Saturday, May 3, 2014

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - భాగం నాలుగు

 
అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ?  - భాగం నాలుగు - అద్వయ తారక ఉపనిషత్


ఈ అద్వయ తారక ఉపనిషత్ 'ఉపనిషత్ బ్రహ్మ యోగి' విరచితం అన్న వాక్యం తో మొదలవు తుంది

ఈ 'ఉపనిషత్ బ్రహ్మ యోగి ఎవరు అన్నది పరిశోధించి తెలుసు కోవలసిన విషయం

ఇక ఈ ఉపనిషత్ కి శ్రీమద్ అప్పయ శివాచార్య అనే వారు భాష్యం వ్రాసి ఉన్నారు . ఈ అప్పయ శివాచార్య ఎవరు ? అప్పయ దీక్షితులు గారా అన్నది తెలియదు ( స్వామీ శివానందా - డివైన్ లైఫ్ సొసైటీ సంస్థాపకులైన స్వామీ శివానందా వారి పూర్వులు  అప్పయ దీక్షితులు అనబడే వారు ఒకరు ఉన్నారు  ) ఒక చోట ఈ అప్పయ శివాచార్యుల వారు , సుందరేశ్వర తాతాచార్యుల వారి శిక్ష్యులని ఈ ఉపనిషత్ భాష్యం లో ఆఖరులో చెప్ప బడి ఉన్నది .


ఈ అద్వయ తారక ఉపనిషత్ శుక్ల యజుర్వేదం లోనిది

జితేంద్రియాయ శమాది షడ్గుణ పూర్ణాయ !

(జితేంద్రియ ములు --> శమ, దమ ఉపరతి, తితీక్ష , సమాధాన , శ్రద్ధ )

(The six virtues praised in Vedantic circles are quiescence (shama), restraint (dama) of the senses, cessation (uparati) of desire or worldly activity, endurance (titiksha), collectedness (samadhana), and faith (shraddha))

ద్వైతాసంభవ విజ్ఞాన సంసిద్ధాత్ అద్వయ తారకం !

రాజయోగ సర్వస్యాన్ని ప్రకటించే ఉపనిషత్ ఇది  ( రాజ యోగ సర్వస్వం ప్రకటయంతి )

యత్ర్హ స్వాతిరేకేణ ద్వయం న విద్యతే తత్ అద్వయం బ్రహ్మ --- ద్వయం దాటితే అద్వయ బ్రహ్మ !


"భ్రూదహరాత్ ఉపరి సచ్చిదానంద తేజః కూటరూపం పరం బ్రహ్మ"

భ్రూదహరాత్  ఉపరి --> భ్రువోర్ ఉపరి --> భ్రు పైన --> (chit lake?)

కూట రూపం లో  పరంబ్రహ్మ సచ్చిదానంద తేజం తో కంటి రెప్పల పై భాగం (ఫాల బాగం) లో ఉన్నట్టు అను కోవచ్చు .

అద్వయ తారక పదార్థౌ గర్బజన్మ జరామరణ భయాత్ సం తారయతి తస్మాత్ తారకం ఇతి !
జీవేశ్వరౌ మాయికావితి విజ్ఞాయ సర్వ విశేషం నేతి నేతి ఇతి విహాయ యద్ అవశిష్యతే తత్ అద్వయం బ్రహ్మ !

By way of negation --> by principle of Neti--> What remains is advaya brahma


ఈ అద్వయ బ్రహ్మ ని సాక్షాత్కరించు కోవడానికి మూడు విధాలు (లక్ష్య లక్షణములు )  ఉన్నాయి

దేహ మధ్యే బ్రహ్మ నాడి సుషుమ్న సూర్యరూపిణి పూర్ణ చంద్రాభా వర్తతే

దేహ మధ్యమం లో సుషుమ్న అనబడే బ్రహ్మ నాడి సూర్య రూపిణి అయి పూర్ణ చంద్రుని ప్రకాశం తో ఉన్నది 

సా తు మూలాధార దారాభ్య బ్రహ్మ రంధ్ర గామిని భవతి !

ఆ సుషుమ్న నాడి మూలాధారం నించి బ్రహ్మ  రంధ్రం దాకా ఉన్నది

తన్మధ్యే తటిత్కోటి సమాన కాంత్యా మృణాల సూత్రవత్ సుక్ష్మాంగీ కుందలిని ఇతి ప్రసిద్ధా ఆస్తి !

దాని మధ్య లో - తటిత్కోటి సమాన కాంతుల తో -->
తామర తూడు (మృణాల సూత్రవత్ --> Fibre of a lotus stalk ) వలె,
అణువు  రూపం లో (సుక్ష్మాంగీ )
కుండలిని అని ప్రసిద్ధముగా పిలువ బడేది ఉన్నది

(సంస్కృతం లో కుందలిని --> కు ణ్ణ దలిని అని ఉన్నది --> తెలుగు లో ఈ కు ణ్ణ దలిని కుండలిని అయ్యిందనుకుంటా )

ఈ కుండలిని మనసులో చూడ గలిగితే ఆ మానవుడు ముక్తి ని పొందు తాడు !

ఫాల ఊర్ధ్వ గల లాట విశేష మండలే నిరంతరం తేజః తారక యోగ విస్ఫురణేన  పశ్యతి చేత్ సిద్దో భవతి !

