ప్రతిష్టిత మై ఉన్నది ;  హృదయం లో తను ఉన్నాడు; (హృది త్వం అసి)  త్రిగుణా ల కావల ఉన్నాడు "  

మరొక్క చోట , వెంట్రుక కొన  అంత సన్నగా (అంతర్యామిన్) హృదయం లో ఉన్నాడన్న ప్రస్తావన వస్తుంది . 

" వాలాగ్ర మాత్రం హృదయస్య మధ్యే విశ్వం దేవం జాతరూపం  వరేణ్యం ! "

తమ్ ఆత్మస్థ యేను పశ్యంతి ధీరాః తేషాం శాంతిహి భవతి న ఇతరేషాం !

(To the wise men  , who realize the Deity in Atman, (who is as minute as the end of the hair), in the center of the heart, who is omniscient the best and all, is the eternal tranquility, and not to others. )

అథర్వ శిర ఉపనిషత్ సంస్కృతం 

అథర్వ శిర ఉపనిషత్ - ఆంగ్లాను వాదం 


శుభోదయం 
జిలేబి 

Wednesday, April 23, 2014

శ్రీ పాద వారి 'అరణ్య కాండం'

శ్రీ పాద వారి 'అరణ్య కాండం'

ఇరవై మూడు ఏప్రిల్ నెల అనంగా నే శ్రీ పాద వారు గుర్తుకు రాక మానరను కుంటా !

ఆ మధ్య వారి అరణ్య కాండం పీ డీ ఎఫ్ రచన దొరికితే దాని మీద ఒక టపా  జిలేబించి నట్టు ఈ మారు ఆ పీ డీ ఎఫ్
లింకు  క్రింద !

శ్రీ పాద వారు ఎందుకు అరణ్య కాండ రామాయణం లో తనకు అంత ఇష్టమైనది అంటూ ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ అంటారు - రామాయణం లో అరణ్య కాండ ఎక్కువ గా ఆంధ్ర దేశం లో ప్రదేశాల లో ఉన్నదట ! అందుకనే వారికి ఈ కాండం అత్యంత ఆప్య మైంది అంటారు ! శ్రీ రాముల వారిని విప్రలంభ శృంగార యోగి అని చమత్కరిస్తారు కూడాను !


సులభ శైలి లో వాల్మీకి రామాయణం ఆధారం గా శ్రీ పాదవారి రామాయణం లో అరణ్య కాండం

"మన దగ్గిర చుట్టమైన రాముడు

మహావీరుడూ ,

ప్రకృతి సౌందర్య పిపాసీ ,

దుష్టశిక్షకుడూ ,

శిష్టరక్షకుడూ,

ముఖ్యం గా విప్రలంభ శృంగార యోగిన్నీ !"

 

(వాల్మీకి మహర్షి విరచితం రామాయణం మూడో సంపుటం అరణ్య కాండ వాడుక భాషలో శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

వచనానువాదం - పబ్లిషర్స్  అద్దేపల్లి అండ్ కో - సరస్వతి పవర్ ప్రెస్ -రాజమహేంద్ర వరము - మొదటి కూర్పు 1956- 'సూచన' -ముందు మాట నించి )


చీర్స్
జిలేబి 

Monday, April 21, 2014

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ?


ఉపనిషత్తులు వేదాంతములు . అంటే వేదానికి అంతిమ భాగాలని చెప్పుకోవచ్చు . కాకుంటే , వేదసారమని కూడా చెప్పు కోవచ్చు .

ఉప + ని + షద్ (షత్) = దగ్గిర + క్రింద + కూర్చోవడం

గురువు దగ్గిర క్రింద కూర్చొని తన బోధనల ను గ్రహించడం అనుకొవచ్చు.

మరో విధంగా చెప్పాలంటే , గురువు వద్ద గ్రహించిన జ్ఞాన సముదాయం .

ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉన్నాయి వాటి లో ముఖ్యమైనవి అంటే వాటి కి శంకర భగవత్ పాదులు వ్యాఖ్య లందించినవి వేళ్ళ మీద లెక్క పెట్ట గలిగినవి  - పది

  1. ఈశోపనిషత్ (ఈసావాస్యోపనిషత్)
  2. కేనోపనిష త్ 
  3. కథొపనిషత్ 
  4. ప్రశ్నోపనిషత్ 
  5. ముండకోపనిషత్ 
  6. మాండూక్యోపనిషత్ 
  7. తైత్రేయోపనిషత్ 
  8. ఐతరేయోపనిషత్ 
  9. చాందోగ్యోపనిషత్ 
  10. బృహదారణ్యకోపనిషత్ 
వీటితో బాటున్న మరో తొంభై ఎనిమిది ఉపనిషత్తుల్లో అంతర్యామిన్ ప్రస్తావన అక్కడక్కడా వస్తుంది . వేర్వేరు విధం గా వీటి ప్రస్తావన - అంటే మన దేహం లో అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడన్న చర్చ వాటికి ఒక విధం గా సమాధానం (పూర్తీ గా కాక పోవచ్చు ) - లాంటివి కనిపిస్తాయి .

చాలా సౌలభ్యమైన సమాధానం - హృదయేషు లక్ష్మి - అంతర్యామిన్ హృదయం లో ఉన్నాడన్నది .

నారాయణ సూక్తం (యజుర్వేదం - తైత్తరీయారణ్యకం ) కొంత వివరంగా చెబ్తుంది . కొద్దిగా కవి వర్ణ న లాంటిది అనిపిస్తుంది .

ఈ టపా  నారాయణ సూక్తం లో ఈ అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడన్న దాని గురించి.

పద్మకోష ప్రతీకాషం హృదయం చాపి అధో ముఖమ్ !  అంటుంది . హృదయం లో తలక్రిందులైన పద్మం లా ఉన్నాడు/ఉన్నది .

అధో నిష్ట్యా వితస్త్యాం తే   నాభ్యాముపరి తిష్టతిమ్
జ్వాల మాలాకులం భాతి  విశ్వశ్యాయతనం మహత్

నిష్ట్యా అంటే - గొంతు దగ్గిరున్న ఎముక (Adam's apple ) - దానికి 'వితస్త్య ' అంత దూరం లో -( వితస్త్య   అన్నది ఒక కొలమానం -  (defined as long span between extended thumb and little finger) )- నాభి కి పై వైపు తిష్ఠతి ! జ్వాలమాల లా విశ్వమూలం లా ఉన్నది .

ఇట్లా కవి వివరణ సాగు తుంది .

ఇట్లాగే మరి ఉపనిషత్తుల లో వర్ణన ఎలా ఉన్నది అన్నది వచ్చే టపాలలో చూద్దాం

నారాయణ సూక్తం ఆంగ్లానువాదం


శుభోదయం
జిలేబి






 

Saturday, April 19, 2014

మోడీ ప్రధాన మంత్రి ఐతే గుజరాత్ గతి అధోగతి?

 
 
ఈ ప్రశ్న కి సమాధానమేమిటి ?
 
 
మోడీ ప్రధాన మంత్రి ఐతే గుజరాత్ గతి అధోగతి?
 
 
జిలేబి 

Thursday, April 17, 2014

రేతిరి చందమామ

 
రేతిరి చందమామ 
ఎర్రటి రంగులో
జిగేలు మన్నది 
గ్రహణమ ట !
 
నిరుడు భువి లో 
పెను చోట్ల 
ఆకశ్మిక ప్రమాదం 
'ఆగ్రహమట' !
 
 
కర్ణాటక బస్సు 
అస్సాము రైలు 
కొరియా క్రూయిజర్ 
అమెరికా హత్య 
 
వెరసి లోకం పై  
చందురిని మచ్చ 
 
 
నివాళితో  
జిలేబి 

Saturday, April 12, 2014

పడవ 'ప్రణయం' !

 
నది లో పడవ
జన సాంద్రత తో 
అలవోక గా సాగి
తీరాన్ని చేరింది 
 
గప్ చుప్ పడవ ఖాళీ !
 
విశాలమైన నది రా రమ్మని 
ఆహ్వా నిస్తోంది
 
పడవ నిట్టూర్చింది !
 
అంతలో మళ్ళీ జన సందోహం !
 
పడవ హుషారయ్యింది మళ్ళీ 
నది దాట దాని ఆనందం 
సత్ చిత్ ఆనందం !
 
 
శుభోదయం 
జిలేబి 
*కష్టే ఫలి వారి పడవ ప్రయాణం చిత్ర మాలిక చూసేక*

(దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిహి!
విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్న నావ దురితాత్ పర్షిహి !)