ఫాల భాగ మండలం లో తేజస్సుని నిరంతరం చూడ గలిగిన వాడు సిద్ది కలిగిన వాడవు తాడు

తర్జన్యగ్రోన్మిలిత కర్ణ రంధ్ర ద్వయే తత్ర ఫూత్ కార శబ్దో జాయతే
తత్ర స్థితో మనసి చక్షుర్మధ్యగత నీల జ్యోతి స్థలం విలోక్య అంతః దృష్ట్యా నిరతిశయ సుఖం ప్రాప్నోతి !
ఏవం హృదయే పశ్యతి ఏవం అంతర్ లక్ష్య లక్షణం ముముక్షుభిరూపాస్యాం !


రెండు కర్ణ రంద్ర ముల మధ్య 'ఫు' కార శబ్దం ఉన్నది అక్కడ ఉన్న మనస్సు రెండు కన్నుల మధ్య
ఉన్న నీల జ్యోతి ( blue colored) స్థలాన్ని అంతర్ దృష్ట్యా చూసినవాడు నిరతిశయ సుఖాన్ని
పొందుతాడు -->

హృదయం లో దానిని చూడ గలుగుతాడు (ఈ హృదయే పశ్యతి అన్నది --> ఇదేదో మధ్యలో ఇరికించిన విధం గా అని పిస్తున్నది  !)

ఈ పై మూడు లక్ష్య లక్షణములు అంతర్ లక్ష్య లక్షణ ములు గా చెప్ప బడి ఉన్నది

ఈ ఉపనిషత్ లో మరో రెండు లక్ష్య లక్షణములు కూడా చెప్ప బడి ఉన్నది అవి ; బహిర్; మధ్య లక్ష్య లక్షణములు
మధ్య లక్షణ లక్ష్యముల లో ఆలోచింప దగ్గవి కొన్ని ఉన్నాయి .

బహిర్ ప్రపంచం లో ఉన్న సూర్య చంద్రుల రూపం మన కంటి లో ప్రతి బింబమై ఉన్నవి 

 బ్రహ్మాండం లో ఉన్న సూర్య చంద్రులు పిండాండ మైన శరీర శిరస్సులో ఉన్న ఆకాశం లో కూడా 'రవీందు' మండలం గా ఉన్నాయి

పరంబ్రహ్మ గురించి -->

తత్ బ్రహ్మ మనః సహకారి చక్షుషా అంతర్ దృష్ట్యా వేద్యతే !
ఏవం అమూర్తి తారక మపి !
మనోయుక్తెన చక్షుషైవ దహరాదికం వేద్యం !

In esoteric దహర is from the root dah meaning "to burn." It probably refers to the miniscule space at the heart, which from ancient times has been considered a locus of the effulgent transcendental Self. This dahara is also mentioned in the Kshurika Upanishad (10). 


అద్వయ తారక ఉపనిషత్ - సంస్కృతం

అద్వయ తారక ఉపనిషత్ - ఆంగ్లానువాదం

ఈ ఉపనిషత్తు లో గురువు యొక్క శబ్దార్థం ఉన్నది --> గు అనగా అంధకారం  రు అనగా నిరోధించడం --> అంధకారాన్ని (నిరోధించు వాడు ) పోగొట్టు వాడు గురువు అని చెప్ప వచ్చు

గురు శబ్దస్త్వ అంధకారః స్యాత్ రు శబ్దః తన్నిరోధకః 
అంధకార నిరోధిత్వాత్ గురిరిత్యాభిదీయతే !!



శుభోదయం
జిలేబి
అంధకార నిరోధిత్వాత్ గురిరిత్యాభిదీయతే !!







 

2 comments:

  1. By way of negation --> by principle of Neti--> What remains is advaya brahma
    >>
    దీనిలో ఇవ్వాళ్టి బూలియన్ అల్జీబ్రా సిధ్ధాంతం ఉన్నట్టుంది.బూలియన్ చెప్పేది యేంటంటే - ఈ ప్రపంచంలో ప్రతి విషయాన్ని అది సత్యమా, అసత్యమా అనే True-False అనేవాటి bifurcation తో తేల్చుకోగలమని. అంటే యెదటి వాళ్ళు మనకి ఒక విషయం చెప్పారనుకోండి, మనం అందులో మొదటి అంశాన్ని గురించి అవునా కాదా అని ప్రశ్న వేశామనుకోండి, అవునని వొస్తే తర్వాతి ప్రశ్నకి వెళ్తాం. ఇలా అన్నింటికీ యేకరూపమయిన జవాబులు వస్తే అది సత్యం - అని.ఇలాంటివి తెలిసినప్పుడల్లా మనవాళ్ళ గురించిన గర్వంతో చాతీ ఉబ్బుతుందండీ నిజంగా!

    ReplyDelete
    Replies

    1. హరి బాబు గారు,

      చాలా బాగా చెప్పేరు ! ఈ ఉపనిషత్తు తత్వాలు నిజంగానే ఒక పరిధి దాటి నవి అనిపిస్తాయి --> మీరు వ్రాసినట్టు మన మాడర్న్ మెథడ్స్ ని పరిశీలిస్తే ఈ అనంత తత్వ సత్యం యొక్క extra polation అని పించక మానదు

      By the way, it as well reminds me of Richard Feynman 's classic sentence (The character of Physical Law talks) -->

      "Nature uses only the longest threads to weave her patterns, so each small piece of her fabric reveals the organization of the entire tapestry"


      చీర్స్
      జిలేబి

      Delete