Friday, April 11, 2014

ఏడు కొండల కి దరిదాపుల్లో కి వెళుతున్న నిఫ్టీ - మస్త్ మోడీ ?

ఏడు కొండల కి దరిదాపుల్లో కి వెళుతున్న నిఫ్టీ - మస్త్ మోడీ ? !

' ఏడు కొండల' దగ్గిర లో కి వెళుతోంది నిఫ్టీ - ఇండియా స్టాకు మార్కెట్టు తమాషా చూడటానికి అర్థం చేసు కోవటానికి మన ఒక జీవిత కాలం సరిపోదు సుమీ !!

జనవరి నెలకి ఏప్రిల్ నెలకి మధ్య న మూడు నెలలు . ఈ మూడు నెలలో మన దేశం లో అంత మార్పేమి జరిగిందో లేదో తెలియదు కాని బాంకింగ్ సెక్టార్ దరిదాపుల్లో ముప్పై శాతం పెంపొందిన 'స్టాకు' లావు లతో 'భర్పూర్' హోగయా !!

ఏడు కొండల కి వెళితే బోడి గుండు కొట్టు కో కుండా రావడం బావోదు ! ఇక మన ఇండియా స్టాకు మార్కెట్టు ఎప్పుడు బోడి గుండు కొడు తోందో ఆ మా పెరుమాళ్ళ కే ఎరుక !!

దేశం లో కి డాలర్లు వచ్చేస్తున్నాయి  వచ్చేస్తున్నాయ్ - సో మన మార్కెట్టు ఎకానామీ అభివృద్ధి పథం లో కి జుమ్మంది నా 'దమ్' అనుకోవాలా లేక డం డం డమాల్ డమాల్ రాబోయే కాలం అనుకోవాలా ?

నిఫ్టీ వేల్యూ ఎంత ? ఎవరి కెరుక లోగుట్టు ? ఏ పెరుమాళ్ళు ఈ మారు హర్షద్ మెహతా ని తలపించ బోతాడు ? అంతా విష్ణు మాయ !
వేచి చూడుము నరుడా  తమాషా !

కాశీ ఘాట్ ఈ మారు చూపిస్తుంది ష్యూర్ షాట్ !

అమెరికా మార్కెట్టు నిన్న 'డాం' అంది సందులో సడేమియా అని మన మార్కెట్ రివ్వున ఆకాశానికి ఎగురుతోంది ! ఇది ఎప్పుడో 'బెలూన్' బర్స్ట్ అగునో మరి !!


వెల్కం బెక బెక !

'చీర్స్' సహిత
శుభోదయం
జిలేబి

Wednesday, April 9, 2014

చెట్టు - పువ్వు-కాయ-పండు !

చెట్టు - పువ్వు-కాయ-పండు 
 
ఓ చెట్టు కో పువ్వు పూచింది 
పువ్వు కాయ గా మారింది 
కాయ పండు గా పరువాని కొచ్చింది 
దారిన వెళ్ళే పక్షి రాజు మోజు పడి 
పండుని కొరుక్కు ఎళ్ళాడు !
 
పండు దారెంబడి తింటూ వెళితే 
విత్తనాలు దారెంబడి పడుతూ వెళ్ళాయి 
 
మళ్ళీ తల్లి ఒడి లో మరో 
చెట్టు కి అంకురార్పణ !
 
పండు తిన్న పక్షి రాజూ రాణి తో చేరితే 
మరో పక్షి కి అంకురార్పణ !
 
అన్నాత్ భవంతి భూతాని !
 
 
శుభోదయం 
జిలేబి 
 
 

Monday, April 7, 2014

సూరీడు మండి పోతున్నాడు !

 
సూరీడు మరీ మరీ
మండి పోతున్నాడు !
వస్తోంది మోడీ కాలం
అని సూచిస్తో !
 
 
 
శుభోదయం
జిలేబి
 

Wednesday, April 2, 2014

వెదురు బొంద - చెందురిని చమక్కు !

 
 
రేతిరి వెదురు బొందల 
నీడల కదలికలో మెట్ల మీది 
దుమ్ము చెక్కు చెదర లేదు 
 
నడి రేయి చెందురిని 
కాంతి కిరణాలు తాలాబ్ ని 
తాకి ఇసుమంత కూడా నిలువ లేదు !
 
 
 
శుభోదయం 
జిలేబి 
(జెన్ కోవన్ ఆధారం)